
04/08/2025
ట్రైబల్ జర్నలిస్ట్ పేరుతో విభజిస్తున్న వారిని నమ్మకండి...!
కొంతమందిని పోగేస్తూ ఒక రెండు జిల్లాలనే వారి మనుగడ కోసం.. వసూళ్ల కోసం పాపం కొంతమంది ట్రైబల్ జర్నలిస్టుమంటూ వస్తున్నారు తస్మాత్ జాగ్రత్త...!
మిత్రులారా ఇప్పటికి ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ ల మంటూ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు...!
వ్యక్తిగతంగా పబ్బం గడుపుకోవడానికి ఇదంతా చేస్తున్నారు తప్ప ఇంకో దానికి కాదు...!
సమస్యలపై ఇప్పటివరకు ఎప్పుడు స్పందించని వారు నేరుగా ఇప్పుడు వచ్చి శిక్షణ తరగతులు ఇస్తాం..,అకాడమీతో పెట్టిస్తామని ప్రగల్ బాలు పలుకుతున్నారు..
మిత్రులారా..! ఒక్కసారి మీరందరూ ఆలోచించండి...!
శిక్షణ తరగతుల కంటే ముందు మనకు ఇళ్ల స్థలాలు కావాలి.. డబుల్ బెడ్ రూమ్ ల లో మా ప్రాధాన్యత ఏందో తేల్చాలి...! అక్రిడేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి...!
ఇప్పుడున్న హెల్త్ కార్డులు పనిచేయడం లేదు.. అవి ఎప్పుడు పనికి వస్తాయో తెలుపండి..
అంతేకానీ అసలు శిక్షణ తరగతులు ఇస్తామని చెప్పుకునే వారు కూడా ఒకసారి ఎవరికి ఇస్తున్నారు వాళ్లే చెప్పాలి.. ఒక పెద్దాయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఎన్ని అక్రిడేషన్ కార్డులు ఇస్తారా ఎవరెవరికి ఇచ్చారో తెలుసా అని సినిమా డైలాగులు పెట్టిన ఎర్రజెండా నాయకుడు...?
రాష్ట్రంలో ఉన్న ట్రైబల్ జర్నలిస్టులకు ఏ ప్రాతిపదికన శిక్షణ తరగతులు ఇస్తాడో చూడాలి....?
ఏ అంశంపై శిక్షణ తరగతులు ఇస్తాడో ముందే చెప్పాలి...!
ముందు మీడియా అకాడమీ పెద్ద మనిషి ఈ సార్ గారు మీరు చెప్పినట్టుగానే ఉన్నదాంట్లో ఎవర్ని జర్నలిస్ట్ గా గుర్తిస్తారు కూడా చెప్పవలసిన అవసరం ఉంది... చెప్పిన తర్వాతే రేపటి శిక్షణ తరగతుల ముచ్చట మొదలుపెట్టాలి...అంతేకానీ రాష్ట్రంలో ఉన్న వారిని పట్టించుకోకుండా వర్కింగ్ జర్నలిస్టులను వదిలిపెట్టి ఎవరితో ఏం సంప్రదింపులు చేస్తున్నారో బహిరంగంగా చెప్పవలసిన అవసరం ఉంది....!
గతంలో ఈ పెద్ద సార్ సోషల్ మీడియా వేదికగా కులాల పేరుతో జర్నలిస్టులు గ్రూపులు పెట్టొద్దని చాలా ప్రమాదమని పోస్ట్ పెట్టారు.. మరి ఎందుకు ట్రైబల్ జర్నలిస్టులను విభజించి పాలిస్తున్నారు..
అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టుల సంఖ్య అకాడమీ దగ్గర ఉందా..? అసలు ఉంటే ఎంత మంది ఉన్నారో బహిరంగంగా పత్రిక ప్రకటన చేయాలి... అందులో ఎవర్ని నీ ప్రాతిపదికన జర్నలిస్టుగా గుర్తిస్తున్నారు.. సీనియర్ కామ్రేడ్ సార్ మీ చేతి ద్వారా ప్రెస్ నోట్ రూపకంగా రావాలి....!
లేని యెడల మిగతా విషయాలు శిక్షణ తరగతుల అనంతరం మాట్లాడుకుందాం...!
రాష్ట్రంలో ఉన్న డిపిఆర్ఓల దగ్గర నుండి మీరు సేకరించిన సంఖ్య ఎంతో ముందు చెప్పండి..
అందులో బిపిఎల్ కింద కనీసం మేము 6 గ్యారంటీలకు ఎలిజిబుల్ లేదా సీనియర్ కామ్రేడ్...!
సీనియర్ కామ్రేడ్ అని చెప్పుకునే మీరు తెలంగాణ ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టుల అంశంలో నిష్పక్షపాత నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం...!
కొంతమంది మీ డైరెక్షన్ లో నే ఇదంతా చేస్తున్నారు కావచ్చు అని అనుమానం మాకు రాకుండా మీ తరగతుల అంశంలో నిష్పక్షపాత విషయాన్ని తెలుపుతారని ఆశిస్తున్నాము...!
మీరు చెప్పినట్టుగా ఎవరు జర్నలిస్టులో.., ఎవరిని మీరు గుర్తించాలని చెబుతారో అది కూడా మీ మీడియా అకాడమీ ద్వారా ఒక పత్రాన్ని విడుదల చేస్తారని ఆశిస్తున్నాం....!
ట్రైబల్ జర్నలిస్టుల పేరుతో నడిచే ప్రచారాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం...!
తెలంగాణ ట్రైబల్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఎటువంటి శిక్షణ తరగతులను పెట్టట్లేదు..!
వర్కింగ్ జర్నలిస్టుల హక్కుల కోసం ఒక్క రూపకల్పన ఏర్పాటు చేస్తున్నాము...!
చాలా వరకు దీర్ఘకాలిక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి...!
గత పాలకులు మా సమస్యలకు పరిష్కారం చూపలేదు.. ఏదో కొంతమందికి ఒకటి రెండు జిల్లాల్లోనే ఇండ్ల స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు..
ఇప్పుడున్న ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు చేస్తున్న కొంత నాయకులు సంబంధిత మంత్రి గారు కొంత సానుకూలంగా స్పందించారు...!
రాష్ట్రంలో అందరి సమస్య ఒకేసారి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అందుకనే కొంత సమన్వయంతో ఉన్నాం....!
కానీ కొంతమంది సంఘాల పేరుతో ఏం చేస్తున్నారో మీకు తెలిసిందే అలాంటి సంఘాల గురించి మేము మాట్లాడం కానీ మీడియా అకాడమీ పెద్ద సార్ కు రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టులకు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం....!
పెద్ద సార్ చివరిగా మీకు విన్నపం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సీనియర్ జర్నలిస్టు , తెలంగాణ ట్రైబల్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోత్ చందర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వైద్య ఖర్చులకోసం ప్రెస్ అకాడమీకి ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు.. కానీ ఇప్పటివరకు అతనికి సహాయం అందలేదు.. వీలైతే అతనికి సహాయం చేయండి.. లేదు ట్రైబల్ జర్నలిస్టులను విభజించి పాలిస్తామంటే వదిలేయండి సార్..!
తిరుపతి నాయక్ మాలోత్
తెలంగాణ ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TTWJA) రాష్ట్ర అధ్యక్షులు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రవి నాయక్ (TTWJA)
డా. వెంకట్
రాష్ట్ర కోశాధికారి(TTWJA)