29/04/2025
సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లిన రైతును గల్లా పట్టి నెట్టేసిన పోలీసులు!
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని శాలిగౌరారం గ్రామంలో కలెక్టర్ కార్యక్రమంలో పాల్గొన్న రైతు పోతరాజు, తన సమస్యలు వినిపించేందుకు స్టేజికి వెళ్లగా, ఎస్ఐ సైదులు ఆయనను గల్లా పట్టి తోసేసిన దృశ్యం కలవరపరుస్తోంది.
ఈ ఘటనపై రైతు సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి.