VS VaruShoban

VS VaruShoban నా ప్రయాణం సామాన్య ప్రజలతో…
నా యుద్ధం పెత్తందార్లతో…
నా లక్ష్యం పేదరిక నిర్మూలన…

08/11/2023

బీహార్ అసెంబ్లీలో సిఎం నితీశ్ క్షమాపణలు

పాట్నా : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో, వెలుపల క్షమాపణలు తెలిపారు. మంగళవారం ఆయన సభలో జనాభా విషయంపై చేసిన ప్రసంగంలో మహిళలను అసభ్యంగా చిత్రీకరించినట్లు దుమారం చెలరేగింది. మహిళలకు ప్రత్యేకించి బాలికలకు లైంగిక పరిజ్ఞానం అవసరం అని, బాలికలకు సరైన సెక్స్ పరిజ్ఞానం ఉండటం వల్లనే రాష్ట్రంలో సంతానోత్పత్తి తగ్గిందని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగానే కాకుండా సామాజికంగా విమర్శలకు దారితీశాయి. దీనితో ఈ నేత బుధవారం అసెంబ్లీలోకి రాగానే తాను చేసిన వ్యాఖ్యలు చాలా మందికి రుచించలేదని, ఈ విషయం తనకు తెలిసిందని, రాష్ట్రంలోని మహిళలకు సరైన సాధికారికతకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలియచేయడం తమ ఉద్ధేశం అని వివరించారు. ఈ క్రమంలో మహిళకు సమగ్రరీతిలో విద్యా , అక్షరాస్యత ఇనుమడించాలనేదే లక్షం అని తెలిపారు.

ఈ క్రమంలోనే తాను జనాభా నియంత్రణలో మహిళ కీలక పాత్రకు సరైన పరిజ్ఞానం అవసరం అని తెలిపానని, ఈ దశలోఎవరైనా నొచ్చుకుంటే , అందుకు బాధ్యత వహిస్తూ తాను క్షమాపణలు తెలియచేస్తున్నానని వెల్లడించారు. తన మాటలను ఉపసంహరించుకుంటున్నానని వివరించారు. అయితే సభ ఆరంభం కాగానే బిజెపి సభ్యులు ప్రతిపక్ష నేత విజయ్‌కుమార్ సిన్హా ఆధ్వర్యంలో వెల్‌లోకి దూసుకువెళ్లారు. సిఎం రాజీనామా చేయాలని నినాదాలకు దిగుతూ ,ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. నితీశ్ చివరికి మెంటల్ తరహా అయ్యారని, ఇక సిఎం పదవికి అనర్హుడని విమర్శించారు. సిఎం రాజీనామా డిమాండ్‌ను స్పీకర్ అవధ్ బిహారీ చౌదరి తోసిపుచ్చారు. ప్రజలు, ఈ సభ విశ్వాసం పొందిన వ్యక్తి వైదొలగాలని చెప్పే హక్కు అధికారం ప్రతిపక్షాలకు లేదని తేల్చిచెప్పారు.

అయినా గందరగోళ పరిస్థితి కొనసాగింది. దీనితో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. బుధవారం ఉదయం అసెంబ్లీ ముఖద్వారం వద్ద కూడా బిజెపి సభ్యుల నుంచి సిఎంకు నిరసన వ్యక్తం అయింది. సిఎం నితీశ్ చాలాసేపటి వరకూ గేట్ వద్దనే నిశ్చేష్టులై నిలబడ్డారు. తరువాత సభలోకి ప్రవేశించారు. శాసనమండలిలోనూ సిఎం తమ వ్యాఖ్యలకు క్షమాపణలు తెలిపారు. తాను జర్నలిస్టుల సమక్షంలో కూడా వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేసినట్లు తెలియచేసుకున్నారు.

పత్తి రైతులకు కేంద్రం శుభవార్తఆదిభట్ల : పత్తి రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మద్దతుధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలను...
01/10/2023

పత్తి రైతులకు కేంద్రం శుభవార్త

ఆదిభట్ల : పత్తి రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మద్దతుధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెస్తోంది. ఈమేరకు వివరాలను జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ ఛాయాదేవి వివరాలను మీడియాకు వెల్లడించారు. పత్తిరైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తాము పండించిన పంటను దళారులకు విక్రయించరాదని కేంద్ర ప్రభుత్వం సూచించింది. పత్తిమద్దతుధర పింజపొడవు పత్తికి రూ.7020గా, మధ్యస్థ పింజపొడవు పత్తి ధర రూ.6020గా ప్రకటించింది. రైతులు తాము పండించిన పత్తిని దళారులకు విక్రయించరాదని కేంద్రం సూచించింది. అలాగే పత్తిరైతులకు కొన్ని ప్రత్యేకమైన సూచనలను చేసింది.

పత్తి తేమ శాతం 8 నుండి12 శాతం లోబడి ఉండాలని పేర్కొంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించబడే కొనుగోలు కేంద్రాల్లో రైతులు స్వయంగా వచ్చి తమ పంటను విక్రయించాలని సూచించింది. కొనుగోలు కేంద్రాల్లో ఆధార్ ధృవీకరణ అనంతరం రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపింది. రైతులు తమ ఆధార్‌కార్డును బ్యాంకు ఖాతాకు లింక్‌చేసి ఉండాలని సూచించింది. ఆధార్‌కార్డు లేని పక్షంలో రైతులు తాము నమోదుచేసుకున్న ఆధార్ నంబర్ రశీదుతో ఏదైనా దృవీకరణ పత్రముతో కొనుగోలు కేంద్రాల్లో సందర్శించాలని సూచించింది.

కొంప ముంచుతున్న అత్యాశహైదరాబాద్: బాధితులను అన్ని రకాలుగా దోచుకుంటున్న నేరస్థులు పెట్టుబడుల పేరుతో మోసం చేస్తున్నారు. ఇటీ...
01/10/2023

కొంప ముంచుతున్న అత్యాశ

హైదరాబాద్: బాధితులను అన్ని రకాలుగా దోచుకుంటున్న నేరస్థులు పెట్టుబడుల పేరుతో మోసం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్, స్టాక్‌మార్కెట్‌పై పెట్టుబడిపెట్టే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. ఇలా సంప్రదించిన వారికి మయమాటలు చెప్పి పెట్టుబడిపెట్టించి మోసం చేస్తున్నారు. కోట్లాది రూపాయలు పెట్టుబడిపెట్టించి నిండా ముంచుతున్నారు నేరస్థులు. గతంలో సైబర్ నేరస్థులు స్టాక్‌మార్కెట్‌పై ఆసక్తి చూపుతున్న వారిని టార్గెట్‌గా చేసుకుని దోచుకునే వారు, ఇటీవలి కాలంలో నేరుగా పెట్టుబడిపెట్టే వారిని కూడా టార్గెట్ చేసుకుని దోచుకుంటున్నారు. వృద్ధులను టార్గెట్‌గా చేసుకుని మోసం చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు టాటా క్యాపిట్‌లో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నాడు.

వృద్ధులు టాటా క్యాపిటల్‌లో పెట్టుబడిపెట్టేందుకు ఆసక్తి చూపిగా వారికి మాయమాటలు చెప్పి వేరే కంపెనీలో పెట్టుబడిగా పెట్టించి తనకు రావాల్సిన లక్షలాది రూపాయల కమీషన్ తీసుకుని జారుకున్నాడు. నిందితుడి మాటలు నమ్మిన వృద్ధులు మూడు అనామక కంపెనీల్లో రూ.3,56,74,000 పెట్టుబడిపెట్టారు. ఏడాదికి 12శాతం లాభాలు వస్తాయని చెప్పడంతో వారు నిందితుడి మాటలు నమ్మారు. కాని పెట్టుబడి పెట్టి మూడేళ్లు అవుతున్నా ఎలాంటి లాభాలు లేకపోగా పెట్టిన పెట్టుబడి తిరిగి రాలేదు. తాము పెట్టిన పెట్టుబడి రూ.36,94,989 కావడంతో తమ డబ్బులు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడికి మాత్రం కమీషన్ రూపంలో 47,48,000 వచ్చింది. మరో కేసులో విల్లా పేరుతో మోసం చేసి రెండు కోట్ల రూపాయలు కొట్టేశారు నిందితులు. ఈ కేసులో ఒకే కంపెనీలో పనిచేస్తున్న వారిని నిండాముంచారు. విల్లాల నిర్మాణాలు మధ్యలో ఆగిపోయాయని, వాటికి డబ్బులు అవసరం ఉందని, డబ్బులు ఇస్తే తిరిగి అధిక వడ్డీ ఇస్తామని చెప్పి రూ.2కోట్లు తీసుకుని నిండాముంచారు.

రెండు కేసుల్లో బాధితులు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో కూడా సైబర్‌నేరస్థుల స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడిపెట్టే వారిని టార్గెట్‌గా చేసుకుని మోసం చేశారు. తాము చెప్పిన కంపెనీలో పెట్టుబడిపెడితే అధికంగా లాభాలు వస్తాయని చెప్పి వాట్సాప్, టెలీగ్రాంలో సైబర్ నేరస్థులు మెసేజ్‌లు పంపిస్తున్నారు. వాటిని చూసి ఆకర్షితులైన వారిని ట్రాప్ చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధికి చెందిన బానోతు కిరణ్‌కుమార్‌కు పశ్చిమబెంగాల్‌కు చెందిన నిందితులు పెట్టుబడికి చెందిన లింక్ పంపించాడు. దానిని క్లిక్ చేసిన బాధితుడు నిందితులతో మాట్లాడాడు. ఆన్‌లైన్‌లో రూ.86లక్షలు పంపిస్తే భారీగా లాభాలు వస్తాయని చెప్పారు. డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత లాభాలతో కలిపి వాటిని తీసుకోవచ్చని చెప్పారు. ఇది నమ్మిన బాధితుడు డబ్బులు ఆన్‌లైన్‌లో నిందితులు చెప్పిన బ్యాంక్ ఖాతాలకు పంపించాడు. కొద్ది రోజులకు మీకు భారీగా లాభాలు వచ్చాయని ఆన్‌లైన్‌లో నిందితులు చూపించారు.

దానిని విత్‌డ్రా చేసేందుకు బాధితుడు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. నిందితులకు ఫోన్ చేసినా కూడా స్పందించలేదు. దీంతో తాను మోస పోయానని గ్రహించిన బాధితుడు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇలాంటి నేరాలు చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు. నేపాల్ దేశానికి చెందిన నిందితులు సిలిగురిలో ఉంటూ కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. పలువురు బాధితుల నంబర్లు తీసుకుని ఫోన్లు చేస్తున్నారు. వీరి మాటలను నమ్మిన వారు నిండామునుగుతున్నారు. నగరానికి చెందిన ఓ వృద్ధురాలికి ముంబైకి చెందిన నిందితులు ఫేస్‌బుక్‌లో మెసేజ్ పెట్టారు. తమ ద్వారా స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించారు. దానిని నమ్మిన బాధితురాలు వారికి రూ.5కోట్లు ఇచ్చింది. వాటిని తీసుకున్న నిందితులు కొద్ది రోజులు లాభాలు వచ్చాయని చూపించారు. తర్వాత కొద్ది కాలానికి బాధితురాలికి తెలియకుండానే షేర్లను విక్రయించారు. నిందితులు ఏకంగా వారు నిర్వహిస్తున్న ఆఫీస్‌ను కూడా ఖాళీ చేసి వెళ్లి పోయారు.

బాధితురాలు ఫోన్ చేసినా నిందితులు స్పందిచడం మానివేశారు. దీంతో తాను మోసపోయానని గ్రహించి నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. నగరానికి చెందిన యువకుడికి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని ఫేస్‌బుక్‌లో ఓ వ్యక్తి మెసేజ్ పంపించాడు. దీనిని నమ్మిన యువకుడు తాను డబ్బులు పెట్టడమే కాకుండా తన స్నేహితులతో కూడా డబ్బులు పెట్టుబడి పెట్టించాడు. బాధితుడి నుంచి సైబర్ నేరస్థులు రూ.16లక్షలు తీసుకున్న తర్వాత ముఖం చాటేశారు. దీంతో యువకులు నిండా మునిగారు, నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అధికంగా ఆశపడితే….
చాలా కేసుల్లో బాధితుల అత్యాశ వల్లే నేరస్థుల బారిన పడుతున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఒక కంపెనీలో పెట్టిన పెట్టుబడిపై లాభాలు రావాలంటే చాలా కాలం వేచి ఉండాలని, కానీ చాలా మంది పెట్టుబడి దారులు తక్కువ సమయంలో అధికంగా లాభాలు రావాలని ఆశపడడంతో నేరస్థుల చేతుల్లో పడి మోసపోతున్నారు. ఏదైనా కంపెనీలో పెట్టుబడిపెట్టు ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని పెట్టాలి. ఇలా చేయకుండా ఆన్‌లైన్‌లో పరిచయమైన వారు, ముక్కుమోహం తెలియని వారి మాటలు నమ్మి పెట్టుబడి పెడితే లాభాల మాట దేవుడెరుగు ఉన్న డబ్బులు కోట్లాది రూపాయలు నేరస్థులు చేతుల్లో పెడుతున్నారు. ఇలా అత్యాశకు పోయిన వారు నిండిముగునుగుతున్నారు.

11/07/2023

అజ్ఞానం తో రేవంత్ రెడ్డి

హైదరాబాదు: అమెరికా లో ఉచితాల గురించి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశాడని రాష్ట్ర జల వనరుల సంస్థ ఛైర్మన్ వి ప్రకాశ్ ఖండిస్తున్నామన్నారు.
మొన్న ఈ మధ్యలో ధరణి ఎత్తేస్తాం అన్నాడు దానితో రాష్ట్ర రైతులు అందరూ ఆందోళన వ్యక్తం చేశారు

మళ్ళీ ఇప్పుడు అజ్ఞానం తో రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటల విద్యుత్ సరఫరా సరిపోతుంది అన్నాడు.కానీ 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడంతో దేశానికి అన్నం పెట్టే రాష్ట్రాంగా తెలంగాణ రైతులు ఎదిగారు.

24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల తో ఇవాళ దేశంలోనే అత్యధిక వరి పంట పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ.

*మరి అలాంటప్పుడు ఉచిత విద్యుత్ అవసరం లేదని అపరిపక్వ మాటలు మాట్లాడం కరెక్ట్ కాదు.రేపు రానున్న రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు,రైతు బంధు ను కూడా వద్దంటాడు ఈ రేవంత్.*

రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్న.

రేవంత్ రెడ్డి ఇలాంటి వాక్యాలు చేయడం కొత్త ఎం కాదు.

08/07/2023

బెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో 9 మంది మృతి

పశ్చిమ బెంగాల్‌లో మూడు అంచెల పంచాయతీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. పోలింగ్‌కు సంబంధించి జరిగిన హింసాత్మక ఘటనలలో 9 మంది మరనించినట్లు అధికారులు తెలిపారు. మృతులలో ఐదుగురు టిఎంసి సభ్యులతోపాటు బిజెపి,, సిపిఎం, కాంగ్రెస్‌కు చెందిన ఒక్కో కార్యకర్త ఉన్నారు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతుదారుడు ఒకరు కూడా మృతులలో ఉన్నట్లు అధికారులు చెప్పారు.

పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణలలో పలువురు గాయపడ్డారు. రెండు పోలింగ్ బూత్‌లలో బ్యాలట్ బాక్సులు ధ్వంసమయ్యాయి. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలోగల 3,887 సీట్లలో ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. బరిలో ఉన్న 2.06లక్షల మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 5.67 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. ఉదయం 9 గంటల వరకు 10.26 శాతం పోలింగ్ నమోదైంది.

07/07/2023

తెలంగాణలో తేలికపాటి వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం జార్ఖండ్ పరిసరాల నుండి సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తన కొనసాగుతోంది.దీని ప్రభావంతో రాగల 24గంటల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

గడిచిన 24గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా మదనపల్లిలో అత్యధికంగా 31.5మి.మీ వర్షం కురిసింది. శంకర్‌పల్లిలో 30, లింగాపూర్‌లో 25, నవాబ్ పేటలో 24.8, మల్లాపురంలో 23.5, వీపనగండ్లలో 22.5, చెన్నపురావుపల్లిలో 22.3, తెల్కపల్లిలో 21.5 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు పడ్డాయి.

19/05/2023

రజనీకాంత్‌పై ప్రశ్నిస్తే వెక్కిరించిన రోజా!
చెన్నై: ఒకప్పటి నటి, ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా ఇటీవల తమిళనాడులోని తిరుచెందూర్‌లో ‘మురుగన్’ ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లారు. ఆ సందర్భంలో మీడియాతో మాట్లాడినప్పుడు విలేకరులు ‘ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ఏపికి రజనీకాంత్ వచ్చారని, ఎన్టీఆర్‌ని ప్రశంసించారని, చంద్రబాబును ఆకాశానికెత్తారు’ అని అనప్పుడు రోజా స్పందన విచిత్రంగా ఉండింది. ‘చంద్రబాబు విజనరీ ఉన్న నేత’ అంటూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యపై ఆమె విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. ఇది రజనీకాంత్ ఫ్యాన్స్‌కు కోపాన్ని తెప్పించింది. ఆమె వ్యంగ్యంపై వారు మండిపడ్డారు. మీడియా వేదికగా ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

07/05/2023

ఈ నెల 9న తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల..
ఈ నెల 9వ తేదీన (మంగళవారం నాడు) తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో మంగళవారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం .

కాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు ఐదు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాల కోసం ఇంటర్ బోర్డు వెబ్ సైట్ tsbie.cgg.gov.in కు లాగిన్ అవ్వొచ్చు.

ఆస్తి పంచలేదని తల్లి మృతదేహాన్ని ఆసుపత్రిలోనే ఉంచిన కూతుళ్లు ఆస్తి పంపకాలు జరుపలేదనే నేపంతో మృతి చెందిన తల్లి శవాన్ని తీ...
07/05/2023

ఆస్తి పంచలేదని తల్లి మృతదేహాన్ని ఆసుపత్రిలోనే ఉంచిన కూతుళ్లు

ఆస్తి పంపకాలు జరుపలేదనే నేపంతో మృతి చెందిన తల్లి శవాన్ని తీసుకెళ్లడానికి కన్న కూతుళ్లు నిరాకరించారు. దారుణమైన ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ బి నగర్ కాలనీకి చెందిన కిష్టవ్వ 70 అనారోగ్యంతో భాద పడుతుండటంతో కుటుంబ సభ్యులు గత నెల 21న ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె సుమారు పది హేను రోజుల పాటు చికిత్స పొందుతు శనివార రాత్రి మృతి చెందింది.మృతురాలికి ముగ్గురు కూతుళ్లు కాగా ఒక కూతురు మృతి చెందింది.ఎల్లవ్వ, పెంటవ్వ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతురాలి పేరు పైన ఇళ్లు, డిపాసిట్ పేరిట లక్షా 70 ఉన్నాయి. వీటికి మృతురాలి బంధువు ఒకరు నామినీగా ఉన్నారు. కిష్టవ్వ బతికుండగా ఆస్తి పంపకాలు జరుపలేదని డిపాజిట్ డబ్బులు తమకు ఇప్పించేంత వరకు తల్లి శవాన్ని తీసుకుళ్లెమని ఇద్దరు కూతుళ్లు శవాన్ని ఒదిలేసినట్లు డ్యూటీ డాక్టర్ మౌనిక తెలిపారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది మార్చురిలో వృద్దురాలి శవాన్ని ఉంచారు.

Address

1-7-695/Ramnagar
Hyderabad
500020

Alerts

Be the first to know and let us send you an email when VS VaruShoban posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share