Sportz 365 Telugu

Sportz 365 Telugu Telugu sports news. Cricket, IPL & other Sport. Follow us for the latest updates!

01/01/2024

Wish You A Very Happy New Year

https://sportz365.net/sports/pragnanandhaa-r-chess-champion/
24/08/2023

https://sportz365.net/sports/pragnanandhaa-r-chess-champion/

భారత చదరంగంలో నయా సంచలనం, పిన్న వయసులోనే గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించి....మాగ్నస్ కార్లసన్‌ని మూడు సార్లు ఓడించి....

ఐపీఎల్ ఫైనల్‌కు వేళయింది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్, 4సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌తో నేడు అమీతుమీకి సిద్ధమైంద...
28/05/2023

ఐపీఎల్ ఫైనల్‌కు వేళయింది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్, 4సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌తో నేడు అమీతుమీకి సిద్ధమైంది. రెండు మేటి జట్ల మధ్య జరిగే అంతిమ పోరు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. అల్‌రౌండ్‌ నైపుణ్యంతో గుజరాత్‌ చెలరేగుతుండగా, ధోనీ మాస్టర్‌మైండ్‌తో చెన్నై అనూహ్య విజయాలు సాధిస్తోంది. మరి ఈ అంతిమ సమరంలో ధోనీ ఐదో సారి ఐపీఎల్‌ ట్రోఫీ అందుకుంటాడా.. లేక హార్దిక్‌ పాండ్యా వరుసగా రెండో సారి కప్పును ముద్దాడుతాడా అనేది ఆసక్తికరంగా మారింది.

ఐపీఎల్‌లో నేడు రెండో క్వాలిఫయర్ మ్యాచ్... డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్, 5 సార్లు ఛాంపియన్ ముంబయి జట్ల మధ్య జరుగనుంది. అహ్...
26/05/2023

ఐపీఎల్‌లో నేడు రెండో క్వాలిఫయర్ మ్యాచ్... డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్, 5 సార్లు ఛాంపియన్ ముంబయి జట్ల మధ్య జరుగనుంది. అహ్మదాబాద్‌లోరాత్రి 7:30కు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి క్వాలిఫయర్‌లో ఓడిన గుజరాత్ ఒత్తిడిలో ఉండగా, ఎలిమినేటర్ మ్యాచ్‌లో నెగ్గిన ముంబయి ఉత్సాహంగా ఉరకలు వేస్తోంది. అయితే రెండు జట్లు బలమైనవే. ఈ నేపథ్యంలో సమ ఉజ్జీలైన ఈ మేటి జట్ల మధ్య జరిగే హై ఓల్టేజ్ మ్యాచ్‌లో మొతెరా పిచ్ ఎవరికి అనుకూలంగా ఉంటుందో చూడాలి.

ఐపీఎల్‌లో నేడు లక్నో, ముంబయి జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. చెన్నైలో రాత్రి 7:30కు  ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.  5...
24/05/2023

ఐపీఎల్‌లో నేడు లక్నో, ముంబయి జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. చెన్నైలో రాత్రి 7:30కు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. 5సార్లు ఛాంపియన్ ముంబయి చెన్నై స్లో పిచ్‌పై... లక్నో సిన్నర్లను ఎలా ఎదుర్కొంటుందన్నదే ప్రశ్న. ఇక గత ఏడాది ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌లో ఓడిన లక్నో... ఈసారి మాత్రం గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డనుంది. ఎలిమినేటర్‌లో ఓడిన జట్టు ఇంటికెళుతుంది. ఈ నేపథ్యంలో లక్నో, ముంబయి జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి రెండో క్వాలిఫయర్‌కు ఏ జట్టు చేరుకుంటుందో చూడాలి.

ఐపీఎల్‌లో తొలి క్యాలిఫయర్‌కు వేళయింది. ఈరోజు  రాత్రి 7:30కు చెన్నైలో జరిగే ఈ మ్యాచ్‌లో CSK, GTని ఢీకొనబోతోంది. డిఫెండింగ...
23/05/2023

ఐపీఎల్‌లో తొలి క్యాలిఫయర్‌కు వేళయింది. ఈరోజు రాత్రి 7:30కు చెన్నైలో జరిగే ఈ మ్యాచ్‌లో CSK, GTని ఢీకొనబోతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్, నాలుగు సార్లు ఛాంఫియన్ చెన్నైల మధ్య జరిగే ఈ బ్లాక్‌బస్టర్ క్లాష్‌లో నెగ్గేందుకు ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. మొత్తంగా రెండు సమ ఉజ్టీల మధ్య జరిగే ఈ పోరు హోరాహోరీగా జరగడం మాత్రం ఖాయం. గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. కాగా ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. లక్నో, ముంబయి జట్ల మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో తలపడుతుంది.

ఐపీఎల్‌లో నేటితో లీగ్ మ్యాచ్‌లకు తెరపడనుంది. ఇప్పటికే గుజరాత్, చెన్నై, లక్నో... ఈ మూడు జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. ...
21/05/2023

ఐపీఎల్‌లో నేటితో లీగ్ మ్యాచ్‌లకు తెరపడనుంది. ఇప్పటికే గుజరాత్, చెన్నై, లక్నో... ఈ మూడు జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. నాలుగో జట్టు ఇంకా ఖరారు కాలేదు. నేడు జరిగే రెండు మ్యాచ్‌ల తర్వాత గానీ ప్లే ఆఫ్ చేరే జట్టేదో తేలదు. ఈ నేపథ్యంలో నేడు జరిగే రెండు మ్యాఛ్‌లు ముంబయి, బెంగళూరు జట్లకు కీలకం కానున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌, హైదరాబాద్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో ముంబయి భారీ తేడాతో నెగ్గితేనే ఫ్లే ఆఫ్ ఛాన్స్ ఉంటుంది. మరోవంక రాత్రికి జరిగే రెండో మ్యాచ్‌లో బెంగళూరు, గుజరాత్‌ను ఢీకొనబోతోంది. ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా బెంగళూరు ప్లేఆఫ్స్ చేరాలంటే చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించాలి. బెంగళూరు, ముంబై తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓడితే రాజస్థాన్‌కు ప్లేఆఫ్స్ ఛాన్స్ ఉంటుంది. ఆర్సీబీ (+0.180)తో పోలిస్తే రాజస్థాన్ (+0.148) నెట్ రన్ రేట్ తక్కువగా ఉంది. దీంతో చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గెలిచి, ఆర్సీబీపై గుజరాత్ భారీ తేడాతో గెలుపొందితే.. అప్పుడు రాయల్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.

ఐపీఎల్‌లో నేడు జరిగే రెండో మ్యాచ్‌లో సాయంత్రం 7:30 గంటలకు ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కత నైట్ రైడర్స్,  లక్నో సూపర్ జె...
20/05/2023

ఐపీఎల్‌లో నేడు జరిగే రెండో మ్యాచ్‌లో సాయంత్రం 7:30 గంటలకు ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కత నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఇప్పటికే 15 పాయింట్లతో టాప్ 3లో ఉన్న లక్నో ఈ మ్యాచ్ గెలిచి సజావుగా ప్లేఆఫ్స్‌కు చేరాలనుకుంటోంది. ఒక వేళ ఓడితే ఆదివారం మ్యాచ్ ఫలితాల కోసం ఎదురు చూడక తప్పదు. ఇక కోల్‌కత గెలిచి 14 పాయింట్లకు చేరినా దాని నెట్ రన్‌రేట్‌ -0.256 గా ఉంది. దీంతో KKR ప్లే ఆఫ్ ఆశలు క్లిష్టంగా మారాయి.

ఐపీఎల్‌-16 చివరి అంకానికి చేరింది. రేపటితో లీగ్ మ్యాచులు ముగియనున్నాయి.  గుజరాత్ ఇప్పటికే  ప్లేఆఫ్స్‌కు చేరింది. మిగతా  ...
20/05/2023

ఐపీఎల్‌-16 చివరి అంకానికి చేరింది. రేపటితో లీగ్ మ్యాచులు ముగియనున్నాయి. గుజరాత్ ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరింది. మిగతా మూడు స్థానాల కోసం ఆయా జట్ల మధ్య రసవత్తర పోరు జరుగనుంది. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ, చెన్నై జట్ల మధ్య ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఢిల్లీలో మధ్యాహ్నం 3:30కు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 15పాయింట్లతో 2వ స్థానంలో ఉన్న CSK ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్‌కు చేసుకోవాలని చూస్తోంది. 10పాయింట్లతో 9వ స్థానంలో ఉన్న ఢిల్లీకి ఈ మ్యాచ్ ఓడినా, గెలిచినా పెద్దగా ఒరిగేదేంలేదు. చెన్నై మాత్రం కచ్చితంగా గెలిచి తీరాలి. ఓడినా ప్లే ఆఫ్స్ రేసులోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ గెలిచేందుకు ధోనీ సేన సర్వశక్తులు ఒడ్డనుంది. మరి ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.

ఐపీఎల్‌-16లో గుజరాత్ ఇప్పటికే  ప్లేఆఫ్స్‌కు చేరింది. మిగతా  మూడు  స్థానాల కోసం ఆయా జట్ల మధ్య ఆసక్తి పోరు జరుగనుంది.  ఈ న...
19/05/2023

ఐపీఎల్‌-16లో గుజరాత్ ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరింది. మిగతా మూడు స్థానాల కోసం ఆయా జట్ల మధ్య ఆసక్తి పోరు జరుగనుంది. ఈ నేపథ్యంలో నేడు పంజాబ్, రాజస్థాన్ జట్ల మధ్య రసవత్తర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ధర్మశాలలో రాత్రి 7:30కు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 12పాయింట్లతో 6వ స్థానంలో ఉన్న RR ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్‌కు మార్గం సుగమం చేసుకోవాలని చూస్తోంది. 12పాయింట్లతో 8వ స్థానంలో ఉన్న PBKS సైతం ఎలాగైనా మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలని చూస్తోంది. ఈ మ్యాచ్ ఫలితం ఏదైనా ఇరుజట్ల భవితవ్యం మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ గెలిచేందుకు రెండు జట్లు సర్వశక్తులు ఒడ్డనున్నాయి. మరి ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.

ఐపీఎల్‌లో ఇప్పటికే గుజరాత్ ప్లేఆఫ్స్‌కు చేరింది. మిగతా  మూడు  స్థానాల కోసం ఆయా జట్ల మధ్య ఆసక్తి పోరు జరుగనుంది.  ఈ నేపథ్...
18/05/2023

ఐపీఎల్‌లో ఇప్పటికే గుజరాత్ ప్లేఆఫ్స్‌కు చేరింది. మిగతా మూడు స్థానాల కోసం ఆయా జట్ల మధ్య ఆసక్తి పోరు జరుగనుంది. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఉప్పల్ స్డేడియంలో రాత్రి 7:30కు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 12పాయింట్లతో 5వ స్థానంలో ఉన్న RCB ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్‌కు మార్గం సుగమం చేసుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న హైదరాబాద్ ఎలాగైనా మ్యాచ్ గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. ఈ మ్యాచ్ ఫలితంపై మిగతా జట్ల ప్లే ఆఫ్ అవకాశాలు ముడిపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ గెలిచేందుకు బెంగళూరు సర్వశక్తులు ఒడ్డనుంది. అటు SRH సొంతగడ్డపై గెలిచేందుకు సిద్ధమంటోంది. మరి ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.

Address

Hyderabad
500018

Alerts

Be the first to know and let us send you an email when Sportz 365 Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sportz 365 Telugu:

Share