PRIME Telugu

PRIME Telugu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from PRIME Telugu, Media/News Company, ravirala, Hyderabad.

Telugu news and entertainment channel Telangana Andhra Pradesh Telugu news updates breaking news Tollywood latest updates breaking Telugu news Telugu news updates

బిగ్‌ బ్రేకింగ్‌-సంచనలం!-------------------------ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభలో...
24/04/2026

బిగ్‌ బ్రేకింగ్‌-సంచనలం!
-------------------------
ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభలో ఆప్‌ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్టు రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా సంచలన ప్రకటన చేశారు. అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ లతో కలిసి ఆయన బీజేపీలో చేరారు. "రాజ్యసభలో ఆప్ కు చెందిన మూడింట రెండు వంతుల మంది సభ్యులు భారత రాజ్యాంగం ప్రకారం బిజెపిలో విలీనం కావాలని నిర్ణయించుకున్నాము" అని ఆయన తెలిపారు. ఆయన పార్టీ సహచరులు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
`రాజ్యసభలో ఆప్ కు 10 మంది ఎంపీలు ఉన్నారు. వారిలో 2/3 వంతు మందికి పైగా మాతో ఉన్నారు. ఈ మేరకు సంతకం చేసిన లేఖను, ఇతర పత్రాలను రాజ్యసభ చైర్మన్ కు సమర్పించాము. మాతో పాటు హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీ, స్వాతి మాలివాల్ కూడా ఉన్నారు.` అని తెలిపారు.
గతంలో చద్దా స్థానంలో రాజ్యసభ డిప్యూటీ లీడర్ గా మిట్టల్ నియమితులైన విషయం తెలిసిందే. ఇప్పుడు చద్దాతోపాటు మిట్టల్‌ బీజేపీ గూటికి చేరడం గమనార్హం.

బిగ్‌ బ్రేకింగ్‌-సంచనలం!
-------------------------
ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభలో ఆప్‌ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్టు రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా సంచలన ప్రకటన చేశారు. అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ లతో కలిసి ఆయన బీజేపీలో చేరారు. "రాజ్యసభలో ఆప్ కు చెందిన మూడింట రెండు వంతుల మంది సభ్యులు భారత రాజ్యాంగం ప్రకారం బిజెపిలో విలీనం కావాలని నిర్ణయించుకున్నాము" అని ఆయన తెలిపారు. ఆయన పార్టీ సహచరులు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

`రాజ్యసభలో ఆప్ కు 10 మంది ఎంపీలు ఉన్నారు. వారిలో 2/3 వంతు మందికి పైగా మాతో ఉన్నారు. ఈ మేరకు సంతకం చేసిన లేఖను, ఇతర పత్రాలను రాజ్యసభ చైర్మన్ కు సమర్పించాము. మాతో పాటు హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీ, స్వాతి మాలివాల్ కూడా ఉన్నారు.` అని తెలిపారు. కేజ్రీవాల్‌తో అంటీముట్టనట్టు ఉంటున్న చద్దాను గతంలో రాజ్యసభ డిప్యూటీ లీడర్ గా తొలగించి ఆయన స్థానంలో మిట్టల్ నియమితులైన విషయం తెలిసిందే. ఇప్పుడు చద్దాతోపాటు మిట్టల్‌ బీజేపీ గూటికి చేరడం గమనార్హం.

19/04/2026

అందుకే నన్ను యాంటీ హిందూ అంటున్నారు!!
శ్రీరాముడిపై వ్యాఖ్యల వివాదంలో నటుడు ప్రకాశ్‌రాజ్‌ (Prakash Raj) తాజాగా స్పందించారు. ‘‘ఇటీవల నేను ఓ లిటరరీ ఫెస్టివల్‌లో ఇచ్చిన ప్రసంగంలోని కొన్ని మాటలను మాత్రమే తీసుకుని కొందరు వక్రీకరించారు. నేనేదో అవతారపురుషుడు శ్రీరాముడి గురించి తప్పుగా మాట్లాడానని, హిందువుల మనోభావాలను గాయపరిచానని అంటున్నారు. అన్ని ధర్మాలను, అందరినీ ప్రేమించే నాకు ఆ అవసరం లేదు. కొందరు రాజకీయ నాయకులు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక.. హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని పేర్కొన్నారు.

17/04/2026

హైదరాబాద్ నగరంలో రాత్రిపూట డ్యూటీలో ఉన్న ఒక సెక్యూరిటీ గార్డు దోమల నెట్‌ కప్పుకొని కూర్చుని ఉన్న వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది.
లగ్జరీ అపార్ట్‌మెంట్లకు కాపలా డ్యూటీ చేస్తున్న సెక్యూరిటీ గార్డుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఈ వీడియో చాటుతోంది.
ఈ వీడియోలో ఓ అపార్ట్‌మెంట్‌ ముందు దోమల నెట్‌ కప్పుకుని కుర్చీలో కూర్చుని ఉన్న సెక్యూరిటీ గార్డుతో ఓ మహిళ మాట్లాడుతూ.. గార్డుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తుంది. "భారతదేశంలో సెక్యూరిటీ గార్డుల జీవితాలు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ వీడియో చాటుతోంది. గార్డు రాత్రాంత దోమల నెట్‌ కప్పుకుని, మేల్కొని తన విధిని నిర్వహించాల్సిన పరిస్థితి. హౌసింగ్‌ సొసైటీ సభ్యులు ఏసీలో బ్రతుకుతూ.. వారికి భద్రత, రక్షణ కల్పిస్తున్న గార్డులకు మాత్రం కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం ఎంతో బాధాకరం. కఠిన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న పేదల పట్ల ప్రజలకు కనీస దయ లేకపోవడాన్ని ఇది చాటుతోంది` అని నెటిజన్లు అంటున్నారు. ఈ వీడియోపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గార్డుల కనీస సౌకర్యాలు- ఒక క్యాబిన్‌-ఫ్యాన్‌ లాంటి సదుపాయాలు లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై మీరు ఏమంటారు?
వీడియో సోర్స్‌: online- hindustantimes

Address

Ravirala
Hyderabad
501510

Alerts

Be the first to know and let us send you an email when PRIME Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to PRIME Telugu:

Shortcuts

Share