webcam24.news

webcam24.news News & media, astrology, cinema

07/02/2026
26/08/2024
19/07/2024

Just a Minute Movie Genuine Public Talk | Just a Minute Movie Review | Poorna's YaswanthFor more videos about Telugu cinema, subscribe to our YouTube channel...

16/07/2024

కన్నడంలో కూడా విడుదల కానున్న ఆర్. కె పురంలో?

పవన్ దీపికా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమైన ఆర్. కె పురంలో? సినిమా కన్నడ భాషలో కూడా విడుదల కానున్నది. ఈ సందర్భంగా బెంగుళూరు కన్నడ ఫిలిం చాంబర్ లో ఫిలిం చాంబర్ అధ్యక్షుడు, డి.ఎస్సీ సినిమాస్ అధినేత డాక్టర్ సునీల్ కుంబా ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేసారు . కోనసీమ యువకుడు గుబ్బల రవికిరణ్ హీరోగా త్రిషల , రక్షా హీరోయిన్ లుగా యాక్షన్ , థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కించారు . ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ , హిందీ భాషల్లో ఆగష్టు 22 న విడుదల కానున్నది. ఈ చిత్రం కుటుంబ నేపధ్యంలో సాగిందని ,ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని కన్నడంలో కూడా విడుదల చేస్తున్నామని సునీల్ కుంబా తెలిపారు . హీరో రవి కిరణ్ కు మంచి భవిష్యత్ ఉందని ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా విశ్వరూపం చూపించారని ,డాన్స్ , పైట్స్ అద్భుతంగా చేశారని ఫిలిం చాంబర్ అధ్యక్షుడు సునీల్ కుంబా తెలిపారు . మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా ఆగష్టు22 న విడుదల చేయనున్నట్లు హీరో మరియు నిర్మాత రవి కిరణ్ తెలిపారు .ప్రముఖ దర్శకుడు కట్టా శ్రీకర్ ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించిన ఆర్.కె .పురం లో? ఒక సస్పెన్స్ గా సినిమా సాగుతుంది అన్నారు ప్రధానంగా మత్తుకు బానిస అవుతున్న యువత , గంజాయి రాకెట్ లపై ఈ చిత్రాన్ని నిర్మించామన్నారు . బెంగుళూరులో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కెమెరామెన్ వాసుదేవన్ , ప్రముఖ కన్నడ దర్శకుడు గురురాజ కులకర్ణి ,వాసంశెట్టి తేజ , మేనేజర్ రూప రాస్విని , వినయ్ తదితరులు పాల్గొన్నారు .

Address

H. No. 6-120/38, Raghavendranagar, Jillelaguda, R. R. District
Hyderabad
500097

Alerts

Be the first to know and let us send you an email when webcam24.news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share