SRRCC Films

SRRCC Films SRRCC Films - Writing/Directing Short Films

అక్షరాగ్నితో ఆలోచనలు రగిలించిన మహాకవి శ్రీశ్రీ గారికి జన్మదిన శుభాకాంక్షలు 🎂🙏💐                                - నవీన్ నా...
30/04/2022

అక్షరాగ్నితో ఆలోచనలు రగిలించిన మహాకవి శ్రీశ్రీ గారికి జన్మదిన శుభాకాంక్షలు 🎂🙏💐
- నవీన్ నానా దివిటి🖋️

జీవన క్రమంలో రంగులు మారే దశల్ని ఆస్వాదిస్తూ...జీవితాల్ని రంగులమయం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ...మీకు, కుటుంబ సభ్యులకు అందరి...
18/03/2022

జీవన క్రమంలో రంగులు మారే దశల్ని ఆస్వాదిస్తూ...
జీవితాల్ని రంగులమయం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ...
మీకు, కుటుంబ సభ్యులకు అందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు...🌺🌼💐
- నవీన్ నానా దివిటి 🖋️

దగా పడిన కోయిలదట్టంగా అల్లుకున్న ప్రకృతి ఒడిలో...తానొక యజమాని అనే భావనలో...పచ్చని చెట్ల కొమ్మలపై వాలి...వసంతపు చిగురుల న...
25/01/2022

దగా పడిన కోయిల

దట్టంగా అల్లుకున్న ప్రకృతి ఒడిలో...
తానొక యజమాని అనే భావనలో...
పచ్చని చెట్ల కొమ్మలపై వాలి...
వసంతపు చిగురుల నడుమ...

చిక్కటి చీకటిలో...చక్కటి వెలుగులో...
తెలవారిన సంధ్యలో...చల్లని సాయంత్రంలో...
సరదాగా మది గదినే తెరిచి...
సమయాన్నే మైమరచి...కుహూ కుహూ రాగాలతో...

కాలం అలా సాగిపోతుంటే...
అంతా అదేదో జరిగినట్టు...కనికట్టు
మాయతో కమ్మేసి ఏర్పడినట్టు కాంక్రీట్ భవనాలు...
తలపిస్తున్న ఆకాశ హర్మ్యాలు...

అల్లంత దూరాన ఉండే కొండకోనలు..
అలసిసొలసి సేదతీరే చెరువు గట్లు...
ఎన్నో ఎన్నెన్నో ప్రోది చేసుకున్న
జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ...

రోదిస్తూ... రోదనలతో గానం ఆలపిస్తూ
రాబోయేవి మంచి రోజులని కాంక్షించాలో...
రానున్నది ఇంకా గడ్డు కాలం అని విలపించాలో...
కన్నీరు ఇంకిన కన్నులతో...

మనుషుల స్వార్ధపు దాహార్తికి బలై...
ఆవరించిన శూన్యంలో...దగాపడిన కోయిల...
- నవీన్ నానా దివిటి✍️ with SRRCC Films

సంక్రాంతి శోభఇంటికి చేరిన పంట...బావామరదల్ల ఆటాపాటా...లోగిళ్ళన్నీ రంగవల్లులతో, గొబ్బెమ్మలతో ఆహ్వానిస్తున్న వేళ...పల్లేపడు...
15/01/2022

సంక్రాంతి శోభ

ఇంటికి చేరిన పంట...
బావామరదల్ల ఆటాపాటా...
లోగిళ్ళన్నీ రంగవల్లులతో, గొబ్బెమ్మలతో ఆహ్వానిస్తున్న వేళ...
పల్లేపడుచు అందాలతో కళకళ...

కోడిపందేల జోరు...
సందడులను వెంట తీసుకొచ్చే కుర్రకారు హుషారు...
డూ డూ బసవన్నలు...సన్నాయిలు...
పండగ విశిష్టతను తెలుపుతూ హరిదాసుల కీర్తనలు...

నింగిలో ఎగిరే పతంగులు...
చిన్నపిల్లల కేరింతలు...
ఎన్నో ఎన్నెన్నో హంగులు...
ఇంటిల్లిపాదీ కలిసి ఆరగించే పిండివంటలు, భోజనాలు...

మకర సంక్రమణ పర్వదినాన....
మిత్రులకు, శ్రేయోభిలాషులకు, FB కుటుంబ సభ్యులకు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు💥💐🌺🏵️
- నవీన్ నానా దివిటి🖊️ with SRRCC Films

కొన్ని కొన్ని అవార్డ్స్ కొందరికి వస్తే ఆ అవార్డ్ కే అందం వస్తుంది. అలాంటి సందర్భమే ఇది.Hearty congratulations dear Rajin...
26/10/2021

కొన్ని కొన్ని అవార్డ్స్ కొందరికి వస్తే ఆ అవార్డ్ కే అందం వస్తుంది. అలాంటి సందర్భమే ఇది.
Hearty congratulations dear Rajinikanth గారు on occasion of receiving Dadasaheb Phalke award 💐💐

మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కుటుంబ సభ్యులకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు 🏵️💮🌼🪔💐                              - నవీన్ నా...
15/10/2021

మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కుటుంబ సభ్యులకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు 🏵️💮🌼🪔💐
- నవీన్ నానా దివిటి SRRCC Films

ప్రపంచ తపాలా దినోత్సవ సందర్భంగా...ఉత్తరం        - మరిచిపోలేను ఆ రోజులనుఅట్లాస్ సైకిల్ గంటకొడుతూ...ఇంటిదగ్గరికొచ్చి ప్రేమ...
09/10/2021

ప్రపంచ తపాలా దినోత్సవ సందర్భంగా...

ఉత్తరం
- మరిచిపోలేను ఆ రోజులను

అట్లాస్ సైకిల్ గంటకొడుతూ...
ఇంటిదగ్గరికొచ్చి ప్రేమతో పలకరిస్తూ...
Postman తెచ్చే ఉత్తరాన్ని అందుకొన్న...
ఆ రోజులను మరిచిపోలేను...

ఉత్తరాన్ని చదువుతూ...
అక్షరాలను చేతితో తడుముతూ...
కన్నులు తడిసిన క్షణాలను...
గుండె బరువెక్కిన సమయాన్ని...
ఆ రోజులను మరిచిపోలేను...

క్షేమసమాచారాలను...
మదిలోని భావాలను...
దూరంగా ఉన్నా...
దగ్గర చేసే ప్రేమానురాగాలను...
మరిచిపోలేను ఆ రోజులను...

ఏవైనా వస్తువులు సర్దుతుంటే
కనిపించిన ఉత్తరాలను...
అవి అందించిన ఆ సమాచారాన్ని...
మరలా గుర్తుచేసుకొన్న జ్ఞాపకాలను...
ఆ రోజులను మరిచిపోలేను...

అందమైన ప్రేమలేఖలు...
అనుబంధాల రూపురేఖలు...
అపూర్వమైన అనుభూతులు...
ఎన్నో, ఎన్నెన్నో మరెన్నో మధురానుభూతులు...
ఉత్తరాలు అందించిన ఆ రోజులను మరిచిపోలేను...
- నవీన్ నానా దివిటి ✍️

09/10/2021

ప్రపంచ తపాలా దినోత్సవ సందర్భంగా...

ఉత్తరం
- మరిచిపోలేను ఆ రోజులను

అట్లాస్ సైకిల్ గంటకొడుతూ...
ఇంటిదగ్గరికొచ్చి ప్రేమతో పలకరిస్తూ...
Postman తెచ్చే ఉత్తరాన్ని అందుకొన్న...
ఆ రోజులను మరిచిపోలేను...

ఉత్తరాన్ని చదువుతూ...
అక్షరాలను చేతితో తడుముతూ...
కన్నులు తడిసిన క్షణాలను...
గుండె బరువెక్కిన సమయాన్ని...
ఆ రోజులను మరిచిపోలేను...

క్షేమసమాచారాలను...
మదిలోని భావాలను...
దూరంగా ఉన్నా...
దగ్గర చేసే ప్రేమానురాగాలను...
మరిచిపోలేను ఆ రోజులను...

ఏవైనా వస్తువులు సర్దుతుంటే
కనిపించిన ఉత్తరాలను...
అవి అందించిన ఆ సమాచారాన్ని...
మరలా గుర్తుచేసుకొన్న జ్ఞాపకాలను...
ఆ రోజులను మరిచిపోలేను...

అందమైన ప్రేమలేఖలు...
అనుబంధాల రూపురేఖలు...
అపూర్వమైన అనుభూతులు...
ఎన్నో, ఎన్నెన్నో మరెన్నో మధురానుభూతులు...
ఉత్తరాలు అందించిన ఆ రోజులను మరిచిపోలేను...
- నవీన్ నానా దివిటి ✍️

FB మిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబసభ్యులకు అందరికీ గణేశ్ చతుర్థి పండుగ శుభాకాంక్షలు🌻Dear friends, Happy Ganesh Chaturth...
10/09/2021

FB మిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబసభ్యులకు అందరికీ గణేశ్ చతుర్థి పండుగ శుభాకాంక్షలు🌻
Dear friends, Happy Ganesh Chaturthi 🙏💐

05/09/2021

గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెస్తూ,
ఉత్తమ విద్యార్థులను తయారు చేస్తూ,
ఉన్నతమైన వ్యక్తిత్వం, విలువలు కలిగిన పౌరులను అందిస్తూ
సమాజానికి మేలు చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ "ఉపాధ్యాయ దినోత్సవం" సందర్భంగా శుభాకాంక్షలు💐🙏
Happy Teacher's day wishes 💐🎁🙏
- నవీన్ నానా దివిటి

🌺🌾🌸Happy Onam to all my Malayalee friends🌺🌾🌸
21/08/2021

🌺🌾🌸Happy Onam to all my Malayalee friends🌺🌾🌸

20/05/2021

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న

పాటకు కొత్తగా రెక్కలిచ్చిన, సిరివెన్నెల సోయాగాలద్దిన గురువుగారు శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి,

నవరసాలను అవలీలగా పలికిస్తూ, అభిమానులను అలరిస్తున్న శ్రీ నందమూరి తారక రామారావు గారికి,

మంచి మనస్సు ఉన్న మంచువారబ్బాయి శ్రీ మంచు మనోజ్ గారికి

జన్మదిన శుభాకాంక్షలు 🎂🎉🎈🎁💐

- నవీన్ నానా దివిటి SRRCC Films

Address

Hyderabad

Telephone

+91-9000234293

Website

Alerts

Be the first to know and let us send you an email when SRRCC Films posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to SRRCC Films:

Share