Team Lokesh

Team Lokesh A Proud Warrior Of Nara Lokesh

26/06/2025

గత ఏడాది కాలంలో మనం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేలా, జులై 2 నుంచి "సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం" మొదలు పెడుతున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరుతున్నా.


24/06/2025

విశాఖపట్నం మెడ్‌టెక్ జోన్, ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దుతాం. ఏఐ యూనివర్సిటీ నెలకొల్పుతాం. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర ద్వారా 503 సేవలు అందిస్తున్నాం. ఆగస్ట్ 15 నాటికి ఈ సేవలను 703కి పెంచుతాం. ఇప్పటివరకు 25 డిజిటల్ క్యాబినెట్లు నిర్వహించాం.
#సుపరిపాలనలోతొలిఅడుగు



23/06/2025

"సుపరిపాలనలో తొలి అడుగు..
ఆకాంక్షల నుంచి అభివృద్ధి దిశగా.."

ఏడాది పాలన సందర్భంగా అమరావతిలో నిర్వహించిన సమావేశంలో కూటమి ప్రభుత్వ విజయాలపై ముఖ్యమంత్రి ప్రెజెంటేషన్.
#సుపరిపాలనలోతొలిఅడుగు



23/06/2025

కూటమిగా మూడు పార్టీలు కలిసి అధికారంలో ఉన్నా ఎలాంటి సమస్య రాలేదు. సుపరిపాలన అందించేందుకు అధికారులు కూడా ముఖ్యం.
#సుపరిపాలనలోతొలిఅడుగు



23/06/2025

సుపరిపాలనలో తొలి అడుగు..

సమర్థంగా పరిపాలించి సుపరిపాలన అందిస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా చెప్పిన మాట నిలబెట్టుకుంటాం.
#సుపరిపాలనలోతొలిఅడుగు



23/06/2025

ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గత పాలకుల అహంకారం, అరాచకంతో 151 - 11 అయ్యింది. కాలర్ ఎగరేసి తిరగడం కాదు, ఒళ్లు దగ్గర పెట్టుకొని ప్రజల కోసం నిరంతరం పనిచేయాలి.
#సుపరిపాలనలోతొలిఅడుగు




23/06/2025

ఐదేళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వారు ప్రజా ప్రభుత్వం ఏడాదిలో ఏం సాధించింది అని అడుగుతున్నారు. నేను వారికి సూటిగా సమాధానం చెప్పాలి అనుకుంటున్నా. ప్రజా ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు ప్రశాంతత వచ్చింది. ప్రజా ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజల మొఖంలో చిరునవ్వు వచ్చింది. ప్రజా సంఘాలకు ప్రశ్నించే హక్కు వచ్చింది. నియంత పాలన నుండి ప్రజలకు స్వాతంత్య్రం వచ్చింది.
#సుపరిపాలనలోతొలిఅడుగు




23/06/2025

ఐదేళ్లు అరాచక పాలన సాగింది. దళిత బిడ్డల్ని చంపి డోర్ డెలివరీ చేసారు. మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్ ను వేటాడి, వెంటాడి చంపేసారు. అక్క ను వేధించిన వారిని ప్రశ్నించినందుకు బిసి బిడ్డ అమర్నాధ్ గౌడ్ పై పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేసారు. ప్రశ్నిస్తే లాఠీ దెబ్బలు, కేసులు, అరెస్టులు. విధ్వంస పాలన పై ప్రజలు తిరగబడి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు.
#సుపరిపాలనలోతొలిఅడుగు




23/06/2025

సుపరిపాలనలో తొలి అడుగు సభలో జ్యోతి ప్రజ్వలన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఎంపీ పురందేశ్వరి గారు, మంత్రి నారా లోకేష్ గారు, చీఫ్ సెక్రటరీ గారు
#సుపరిపాలనలోతొలిఅడుగు



23/06/2025

అందరూ కూటమి గెలిచింది, టీడీపీ గెలిచింది, జనసేన గెలిచింది, బీజేపీ గెలిచింది అంటున్నారు. గెలిచింది కూటమి కాదు గెలిచింది ప్రజలు. 94 శాతం స్ట్రైక్ రేట్ ..164 అవుట్ ఆఫ్ 175. ప్రజలు రికార్డులు బద్దలు కొట్టారు. చరిత్రను తిరగరాసారు. ఇది ప్రజా విజయం.
#సుపరిపాలనలోతొలిఅడుగు




21/06/2025

ప్రధాని మోదీ గారి సమక్షంలో సీఎం చంద్రబాబు గారి కృషితో ప్రపంచరికార్డు సాధించబోతున్నాం : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్






Address

Hyderabad

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 1pm

Alerts

Be the first to know and let us send you an email when Team Lokesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share