03/03/2025
లేపి మరి తన్నించుకోవడం రేవంత్ కు అలవాటే..!
మోకాలికి బోడి గుండుకు ముడివేసి మోసగించడం, తన వైఫల్యం నుంచి దృష్టి మళ్లించడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారింది.
కర్తవ్యం మరిచి ఎన్నికలలో రాజకీయాలలో మునిగితేలిన ముఖ్యమంత్రి.
నేను నా సన్నిహిత మిత్రుడు దుబ్బాక శాసనసభ్యులు కూతురు పెళ్లి ఫంక్షన్ కోసం అబుదాబి వెళితే దాన్ని వివాదం చేయడానికి ప్రయత్నించడం అతని నీచత్వానికి పరాకాష్ట
ప్రభుత్వాన్ని నడుపుతున్నది తాను, ప్రమాద స్థలానికి వెంటనే వెళ్ళవలసింది తను. తను బాధ్యత మరిచి ఎలక్షన్ ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు ప్రతిపక్షం మీద నా మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడు.
నేను అబుదాబికి వెళ్ళింది క్రికెట్ మ్యాచ్లు చూడడానికో, విహారయాత్రలకు, విలాసాలకో కాదు.
నా సన్నిహిత మిత్రుడైన కొత్త ప్రభాకర్ రెడ్డి గారి బిడ్డ పెండ్లి ఫంక్షన్ కి హాజరవ్వడానికి వెళ్లాను.
నేను వెళ్ళింది 21-02-2025 రోజున, ప్రమాద ఘటన జరిగింది 22-02-2025 రోజున.
హెలికాఫ్టర్ తీసుకొని ప్రమాద స్థలానికి రాకుండా ఎన్నికల ప్రచారానికి పోయింది ఎవరు? ప్రమాద స్థలానికి చేరుకోవడానికి హెలికాప్టర్ లేదని నీటిపారుదల శాఖ మంత్రి పోకుండా హైదరాబాదులో ఉన్నాడు.
ప్రభుత్వంలో ఉండి కూడా బాధ్యత మరచి ప్రవర్తించిన వాళ్ళు
కనీస మానవ విలువలు పాటించకుండా ప్రవర్తించిన వాళ్ళు ప్రతిపక్ష శాసనసభ్యున్నయినా నన్ను ఆడిపోసుకుంటున్నారు.
మానవ సంబంధాల్లో భాగంగా స్నేహితుని బిడ్డ పెండ్లి ఫంక్షన్ కు నేను ఫ్యామిలీతో అబుదాబికి పోతే దానిమీద వక్ర వ్యాఖ్యలు చేస్తూ తమ కుత్సితబుద్ధి బయట పెట్టుకుంటున్నారు
తన తక్షణ కర్తవ్యం విస్మరించిన ముఖ్యమంత్రి ఇప్పుడు తగుదునమ్మా అని తొమ్మిది రోజుల తర్వాత పోయి తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏది పడితే అది వాగు తున్నాడు
ప్రతిపక్ష శాసన సభ్యునిగా నేను నిర్మాణాత్మకంగా బాధ్యతా యుతంగా వ్యవహరించాను ప్రమాద సహాయక చర్యలకు తగిన గడువిచ్చిన తర్వాత ప్రమాద స్థలానికి చూడడానికి పోయాను. తాను రాకపోగా వెళ్లిన నన్ను అడుగడుగున నిర్బంధించిన ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రమాద ఘటన స్థలం నుండే నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడు.
ప్రమాదం జరిగి తొమ్మిది రోజులు గడిచిన కార్మికులను కాపాడకపోగా, కనీసం వారి మృతదేహాలను బయటకు తీయలేని చేతగాని ప్రభుత్వం.
ప్రభుత్వంలో ఉంది నువ్వా నేనా. ప్రభుత్వంలో ఉన్నవాళ్లు దుబాయిలో విలాసాలు చేయడం ఎట్ల సమర్ధించుకుంటారు?
మానవత్వం మరిచి నువ్వు ఎన్నికల ప్రచారానికి పోవడాన్ని ఎట్లా సమర్థించుకుంటావు.
బాధ్యతలను మరచి విలాసాల్లో విహారాల్లో మునిగింది రాజకీయాలు చేసింది నువ్వు నీ మంత్రిమండలి నీ సహచరులు.
నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే చెల్లదు. నువ్వేమిటో నేనేమిటో ప్రజలు గమనిస్తున్నారు.
ముఖ్యమంత్రిగా శాంతి భద్రతల మీద దృష్టి సారించకుండా ప్రతిపక్ష నాయకుల కదలికలను తెలుసుకోవడానికి ఇంటలిజెన్స్ వ్యవస్థను ఉపయోగించుకుంటామని
నువ్వు దృష్టి పెట్టవలసింది మా ప్రయాణాల మీద కాదు, ప్రజల ప్రయోజనాల మీద
నువ్వు నిరంతరం మామీద నిఘా పెడుతున్నావాంటే అభద్రతలో పడి కొట్టుమిట్టాడుతున్నావని అనుకోవాలి
ఇకనైనా బుద్ధి తెచ్చుకో.
Anumula Revanth Reddy