12/09/2026
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ శ్రీ బాలకృష్ణుని దర్శించుకున్నారు. వేకువజామున ఆలయానికి చేరుకున్న ఆయన నిర్మాల్య దర్శనంలో పాల్గొన్నారు. దాదాపు 30 నిమిషాల పాటు తైలాభిషేకం, శంఖాభిషేకం, వాకచార్థు సేవలను తిలకించారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆశీర్వాదం పొందారు.