Aptopnews

Aptopnews 24/7 political news and entertainment news and sports

24/03/2024

100 మంది జనసేన నేతలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

కులతత్వ, మతతత్వ పార్టీలు ఒక్కటయ్యాయి

వైయ‌స్ఆర్‌సీపీ నెల్లూరు పార్ల‌మెంట్ అభ్య‌ర్థి విజయసాయిరెడ్డి


నెల్లూరు: వైయ‌స్ఆర్‌సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సమక్షంలో 100 మంది జనసేన నేతలు వైయ‌స్ఆర్‌సీపీలోకి చేరారు. జనసేన పార్టీ నెల్లూరు నగర ప్రధాన కార్యదర్శి జీవన్ కుమార్ నేతృత్వంలో ఆదివారం 100 మంది ఆ పార్టీ కార్యకర్తలకు వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో కండువా కప్పి విజ‌య‌సాయిరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. మా పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి తెలుగుదేశం పార్టీకి కంటగింపుగా ఉంద‌ని విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. టిడిపికి వచ్చే ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదు. నెల్లూరు పార్లమెంటుతో పాటు దాని పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను వైయ‌స్ఆర్‌సీపీ కైవసం చేసుకుంటుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. జనసేనకి భవిష్యత్తు లేదన్నారు. కులతత్వ, మతతత్వ పార్టీలో ఏపీలో ఒక్కటయ్యాయని ఆయన మండిపడ్డారు.

నా ప్రత్యక్ష రాజకీయాలు సొంత జిల్లా నుంచి ప్రారంభిస్తున్నా.. రాష్టంలోని అన్ని జిల్లాలకు రీజినల్ కో-ఆర్డినేటర్‌గా పనిచేశాను.. పార్టీకి, ప్రజలకు విశేష సేవలు అందించాను. జిల్లాలో టీడీపీకి ఎంపీ అభ్యర్థి దొరకలేదు.. అందుకే వైయ‌స్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడ్ని లాక్కుని టికెట్ ఇచ్చారు. మా పార్టీలో రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు పొందిన నేతలు ఇప్పుడు మాపైనే విమర్శలు చేస్తున్నార‌ని దుయ్యబట్టారు.

టీడీపీ నేతలు వీధి రౌడీలు, చిల్లర మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారు. మాదక ద్రవ్యాలు దిగుమతి చేసుకున్నది. చంద్రబాబు బంధువులకు చెందిన కంపెనీ. డ్రగ్స్ కేసులో టీడీపీ నేతలు దొరికితే.. వైఎస్సార్‌సీపీపైకి నెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఆరు సీట్లకు మించి రావు. సీబీఐ విచారణలో టీడీపీ నేతల బండారం బయటపడటం ఖాయం. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన చాలా మంది నేతలు బీజేపీకి ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇచ్చారు. బ్రెజిల్ అధ్యక్షునికి అభినందనలతో ట్విట్ పెడితే.. దాన్ని కూడా తప్పుగా చిత్రీకరిస్తున్నారు అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

అధికారం కోసం  ఎన్ని కుట్రలు చేయడానికైనా చంద్రబాబు వెనకాడడువైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణా...
21/03/2024

అధికారం కోసం ఎన్ని కుట్రలు చేయడానికైనా చంద్రబాబు వెనకాడడు

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

వ్యవస్ధలను మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరు.

దేశంలోని అన్ని వ్యవస్ధలను శాసించేలా చేయడం చంద్రబాబుకు మొదటినుంచి అలవాటు.

చేసిన తప్పులనుంచి తప్పించుకోవడానికి వ్యవస్దలను మేనేజ్ చేసేవారు.

ద్రబాబు అంటే గుర్తుకు వచ్చేది వ్యవస్దల మేనేజ్ మెంట్.అవినీతి.

అవినీతి,దోపిడీ విధానాలను ప్రజలు ఛీ కొట్టినా చంద్రబాబులో ఎలాంటి మార్పులేదు.

తన రాజకీయజీవితంలో అవినీతిని సమాంతరంగా బ్యాలెన్స్ చేశారు.అవినీతిని వ్యవస్దీకృతం చేశారు.

మీడియాను అడ్డుపెట్టుకుని అసత్యాలను ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట.

40 ఏళ్ల అనుభవం చూస్తే చంద్రబాబు చేసిన అవినీతే ఆయనకు మిగిలింది.

ఇక్కడ అవినీతిని చంద్రబాబు అంతర్జాతీయస్దాయికి తీసుకువెళ్లాడు.

నరేంద్రమోదిని అన్ని తిట్లు తిట్టి తిరిగి ఆయనతోనే పొత్తు చంద్రబాబుకే సాధ్యం.

రాష్ట్రాన్ని నమిలి మింగడానికి పొత్తులతో చంద్రబాబు వస్తున్నాడు.చంద్రబాబు దృష్టిలో రాజకీయం అంటే దోపిడీ.

చంద్రబాబు "మహాదోపిడీ", పుస్తకావిష్కరణ సభలో వైయస్సార్ సిపి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామ కృష్ణ రెడ్డి.

తాడేప‌ల్లి: అధికారం కోసం చంద్ర‌బాబు ఎన్ని కుట్రలు చేయడానికైనా వెనకాడడ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి విమ‌ర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు మోసాలు ప్రజలకు అర్థమయ్యాయి కాబట్టే 2019 టీడీపీని ఓడించారని అన్నారు జన్మభూమి కమిటీలతో చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారని సజ్జల చెప్పారు. రాజకీయం అంటే దోపిడీ అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించారు. చంద్రబాబు అధికారం కోసం పవన్‌, బీజేపీని వాడుకుంటున్నారు. అధికారం చంద్రబాబు ఆఖరి ప్రయత్నం చేస్తున్నారని మండిప‌డ్డారు. సీనియర్ జర్నలిస్ట్ పి.విజయబాబు రచించిన చంద్రబాబు ``మహాదోపిడీ" పుస్తకాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో విజయబాబుతోపాటు శాసనమండలి విప్ లేళ్ళ అప్పిరెడ్డి, శాసనసభ్యులు మల్లాీది విష్ణు, మహిళా కమీషన్ మాజి ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ,కృష్ణంరాజు,ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్లు కొమ్మూరి కనకారావు,అమ్మాజి, పార్టీ నేతలు చల్లా మధుసూధన్ రెడ్డి,కాకుమాను రాజశేఖర్,నారాయణమూర్తి పాల్గొన్నారు.

స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఏమ‌న్నారంటే..

చంద్రబాబు అవినీతి విషయంలో విశ్వరూపం ప్రదర్శించారు. అవినీతిని వ్యవస్ధీకృతం చేశారు. ఆంధ్రప్రదేశ్ ను అవినీతి విషయంలో అంతర్జాతీయస్దాయికి తీసుకువెళ్లిన ఘనత చంద్రబాబుదని అన్నారు. చంద్రబాబు అనగానే గుర్తుకువచ్చేది అవినీతి. వ్యవస్దలను మేనేజ్ చేసి కరప్ట్ చేయడంలో దిట్ట అని అన్నారు. వ్యవస్దలను అవినీతి ద్వారా మేనేజ్ చేసి శాసించగల మాఫియానేతగా చంద్రబాబు తననుతాను తన అనుకూల మీడియా ద్వారా చిత్రీకరించుకున్నారు. ఇది అద్బుతమైన అంతర్జాతీయస్దాయి సినిమాకధగా బాగుంటుంది కాని,మన కర్మకాలి అది మన రాష్ర్టంలోనే నిజమైంది అని అన్నారు. అంతర్జాతీయస్దాయిలో అవినీతి

దేశంలో అన్ని వ్యవస్థలను శాసించడం మొదటి నుంచి చంద్రబాబుకు అలవాటు. వ్యవస్థలను మేనేజ్ చేయడం చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడం. చంద్ర బాబు అంటే గుర్తొచ్చేది వ్యవస్థలను మేనేజ్ చేయడమే. మీడియాను అడ్డం పట్టుకునే ఉవ్వెత్తున అసత్య ప్రచారాలు చేయడంలో దిట్ట అన్నారుతద్వారా తాను ఒక బలమైన వ్యక్తిగా అందరి ముందు కనిపించి ఆరోజుకు అవసరమైన పొత్తులతో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించడం చేస్తుంటారన్నారు. అవసరాలకు అనుగుణంగా పొత్తులు పెట్టుకోవడం చంద్ర బాబుకు అలవాటే. ఐదు సంవత్సరాలు అవినీాతిని వ్యవస్దీకరించి పార్టీని మాఫియా ముఠాలాగ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాన్ని నడిపాడని తెలియచేశారు. తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలు,పచ్చకార్యకర్తలు మొత్తం అంతా రాజకీయపార్టీగా చలామణి అవుతున్నా నలభై ఏళ్ల అనుభవం తరువాత చంద్ర బాబు చేసిన అవినీతే ఆయనకు మిగిలింది. 2014-19 మధ్య జన్మభూమి కమిటీలను ఏర్పాటుచేసి రాజకీయ జీవితంలో సమాంతరంగా అవినీతిని బ్యాలెన్స్ చేశాడన్నారు. కేంద్ర నిధుల నుంచి రాష్ట్ర నిధుల వరకు ఎదో ఒక పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు.కిందకు వెళ్లే రూపాయిలో ముప్పావులా ఎలా కాజేయచ్చో అది చెట్టు-నీరు లేదా పోలవరం అమరావతి కావచ్చు.అని అన్నారు.నిజానికి అమరావతి కూడా ఒక పెద్ద స్కాం అని తెలియచేశారు. ప్రజలు చీ కొట్టి తరిమివేసిన తన వైఖరిని చంద్రబాబు ఇప్పటికీ మార్చుకోలేదు. ఇదే సమయంలో చూస్తే జగన్ మోహన్ రెడ్డి రూపంలో ఒక బలమైన యువనేత రాష్ర్ట పగ్గాలు చేపట్టారన్నారు.చంద్రబాబును ప్రజలు బలమైన దెబ్బకొట్టి చెత్తబుట్టలో పడేశారన్నారు. అయినా సరే ఈరోజు మళ్లీ సర్వశక్తులు కూడగట్టుకుని తన దోపిడీ ద్వారా సంపాదించిన అంతర్జాతీయస్దాయిలో నిధులను సమీకరించుకుని డూ ఆర్ డై అంటూ తలపడతున్నారన్నారు.రాష్ట్రాన్ని నమిలి మింగడానికి మళ్ళీ పోత్తులతో చంద్రబాబు వస్తున్నాడు.
ఈరోజు జరిగే యుధ్దంలో ఇటువైపు జగన్ గారు సృష్టించే క్రమంలో ఉన్న అద్బుతమైన కలల రాజ్యం...సుస్దిరమైన,శాశ్వతమైన,ప్రశాంతమైన ఆరోగ్యకరమైన సమాజాన్ని సృష్టించేదిశగా అడుగులు వేస్తున్నారు.ఇదే సమయంలో చంద్రబాబు తిరిగి తన అరాచకమైన,దోపిడీ,అవినీతి చీకటి పాలనలోకి రాష్ర్టాన్ని తీసుకువెళ్లే ఆఖరి ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ, జనసేనతో పాటు నోటాతో పోటీ పడే కాంగ్రెస్ పార్టీతో కూడా చంద్రబాబు జత కట్టారు. అవుట్ సోర్సింగ్ లాగ అన్ని పార్టీల మద్దతు కూడా గట్టుకొని పొత్తులతో వస్తున్నారు. వైఎస్ షర్మిల కూడా చంద్రబాబుతో కలిసి పని చేస్తున్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎలా అయ్యారు.
వైఎస్ షర్మిలకు స్క్రిప్ట్ ఎక్కడా నుంచి వస్తుంది.రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు.

ఎవరు ఎలా వచ్చినా ఎంత మంది వచ్చినా ఎన్నికల యుద్దానికి సిద్దంగా ఉన్నామని సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అట్టడుగున ఉన్న అన్ని వర్గాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. దేశం మొత్తం చూసేలా ఎన్నికల్లో అభ్యర్థులను వైయస్సార్ సిపి నిలిపింది. ఎస్సీ , ఎస్టీ, బిసి,మైనార్టీలకు పోటీ చేసే అవకాశం వైఎస్ జగన్ కల్పించారు. అన్ని శక్తులు ఏకమై వైయస్సార్ సిపి మళ్ళీ అధికారంలోకి రాకూడదని ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి రావాలని ఎన్ని కుట్రలు చెయ్యాలో అన్ని చేస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చి చేయాల్సిన అవినీతి అంతా మళ్ళీ చేయాలని చంద్రబాబు చూస్తున్నాడు. అన్ని తిట్లు తిట్టి మళ్ళీ మోడీతో మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు. లక్ష్మి పార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నా కూడా అత్యంత నీచంగా ఆమెను చంద్రబాబు చిత్రీకరించారు.అధికారం కోసం ఆమె క్యారెక్టర్ ను కూడా రోడ్డుకు లాగారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతకయిన దిగజారతాడు అని అన్నారు.

రాజకీయం అంటే దోపిడీ అనుకునే చంద్రబాబు ఉన్నారు.అధికారం కోసం గతంలో తను ఓడిపోయినా ఆదరించిన మామ ఎన్టీఆర్ ను,తోడల్లుడు దగ్గుబాటిని,ఎన్టీఆర్ కుటుంబాన్ని,లక్ష్మీపార్వతిని....ఇప్పుడైతే పురందేశ్వరిని ఇలా ఎవరిని ఎక్కడా ఎలా బలివ్వాలో ఎవరిని ఎక్కడ ఎలా వాడుకోవాలో చంద్రబాబుకి తెలిసినంతగా మరెవ్వరికి తెలియదు.ఇదంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలలో చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతారు.చివరకు గతంలో నరేంద్రమోదిని తిట్టిన తిట్ట్లు తిట్టకుండాతిట్టారు.తిరిగి నేడు ఆయన చెంతన చేరారు. ఒక బలమైన కులం ఓట్ల కోసం అంటూ పవన్ కల్యాణ్ ను తనకు రాబోయే అధికారం కోసం చెంతచేర్చుకున్నాారు. విజయబాబు పైపైన ఈ పుస్తకం రాయడం కోసం చంద్రబాబు పాలనలోని చరిత్ర తడిమితే నాలుగులక్ష కోట్లు ఉన్నాయంటున్నారు.నిజానికి ఆరులక్షల కోట్ల కంటే ఎక్కువ ఉంటాయన్నారు. చంద్రబాబు అవినీతిని కాగ్ నివేదికలతో బయటకు తీస్తే 10 యేళ్లు అయిన సరిపోదన్నారు.చంద్రబాబు హెరిటేజ్ కోసం సహకారవ్యవస్దను నాశనం చేశారన్నారు.చంద్రబాబు ప్రజలలో తిరిగి భ్రమలు కల్పించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.2014-19 మధ్య చంద్రబాబు అరాచక పాలన...2019-24 మధ్య జగన్ గారు సుపరిపాలన,సంక్షేమపాలన గురించి ప్రజలకు తెలియచేసే ప్రయత్నం చేసిన విజయబాబును అభినందించారు.ఇలాంటివి ఇంకా రావాలి.వాస్తవాలు ప్రజలలోకి వెళ్లాలి.వారు ఆలోచించి నిర్ణయం తీసుకునేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు.జగన్ గారు డిబిటి గురించి కొందరు విమర్సలు చేస్తుంటారు.కాని ఎటువంటి అవినీతి లేకుండా నిజమైన లబ్దిదారుకు పధకం అందేలా విజయవంతంగా చేయగలిగారన్నారు.

జగన్ గారు అంబేద్కర్ వంటి రాజ్యాంగ నిర్మాతలు,జాతిపిత మహాత్మాగాంధిలాంటి మహనీయులు కోరుకున్న విధంగా పరిపాలన అందిస్తూ ముందుకు వెళ్తున్నారు.ఎస్సీ,ఎస్టి,బిసి,మైనారిటీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.సామాన్యులను సైతం ఎన్నికలలో అభ్యర్దులుగా నిలబెట్టారు.దేశం అంతా వైయస్సార్ సిపి అభ్యర్దులవైపు చూసేలా చేశారన్నారు.అందుకే నేడు ప్రజలంతా జగన్ గారికి అండగా నిలబడ్డారన్నారు.సాంప్రదాయపాలనకు భిన్నంగా సంస్కరణలు తెచ్చి పేదప్రజలు,బడుగు బలహీనవర్గాలకు మేలు చేసే పాలన సాగిస్తున్నారన్నారు.

పుస్తక రచయిత పి.విజయబాబు మాట్లాడుతూ చంద్రబాబు అంతులేని అవినీతికి గేేట్లు ఎత్తేశారన్నారు.చంద్రబాబు న్యాయస్దానాల్లో ఈ అవినీతిపనులు నిరూపితం కాకుండా జాగ్రత్త వహించడంలో ఆరితేరారన్నారు.ఇప్పటికే పలు కేసులలో స్టే తెచ్చుకున్నారన్నారు. తాజా కేసులలో కూడా బెయిల్ తెచ్చుకున్నారని తెలియచేసారు.నిజానికి చూస్తే ప్రజాకోర్టు చంద్రబాబును ఐదేళ్లలోనే శిక్షించిందన్నారు.ప్రజలను మరోసారి వంచించడానికి అవకాశవాద అవతారాలతో వస్తున్నప్పుడు ఆ నిజస్వరూపాన్ని బట్టబయలు చేయడంలో మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని అనిపించి ఈ పుస్తకాన్ని రాయడం జరిగిందన్నారు. సమాజాన్ని దోపిడీ చేసేందుకు ఫ్యూడలిస్ట్ రాజకీయం...నయా జర్నలిజం ఏకం అయ్యాయన్నారు.మానవ రక్తం రుచిమరిగిన పులుల్లా పేదలకు దక్కవలసిన ధనాన్ని తినేయడానికి అలవాటు పడిన శక్తులు అన్నీ ఏకమై తమ దోపిడీకి అడ్డునిలిచిన జన నేత జగన్ గారిపై ముప్పేటదాడి చేస్తున్నవేళ ఈ పోరాటంలో అక్షరాయుధాలుసైతం అవసరం అనిపించిందన్నారు. దానిలో భాగంగానే "మహాదోపిడీ" పుస్తకాన్ని రాయడం జరిగిందన్నారు.

ఈ పుస్తకంలో జయలలిత,లాలూప్రసాద్ యాదవ్,మధుకోడా,ఓంప్రకాష్ చౌతాలా వాళ్ల స్కామ్ ల గురించి రేఖామాత్రంగా స్మృశించాను. నిజానికి చంద్రబాబుతో పోలిస్తే వాళ్లవి చాలా చిన్న మొత్తాలు.కాని వాళ్లుకూడా జైలులో ఉన్నారు.చంద్రబాబు పాపం పండింది.ఏదోఒకరోజు భారీ మూల్యం చెల్లించకతప్పదు.

*అధికారంలోకి రాకుండా వందలు,వేలకోట్లు సంపాదించే టెక్నిక్ కనిపెట్టిన పవనిజంపై కూడా పుస్తకం రాస్తా...*
--------------------------------------------------------------------------------------------

ఈ దేశంలోనే పదవిని అడ్డుపెట్టుకుని అవినీతి ద్వారా పెద్దమొత్తంలో కొట్టేసిన వ్యక్తి చంద్రబాబు అయితే దేశరాజకీయాలలోనే రాజ్యాధికారాన్ని చవిచూడకుండా రాజకీయాలను అడ్డుపెట్టుకుని ఎలా సంపాదించవచ్చనే టెక్నిక్ కనిపెట్టినవ్యక్తి పవన్ కల్యాణ్ అన్నారు.అధికారంలోకి రాలేదు,గెలవలేదు.అయినా రాజకీయాలను అడ్డుపెట్టుకుని వందలు వేల కోట్లు ఎలా కొట్టేయవచ్చనేదానికి తెరలేపాడు. అలాంటి పవనిజం మీద కూడా పుస్తకం రాస్తానని ప్రకటించారు.

మీ ముగ్గురూ కలవడం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సేనా..?సైకిల్‌కు ఓటేస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దే.. దీనికి ఏఐతో పనేంటి బ...
19/03/2024

మీ ముగ్గురూ కలవడం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సేనా..?

సైకిల్‌కు ఓటేస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దే.. దీనికి ఏఐతో పనేంటి బాబూ..?

మంత్రి అంబటి రాంబాబు

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్‌మీట్

మూగబోయిన ప్రజాగళం మీ ఓటమికి నాంది..!

మైకు వినిపించకపోవడం భద్రతా వైఫల్యమా.. మీ చేతగానితనమా!

జనం రాకపోతే మాపై నిందలా

ప్రజాగళంతో బొక్కబోర్లా పడ్డారు.. వారి బలహీనతను చాటిన సభ

ఒంటరిగా పోటీ చేయలేకపోవడం.. చంద్రబాబు వైఫల్యం కాదా..!

2014లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మీ ముగ్గురే కదా..!

ప్రజల గుండెల్లో జగన్‌ గారి బొమ్మను చెరిపేయడం మీ తరం కాదు

మంత్రి అంబటి రాంబాబు

ప‌ల్నాడు: మీ ముగ్గురూ కలవడం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సేనా..? అని మంత్రి అంబ‌టి రాంబాబు ప్ర‌శ్నించారు. ఇటీవ‌ల నిర్వ‌హించిన మూడు పార్టీల సభ అట్టర్‌ ప్లాప్‌.. ప్రధాని హాజరైన సభను కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారంటూ మంత్రి ఎద్దేవా చేశారు. 2014లో ఇదే కూటమి కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చింది.. ఆ తర్వాత రాష్ట్రాన్ని ఎంత ఆగం చేశారో అందరికీ తెలుసు అంటూ మండిపడ్డారు. నాడు విడిపోయి ఒకరినొకరు తిట్టుకున్నారు. ప్రధానిని ఆనాడు చంద్రబాబు ఏమన్నారో ప్రజలకు గుర్తుంది. పొరపాటున ఓటు వేసిన పాపానికి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు. ప్రజాగళం ఏం సందేశం ఇచ్చింది?. ముగ్గురు కలిసి పోటీ చేసినా సీఎం వైయ‌స్ జగన్‌ను ఓడించలేరు. చంద్రబాబు జీవితమంతా అభద్రతాభావంతో బతుకుతున్నారు. ప్రజాగళం సభలో మైక్‌ మూగబోయింది. మైక్‌ కూడా సరిచేసుకోని వారు రాష్ట్రాన్ని ఎలా నడుపుతారు? అంటూ ప్రశ్నించారు.

సీఎం జగన్‌ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని సీఎం జగన్‌ పరుగులు పెట్టించారు. సీఎం జగన్‌ సభలకు ప్రజలు తరలివస్తున్నారు. ఆ మూడు పార్టీల సభలను జనం పట్టించుకోవడం లేదు. పవన్‌తో కాదని తెలిసి మోదీతో పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు అండ్‌కో ఎంత బురదజల్లినా ప్రజల గుండెల్లో ఉన్న జగన్‌ను ఏమీ చేయలేరు’’ అని మంత్రి అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మంగ‌ళ‌వారం స‌త్తెన‌ప‌ల్లిలో మీడియాతో మాట్లాడారు.

మంత్రి అంబ‌టి రాంబాబు ఇంకా ఏమన్నారంటే..

చంద్రబాబు నాయకుడు కాదు-అతనొక మానిప్యులేటర్:
– నారా చంద్రబాబు నాయుడు తనపై వైఎస్‌ఆర్‌సీపీ కావాలని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా దుష్ప్రచారం చేస్తుందని చెప్పుకుంటున్నాడు.
– సాక్షాత్తూ ప్రధానిమంత్రి మోదీ గారే ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి చిలకలూరిపేట సభకు హాజరైతే..వారి చేతగానితనంతో సభ అట్టర్ ప్లాప్ అయితే.. పోలీసు యంత్రాంగం కనీస భద్రత కల్పించలేదనే దుష్ప్రచారానికీ దిగాడు.
– చంద్రబాబు నాయుడు మీద ఈ దేశంలో, రాష్ట్రంలో ప్రత్యేకంగా పనిగట్టుకుని ఎవరైనా దుష్ప్రచారం చేయాలా..? ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా దుష్ప్రచారం చేయాల్సిన పనుందా..?
– భారత దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడంత అనైతికమైన రాజకీయ నేత ఎవరూ లేరు.
– ఆయన ప్రజానాయకుడు కాదు. అతనొక మానిప్యులేటర్‌. అనేక మోసాలు చేసి అధికారంలోకి రావాలనే నీచమైన మనస్తత్వం కలిగిన నాయకుడనేది స్పష్టంగా ఇప్పటికే ప్రజలకు బాగా అర్థమైంది. ఇది పచ్చి నిజం.
– అలాంటి నీచమైన, దుర్మార్గమైన చంద్రబాబు మీద దుష్ప్రచారానికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉపయోగించాల్సినంత అవసరమేముంది..?

సైకిల్‌కు ఓటేస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దే
– ముస్లీంల గురించి చంద్రబాబు ఎప్పుడు, ఏ విధంగా మాట్లాడాడో ప్రజలందరికీ గుర్తుంది. ముఖ్యంగా ముస్లీంలకు చాలా బాగా గుర్తుంది.
– ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న సైకిల్‌కు ఓటు వేస్తే.. ముస్లీంలకు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారు ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి నాలుగు శాతం రిజర్వేషన్‌ ఇచ్చారే.. ఆ రిజర్వేషన్లు పోయినట్టే.. ఇది సత్యం.
– డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు కొనసాగాలంటే.. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలి.
– తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేస్తూ.. అమిత్‌షా ముస్లీం రిజర్వేషన్ల గురించి ఏ మాట్లాడారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని మనవి చేస్తున్నాను. వారు అధికారంలోకి రాగానే ముస్లీంల రిజర్వేషన్లు రద్దు చేస్తామనే మాట మాట్లాడారు. దీన్నిబట్టి.. ఇవాళ చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే.. మొదటిగా వారు చేసేది.. ముస్లీం రిజర్వేషన్లు రద్దు చేయడమేనని గుర్తు చేసుకోవాలి.
– అలాంటప్పుడు ముస్లీం మైనార్టీలకు ఇది అవసరమా..? పనిగట్టుకుని తమ రిజర్వేషన్ల రద్దు కోసమని చంద్రబాబుకు ఓటు వేయాల్నా..? అనేది అందరూ ఒక్కసారి ఆలోచించండి.
– కిందటి ఎన్నికల్లో ఇదే చంద్రబాబు ఏమన్నాడు..? జగన్‌మోహన్‌రెడ్డికి ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని అన్నాడు కదా..? మరి, ఆనాడు బీజేపీకి సపోర్టు చేస్తే ముస్లీంల పరిస్థితేంటో నువ్వే చెప్పావు. ఇందులో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఏముంది..? నీ మాటలు నీ వీడియోలే ప్రజలు చూస్తున్నారు. ఎవరూ పనిగట్టుకుని నీ మీద దుష్ప్రచారం చేయడం లేదే..?

2014లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మీ ముగ్గురే కదా..
– 2014లో మీ ముగ్గురూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. అప్పుడు ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. ఇక్కడ టీడీపీ అధికారంలోకి వచ్చింది. మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిన పాపానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత గందరగోళం చేశారో.. ఒక్కసారి ఆలోచించుకోండి.
– బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఏం జరిగిందో.. మీరూ మీరూ ఎన్ని దుర్భాషలాడుకున్నారో మేం ప్రత్యేకంగా చెప్పాల్నా..?
– మోదీ గారిని మీరేమన్నారో..? మిమ్మల్ని మోదీ గారేమన్నారో..? మీ ఇద్దర్నీ కలిపి పవన్‌కళ్యాణ్‌ ఏమన్నాడో..? ఎంతగా తిట్టుకున్నారో.. కొట్టుకున్నారో.. ఎంత నీచంగా మాట్లాడుకున్నారో.. ఆ వీడియోలన్నీ ఆర్టిఫిషీయల్‌ ఇంటెలీజెన్స్‌నా..?
– మీరు మీరూ ఒకరినొకరు తిట్టుకున్న మాట వాస్తవం కాదా..? ఎవరు ఎవర్ని ఏమన్నారో మరిచిపోయారా..?
– పవన్‌కళ్యాణ్‌ నోటి వెంట పలికిన పాచిపోయిన లడ్డూలు అన్నమాట మరిచిపోయారా..? ఇవన్నీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తోనే వచ్చాయా..?
– మీ ముగ్గురు కలిసి జగన్‌మోహన్‌రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమి కడితే.. పొరబాటున మీకు ఓటేసిన పాపానికి ఆ ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని చిందరవందర చేశారు గదా.. ప్రజలు ఎప్పటికీ మరచిపోరు.

మళ్లీ మీకు అధికారమివ్వడానికి ప్రజలు పిచ్చోళ్లు కాదుః
– కలిసి పరిపాలన చేశారు. విడిపోయి కొట్టుకున్నారు. కలిసి ప్రయాణం చేశారు. విడిపోయి తిట్టుకున్నారు. దౌర్భాగ్యమైన పరిపాలన చేసి విడిపోయి ఒకళ్ళకొకళ్ళు జుట్లు పట్టుకుని ఇవాళ మళ్ళీ కలిసొచ్చాం.. మమ్మల్ని అధికారంలోకి తీసుకురండంటే.. ప్రజలంత అమాయకులా..? ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళా..?
– ఆల్రెడీ ఒకసారి మీ పరిపాలన చూశారు. మీ కుమ్ములాటలూ చూశారు గదా..?
– ఇంతా చూశాక మళ్ళీ మీ కూటమికి ఓటు వేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు గాక లేదనేది స్పష్టంగా అందరికీ అర్ధమవుతూనే ఉంది.

అందితే జుట్టు.. అందకపోతే కాళ్ళు.. ఇదీ బాబు నైజంః
– మొన్న తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభ ఎలా జరిగింది..? ఆ తర్వాత ఏం జరిగింది..? తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి జెండాలు పట్టుకున్నంత మాత్రాన ఏదో అద్భుతాలు జరిగిపోతాయని భావించిన తెలుగుదేశం పార్టీకి ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి..?
– పవన్‌కళ్యాణ్‌ మనతో కలిసినప్పటికీ, ప్రజల్లో మాత్రం స్పందనలేదని.. తెలుగుదేశం పార్టీ ప్లాన్‌ బెడిసికొట్టిందని నిరాశపడిన మాట వాస్తవమా..? కాదా..? అని ప్రశ్నిస్తున్నాను.
– అంతటితో ఆగకుండా.. మనిద్దరి వల్ల కాదంటూ.. కేంద్రంలో ఉన్న బీజేపీతో కూడా పొత్తుపెట్టుకుందామని ఢిల్లీకి వెళ్లి వాళ్ల కాళ్లు పట్టుకున్నారే.. అంత దిగజారుడుతనం ఎందుకు..? అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అనేదే చంద్రబాబుకు తెలిసిన విద్య కాబట్టేగా..?
– ఒకప్పుడు మోదీ టెర్రరిస్టు అని చెప్పిన చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి అమిత్‌షా ఇంటి ముందు పడిగాపులు పడి మొత్తానికి వాళ్ల కాళ్లు పట్టుకుని మరోసారి పొత్తు పెట్టుకున్నారు. ఇది మేమంటున్న మాట కాదు. వాళ్లే మీడియాలో చెప్పుకుంటున్న నిజాలివి.

ప్రజాగళం అట్టర్‌ఫ్లాప్‌.. మీ బలహీనత చాటుకున్న వేదికః
– చిలకలూరిపేటలో మూడు పార్టీల కూటమి బహిరంగ సభ జరుగుతుందని .. మా గ్రాఫ్‌ పెరగబోతుందని భారీస్థాయిలో హైప్‌ క్రియేట్‌ చేశారు. ప్రజాగళంతో బొక్కబోర్లా పడ్డారు.
– చిలకలూరిపేట ప్రజాగళం సభ ఏం సందేశం ఇచ్చిందో చెప్పగలరా..?
– మీ బలహీనతను తెలియజేసిన సభ అది. మీ ముగ్గురు జట్టుకట్టి పోటీచేసినా మీకు బలం లేదు. జగన్‌మోహన్‌రెడ్డి గారిని ఓడించలేరనే స్పష్టమైనటువంటి సందేశాన్ని రాష్ట్రప్రజానీకానికి తెలియజెప్పిన సభగా ప్రజాగళం నిలిచింది.
– సాక్షాత్తూ ప్రధానిమంత్రి మోదీ గారు వచ్చి మాట్లాడినటువంటి సభ అయినప్పటికీ.. ఆ సభ తర్వాత కూడా మీకు హైప్‌ రాలేదు. గ్రాఫ్‌ పెరగలేదు. ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలేదు.
– ప్రజాగళం సభలో మీరు మాట్లాడిన తీరును బట్టే.. మీరు ఓటమిని అంగీకరించారనే విషయం చాలా స్పష్టంగా అందరికీ అర్థమైంది.

ఇది బాబు వైఫల్యం కాదా..
– జెండా సభ తర్వాత చంద్రబాబులో ఒక అభద్రతా భావం వచ్చింది. ప్రజాగళం తర్వాతనూ మీలో అదే అభద్రతా భావం కనిపిస్తుంది. మీ జీవితాంతం అభద్రతా భావంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు.
– డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారు, మీరూ ఒకేసారి రాజకీయాల్లోకి ప్రవేశించారు కదా..? ఆయన జగన్‌మోహన్‌రెడ్డి గారికి తండ్రి. ఆయన హఠాన్మరణం చెందితే.. వారి కుమారుడు పెట్టిన పార్టీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కాగా.. అప్పుడెప్పుడో రాజకీయాల్లోకొచ్చిన నువ్వు .. నీ కుమారుడు వయస్సున్న రాజశేఖర్‌రెడ్డి గారి బిడ్డతో తలపడేందుకు సింగిల్‌గా రాలేకపోతున్నావే..? ఇది నీ వైఫల్యం కాదా..? ఇది నీ అభద్రతాభావం కాదా..? నీ బతుకంతా అభద్రతా భావమే కదా..? అని అడుగుతున్నాను.

మైకు వినిపించకపోతే భద్రతా వైఫల్యమా..?
– రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉందంటావు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానంటావు.. ఎన్నో మహానాడులు తీర్చిదిద్దానంటావు.. నీ జీవితంలో జగన్‌ గారి కంటే ఎన్నో బహిరంగ సభలు నిర్వహించావు కదా..? ప్రధానిమంత్రి వస్తుంటే మైకు కూడా సరిచేసుకోలేని వాడివి. మైకు వినిపించకపోతే.. అది భద్రతా వైఫల్యమా..? అది నీ నిర్లక్ష్యం కాదా..? అది నీ చేతగానితనం.. అభద్రతా భావం కాదా..?

మూగబోయిన ప్రజాగళం మీ ఓటమికి నాంది..
– ప్రజాగళంలో మైకు మూగబోయిందంటే అది అపశకునం కాదా..? అది మీ ఓటమికి దారితీస్తుందనే అర్ధం కాదా..? అని ఆలోచించుకోండి..
– ప్రధాని హాజరై మాట్లాడే ఒక బహిరంగ సభలో మైకు సరిగ్గా పెట్టుకోకుండా.. మైక్‌ మిక్సర్‌ ఎక్కడో పబ్లిక్‌ మధ్య ఉంచుకుని.. అది పనిచేయకపోతే.. భద్రతావైఫల్యమని ప్రభుత్వం మీద నెట్టేస్తున్నావే.. ? ఇది నీ రాజకీయ దిగజారుడుతనం కాదా చంద్రబాబూ ..? దీనికి గుండెలపై చేయ్యేసుకుని నీకు నువ్వు సమాధానం చెప్పుకో..

జనం రాకపోతే.. మాపై నిందలా..?
– నువ్వు , పవన్‌కళ్యాణ్, మోదీ మాట్లాడుతున్నప్పుడు సభా ప్రాంగణంలో కుర్చీలన్నీ ఖాళీగానే ఉన్నాయి కదా..? అలా ఎందుకున్నాయి..? అది కూడా ప్రభుత్వ భద్రతా వైఫల్యమా..? ఇదంతా సరుకులేని వ్యవహారమే కదా..? నువ్వు.. నీ పార్టీకెటూ సరుకులేదు. ముగ్గురు కలిసినా మీ దగ్గర సరుకులేదు. జనం మీ సభకు రాలేదు. కుర్చీలన్నీ ఖాళీగా ఉంచుకుని.. ఇంత వైఫల్యం చెంది.. ప్రభుత్వం మీద నిందలేస్తారా..?
– ఎంతకాడికి, మీ చేతగానితనాన్ని జగన్‌గారి మీద నెడదామా..? ప్రభుత్వం మీద తోసేద్దామా..? పోలీసు అధికారులపై నెట్టేదామా..? అనే నీచమైన ఆలోచనే గానీ.. మీ ముగ్గురి పట్ల ప్రజలకెందుకు నమ్మకం కలగడం లేదనే ఆలోచించుకోలేకపోవడం చాలా దురదృష్టకరం.

ప్రజల గుండెల్లో జగన్‌ గారి బొమ్మ చెరిపేయడం మీ తరం కాదుః
– ఎక్కడ చూసినా జగన్‌ గారి బొమ్మే కనిపిస్తుందంట. పుస్తకాల్లో, ఇంటి పట్టాలపై, పథకాలపై ఆయన బొమ్మే కనిపిస్తుందని తెగ ఆందోళన పడుతున్నావే.. నువ్వు వాటిని ఏదొకటి చేసి చెరిపేయగలవేమో గానీ.. ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నటువంటి రాజశేఖర్‌రెడ్డి బిడ్డ శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి బొమ్మను చెరిపేయడం మీ తరం కాదని తెలుసుకోండి..
– ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు మేలు చేసి .. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి .. సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల గుండెల్లో చెక్కుచెదరని నాయకుడిగా నిలిచిపోయిన జగన్‌ గారి ఆనవాళ్లను చెరిపేయడం మీకు సాధ్యమా..? అని అడుగుతున్నాను.
– మీ ముగ్గురు కాదు.. ముక్కోటి మందితో జట్టుకట్టి వచ్చినా .. ప్రజల గుండెల్లో జగన్‌మోహన్‌రెడ్డి గారు ఏర్పాటు చేసుకున్న బొమ్మను ఎవరూ చెరపలేరు. ఇది సత్యం.. ఇది యథార్థం.

175కి 175 స్థానాలూ వైఎస్‌ఆర్‌సీపీవే..
– ఈ విషయాన్ని జూన్‌ 4న చూస్తారు.. ఒక్కసారి ఎన్నికల పోలింగ్‌ మొదలైన తర్వాత ప్రజలంతా ఫ్యాన్‌ గుర్తుపై బటన్‌ నొక్కుతున్న క్రమంలో మీ గుండె ఆగిపోతుందేమో చూసుకోండి..
– నువ్వెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా.. ఎల్లోమీడియా ఉందని.. దాన్ని అడ్డంపెట్టుకుని దుష్ప్రచారం చేసినా..జగన్‌మోహన్‌రెడ్డి గారిపై బుట్టలు బుట్టలుగా బురదజల్లినా.. రామోజీ, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు దిగొచ్చినా ప్రజల గుండెల్లోని జగన్‌మోహన్‌రెడ్డి గారి బొమ్మను చెరపడం ఎవరివల్లా సాధ్యం కాదని గుర్తు చేస్తున్నాను.
– ప్రజాగళం సభ అట్టర్‌ఫ్లాప్‌ అవగా.. ఆ విషయం పక్కదోవ పట్టించాలనే దిశగా చంద్రబాబు అండ్‌ కో ప్రభుత్వం మీద, జగన్‌ గారి మీద దుష్ప్రచారానికి దిగాయనేది ప్రజలకూ తెలుసు.
– రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండమైన మెజార్టీతో 175కి 175 స్థానాల్ని కైవసం చేసుకుంటుంది... ఇది సత్యం అని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

కార్యకర్తలందరినీ స‌మ‌య‌త్తం చేసేందుకు మేమంతా సిద్ధం  బస్సు యాత్ర వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జ‌ల రామ‌...
19/03/2024

కార్యకర్తలందరినీ స‌మ‌య‌త్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

ప్రతి పార్లమెంట్, ప్రతి జిల్లా మేం సిద్ధం అనేలా బస్సు యాత్ర

‘మేమంతా సిద్ధం’ పేరుతో తొలిసభ 27వ తేదీన ప్రొద్దుటూరులో ప్రారంభం.

ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకూ కొనసాగనున్న యాత్ర.

ఎంత మంది కూటమి కట్టినా...మా బ్రాండ్ జగన్ గారే..! సజ్జల రామకృష్ణారెడ్డి.

ఈనెల 27 నుంచి వైఎస్‌ జగన్‌ ‘మేమంతా సిద్ధం’బస్సు యాత్ర.

సిద్ధం సభలకు ధీటుగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో సభలు.

క్షేత్ర స్థాయిలో వివిధ వర్గాలతో ఇంటరాక్షన్‌..సలహాలు, సూచనల స్వీకరించనున్న సీఎం

పాదయాత్రలో ప్రజలతో మమేకమైనట్లే బస్సు యాత్ర కూడా సాగుతుంది. : సజ్జల రామకృష్ణారెడ్డి.

తాడేప‌ల్లి: సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని సమాయత్తం చేసేందుకు, వారిలో చైతన్యం నింపేందుకు పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ నెల 27వ తేదీ నుంచి బస్సు యాత్ర చేప‌డుతున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తెలిపారు.వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బస్సు యాత్ర వివరాలను పార్టీ సీనియర్‌ నేతలు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పేర్ని నాని, సీఎం ప్రోగ్రామ్స్‌ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, పార్టీ కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మీడియాకు వివ‌రించారు.

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:

సిద్ధం ప్రతిధ్వనికి కొనసాగింపుగా వైయ‌స్‌ జగన్ బస్సు యాత్ర:
– ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తరుణంలో ఇప్పటికే వైయ‌స్ఆర్‌సీపీ 4 సిద్ధం సభలు లక్షలాది మంది కార్యకర్తలతో నిర్వహించింది.
– రాష్ట్రంలో నాలుగు చోట్ల ఉత్తరాంధ్ర నుంచి అనంతపురం వరకూ నిర్వహించాం.
– ఈ నాలుగు సభలు జరిగిన తీరు, అక్కడికి వచ్చిన లక్షలాది మంది వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు..మా అధినాయకుడు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి గారికి నీరాజనాలు పట్టారు.
– చెప్పిన మాట మీద నిలబడి, విశ్వసనీయతకు మారుపేరుగా ఐదేళ్ల పాలనలో ప్రజలకు 20 ఏళ్ల పాటు జరగనంత అభివృద్ధి, సంక్షేమాన్ని అందించారు.
– మేనిఫెస్టోలో 99 శాతం అమలు చేసి మేనిఫెస్టోలకే కొత్త అర్ధం ఇచ్చి..ఇలా ఉండాలి ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడు అనే మార్గదర్శకత్వం ఇచ్చారు.
– ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన నేపథ్యంలో నెక్ట్స్‌ స్టెప్‌గా బస్సు యాత్ర చేపడుతున్నారు.
– ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకూ ఈ బస్సు యాత్ర నిర్వహించాలని తలపెట్టాం.
– ఒక వైపు సిద్ధం సభల ప్రతిధ్వని వినిపించింది. జాతీయ స్థాయిలో కూడా అందరి దృష్టి ఇటువైపు పడింది.
– దానికి కొనసాగింపుగా క్షేత్ర స్థాయిలోకి వెళ్లి మేము సిద్ధం, మా బూత్‌ సిద్ధం అని బూత్‌ స్థాయిలో కూడా చైతన్యవంతులయ్యారు.
– వచ్చే ఎన్నికలకు సమాయత్తంగా ఉన్నామని వారు ప్రకటిస్తున్నారు.

ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకూ:
– ఈ నెల 27 నుంచి ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తారు.
– కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని సమాయత్తం చేసేందుకు, వారిలో చైతన్యం నింపేందుకు ఈ బస్సు యాత్ర.
– రాష్ట్రమంతటా ఉన్న కోట్లాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం అని డిక్లేర్‌ చేసే సందర్భం ఇది.
– 27వ తేదీ మొదలైతే..నోటిఫికేషన్‌ వచ్చే దాదాపు 18వ తేదీ వరకూ ఈ బస్సు యాత్ర కొనసాగే అవకాశం ఉంది.
– సిద్ధం సభలు జరిగిన నాలుగు నియోజకవర్గాలు పోను మిగిలిన నియోజకవర్గాలన్నీ కలిసి వచ్చేలా బస్సు యాత్ర ప్లాన్‌ జరుగుతుంది.
– ఆ తర్వాత నోటిఫికేషన్, నామినేషన్లు మొదలైనప్పటి నుంచీ ఎన్నికల సభలకు ముఖ్యమంత్రి గారు బయలుదేరతారు.
– మా పార్టీ పెట్టినప్పటి నుంచీ అట్టడుగు వర్గాల వైపు నిలబడి అధికారం వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లు వారి కోసం జగన్‌ గారు తపన పడ్డారు.
– ఇదే రీతిలో 27వ తేదీ నుంచి పూర్తిగా ఆయన యాత్రలోనే ఉంటారు. పండుగలు, సెలవులు వచ్చినా ఆయన అక్కడే ఉంటారు.
– 27వ తేదీ ఉదయం ఇడుపులపాయలో మహానేత వైయ‌స్ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పిస్తారు.
– ఆ రోజు సాయంత్రం ప్రొద్దుటూరు చేరుకుని అక్కడ తొలి ‘మేమంతా సిద్ధం’సభ జరుగుతుంది.
– చాలా పెద్ద ఎత్తున ఈ సభలు జరుగుతాయి..అంచనాలకు మించి జరుగుతాయి.
– గతంలో ఎన్నడూ లేనంతగా రోజుకో ఒక మహాసభ జరుగుతుంది.
– ప్రతి పార్లమెంటు, ప్రతి జిల్లా మేం సిద్ధం అని డిక్లేర్‌ చేసేలా ఈ సభలు జరుగుతాయి.
– బస్సు యాత్రలో ప్రతి రోజు ఉదయం వివిధ వర్గాలతో ఇంటరాక్షన్‌ కార్యక్రమం ఉంటుంది.
– ఈ ఐదేళ్ల పరిపాలన చూసిన తర్వాత ఇంకా ఏమైనా సలహాలు, సూచనలు కూడా తీసుకుంటారు.
– మధ్యాహ్నం తర్వాత పార్టీ వారిని కలుస్తారు. సభ జరిగే నియోజకవర్గానికి వెళ్లి అక్కడి సభలో పాల్గొంటారు.
– వీలైనంత వరకూ ఒక పార్లమెంటులో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు పెడితే బాగుంటుందని భావిస్తున్నాం.

ఎంత మంది కూటమి కట్టినా మా బ్రాండ్‌ జగన్‌ గారే:
– అన్ని రకాల శక్తులు, ప్రత్యర్ధులు ఏకంగా వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మా వైపు ఒంటరిగా వస్తున్నారు.
– స్పష్టమైన ఒక బ్రాండ్‌ వైయ‌స్ఆర్‌సీపీకి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి గారే.
– ఈ యాత్రల తర్వాత ఎన్నికల సభలకు వెళ్తాం. ఇప్పటికి బస్సు యాత్ర 3 రోజుల వరకూ ఖరారు అయింది.
– తొలిరోజు ప్రొద్దుటూరులో, రెండో రోజు ఉదయం నంద్యాల లేదా అళ్లగడ్డ ఇంటరాక్షన్, సాయంత్రం నంద్యాలలో సభ.
– మూడో రోజు కర్నూలు పార్లమెంటులోకి ప్రవేశిస్తారు. ఎమ్మిగనూరులో సభ ఉంటుంది.
– ఈ బస్సు యాత్రలో జగన్‌ గారి యాక్టివిటీ అంతా పాదయాత్రలో ఎలా జరిగిందో అలానే జరుగుతుంది.

ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారువైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్ర‌హం సభ నిర్వ...
18/03/2024

ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారు

వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్ర‌హం

సభ నిర్వహించడం చేతగాక పోలీసులపై విమర్శలా?

2014లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? 2024లో మళ్లీ కలిసి స్టేజ్‌పై ప్రత్యక్షమయ్యారు

కాంగ్రెస్, వైయ‌స్ఆర్‌ సీపీ ఒక్కటేనని మోదీ చెప్పగానే జనం నమ్ముతారా?

తాడేపల్లి: పదేళ్ల తర్వాత మళ్లీ అదే నాటకం మొదలుపెట్టారని ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారని వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సీఎం వైయ‌స్ జగన్‌ను విమర్శించడమే పని పెట్టుకున్నారని అన్నారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా విమర్శలకే టైమ్‌ కేటాయించారని త‌ప్పుప‌ట్టారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

టీడీపీ, జనసేన, బీజేపీకి పొత్తులు కొత్త కాదని స‌జ్జ‌ల మండిపడ్డారు. పదేళ్ల క్రితం ఆ రోజు ఇచ్చిన హామీలన్నీ తర్వాత మర్చిపోయారని అన్నారు. నాడు విడాకులు తీసుకొని విడిపోయి, దూషించుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీని ఆనాడు చంద్రబాబు ఇష్టానుసారం దూషించారని దుయ్యబట్టారు.

సభ నిర్వహించడం చేతగాక పోలీసులపై విమర్శలా? అని ప్రశ్నించారు. అర్జెంట్‌గా అధికారంలోకి రావాలనేది వారి ఆత్రమని దుయ్యబట్టారు. 2014లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? 2024లో మళ్లీ కలిసి స్టేజ్‌పై ప్రత్యక్షమయ్యారని అన్నారు. మళ్లీ ఇప్పుడెందుకు కలిశారో ప్రజలకు వివరణ ఇవ్వాలని సజ్జల నిలదీశారు.

పొత్తు కోసం వెంపర్లాడటం, తర్వాత విడిపోవటం, మళ్ళీ కలవటం ఇదే వీరి పని. అసలు ఎందుకు కలిశారు? ఎందుకు విడిపోయారో కూడా ప్రజలకు చెప్పాలి. 600 హామీలు ఇచ్చి ఎన్ని అమలు చేశారో చెప్పాలి. అర్హులందరికీ స్థలాలు ఇచ్చి, ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ పేరుతో ఎందుకు మోసం చేశారో చెప్పాలి?. మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఒకే స్టేజీ మీదకు వచ్చారు?. ఏపీ ప్రజలను తేలిగ్గా మోసం చేయవచ్చనే ఆలోచనలో కూటమి పార్టీలు ఉన్నాయి.

కనీసం చిన్న సభను కూడా జరుపుకోలేని వారు ప్రజలకు ఏం మేలు చేస్తారు?. ప్రధానిని సైతం అవమానపరిచారు. కాంగ్రెస్, వైయ‌స్ఆర్‌ సీపీ ఒక్కటేనని మోదీ చెప్పగానే జనం నమ్ముతారా?. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ రాష్ట్రానికి కావాల్సిన అంశాల గురించి మోదీని ఎందుకు అడగలేదు?. నాయకుడికి ఒక స్థిరమైన నిజాయితీ ఉండాలి. సీఎం వైయ‌స్‌ జగన్ ప్రభుత్వంలో 87 శాతం కుటుంబాలు లబ్ది పొందాయి. అందుకే సీఎం వైయ‌స్‌ జగన్‌ జగన్‌ ప్రజలు ఓన్ చేసుకున్నారు. షర్మిల ఎక్కడ నుంచైనా పోటీ చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీ కాబట్టి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదని సజ్జల రామ‌కృష్ణారెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు.

అభ్య‌ర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలిపార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంలో సీఎం వైయ‌స్ జ...
18/03/2024

అభ్య‌ర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి

పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంలో సీఎం వైయ‌స్ జగన్‌

తాడేపల్లి: ఎన్నికల షెడ్యూల్‌ వల్ల వెసులుబాటు వచ్చిందని, ఈ సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సూచించారు. ప్రతి సచివాలయాన్నీ సందర్శించాలని, ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ రీజనల్‌ కో ఆర్డీనేటర్ల సమావేశం నిర్వ‌హించారు. తాడేపల్లిలో సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సాగిన ఈ సమావేశంలో వైయ‌స్‌ జగన్‌ బస్సుయాత్ర, రూట్‌ మ్యాప్‌, మేనిఫెస్టో తదితర అంశాలపై చర్చించారు. మూడు పార్టీల కూటమిని ఎదుర్కొనే కార్యచరణపై పార్టీ నేతలకు సీఎం వైయ‌స్ జగన్‌ దిశానిర్దేశం చేశారు.

రీజనల్ కో-ఆర్డినేటర్ల సమావేశంలో సీఎం వైయ‌స్ జగన్‌ మాట్లాడుతూ.. అభ్యర్థులకు సరిపడా సమయం ఉందన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ వల్ల ఈ వెసులుబాటు వచ్చిందని తెలిపారు. ఈ సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి సచివాలయాన్నీ సందర్శించాలని, ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పారు. సిద్ధం సభలు తరహాలోనే బస్సు యాత్ర కూడా విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

కాగా, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే మొత్తం అభ్యర్థుల్ని ప్రకటించిన వైయ‌స్ఆర్‌సీపీ ప్రచారంపై దృష్టి పెట్టింది. ‘మేమంతా సిద్ధం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్‌ బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. దాదాపు నెలపాటు జనంలోనే ఉండనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా బస్సు యాత్ర కొనసాగనుంది. ఉదయం ఇంటరాక్షన్‌.. మధ్యాహ్నం/సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తొలి విడతలో బస్సు యాత్ర.. ఆ తర్వాత ఎన్నిలక ప్రచార సభలు ఉండనున్నాయి. ప్రజలతో మమేకమై సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు.

Address

Hyderabad
500036

Alerts

Be the first to know and let us send you an email when Aptopnews posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aptopnews:

Share

APTOPNEWS

PoliticalNews