A1TV Telugu

A1TV Telugu 1st news channel in telugu 24x7 local based news channel, Fresh news and updates

ప్రోటీన్ కోసం చికెన్‌ అన్నదే సాధారణంగా మనకు గుర్తుకొచ్చే ఎంపిక. కానీ ఇప్పుడు గ్రిల్డ్ చికెన్‌కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన...
04/07/2025

ప్రోటీన్ కోసం చికెన్‌ అన్నదే సాధారణంగా మనకు గుర్తుకొచ్చే ఎంపిక. కానీ ఇప్పుడు గ్రిల్డ్ చికెన్‌కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన ప్రత్యామ్నాయాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఎండు చేపలు (Dry Fish) వాటిలో ముందుంటాయి. తాజా గణాంకాల ప్రకారం, 100 గ్రాముల ఎండు చేపల్లో సుమారు 60 గ్రాముల ప్రోటీన్ లభిస్తోంది. ఇది చికెన్‌లో లభించే ప్రోటీన్‌ కంటే రెట్టింపు కన్నా ఎక్కువ. అంతేకాదు, పర్మేసన్ చీజ్ (Parmesan Cheese), ట్యూనా చేపలు (Tuna Fish) వంటి ఆహార పదార్థాల్లోనూ అధికంగా ప్రోటీన్‌ లభిస్తోంది. ఈ వివరాలు అమెరికా వ్యవసాయ శాఖ (USDA) విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడయ్యాయి. ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలనుకునే వారికి ఇవి గొప్ప ఎంపికలుగా మారుతున్నాయి.

ప్రోటీన్ కోసం చికెన్‌ అన్నదే సాధారణంగా మనకు గుర్తుకొచ్చే ఎంపిక. కానీ ఇప్పుడు గ్రిల్డ్ చికెన్‌కంటే ఎక్కువ ప్రో....

ఎస్‌బీఐ కార్డ్‌ హోల్డర్లకు కీలక సమాచారం! ఆగస్టు 11, 2025 నుంచి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ నిబంధనల్లో పలు మార్పులు అమలులోకి ...
04/07/2025

ఎస్‌బీఐ కార్డ్‌ హోల్డర్లకు కీలక సమాచారం! ఆగస్టు 11, 2025 నుంచి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ నిబంధనల్లో పలు మార్పులు అమలులోకి రానున్నాయి. ఈ మార్పులు చాలామంది వినియోగదారులపై ప్రత్యక్షంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. కనీస చెల్లింపు మొత్తం (Minimum Due) పెరగనుంది. ఇది వినియోగదారుల నెలవారీ చెల్లింపులపై భారం కలిగించవచ్చు. బిల్లు చెల్లింపుల సర్దుబాటు విధానం (Payment Allocation) మారనుంది. అంటే మీరు చెల్లించిన మొత్తం మొదట ఏ రకమైన లావాదేవీలకు అన్వయించబడుతుందో దాని విధానం మార్చబడుతుంది. ఎంపిక చేసిన కార్డులపై అందిస్తున్న ఎయిర్ యాక్సిడెంట్ బీమా (Air Accident Insurance) ని రద్దు చేయనున్నారు....

ఎస్‌బీఐ కార్డ్‌ హోల్డర్లకు కీలక సమాచారం! ఆగస్టు 11, 2025 నుంచి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ నిబంధనల్లో పలు మార్పులు అమలు....

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం ఓ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చౌటుప్పల్‌ వద్ద మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొ...
04/07/2025

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం ఓ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చౌటుప్పల్‌ వద్ద మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనతో రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ స్థంభించింది. ప్రమాదానికి కారణం ముందుగా వెళ్తున్న కారు సడన్‌గా బ్రేక్ వేయడం వలన ప్రమాదం జరిగింది అని పోలీసులు తెలిపారు. వెనుక వస్తున్న కార్లు వేగంగా రావడం తో ఒకదానికొకటి ఢీకొన్నాయి. తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది అని చెప్పారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం ఓ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చౌటుప్పల్‌ వద్ద మూడు కార్లు ఒకదాని.....

హిమాచల్ ప్రదేశ్‌ లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జూన్ 20 నుంచి ఇప్పటివరకు వర్షాలకు సంబంధ...
04/07/2025

హిమాచల్ ప్రదేశ్‌ లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జూన్ 20 నుంచి ఇప్పటివరకు వర్షాలకు సంబంధించిన విపత్తుల్లో 69 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యేకించి మండీ జిల్లా వర్షాల ధాటికి తీవ్రంగా ప్రభావితమైంది. పలుచోట్ల ఇళ్ల కూలిపోయాయి, రోడ్లు తెగిపోయాయి, వాహనాలు కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా భూచలనలు, వరదలు, మరియు మట్టి క్షయము లాంటి ప్రకృతి విపత్తులు కూడా సంభవిస్తున్నాయి. ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పునరావాస చర్యలు చేపట్టింది. సహాయక బృందాలు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ (NDRF) బృందాలు పరిస్థితిని సమీక్షిస్తూ సహాయం అందిస్తున్నాయి. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్‌ లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జూన్ 20 నుంచి ఇప్పటివరకు వర్షా....

అత్తాపూర్‌లో ఓ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడి ప్యాంట్ జేబులో ఉన్న మొబైల్ ఆకస్మికంగా పేలింది. ఈ ఘటనలో అతని తొడకు...
04/07/2025

అత్తాపూర్‌లో ఓ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడి ప్యాంట్ జేబులో ఉన్న మొబైల్ ఆకస్మికంగా పేలింది. ఈ ఘటనలో అతని తొడకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల రాయచోటి మరియు ఉత్తరప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం కలవరపరిచే విషయం. నిపుణుల కథనం ప్రకారం, ఓవర్‌హీటింగ్‌ (Overheating) కారణంగానే ఈ తరహా ఫోన్ పేలుళ్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. మొబైల్ ఫోన్‌లను చార్జింగ్‌లో ఉంచి వాడకూడదని, వేడిచేసే ప్రదేశాల్లో ఉంచరాదని, తక్కువ నాణ్యత గల ఛార్జర్లు, బ్యాటరీలు వాడకూడదని వారు సూచిస్తున్నారు. ప్రజలు అలర్ట్‌గా ఉండాలని, భద్రతా సూచనలను పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

అత్తాపూర్‌లో ఓ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడి ప్యాంట్ జేబులో ఉన్న మొబైల్ ఆకస్మికంగా పేలింది. ఈ ఘటనలో అ....

-మాజీ ముఖ్యమంత్రి, BRS అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ స్పందించారు. సాధారణ వైద్య పరీక్షల కోసం ఆయన యశోద ఆసుపత్ర...
04/07/2025

-మాజీ ముఖ్యమంత్రి, BRS అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ స్పందించారు. సాధారణ వైద్య పరీక్షల కోసం ఆయన యశోద ఆసుపత్రిలో చేరారని తెలిపారు. బ్లడ్ షుగర్, సోడియం స్థాయులకు కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాలని వైద్యులు సూచించినట్టు చెప్పారు. ఎలాంటి సమస్యలు లేవని, వైటల్స్ అన్నీ సాధారణంగానే ఉన్నాయన్నారు. కేసీఆర్ క్షేమ సమాచారం గురించి ఆరా తీస్తున్నఅందరికీ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

-మాజీ ముఖ్యమంత్రి, BRS అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ స్పందించారు. సాధారణ వైద్య పరీక్షల కోసం ఆయన యశోద ఆ...

తమిళనాడు రాష్ట్రం అవడి ప్రాంతంలో ఓ దారుణ హత్య కలకలం రేపింది. స్థానిక కౌన్సిలర్‌గా పనిచేస్తున్న మహిళను ఆమె భర్త స్టీఫెన్ ...
04/07/2025

తమిళనాడు రాష్ట్రం అవడి ప్రాంతంలో ఓ దారుణ హత్య కలకలం రేపింది. స్థానిక కౌన్సిలర్‌గా పనిచేస్తున్న మహిళను ఆమె భర్త స్టీఫెన్ రాజు క్రూరంగా హత్య చేశాడు. ఆమె మరో వ్యక్తితో మాట్లాడుతున్న సందర్భాన్ని చూసిన స్టీఫెన్ రాజు ఆగ్రహానికి లోనయ్యాడు. కోపంతో ఊగిపోయిన అతడు ఆమెపై దాడికి దిగాడు. దారుణంగా మోచేయి కోసి, తీవ్ర గాయాలతో కౌన్సిలర్ అక్కడికక్కడే మరణించారు. ప్రజలు ఘటనను చూసి షాక్‌కి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్టీఫెన్ రాజును అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, భార్యపై గతకొంతకాలంగా స్టీఫెన్‌కు అనుమానాలు ఉండేవని తెలిసింది. వ్యక్తిగత విభేదాలే ఈ ఘాతుకానికి దారితీసినట్లు అనుమానిస్తున్నారు.

తమిళనాడు రాష్ట్రం అవడి ప్రాంతంలో ఓ దారుణ హత్య కలకలం రేపింది. స్థానిక కౌన్సిలర్‌గా పనిచేస్తున్న మహిళను ఆమె భర్త...

ఆరోగ్యాన్ని ఆయుధంగా మలుచుకుని ప్రో కబడ్డీకి సిద్ధమవుతున్న యువ క్రీడాకారుడి ప్రాణం కేవలం చిన్న నిర్లక్ష్యం వల్ల పోయిందని ...
04/07/2025

ఆరోగ్యాన్ని ఆయుధంగా మలుచుకుని ప్రో కబడ్డీకి సిద్ధమవుతున్న యువ క్రీడాకారుడి ప్రాణం కేవలం చిన్న నిర్లక్ష్యం వల్ల పోయిందని కుటుంబ సభ్యులు కన్నీటి మధ్య చెబుతున్నారు. ఒక చిన్నపిల్లను కాపాడేందుకు ఓ వీధి కుక్కను అడ్డుకున్న ఈ యువ క్రీడాకారుడు, ఆ కుక్క కాటుకు గురయ్యాడు. చిన్న గాయం అనుకొని బాధితుడు ఆసుపత్రికి వెళ్లకపోవడంతో, రేబిస్ వైరస్ శరీరంలోకి ప్రవేశించి ప్రాణాంతకంగా మారింది. కుక్క కరిస్తే వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలని, గాయాన్ని ఎంత చిన్నదిగా భావించినా విరామం లేకుండా చికిత్స చేయాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు....

ఆరోగ్యాన్ని ఆయుధంగా మలుచుకుని ప్రో కబడ్డీకి సిద్ధమవుతున్న యువ క్రీడాకారుడి ప్రాణం కేవలం చిన్న నిర్లక్ష్యం వల...

G.BALAKRISHNA-A1-HYD-062-SANATH NAGAR-REPORTER-8885553376
21/06/2025

G.BALAKRISHNA-A1-HYD-062-SANATH NAGAR-REPORTER-8885553376

IDCARDS2025G.BALAKRISHNA-A1-HYD-062-SANATH NAGAR-REPORTER-8885553376 admin9 seconds ago7 seconds ago00 mins Facebook Twitter LinkedIn WhatsApp CopyCopied Messenger Share this: Click to share on Facebook (Opens in new window) Facebook Click to share on X (Opens in new window) X Click to share on Link...

నటి, దర్శకురాలు రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా తరచూ తన ఆలోచనలు, భావోద్వేగాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె ...
17/06/2025

నటి, దర్శకురాలు రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా తరచూ తన ఆలోచనలు, భావోద్వేగాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ తాత్వికమైన సందేశం నెటిజన్ల దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. "క్రీడల ముసుగులో ఇతరుల్ని బాధపెట్టడం అవసరమని మానవులు ఎందుకు భావిస్తారు?" అంటూ రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రశ్నించారు. ఈ వాక్యం సామాన్యంగా ఉన్నా, దానికున్న లోతైన అర్థాన్ని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. జంతు ప్రేమికురాలిగా పేరొందిన రేణు, మూగజీవాల సంరక్షణ, హక్కుల కోసం ఆమె పెట్టే పోస్టులు తరచూ వైరల్ అవుతుంటాయి....

నటి, దర్శకురాలు రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా తరచూ తన ఆలోచనలు, భావోద్వేగాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తా....

తండ్రి ప్రేమ ఎంత గొప్పదో మళ్లీ ఒక్కసారి ప్రపంచానికి తెలియజెప్పిన ఘ‌ట‌న ఇది. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఫోర్ట్ లాడర్‌డేల్ బీచ్...
17/06/2025

తండ్రి ప్రేమ ఎంత గొప్పదో మళ్లీ ఒక్కసారి ప్రపంచానికి తెలియజెప్పిన ఘ‌ట‌న ఇది. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఫోర్ట్ లాడర్‌డేల్ బీచ్‌లో ఓ తండ్రి తన పిల్లలను కాపాడేందుకు సముద్రంలో దూకాడు. ఇద్దరు చిన్నారులను రక్షించాడు. కానీ తాను మాత్రం తిరిగి బయటకు రాలేదు. 33 ఏళ్ల ఆంట్వోన్ విల్సన్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి సముద్ర తీరానికి వెళ్లాడు. అక్కడ అచ్ఛానుకోకుండా ఇద్దరు చిన్నారులు నీటిలో కొట్టుకుపోతుండగా తండ్రిగా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సముద్రంలోకి దూకాడు. గట్టి ప్రయత్నంతో తన ఇద్దరు పిల్లలను కాపాడిన విల్సన్ తన శరీర శక్తి పూర్తిగా తగ్గిపోవడంతో నీటిలోనే చనిపోయాడు....

తండ్రి ప్రేమ ఎంత గొప్పదో మళ్లీ ఒక్కసారి ప్రపంచానికి తెలియజెప్పిన ఘ‌ట‌న ఇది. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఫోర్ట్ లాడర....

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమవుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్‌లో పరిస్థితి రోజురోజుకూ మరింత గందరగోళ...
17/06/2025

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమవుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్‌లో పరిస్థితి రోజురోజుకూ మరింత గందరగోళంగా మారుతోంది. ఇజ్రాయెల్ దాడుల భయంతో ఇరాన్ ప్రజలు ప్రాణాల కోసం పరుగులు తీస్తున్నారు. రాజధాని తెహ్రాన్‌ లోని రహదారులు జనాలతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా కాస్పియన్ సముద్రం వైపు వెళ్లే హైవేలు కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నాయి. ఇంధన కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఓవర్‌లోడ్ అయ్యే అవకాశం ఉండడంతో ఏటీఎంలపై కూడా ఆంక్షలు విధించారు. నగదు కోసం ప్రజలు క్యూలలో నిలబడాల్సి వస్తోంది....

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమవుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్‌లో పరిస్థితి రోజురోజుకూ ....

Address

Plot No. 1-88/2, 5th Floor, Gem Square Building, Pillar No. 1743, Above HDFC Bank, Madhapur, Telangana
Hyderabad
500081

Alerts

Be the first to know and let us send you an email when A1TV Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to A1TV Telugu:

Share

Category