21/03/2025
🧡 పాఠం ఒప్పచెప్పకపోతే పెళ్లి చేస్తానని
పంతులు గారన్నప్పుడే భయమేసింది
ఆఫీసులో నా మొగుడున్నాడు
అవసరమొచ్చినా సెలవివ్వడని
అన్నయ్య అన్నప్పుడే అనుమానమేసింది
‘వాడికేం మగమహారాజని’
ఆడామగా వాగినప్పుడే అర్థమైపోయింది
పెళ్లంటే పెద్దశిక్ష అని
మొగుడంటే స్వేచ్ఛా భక్షకుడని
మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే
మమ్మల్ని విభజించి పాలిస్తోందని 🧡
(సావిత్రి - 'బందిపోట్లు')
💛 నగరం అర్థంకాని రసాయనశాల
అందమైన శ్మశాన వాటిక
చిక్కువిడని పద్మవ్యూహం
చెక్కు చెదరని మయసభ
నగరం మేడి పండు- వేడి పుండు
కొందరికిది అక్షయ పాత్ర
మరెందరికో గుండెలపై పయనించే కాలం రాక్షస యాత్ర
నగరం రహస్యం బద్దలు కాని గర్భ నిరోధం 💛
(అలిశెట్టి ప్రభాకర్ - ‘ప్లాస్టిక్ సర్జరీ’)
💚 నన్ను బాధితుడని పిలవకండి
నేను అమరుణ్ణి నేను అమరుణ్ణి నేను అమరుణ్ణి
లోకానికి సంపదను మిగిల్చేందుకు
క్షామాన్ని మింగిన గరళ కంఠున్ని నేను
శీర్షాసనం వేసిన సూర్యోదయాన్ని
నిటారుగా నిలబెట్టేందుకు
సూర్యుని నెత్తి మీద ఈడ్చి తన్నిన వాడిని
రగిలే గుండె కొలిమిలో
నినాదాలు కురిపిస్తున్న వాడిని 💚
(కలేకూరి ప్రసాద్ - 'పిడికెడు ఆత్మగౌరవం కోసం')
❤️ ఏం చెప్పమంటారండీ!
వానలో తడిసొచ్చి తుడుచుకుందామని అమ్మకొంగందుకుంటే
కోటి మాసికలు నన్ను వెక్కిరించాయండీ
చిన్నప్పుడు ఆకలై మా అమ్మరొమ్ముని ఆబగా నోటికదుముకుంటే
నాకు దాని పక్కెటెముకలు గుచ్చుకున్నాయండీ ❤️
(మద్దూరి నగేష్ బాబు - 'అలగా తల్లి')
🤎 రాత మాకు కొత్తకాదు
మీరు పలకల బావుల్లో బలపాల కప్పలైనపుడు
మేం నేలతల్లి గుండెల మీద పైరు పద్యాలమయ్యాం
మీరు విజ్ఞాన సముద్రాల్లో కాగితప్పడవలైనపుడు
మేం కర్మాగారపు నెన్నొసట లోహలిపులమయ్యాం
మా కడుపుల్లో పడ్డాక కదా అక్షరం అగ్నిపునీతమయ్యింది 🤎
(పైడి తెరేష్ బాబు - 'నిశానీ')
💜 స్నేహితుడా!
అడగడానికైతే అడిగావు
రెండే రెండు చిన్న ప్రశ్నలు
హౌ ఆర్ యూ? హౌ ఈజ్ లైఫ్
చెప్పటానికేం లేదు
చెప్పుకోటానికి చాలా ఉంది
రెండూ నిరంతరం వెంటాడే ప్రశ్నలు
దిగులు దిగుడు బావిలో దిగబడిపోయాను
అంతా ముగిసిపోయింది అనుకోనా
ఇక నేను నేను కాకుండా పోయాననుకోనా 💜
(శివలెంక రాజేశ్వరీ దేవి - 'శైవశైలి')
* Poetry is a Spontaneous overflow of Powerful Feelings - Words Worth *
(కవితల ఆర్డర్‌లోనే రాసిన వారి చిత్రాలు ఉన్నాయి).
Source: WhatsApp