B e s t P a g e

B e s t P a g e PLEASE like and share. Thanks friends ����

09/05/2025

మిత్రులారా చెత్త వీడియోలు అన్ని చూసే బదులుగా మనకు ఉపయోగకరంగా ఉన్నటువంటి ఈ వీడియో తప్పక చూడండి.
అందులో చెప్పిన రెండు టాబ్లెట్స్ తప్పకుండా అందరూ ఇంట్లో దగ్గర పెట్టుకోండి. అవి అవసరము ఈ క్షణం ఏం జరుగునో తెలియదు మనకు.🙏
Tablets
1. Disprin
2. Sorbitarate...

13/04/2025
" సింగినాదం  - జీలకర్ర  " అని సామెత. ఈ రెండిటికి ఏమిటి సంబంధం ?శృంగం అంటే కొమ్ము అని అర్థం. పూర్వం కొమ్ములతో బాకాలు (mou...
19/03/2025

" సింగినాదం - జీలకర్ర " అని సామెత. ఈ రెండిటికి ఏమిటి సంబంధం ?శృంగం అంటే కొమ్ము అని అర్థం. పూర్వం కొమ్ములతో బాకాలు (mouth horns) తయారు చేసి ఊదే వారు. ఎవరైనా ఆ ఊదుడు లాగ వితండ వాదం చేస్తే "సింగినాదం చెయ్యకు" అని తిట్టే వారు. రేవు దగ్గరకి పడవలు వచ్చినప్పుడు కూడా అవి వచ్చాయని సూచించడానికి శృంగాలు ఊదేవారు. ఆ పడవలలో సాధారంగా జీలకర్ర,, బెల్లం లాంటివి ఉంటాయి తప్ప పెద్ద సరుకేమీ ఉండదు. ఎవడైనా చిన్న విషయాల కోసం సింగినాదం చేస్తే ఇది సింగినాదం జీలకర్ర గోల లాగ ఉంది అని అంటారు. శృంగనాధమే సింగినాదంగా రూపాంతరం చెందింది.

ఈ రైతన్న ఐడియా బాగుంది కదా ఫ్రెండ్స్...
04/03/2025

ఈ రైతన్న ఐడియా బాగుంది కదా ఫ్రెండ్స్...

**అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి ఎందుకు కుప్పకూలిపోతారు***వ్యాయామశాలలో లేదా క్రీడల సమయంలో వ్యాయామం చేసిన తర్వాత లేదా వాకిం...
28/02/2025

**అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి ఎందుకు కుప్పకూలిపోతారు***

వ్యాయామశాలలో లేదా క్రీడల సమయంలో వ్యాయామం చేసిన తర్వాత లేదా వాకింగు లేదా జాగింగుకు వెళ్ళినపుడు గుండె సంబంధిత సమస్యలు లేదా గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోవడం ముఖ్యంగా యువ మరియు మధ్య వయస్కులలో ఈ మధ్యలో సర్వసాధారణం అవుతున్నాయి. ఇందుకు గుండెపోటు మాత్రమే కారణం అనుకుంటే పప్పులో కాలేసినట్లే! అమెరికాలో ప్రతి సంవత్సరం 3,25,000 మంది ఇలా చనిపోతారు...

ఇందుకు చాలా కారణాలు గుండె సంబంధించిన వాటిలో ఉన్నాయి,..

1. గుర్తించబడని కొరోనరీ ఆర్టరీ జబ్బులు.. గుండె రక్తనాళాలలో కొవ్వు పేరుకొని పోవడం..
2. HCM హైపర్ ట్రోఫిక్ కార్డియోమయోపతి, 3. అసమాన సెప్టల్ హైపర్ట్రోఫీ ,
4. MVP మైట్రల్ వాల్వు ప్రొలాప్సు ,
5. అరిథమిక్ ధోరణి.
6. Qtc పొడిగించే డ్రగ్స్ వినియోగం,
7. సొంతవైద్యంతో వాడే మందులు మరియు సప్లిమెంట్లు
8. తీవ్రమైన వ్యాయామం తర్వాత నిర్జలీకరణ స్థితి అనగా డీహైడ్రేషన్ బాధ్యత వహిస్తుంది.

చాలా మరణాలు అరిథమిక్ VF వెంట్రికులార్ ఫిబ్రిలేషన్ VT వెంట్రికులార్ టాకీకార్డియా వలన వస్తాయి., కాకపోతే కొన్ని ACS అక్యూట్ కొరోనరీ సిండ్రోమ్సు అనగా గుండె రక్తనాళాలలో కొవ్వు చేరుకోవడం వల్ల వచ్చే కొరోనరీ స్పాజమ్ కావచ్చు.. కొందరిలో ఆంజైనా నొప్పి వచ్చి పరీక్షలుకు సమయం ఇవ్వచ్చు లేకపోతే ఇవ్వకపోవచ్చు....

ఎక్కువ వ్యాయామం, జిమ్ ప్రోగ్రామ్‌కు వెళ్ళేందుకు నిర్ణయం తీసుకుంటే ముందు సరైన కార్డియాక్ చెకప్ పొందడం వివేకంతో కూడిన చర్య.

ఈ పరీక్షలు మీకు రిస్కు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. 40 సంవత్సరాలు దాటిన వారు చేసుకోవచ్చు..

1. ECG,
2. ECHO CARDIOGRAM (ఎకో)
3. Treadmill Test or Stress Test అధిక ప్రమాదం ఉన్న వారిని పరీక్షించడానికి గుర్తించడానికి సరిపోతుంది.

కాని కొరోనరీ ఆర్టరీలో కొవ్వు చేరుకోవడం అదే కొలెస్టెరాల్ చేరుకోవడం వలన ప్లాక్ లు వస్తాయి., ఇవి వంశపారంపర్యంగా ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రెలీమియా అంటారు,, కొందరు హోమోసిస్టిన్ పెరిగిన వారిలో 20 ఏళ్ళనుంచే హార్ట్ ఎటాక్ లు వస్తాయి.. ఈ కొలెస్టెరాల్ ప్లాక్ రప్చర్ అయితే దాని మీద ప్లేట్ లెట్సు చేరుకొని క్లాటింగ్ ప్రాసెస్ మొదలవతాది .. ఆ ప్లాక్ పుండయితే దానిమీద సడన్ గా ప్లేట్ లెట్లు చేరుకొని క్లాటింగ్ ప్రాసెస్ మొదలయితే ఓ అరగంటలో బ్లాక్ అయి హార్ట్ అటాక్ వస్తాది., మనం ఆ క్లాటింగ్ ను అడ్డుకోవాలంటే ఆస్పిరిన్ 375 mg రెండు టాబ్లెట్లు లేదా ఎకోస్పిరిన్-75mg 4 టాబ్లెట్ లు నమలాలి.. నోటినుంచే లాలాజలం ద్వారా అబ్జార్బవతాది,, ఇది క్లాటింగును ఆపి ప్రాసెస్ ను కొంత సేపు ఆపతాది...

ధూమపానం, మద్యపానం, మధుమేహం, బిపి, వ్యాయామం లేకపోవడం, ఎక్కువ కెలోరీల కార్బోహైడ్రేట్ ఆహారం, విపరీతమైన పని వొత్తిడి, స్ట్రెస్సు గుండె నొప్పులకు కారణాలు.. అపుడపుడు 40 సంవత్సరాలయిన తరవాత పరీక్షలు చేయించు కోవాలి., అవసరమైతే మందులు, నియంత్రణ చేసుకోవాల,,

కొందరు హైరిస్కు ఉన్నవారు CT ANGIOGRAM 5 ఏళ్ళకొకసారి చేసుకోవాల., రక్తనాళము ల బ్లాక్ తో పాటి కాల్షియమ్ స్కోరు తెలుస్తాది.. లిపిడ్ప్రొఫైలు, బిపి, షుగరు సంవత్సరానికి ఒకసారైనా 35 ఏళ్ళతరవాత చేసుకోవాల.. ట్రైగ్లిజరైడ్సు పెరిగితే ఫీనోఫైబ్రేట్ టాబ్లెట్, కొలెస్టురాలు పెరిగితే అటారవోస్టాటిన్ వేసుకోమంటారు,, రెండుపెరిగితే కాంబినేషన్ ATOCOR+F వేసుకోమంటారు., దానితో పాటు ఎకోస్పిరిన్ 75mg వాడాలి...

Syncopal Attacks అంటే కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళు (మూర్ఛ), Syncope యొక్క చరిత్ర కలిగిన అభ్యర్థులు, ఆకస్మిక మరణం అనేది కుటుంబ చరిత్ర గల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

గుండెనొప్పి వస్తే 2 ఆస్పిరిన్ టాబ్లెట్ లు నమిలి మింగించాలి.. లేదా దంచి నీళ్ళలో కలిపి తాగించి ఆసుపత్రి కి తీసుకెళ్ళాలి.. లేకుంటే ఎంత పెద్దాసుపత్రి అయినా ప్రాణాలను కాపాడలేరు... అర్ధమయిందిగా.. రెండు ఆస్పిరిన్ 375 mg మాత్రలే ప్రాణాలు కాపాడతాయి.. మీ కోట్లడబ్బు, పదవులు, అధికారాలు, పాపులారటీ, కార్పొరేట్ ఆసుపత్రులు కాదు....

మనుషులను బ్రతికించాలంటే తప్పదు,, 2 ఆస్పిరిన్ గోలీలు, CPR చేయాలి,, కారులో ఆసుపత్రికి తీసుకెళితే బతకడు.. CPR చేస్తూ 108 పిలవాలి ... వారు డీపఫిబ్రిలేట్ చేసి, CPR కొనసాగిస్తూ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి,,
రెండు ఆస్పిరిన్ 375 mg టాబ్లెట్ లు

ఎల్లప్పుడు అంబులెన్సుకు మార్గం ఇవ్వండి, మీరు జీవితాన్ని రక్షించగలరు!
15/02/2025

ఎల్లప్పుడు అంబులెన్సుకు మార్గం ఇవ్వండి, మీరు జీవితాన్ని రక్షించగలరు!

టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జంషెట్ టాటా.జంషెట్ టాటా కొడుకు రతన్ జంషెట్ టాటా.రతన్ జంషెట్ టాటా కి పిల్లలు లేకపోతే నావల్ అనే ...
13/10/2024

టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జంషెట్ టాటా.
జంషెట్ టాటా కొడుకు రతన్ జంషెట్ టాటా.
రతన్ జంషెట్ టాటా కి పిల్లలు లేకపోతే నావల్ అనే వ్యక్తి ని పెంచుకొని నావల్ టాటా అని పేరు పెట్టుకున్నారు.
నావల్ టాటా కొడుకు రతన్ టాటా.

టెక్నికల్ గా టాటా ల వారసుడు రతన్ టాటా నే, కాని నిజానికి రతన్ టాటా ఒక అనాధ కొడుకు. రతన్ తండ్రి నావల్ సూరత్ (గుజరాత్) లో దిగువ మధ్య తరగతి కుటుంభం, 4 యేండ్ల వయస్సు లోనే అతని తండ్రి చనిపోతే తల్లి కుట్టు మిషిన్ తో వచ్చేదానితో పోషించలేక ఒక అనాధాశ్రమం లో చేర్పించారు నావల్ ని. పిల్లలు లేని రతన్ జంషెట్ టాటా భార్య నావల్ ని దత్తత తీసుకోవటం వలన నావల్ టాటా అయ్యాడు.

నావల్ టాటా సోను అనే అమ్మాయి ని పెండ్లి చేసుకున్నాడు. వీరికి రతన్ టాటా పుట్టాక కొన్ని రోజులకే విడిపోయారు. ఆ తర్వాత నావల్ టాటా స్విట్జర్లాండ్ అమ్మాయి ని పెండ్లి చేసుకున్నాడు.

రతన్ టాటా జీవితం లో మెలోడ్రామా లేదు గోల్డెన్ స్పూన్ తో పెరిగాడు అనుకుంటాం. స్పేస్ క్రియేట్ చేసి మెలోడ్రామా స్రుష్టించటం కరక్ట్ కాదు. కానీ చిన్నతనం లోనే తల్లిని కోల్పోయాడు, తను ఆర్కిటెక్ట్ అవుదాం అనుకుంటే తండ్రి ఇంజనీరింగ్ చేయమనేవాడు, తను అమెరికా వెళ్ళి విద్యాభ్యాసం చేయాలనుకుంటే తండ్రి ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోమనేవాడు. చివరికి రతన్ జంషెట్ టాటా (టెక్నికల్ గా తాత) ని ఒప్పించి అమెరికాలోని కార్నెగీ యూనివర్శిటీ లో చదువుకున్నాడు. అమెరికాలో చదువుకునే రోజుల్లో ప్రేమించిన అమ్మాయిని పెండ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ గ్రాండ్ పేరెంట్స్ ఆరోగ్యం బాగాలేకపోతే ఇండియా తిరిగి వచ్చాడు. ఆ సమయం లో ఇండియా చైనా యుద్ధం జరుగుతుండటం తో రతన్ టాటా ని చేసుకోటానికి ఆ అమ్మాయి ఇండియా రాలేకపోయింది, కొన్ని సంవత్సరాలకి వేరే వాళ్ళని చేసుకుంది. ఆ తర్వాత ఎవరిని చూసినా ఆ అమ్మాయే గుర్తు వచ్చిందో ఏమో రతన్ టాటా పెండ్లి చేసుకోలేదు (బ్రహ్మచారి).

టాటా గ్రూపు వ్యవస్థాపకుడు జంషెట్ టాటా కజిన్ బ్రదర్ కొడుకు JRD టాటా (JRD టాటా కి భారత రత్న కూడా వచ్చింది). రతన్ టాటా ఇండియా వచ్చిన సమయం లో JRD టాటా నే టాటా గ్రూపు వ్యాపారాలని చూసుకునేవాడు. రతన్ టాటా కూడా మామూలు ఉద్యోగి లాగే టాటా గ్రూపు లో జాయిన్ అయ్యాడు. JRD టాటా ఆరోగ్యం బాగాలేని స్థితి లో రతన్ టాటా కి టాటా గ్రూపు పగ్గాలు అప్పగించాడు. అప్పటిదాకా కుటుంభ వ్యాపారం లాగా ఉన్న టాటా సంస్థ ని అంతర్జాతీయ సంస్థ గా తీర్చిదిద్దాడు రతన్ టాటా. ఇండియా లో ఉన్న కార్లు, విమానాలు అన్నిటినీ కొనగలడు కానీ ఆయన కారుని ఆయనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేవాడు రతన్ టాటా. తన సొంత సంస్థల్లోకి వెళుతుంటే అందరిలాగే తప్పనిసరిగా ఆగి తన కారు ని చెక్ చేపించుకునేవాడు.

రిలయన్స్, బిర్లా, బజాజ్ లాంటి వారి అందరి సంపద కంటే టాటా గ్రూపు సంపద ఎక్కువ. కానీ అంభానీ లు లాగా ఇండియా లో కానీ, ప్రపంచం లో కానీ టాప్ లో లేడు రతన్ టాటా కారణం ఆయన సంపదలో 60% ఎప్పుడూ దాన ధర్మాలకి వినియోగిస్తుంటాడు రతన్ టాటా.

ఆసియా లో మొదటి క్యాన్సర్ హాస్పటల్ నుంచి ఇండియాలో మొదటి ఎయిర్ లైన్స్ (ఆ తర్వాత ఎయిర్ ఇండియా అయ్యింది) వరకు టాటా లే ప్రారంభించారు. టీ పొడి, ఉప్పు నుంచి ఫైవ్ స్టార్ హోటల్స్ వరకు టాటా లు లేని వ్యాపారం లేదు; సిగరెట్స్ & ఆల్కహాల్ వ్యాపారం తప్ప. గుండు సూది నుంచి గూడ్స్ రైలు ఇంజన్స్ వరకు టాటా లే నంబర్ వన్.

టాటా ఇండికా వచ్చిన కొత్తలో నష్టాల్లో ఉంటే అమెరికాకి చెందిన ఫోర్డ్ మోటార్స్ కి వెళ్ళి అమ్ముతాం కొనమని అడిగితే వాళ్ళు ఎగతాళి గా మాట్లాడి పంపించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అదే ఫోర్డ్ మోటార్స్ నష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు సాదరం గా ఆహ్వానించి ఫోర్డ్ వాళ్ళ లగ్జరీ కార్లు అయిన "జాగ్వార్", "లాండ్ రోవర్" ని కొని ఫోర్డ్ మోటార్స్ కి సహాయం చేశాడు రతన్ టాటా.

గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ లో ఇండియా లో మొట్టమొదట 5/5 రేటింగ్ సాధించిన కార్ టాటా వాళ్ళదే (టాటా నెక్సాన్). ఈ కార్ స్రుష్టికర్త రతన్ టాటా గారే. ఇండియా లో రిలయన్స్ తర్వాత 100 బిలియన్స్ రూపాయలు సాధించిన సంస్థ కూడా టాటా వాళ్ళ TCS నే (మార్కెట్ క్యాపిటలైజేషన్- mcap ప్రకారం). ఇలాంటివెన్నో ఉన్నాయి రతన్ టాటా గారి ఖాతాలో.

ఇండియా కి ఏ కష్టం వచ్చినా సంపదని అంతా ఇచ్చేవాళ్ళలో రతన్ టాటా ముందు ఉండేవాడు. అంభానీలు ధనవంతులు కానీ రతన్ టాటా ఐశ్వర్యవంతుడు. కష్ట పడితే అందరూ అంభానీలు అవ్వకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరూ రతన్ టాటా లాగా ఐశ్వర్యవంతుడు అవ్వొచ్చు.

రతన్ టాటా అంటే ఒక నమ్మకం.
రతన్ టాటా అంటే ఒక నిజాయతీ.
రతన్ టాటా అంటే ఒక నిలువెత్తు భారతం.
రతన్ టాటా అంటే భారతీయ జాతీయ సంపద.
రతన్ టాటా అంటే మనమంతా జరుపుకోవాల్సిన ఒక ఉత్సవం.

మిమ్మల్ని మిస్ అయ్యే ఛాన్స్ లేదు సార్, మేము ఉన్నంత కాలం మీరు మాతో ఉంటారు🙏

Address

Hyderabad
500003

Website

Alerts

Be the first to know and let us send you an email when B e s t P a g e posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to B e s t P a g e:

Share