Dev Tv

Dev Tv Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dev Tv, Media/News Company, SA Plaza, Medipally, Parvathapur, Hyderabad.
(1)

Dev Tv నిష్పక్షపాతంగా, సూటిగా సుత్తి లేకుండా, ముఖ్యమైన షార్ట్ న్యూస్ అందించే ఏకైక మంచి ఛానల్. భవిష్యత్తులో వార్తలతో పాటు మీకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను మీకు అందించడమే మా లక్ష్యం.

*అక్బరుద్దీన్‌ కాలేజీపై బీజేపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం*హైదరాబాద్ జూలై 07,2025: "అక్బరుద్దీన్‌ ఒవైసీకి ఓ న్యాయం, పేదలకు మరో...
07/07/2025

*అక్బరుద్దీన్‌ కాలేజీపై బీజేపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం*

హైదరాబాద్ జూలై 07,2025: "అక్బరుద్దీన్‌ ఒవైసీకి ఓ న్యాయం, పేదలకు మరో న్యాయమా?" అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న పేదల జీవితాలు ప్రభుత్వానికి కీలకంగా లేకపోవడం దారుణమన్నారు. అక్రమంగా నిర్మించిన అక్బరుద్దీన్‌ కళాశాల భవనాన్ని తక్షణమే కూల్చివేయాలని డిమాండ్ చేశారు.

Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.

#ఆంధ్రప్రదేశ్

*ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో అధికారులు నిర్లక్ష్యం – మంత్రి జూపల్లికి ఆగ్రహం*తెలంగాణ జూలై 07,2025: నాగర్‌కర్నూలులో జరిగిన...
07/07/2025

*ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో అధికారులు నిర్లక్ష్యం – మంత్రి జూపల్లికి ఆగ్రహం*

తెలంగాణ జూలై 07,2025: నాగర్‌కర్నూలులో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర గీతం ఆడియో క్లారిటీ లేకపోవడంపై మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులపై సీరియస్ అయ్యారు. రాష్ట్ర గీతంపై శ్రద్ధ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. సంబంధిత సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు.

Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.

#ఆంధ్రప్రదేశ్

*విద్యా అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తున్నాం: లోకేష్*ఆంధ్రప్రదేశ్ జూలై 07,2025: పిల్లల భవిష్యత్‌ కోసమే విద్యాశాఖ తీసుకు...
07/07/2025

*విద్యా అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తున్నాం: లోకేష్*

ఆంధ్రప్రదేశ్ జూలై 07,2025: పిల్లల భవిష్యత్‌ కోసమే విద్యాశాఖ తీసుకున్న అని మంత్రి లోకేష్ తెలిపారు. స్కూల్ కార్యక్రమాల్లో రాజకీయాలు మాట్లాడకూడదన్నారు. గత ప్రభుత్వం మూసివేసిన వీఆర్ హైస్కూల్‌ను, మంత్రి నారాయణ నేతృత్వంలో అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన కోసం పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు.

Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.

#ఆంధ్రప్రదేశ్

*ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు ప్రారంభం*విజయవాడ జూలై 07,2025: ఇంద్రకీలాద్రిపై రేపటి (జూలై 8) నుంచి మూడు రోజుల పాటు శ...
07/07/2025

*ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు ప్రారంభం*

విజయవాడ జూలై 07,2025: ఇంద్రకీలాద్రిపై రేపటి (జూలై 8) నుంచి మూడు రోజుల పాటు శాకాంబరి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు VIP దర్శనాలు రద్దు చేయగా, అంతరాలయ దర్శనాలను నిలిపివేశారు. భక్తులు సాధారణ దర్శనానికి మాత్రమే అనుమతించబడతారు.

Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.

#ఆంధ్రప్రదేశ్

*అబ్దుల్లాపూర్‌మెట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి తాళం*రంగారెడ్డి జూలై 07,2025: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌...
07/07/2025

*అబ్దుల్లాపూర్‌మెట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి తాళం*

రంగారెడ్డి జూలై 07,2025: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి భవనం యజమాని తాళం వేసాడు. 40 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ఈ చర్యకు పాల్పడ్డారు. అద్దె విషయంలో పలుమార్లు డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.

#ఆంధ్రప్రదేశ్

*నటుడు మహేష్‌బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ నోటీసులు*హైదరాబాద్ జూలై 07,2025: ప్రముఖ నటుడు మహేష్‌బాబుకు రం...
07/07/2025

*నటుడు మహేష్‌బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ నోటీసులు*

హైదరాబాద్ జూలై 07,2025: ప్రముఖ నటుడు మహేష్‌బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థకు ప్రచారకర్తగా ఉన్న మహేష్‌బాబు, లేఅవుట్‌ లేని స్థలాలను బాలాపూర్‌లో విక్రయించారన్న ఆరోపణలపై నోటీసులు జారీ అయ్యాయి. మహేష్‌తో పాటు సంస్థ ప్రతినిధులు ఇవాళ విచారణకు హాజరుకావాలని కమిషన్ ఆదేశించింది.

Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.

#ఆంధ్రప్రదేశ్

*ఆత్మహత్యలకు BRS నేతలే కారణం-మంత్రి సీతక్క*తెలంగాణ జూలై 07,2025: తెలంగాణ మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో BRS నేతలపై విమర్శల...
07/07/2025

*ఆత్మహత్యలకు BRS నేతలే కారణం-మంత్రి సీతక్క*

తెలంగాణ జూలై 07,2025: తెలంగాణ మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో BRS నేతలపై విమర్శలు చేశారు. "ఆత్మహత్యలకు BRS నేతలే కారణం, అమాయకులను రెచ్చగొడుతున్నారు" అని అన్నారు. ములుగులో అలజడి సృష్టిస్తున్న BRS నేతలకు సవాల్ విసిరిన ఆమె, "పదేళ్లలో మా కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎన్ని? 18 నెలల్లో మేం పెట్టిన కేసులపై చర్చకు సిద్ధమా?" అని ప్రశ్నించారు. "గిరిజన బిడ్డను కావడమే లక్ష్యంగా రాజకీయ కుట్రలు చేస్తున్నారు. నాకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఇలా చేస్తున్నారు" అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.

#ఆంధ్రప్రదేశ్

*మనం ప్రకృతిని కాపాడితే.. అది మనల్ని కాపాడుతుంది..సీఎం రేవంత్ రెడ్డి*హైదరాబాద్ జూలై 07,2025: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ...
07/07/2025

*మనం ప్రకృతిని కాపాడితే.. అది మనల్ని కాపాడుతుంది..సీఎం రేవంత్ రెడ్డి*

హైదరాబాద్ జూలై 07,2025: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనలో "మనం ప్రకృతిని కాపాడితే, ప్రకృతి మనల్ని కాపాడుతుంది." రాష్ట్రాన్ని హరితవనంగా మార్చే లక్ష్యంతో ప్రతి ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.

#ఆంధ్రప్రదేశ్

*నేటి నుంచి ప్రపంచ దేశాలపై అమెరికా సుంకాలు అమలు..ట్రంప్*జూలై 07,2025: నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెరికా సుంకాలు అమల్ల...
07/07/2025

*నేటి నుంచి ప్రపంచ దేశాలపై అమెరికా సుంకాలు అమలు..ట్రంప్*

జూలై 07,2025: నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెరికా సుంకాలు అమల్లోకి రానున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. బ్రిక్స్‌ దేశాలపై కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించిన ఆయన, బ్రిక్స్ అనుబంధ దేశాలపై అదనంగా 10% సుంకం విధించనున్నట్లు తెలిపారు. మొత్తం 180 దేశాలపై సుంకాలు విధించగా, 57 దేశాలపై అదనపు దిగుమతి సుంకాలు వేశారు. భారత్‌పై 26% ఎగుమతి సుంకం విధించినట్లు ట్రంప్ ప్రకటించారు.

Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.

#ఆంధ్రప్రదేశ్

*ఆర్థిక శాఖపై ఉమ్మడి సమీక్ష నిర్వహించనున్న సీఎం చంద్రబాబు*అమరావతి జూలై 07,2025: అమరావతిలో సీఎం చంద్రబాబు కార్యాచరణ శరవేగ...
07/07/2025

*ఆర్థిక శాఖపై ఉమ్మడి సమీక్ష నిర్వహించనున్న సీఎం చంద్రబాబు*

అమరావతి జూలై 07,2025: అమరావతిలో సీఎం చంద్రబాబు కార్యాచరణ శరవేగంగా కొనసాగుతోంది. ఉదయం 11:15కు సచివాలయానికి చేరుకొనున్న సీఎం, మధ్యాహ్నం 12:30కి క్వాంటమ్ వ్యాలీపై సమీక్ష నిర్వహించనున్నారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు RTGS, నీటి నిర్వహణ, ఆర్థిక శాఖలపై ఉమ్మడి సమీక్ష జరగనుంది.

Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.

#ఆంధ్రప్రదేశ్

*భువనగిరిలో గాయత్రి ఆస్పత్రిపై SOT పోలీసుల దాడి*భువనగిరి జూలై 07,2025: భువనగిరిలో గాయత్రి ఆస్పత్రిపై SOT పోలీసులు దాడి చ...
07/07/2025

*భువనగిరిలో గాయత్రి ఆస్పత్రిపై SOT పోలీసుల దాడి*

భువనగిరి జూలై 07,2025: భువనగిరిలో గాయత్రి ఆస్పత్రిపై SOT పోలీసులు దాడి చేశారు. డాక్టర్‌ శివ ఇద్దరు మహిళలకు అక్రమంగా అబార్షన్‌ చేసినట్లు గుర్తించి పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా SLNS ల్యాబ్‌లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు బయటపడింది. ఈ కేసులో ల్యాబ్‌ యజమాని పాండుపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

Like, Follow, Subscribe Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.

#ఆంధ్రప్రదేశ్

*తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ*తిరుపతి జిల్లా ప్రతినిధి జూలై 07, 2025: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నారాయణగి...
07/07/2025

*తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ*

తిరుపతి జిల్లా ప్రతినిధి జూలై 07, 2025: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నారాయణగిరి షెడ్స్‌ వరకు భక్తుల క్యూ, టోకెన్ లేని భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనానికి సుమారుగా 18 గంటల సమయం పడుతోంది, రూ.300 టోకెన్ ఉన్న భక్తులకు 3-4 గంటల సమయం, దివ్య దర్శనం (పాదయాత్ర ద్వారా వచ్చే భక్తులకు) సుమారుగా 10 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 88,938 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 28,548 మంది భక్తులు.

*The ongoing rush of devotees in Tirumala*

Tirupati District Correspondent, july 07, 2025: The ongoing rush of devotees in Tirumala. A queue of devotees up to Narayanagiri sheds. Currently, for Srivari Sarva Darshanam (free entry), the wait time is approximately 18 hours, while devotees with a Rs. 300 token have a wait time of around 3-4 hours. For Divya Darshanam (devotees arriving by foot), the wait time is about 10 hours. Yesterday, 88,938 devotees visited Sri Venkateswara Swamy, and 28,548 devotees offered hair in reverence.

*तिरुमाला में भक्तों की चल रही भीड़*

तिरुपति जिला प्रतिनिधि, 07 जुलाई 2025: तिरुमाला में भक्तों की चल रही भीड़। नारायणगिरी शेड तक भक्तों की एक कतार, श्री वेंकटेश्वर स्वामी के सर्वदर्शन के लिए टोकन रहित भक्तों को लगभग 18 घंटे का समय लग रहा है, जबकि 300 रुपये के टोकन वाले भक्तों को 3-4 घंटे और दिव्य दर्शन (पदयात्रा से आने वाले भक्तों) के लिए लगभग 10 घंटे का समय लग रहा है। कल श्रीवारी दर्शन करने वाले भक्तों की संख्या 88,938 थी, और 28,548 भक्तों ने तिरुमला में तजस्वरी अर्पित की।

Like, Follow Dev TV WhatsApp, Facebook & YouTube channels for the latest, short and reliable news.

Address

SA Plaza, Medipally, Parvathapur
Hyderabad
500098

Alerts

Be the first to know and let us send you an email when Dev Tv posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share