ASK Bhakthi Channel

ASK Bhakthi Channel ఆధ్యాత్మిక భక్తి వారధి youtube.com/

*శ్రీ చిన్న జీయర్ స్వామివారి తనియన్*దుర్ముఖ్యబ్దే తౌళిశుక్ల ప్రథమే స్వాతిభే శుభే |ప్రాదుర్భూతం గురుం వన్డే శ్రీమన్నారాయణ...
21/07/2024

*శ్రీ చిన్న జీయర్ స్వామివారి తనియన్*

దుర్ముఖ్యబ్దే తౌళిశుక్ల ప్రథమే స్వాతిభే శుభే |
ప్రాదుర్భూతం గురుం వన్డే శ్రీమన్నారాయణం మునిమ్ ॥

కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం ॥ శ్రీమన్నారాయణం వన్దే యతీశ్వర శ్రియా జూషమ్ |

20/07/2024

తిరుమల సమాచారం
అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో …

అక్టోబర్ 4 నుండి 10వ తేదీ వరకు సుప్రభాత సేవ మినహా, మిగిలిన అన్ని ఆర్జిత సేవలు రద్దు.

అక్టోబర్ 11, 12వ తేదీల్లో సుప్రభాత సేవతో పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు.

అక్టోబర్ 3 నుండి 13వ తేదీ వరకు అంగప్రదక్షిణ, వర్చువల్ సేవా దర్శనం టికెట్లు రద్దు చేయబడింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

In view of the annual Sriivari Brahmotsavam between October 4 to 12, TTD has cancelled sevas and darshans

Except Suprabhata seva all arjita Sevas stands cancelled from October 4-10 while on October 11 and 12 all Arjita sevas including Suprabhatam were cancelled.

From October 3-13, Virtual Sevas and Anga Pradakshina remains cancelled.

TTD appeals to pilgrims to note the changes and book their Arjita Seva, Darshan tickets and accommodation only through the TTD official website https://ttdevasthanams.ap.gov. in

ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

20/07/2024

నేటి పంచాంగం 20.07.2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం. గ్రీష్మఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, తిధి : శ్రీ క్రోధి నామ సంవత్సర ఆషాఢ శుధ్ధ చతుర్దశి సా. 05.20 వరకు తదుపరి పౌర్ణమి
వారం: శనివారం ( మందవాసరే )
నక్షత్రం: పూర్వాషాఢ రా. 02.25 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
యోగం: వైధృతి రా. 01.25 వరకు తదుపరి విష్కంభం
కరణం: వణిజ సా. 05.20 తర్వాత భధ్ర తె 04.46 తదుపరి బవ
అమృతకాలం: రా. 09.38 - 11.13 వరకు
వర్జ్యం: ప.వ. 12.05 - 01.40 వరకు
దుర్మూహర్తం: ఉ. దు. 05.57 - 07.38 వరకు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30
యమగండం /కేతుకాలం:ప. 01.30 - 03.00
గుళికకాలం: ఉ. 06.00 - 07.30
సూర్యరాశి: కర్కటక
చంద్రరాశి: ధను:
సూర్యోదయం: 05.57
సూర్యాస్తమయం: 06.40
*పుష్యమి కార్తె ప్రారంభం*
*తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారిపవిత్రోత్సవ సమాప్తి*
*స్వీయఆరాధన సర్వ ఆదరణ*
*మాధవసేవగా సర్వప్రాణిసేవ*
🙏ఓం నమో వేంకటేశాయా🙏

20/07/2024

తిరుమల సమాచారం
*జూలై 21న పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌*

*గురు పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 21న ఆదివారం గరుడసేవ జరుగనుంది*
ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

18/07/2024

*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*

*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*
*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హo*

గురువారం, జూలై 18,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం - శుక్ల పక్షం
తిథి:ద్వాదశి సా6.13 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:జ్యేష్ఠ రా2.09 వరకు
యోగం:బ్రహ్మం తె4.25 వరకు
కరణం:బవ ఉ6.04 వరకు తదుపరి బాలువ సా6.13 వరకు
వర్జ్యం:ఉ7.07 - 8.46
దుర్ముహూర్తము:ఉ9.56 - 10.48
మరల మ3.07 - 3.58
అమృతకాలం:సా5.33 - 6.42
రాహుకాలం:మ1.30 - 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30
సూర్యోదయం:5.38
సూర్యాస్తమయం:6.34

*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

🙏🌹🙏 !! జై శ్రీమన్నారాయణ !! 🙏🌹🙏🙏🌹🙏శాంతాకారం భుజగశయనం, పద్మనాభం, సురేశం విశ్వాకారం, గగన సదృశం మేఘవర్ణం శుభాంగం! లక్ష్మీకాం...
16/07/2024

🙏🌹🙏 !! జై శ్రీమన్నారాయణ !! 🙏🌹🙏

🙏🌹🙏శాంతాకారం భుజగశయనం, పద్మనాభం, సురేశం విశ్వాకారం, గగన సదృశం మేఘవర్ణం శుభాంగం!
లక్ష్మీకాంతం, కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం, భవభయహరం సర్వలోకైక నాధం!!🙏🌹🙏

🙏🌹🙏తొలి ఏకాదశి.. హిందువులకు అతి పవిత్రమైన రోజు. దీనినే దేవశయని అని కూడా అంటారు. మరి ఈ ఏడాది తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది? ఆరోజు ఏం చేయాలి.. ఏం చేయకూడదు? ఈ విషయంలో పురాణాలతోపాటు పండితులు ఏం చెబుతున్నారు? తెలుసుకుందాం.🙏🌹🙏
🙏🌹🙏పంచమి, సప్తమి, దశమి తిథుల్లానే ఏకాదశి చాలా పవిత్రమైంది. శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి అంటూ నెలకు రెండుసార్లు చొప్పున సంవత్సర కాలంలో ఏకాదశి తిథి 24సార్లు వస్తుంది. అధికమాసం వస్తే మరో రెండుసార్లు కలిపి 26సార్లు వస్తుంది. వీటిలో తొలి ఏకాదశి మహా విశిష్టమైంది. మరి ఇంతటి విశిష్టమైన తొలి ఏకాదశి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది? ఆ రోజున ఏం చేయాలి? వంటి వివరాలు చూద్దాం..🙏🌹🙏

🙏🌹🙏తొలి ఏకాదశి ప్రాముఖ్యత : ఆషాఢ మాసంలో తొలి ఏకాదశినే.. దేవశయని ఏకాదశి, పద్మనాభ ఏకాదశి, హరిశయని ఏకాదశి అని కూడా అంటారు. క్షీరసాగరంలో శేషతల్పంపై శ్రీహరి ఆషాఢమాసంలోని తొలి ఏకాదశినాడు యోగనిద్రకు సమాయత్తమవుతాడని విష్ణుపురాణం పేర్కొంది. ఏకాదశి రోజున శ్రీహరి యోగనిద్రకు వెళ్లి.. కార్తికమాసంలో దేవుత్తని ఏకాదశి రోజున మేల్కొంటాడని నమ్మకం. అంతేకాదు తొలి ఏకాదశి నుంచే హిందువుల పండగలు ప్రారంభం అవుతాయని విశ్వసిస్తుంటారు. తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలలపాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని.. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈ 4 నెలల్లో ఎక్కువ సమయం భగవంతుని పూజిస్తారు. జైన మతంలో కూడా ఈ రోజుకు ప్రాముఖ్యత ఉంది. జైనులకూ చాతుర్మాసం ప్రారంభమవుతుంది. అంటే ఈ రోజు నుంచి జైన సాధువులు కూడా నాలుగు నెలలపాటు ప్రయాణం చేయకుండా.. ఒకే చోట ఉండి శ్రీ మహా విష్ణువును పూజిస్తారు. ఈ తీర్థంలో నీరు తాగితే సర్వరోగాలు నయం.. 🙏🌹🙏

🙏🌹🙏తొలి ఏకాదశి 2024 ఎప్పుడంటే...? హిందూ పంచాంగం ప్రకారం.. ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి తిథి జులై 16వ తేదీ మంగళవారం రాత్రి 8:33 గంటలకు ప్రారంభమై.. జులై 17వ తేదీ బుధవారం రాత్రి 09:02 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం.. ఈ సంవత్సరం తొలి ఏకాదశి వ్రతాన్ని జులై 17న జరుపుకుంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, నియమ నిష్ఠలతో విష్ణువుతోపాటు లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల శ్రీ హరి అనుగ్రహంతో జీవితంలో సుఖసంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం.🙏🌹🙏

🙏🌹🙏తొలి ఏకాదశి రోజు చేయాల్సిన పనులు:🙏🌹🙏
🙏🌹🙏తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి.పూజా మందిరాన్ని అలంకరించి శ్రీమహా విష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి. విష్ణుసహస్రనామ పారాయణం చేయాలి.ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి.. మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. ఆ రోజున చేసే ఉపవాసం చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది.శ్రీ హరికి నైవేద్యంలో తులసి ఆకులను తప్పనిసరిగా చేర్చాలి.పేదలకు ధనం, ధాన్యాలు, వస్త్రాలు దానం చేయాలి. అలాగే ఈ రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.🙏🌹🙏

🙏🌹🙏తొలి ఏకాదశి నాడు చేయకూడని పనులు:🙏🌹🙏
🙏🌹🙏ఏకాదశి రోజున తామసిక ఆహారాన్ని తినవద్దు. అంటే మద్య, మాంసాలకు దూరంగా ఉండాలి.ఆ రోజున అన్నం తినకూడదు. స్త్రీలను, పెద్దలను అవమానించకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. మొక్క నుంచి తులసి ఆకులను తెంపకూడదు. ఉపవాసం ఉన్న వ్యక్తి.. ఇతరుల పట్ల చెడు ఆలోచనలు చేయకూడదు. గోళ్లు, వెంట్రుకలు కత్తిరించకూడదు.🙏🌹🙏

NOTE : 🙏🌹🙏పైన తెలిపిన వివరాలు ప్రముఖ ఆధ్యాత్మిక నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.🙏🌹🙏

🙏🌹🙏ఆషాఢంలో విశిష్ట పండుగలు, నెలంతా విశేషాలే..🙏🌹🙏
🙏🌹🙏సుబ్రమణ్యస్వామిని ఆరాధిస్తే పెళ్లికి లైన్​ క్లీయర్..🙏🌹🙏

🙏🌹🙏 !! జైశ్రీ మన్నారాయణ !! 🙏🌹🙏

🙏🌹🙏 !! నారాయణ నారాయణ జయ గోవింద హరే !! 🙏🌹🙏

🙏🌹🙏 !! నారాయణ నారాయణ జయ గోపాల హరే !! 🙏🌹🙏

🙏🌹🙏 !! ఓం నమో నారాయణాయ నమః !! 🙏🌹🙏

🙏🌹🙏 !! సర్వం శ్రీ నారాయణార్పణమస్తు !! 🙏🌹🙏

16/07/2024

తిరుమల తిరుపతి దేవస్థానము సమాచారం
అక్టోబర్-2024 కోసం శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు ఎలక్ట్రానిక్ DIP రిజిస్ట్రేషన్‌లు 18.07.2024 10:00 AM నుండి అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్‌లు 18.07.2024 10:00 AM. నుండి 20.07.2024 ఉదయం 10:00 AM. వరకు తెరిచి ఉంటాయి.

కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు అక్టోబర్-2024కి సంబంధించిన సహస్ర దీపాలంకార సేవ వంటి సేవలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా బుకింగ్ కోసం 22.07.2024 10:00 AMకి అందుబాటులో ఉంటాయి.

ఆన్‌లైన్ సేవ (వర్చువల్ పార్టిసిపేషన్) మరియు అక్టోబరు-2024లో శ్రీవారి ఆలయంలోని శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం & సహస్ర దీపాలంకార సేవలకు అనుసంధానించబడిన దర్శన్ కోటా బుకింగ్ కోసం 22.07.2024 3:00 PMకి అందుబాటులో ఉంటాయి.

అక్టోబర్-2024 తిరుమల అంగప్రదక్షిణం టోకెన్లు బుకింగ్ కోసం 23.07.2024 10:00 AMకి అందుబాటులో ఉంటాయి.

శ్రీవాణి ట్రస్ట్ దాతలకు అక్టోబర్-2024లో దర్శనం మరియు వసతి కోటా బుకింగ్ కోసం 23.07.2024 11:00 AMకి అందుబాటులో ఉంటుంది.

అక్టోబరు-2024లో సీనియర్ సిటిజన్‌లు / ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కోటా బుకింగ్ కోసం 23.07.2024 3:00 PMకి అందుబాటులో ఉంటుంది.

అక్టోబర్-2024కి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టిక్కెట్లు బుకింగ్ కోసం 24.07.2024 10:00 AMకి అందుబాటులో ఉంటాయి.

అక్టోబర్-2024లో తిరుమల మరియు తిరుపతి వసతి కోటా బుకింగ్ కోసం 24.07.2024 03:00 PMకి అందుబాటులో ఉంటుంది.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుచానూరు ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 200/-) ఆగస్టు-2024 టిక్కెట్‌లు 24.07.2024 10:00 AMకి బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి.

TTD - ఆగస్ట్-2024 కోసం స్థానిక ఆలయాల సేవా కోటా బుకింగ్ కోసం 25.07.2024 ఉదయం 10:00 గంటలకు అందుబాటులో ఉంటుంది.

సప్తగౌ ప్రదక్షిణ శాలలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం, అలిపిరి ఆగస్టు-2024 టిక్కెట్లు బుకింగ్ కోసం 25.07.2024 ఉదయం 10:00 గంటలకు అందుబాటులో ఉన్నాయి.

Address

Hyderabad, Telangana
Hyderabad
502305

Alerts

Be the first to know and let us send you an email when ASK Bhakthi Channel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share