Neti Telugu

Neti Telugu "నేడు జరిగిందంతా, నెటి తెలుగు లోనే!"

01/12/2025

*తిరుమల : వైకుంఠ ద్వార దర్శనాలకు ముగిసిన ఈ-డిప్ రిజిస్ట్రేషన్.*

*1.8 లక్షల టోకెన్ల కోసం 24 లక్షల మంది పేర్లు నమోదు.. డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీల్లో మూడు రోజులకు ఆన్‌లైన్‌లో ఈ-డిప్ ద్వారా భక్తులకు దర్శన టోకెన్ల కేటాయింపు.*

*రేపు ఈ-డిప్‌లో ఎంపికైన భక్తులకు ఆన్‌లైన్‌లో టోకెన్లు.. జనవరి 2 నుంచి 8 వరకు 7 రోజులు సర్వదర్శనం యధాతథం.*

*చివరి 7 రోజుల్లో రోజుకు 15 వేల రూ.300 దర్శనం టికెట్లు.. చివరి 7 రోజుల్లో రోజుకు వెయ్యి శ్రీవాణి దర్శన టికెట్లు.*

*వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట.*

*టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాలతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు.*

01/12/2025

విజయవాడ : ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అనిల్‌ చోక్రాను తొలిరోజు విచారించిన సిట్‌ అధికారులు.

షెల్‌ కంపెనీలు, మనీ ల్యాండరింగ్‌ అంశాలపై ఆరా.

రేపు, ఎల్లుండి కూడా అనిల్‌ చోక్రాను విచారించనున్న సిట్‌ అధికారులు.

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఏ49 నిందితుడిగా ఉన్న అనిల్‌ చోక్రా.

01/12/2025

విజయవాడ : సత్యవర్ధన్‌ కిడ్నాప్‌ కేసులో వల్లభనేని వంశీ ప్రధాన అనుచరులకు రిమాండ్‌.

విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో లొంగిపోయిన వజ్ర కుమార్‌, తేలప్రోలు రాము.

విచారణ జరిపి ఇద్దరికీ ఈ నెల 15 వరకు రిమాండ్‌ విధించిన న్యాయస్థానం.

01/12/2025

తాళ్లవలసలో డయేరియా కేసుల నమోదుపై సీఎం చంద్రబాబు ఆరా.

తాళ్లవలసలో వృద్ధుడి మరణానికి కిడ్నీ సమస్య, మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ కారణమన్న వైద్యారోగ్యశాఖ.

నీటిని పరీక్షించగా కలుషితం కాదు.. సురక్షితమేనని తేలిందన్న అధికారులు.. ముందు జాగ్రత్తగా బావి నీటి సరఫరా నిలిపివేశామన్న అధికారులు.

ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని తెలిపిన అధికారులు.. పంచాయతీ ఆఫీసర్‌, ఎస్‌ఈ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారన్న అధికారులు.

డిప్యూటీ డీఎంహెచ్‌వో, ఎపిడెమియాలజిస్ట్‌ గ్రామంలోనే ఉండి పరిశీలిస్తున్నారన్న అధికారులు.

తాళ్లవలస గ్రామస్థులు ఎందుకు అనారోగ్యం పాలవుతున్నారో గుర్తించాలన్న సీఎం చంద్రబాబు.

గ్రామస్థులకు సురక్షిత మంచినీరు అందించేలా చూడాలన్న సీఎం చంద్రబాబు.

సమీప గ్రామాలపైనా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం.

01/12/2025

ఢిల్లీలో కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ.

కార్యాచరణ ప్రణాళికను పున:సమీక్షించుకోవాలి.. రైతులపై నింద వేయడం సాధారణం అయిపోయింది.

పంట వ్యర్థాల దహనం కాకుండా ఏయే అంశాలు కాలుష్యానికి దోహదపడతాయి.

కాలుష్యంపై నెలకు రెండుసార్లు విచారణ జరుపుతాం.

శీతాకాలం తర్వాత పరిస్థితి మెరుగుపడొచ్చు : సుప్రీంకోర్టు

తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా.

01/12/2025

అమరావతి : ఐపీఎస్‌ సునీల్‌కుమార్‌పై DOPTకి డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు లేఖ.

ఇటీవల 'కాపులు, దళితులు కలిస్తే రాజ్యాధికారం మనదే' అన్న సునీల్‌ కుమార్‌ వ్యాఖ్యలను DOPT దృష్టికి తెచ్చిన డిప్యూటీ స్పీకర్‌ రఘురామ.

ఐపీఎస్‌ సునీల్‌ కుమార్‌ను సర్వీస్‌ నుంచి తొలగించాలని DOPTకి రఘురామ లేఖ.

సునీల్‌ వ్యాఖ్యలు అఖిల భారత సర్వీసు నిబంధనలకు విరుద్ధం.

సునీల్‌పై సన్పెన్షన్‌ ఉన్నప్పటికీ ఆయనకు నిబంధనలు వర్తిస్తాయి.

కులాలను రెచ్చగొట్టే విధంగా రాజకీయంగా సునీల్‌ వ్యాఖ్యలు : ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు

01/12/2025

అమరావతి : టీడీపీ కేంద్ర కార్యాలయంలో శిక్షణ తరగతులు ప్రారంభం.

హాజరైన మండల అధ్యక్షులు, జనరల్‌ సెక్రటరీలు.

త్యాగాలకు వెనకాడని కేడర్‌ టీడీపీ సొంతం.

రేపటి కోసం సైన్యాన్ని సిద్ధం చేసే వర్క్‌షాప్‌.

చంద్రబాబు అనుభవం, లోకేష్‌ యువ నాయకత్వం, ఎన్టీఆర్‌ ఆశీర్వాదాలతో భవిష్యత్తు టీడీపీదే : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్

01/12/2025

ఢిల్లీ పేలుడు కేసు..

షాహిన్ నివాసంలో NIA సోదాలు ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో భాగస్వామి అయిన డాక్టర్ షాహిన్‌కు సంబంధించిన వివిధ ప్రదేశాల్లో సోదాలు తాజాగా లక్నోలోని షాహిన్ నివాసంపై దాడులు

ఆమె కుటుంబ సభ్యులను విచారిస్తున్న NIA అధికారులు షాహిన్ నివాసంలో లభ్యమైన పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

01/12/2025

అనంతపురం : ఏ.ఆర్‌.కానిస్టేబుల్‌ ప్రకాష్‌ను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించిన ప్రభుత్వం.

వైసీపీ ప్రభుత్వంలో విధుల నుంచి ఏ.ఆర్‌.కానిస్టేబుల్‌ ప్రకాష్‌ తొలగింపు.

డీజీపీ కార్యాలయం నుంచి ఆర్డర్స్‌ తీసుకుని ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ప్రకాష్‌.. అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్‌ ఆధ్వర్యంలో విధుల్లో చేరనున్న ప్రకాష్‌.

పోలీసులకు రావాల్సిన బకాయిలపై వైసీపీ హయాంలో ధర్నా చేపట్టి ప్రశ్నించిన ప్రకాష్‌.

క్రమశిక్షణా రాహిత్యం కింద వైసీపీ ప్రభుత్వంలో ప్రకాష్‌ను విధుల నుంచి తొలగించిన పోలీసు శాఖ.

తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఏ.ఆర్‌.కానిస్టేబుల్‌ ప్రకాష్‌.

01/12/2025

అమరావతి : జిల్లాలో పరిశ్రమలు రావాలి, కుటుంబానికో పారిశ్రామికవేత్త రావాలి.

వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూనే పరిశ్రమలు తీసుకొస్తాం.

కొల్లేరు సరస్సు సమస్యకు పరిష్కారం చూపుతాం.. 2027కి పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేస్తాం.

రైతులు బాగుండాలి.. వారి జీవితాల్లో వెలుగు రావాలి.

రైతుల ఆదాయం పెంచేందుకు పంచసూత్రాలు అమలుచేస్తున్నాం.

సమీకృత వ్యవసాయ విధానంతో ఆరోగ్యం, ఆదాయం మెరుగవుతాయి : సీఎం చంద్రబాబు

01/12/2025

మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్‌ సమంత.

‘ఫ్యామిలీ మ్యాన్‌’ సినిమా డైరెక్టర్‌ రాజ్‌ నిడిమోరుతో సమంత వివాహం.. కోయంబత్తూరులోని ఓ ఆశ్రమంలో సన్నిహితుల మధ్య పెళ్లి.

కొన్నాళ్లుగా సమంత, డైరెక్టర్‌ రాజ్‌ నిడిమోరు మధ్య ప్రేమ వ్యవహారం.

రాజ్‌ నిడిమోరు మాజీ భార్య శ్యామాలి పోస్ట్‌ వైరల్‌.. తెగించిన వాళ్ల పనులు దానికి తగ్గట్టే ఉంటాయంటూ శ్యామాలి పోస్ట్‌.

01/12/2025

నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేష్..

సాయంత్రం అమరావతి నుంచి ఢిల్లీ బయల్దేరనున్న మంత్రి లోకేష్..

రేపు పార్లమెంట్ హౌస్‌లో పార్టీ ఎంపీలతో కలిసి కేంద్రమంత్రులతో లోకేష్ భేటీలు..

మెంథా తుపాను నష్టపరిహారంపై కేంద్రమంత్రి అమిత్‍షాను కలవనున్న లోకేష్..

రాష్ట్రానికి పెండింగ్ అంశాలపై ఎంపీలతో కలిసి కేంద్రమంత్రులతో లోకేష్ భేటీలు..

మంత్రి లోకేష్‍తో పాటు ఢిల్లీ పర్యటనకు హోంమంత్రి అనిత..

రేపు సాయంత్రం ఢిల్లీ నుంచి అమరావతి రానున్న లోకేష్..

Address

Hyderabad
500038

Website

Alerts

Be the first to know and let us send you an email when Neti Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share