06/09/2026
‘‘చిన్నప్పటి నుంచి రవితేజ గారిని చూస్తూనే పెరిగాను. ఆయన నాకు పెదనాన్న కాదు.. ఒక అన్నయ్య. నా మొదటి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఆయన రావడం చాలా ఆనందంగా ఉంది’’ అని యంగ్ హీరో మాధవ్ అన్నారు.
రవితేజ సోదరుడు రఘు కుమారుడైన మాధవ్ ‘మారెమ్మ’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. సినిమా ట్రైలర్, టీజర్‌కు వచ్చినట్లే ప్రేక్షకుల నుంచి సినిమాకూ మంచి ఆదరణ వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇందులో హ్యూమన్ ఎమోషన్స్‌తో పాటు క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంటుందని తెలిపారు. దర్శకుడు మంచాల నాగరాజ్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. సెప్టెంబర్ 10న థియేటర్లలో కలుద్దాం.. జై మారెమ్మ అంటూ మాధవ్ తన స్పీచ్ ముగించారు.