
27/07/2024
బిగ్ బాస్ సీజన్ 8 లోకి యాంకర్ స్వప్న చౌదరి..??
స్వప్న చౌదరి అమ్మినేని , ఈ పేరు వినగానే పక్కా ఈ తెలుగింటి అమ్మాయి అందరికి గుర్తుకు వస్తుంది.. బిగ్ బాస్ సీజన్ 7 తరువాత బిగ్ బాస్ పేరిట మోసం చేసిన
తమ్మాలి రాజు అనే వ్యక్తి గురించి న్యూస్ లో హాట్ టాపిక్ అవ్వడం , రాజు స్వప్న దగ్గరే కాకుండా చాలా మంది దగ్గర పలు పలు రకాల మాటలు చెప్పి డబ్బులు వసూలు చేసి జైలు పాలు కూడా అవ్వడం, ఆ ఇష్యు గురించి అందరికి తెలిసినదే..అన్యాయం చేసిన రాజు ని పోలీసులకి సాక్షాలతో
పట్టించిన స్వప్న ని నాలుగు నెలల క్రితం
సోషల్ మీడియా లో పొగడ్తలతో ముంచెత్తారు.
మళ్ళీ సీజన్ 8 స్టార్ట్ అయ్యే సరికి మరొక సారి ఈ నటి, యాంకర్ వెలుగులోకి వచ్చింది. ఈ సారి సీజన్ 8 కి పక్కా స్వప్న చౌదరి వెళ్తుందా, వెళ్ళాలి అని సోషల్ మీడియా వేదిక గా కోరుకుంటున్నారు.
అసలు సీజన్ 8 కి స్వప్న చౌదరి వెళ్తున్నట్లు, బిగ్ బాస్ టీం తో ముచ్చట్లు జరుగుతున్నట్లు తన స్నేహితులు చెబుతున్నారు.