07/07/2025
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సబ్బండ వర్గాలకు పనిచేస్తుంది: ఎమ్మార్పీఎస్
జగద్గిరిగుట్ట:- బడుగు బలహీన వర్గాల కు అండగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పనిచేస్తుందని ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు. సోమవారం కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జగద్గిరిగుట్ట డివిజన్ బస్టాండ్ ప్రాంతంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకొని ఎమ్మార్పీఎస్ జెండాను ఆర్టీసీ విభాగం మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ వల్లూరి బాబు మాదిగ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్న రిజర్వేషన్లను పంచుకోవడమే కాకుండా రిజర్వేషన్లను పెంచుకోవడానికి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ కేవలం మాదిగ కులానికే కాకుండా సబ్బండ వర్గాలకు పనిచేస్తుందని తెలిపారు. ఎమ్మార్పీఎస్ కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా భారత దేశంలో అన్ని రాష్ట్రాలలో ఎమ్మార్పీఎస్ ఏర్పాటు అయిందని, దీనికంత కృషి చేసిన ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగకే దక్కుతుందని ఆయన అన్నారు. అనంతరం మాదిగ జర్నలిస్ట్ ఫోరం నాయకులు డప్పు రామస్వామి ఎర్ర యాకన్న మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈదుముడి గ్రామంలో స్థాపించిన ఎమ్మార్పీఎస్ నేడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఎమ్మార్పీఎస్ జెండా రెపరెపలాడుతుందని గుర్తు చేశారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పోరాటం వాళ్ళని ఈరోజు ఆరోగ్యశ్రీ పెన్షన్ వికలాంగులకు పెన్షన్ వితంతులకు పెన్షన్ అనేక కుటుంబాలకు సామాజిక న్యాయం జరుగుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, దళిత రత్న అవార్డు గ్రహీత బండ మహేందర్, దౌపాటి మల్లేష్, ఎర్ర వీరన్న, ఎర్ర సైదులు, అనిల్, ప్రభాకర్, చిప్పలపల్లి బాబురావు, బాబు, మాదిగ జర్నలిస్ట్ ఫోరం మేడ్చల్ జిల్లా కన్వీనర్ జోగు వెంకట్, స్వామి దాస్, రామకృష్ణ, బాలాజీ మాదిగ, దౌపాటి రమేష్, తదితరులు పాల్గొన్నారు.