07/07/2025
గత నాలుగు, ఐదు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, మెదక్, సిద్దిపేట, జనగాం, మహబూబాబాద్, యాదాద్రి జిల్లాల్లో మరి కాసేపట్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఉరుములు, పిడుగుల వర్షం ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడొద్దని సూచిస్తున్నారు. చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. రాబోయే ఈ రెండు రోజులు అత్యవసరం అయితే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్లొద్దని అధికారులు సూచించారు.