10/02/2016
BOOK BUCKET CHALLENGE...
ఫిబ్రవరి 14.. ప్రేమికుల రోజు.. పుస్తక ప్రేమికుల రోజు కూడా..
ప్రపంచవ్యాప్తంగా 14వ తేదీని Give a Book Day/ Interntional Book Giving Day గా కూడా జరుపుకుంటారు. ఆ రోజున మనం కూడా ఓ పుస్తకాన్ని బహుమతిగా ఇద్దాం. పుస్తకాలు కొనుక్కోవడానికి స్తోమతలేని పేద విద్యార్థులకు బహుమతిగా ఇచ్చి, పుస్తకాల పట్ల, పిల్లల పట్ల మన ప్రేమను చాటుకుందాం.
అనాధ పిల్లల శరణాలయాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో వీటిని అందజేయవచ్చు. ఇలా అందజేయడంకోసం కొంత బాలసాహిత్యాన్ని సేకరించి వుంచాం. ఓసారి పరిశీలించండి.
ప్రముఖులు రచించిన మొత్తం 9 పుస్తకాల సెట్టు వెల: 107 రూపాయలు.
అందులో కథలు, స్ఫూర్తిదాయకమైన జీవిత చరిత్రలు, విజ్ఞానాన్ని పెంపొందించే అంశాలు వున్నాయి. వాటిని పిల్లలకు అందుబాటులోకి తేవడంకోసం ఫిబ్రవరి 14ని ఓ సందర్భంగా ఎంచుకోండి. మీ వీలునుబట్టి, సందర్భాన్నిబట్టి.. ఉదాహరణకు బర్త్ డే లాంటివి.. మిగతా రోజుల్లోనూ ఇవ్వవచ్చు. కనీసం పదిమంది విద్యార్థులకు ఇలా అందజేస్తే.. మీకు అదొక తీపి జ్ఞాపకంగా వుంటుంది. పిల్లల్లో పఠనాభిలాషను పెంపొందించడంలో మీ వంతు కర్తవ్యం నెరవేర్చిన వారు అవుతారు. సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాను.
ఫోన్ నెంబరు: 9000528717. కొరియర్ ద్వారా, పోస్టల్ ద్వారా, ఎఎన్ఎల్ పార్సిల్ ద్వారా.. మీకు అనుకూలమైన పద్ధతిలో పుస్తకాలు పంపగలం.
పుస్తకాల వివరాలు:
1. బాలదీపికలు (రచన: నాయని రమాదేవి, వెల: రూ.12),
2. రాణి రుద్రమదేవి (పింగళి పార్వతీప్రసాద్, వెల: 11)
3. ఫిడేలు నాయుడుగారు (పాలగుమ్మి విశ్వనాధం, వెల: 18),
4. ప్రముఖ వాగ్గేయకారులు (జి.కృష్ణ, వెల: 12),
5. బంగారు కుందేలు (డాక్టర్ రావూరి భరద్వాజ, వెల: 12),
6. పుష్కర నదులు (గోవాడ సత్యారావు, వెల: 12),
7. జాతీయ విషయాలపై నెహ్రూ భావనలు (ఎన్.ఎన్.చటర్జీ, వెల: 5),
8. ప్రపంచ క్రీడారంగంలో భారతదేశం (కొండుభట్ల రామచంద్రమూర్తి, వెల: 15),
9. జూడీ లక్ష్మీ (1962 నాటి భారతదేశ పరిస్థితులను వివరించే నవల- నయోమీ మిచిసన్, వెల: 10).
మీరు మీ ప్రియమైన వారికి పుస్తకాలు అందజేస్తున్న ఫోటోలను ముఖపుస్తకంలో జతచేస్తే మేమూ ఆనందిస్తాం. అభినందిస్తాం.
“Long Live International Book Giving Day”