16/04/2026
తాలు పేరుతో రైతు వడ్లలో 40 బస్తాలు కోత పెట్టిన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. కనగల్ మండలం జి. ఎడవెల్లి గ్రామానికి చెందిన రైతు సైదులు, ఐకేపీ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. వడ్లను తీసుకెళ్లిన తర్వాత కోత పెడుతున్నామని చెప్పడం, మిగిలిన 60 సంచులను తీసుకోకపోవడం అన్యాయమని వాపోయాడు.