Mana Vote

Mana Vote Website
www.manavote.com coming shortly

Om Namo NARAYANAYA..
15/08/2013

Om Namo NARAYANAYA..

Dear Friends,I wish you all a very happy Independence day.
15/08/2013

Dear Friends,
I wish you all a very happy Independence day.

15/08/2013
10/08/2013

హాయ్ ఫ్రెండ్స్:
మూడు ప్రాంతాల ప్రజలతో అభివ్రుద్ధి చెందిన మన రాజధాని హైదరాబాద్, తెలంగాన వరకే చెందాలి అని అనడాన్ని మీరు సమర్థిస్తారా?
1) YES
2) NO

09/08/2013

బాబు బేష్..!

తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడిని పలువురు అభినందిస్తున్నారు. తెలంగాణపై కాంగ్రెస్ పలుమార్లు తలాతోకలేని ప్రకటనలు చేయడం.. మళ్లీ వెనక్కు తగ్గడం వంటివి చేస్తుందని ఆ పార్టీకి చెందిన నేతలే అంగీకరిస్తున్నారు. అయితే, చంద్రబాబు అలా కాదని.. విభజన విషయంలో బాబు ఒక స్టాండ్ పై నిల్చున్నారని నేతలు అంటున్నారు. బాబుకు గల స్పష్టతను ఇటు తెలంగాణ నేతలతో పాటుగా, సీమాంధ్ర నేతలు కూడా అభినందిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజాప్రయోజనాలే ముఖ్యమని బాబు పేర్కొనడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విభజన జరిగితే పార్టీకి నష్టం వాటిలుతోందని.. తెలంగాణపై స్టాండ్ మార్చుకోవాలని కొందమంది సూచించినప్పటికినీ.. బాబు తిరస్కరించారని తెలుస్తోంది. తెలంగాణపై పార్టీ ఓ నిర్ణయం తీసుకుందని ఇక వెనక్కు వెళ్లే పరిస్థితి లేదని బాబు స్పష్టం చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత గుత్తాసుఖేందర్ రెడ్డి అభినందించారు. ప్రత్యేక తెలంగాణపై ప్రకటన చేసిన కాంగ్రెస్ అధిష్టానం మాటనే కాంగ్రెస్ నేతలు వినే పరిస్థితి లేదు.. అంతేకాకుండా కేంద్రం తాను చేసిన ప్రకటనను అమలు చేయడానికే ధైర్యం చేయలేకపోతుంది. ఇలాంటి క్లిష్టమైన సమస్యపై ఓ స్టాండ్ తీసుకోవడమే కాకుండా… ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ స్టాండ్ కట్టుబడి వుంటామని బాబు ప్రకటించడం నిజంగా అభినందించాల్సిన విషయమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

09/08/2013

సొమ్మసిల్లిన సిఎం రమేష్

మా ప్రాంత ప్రయోజనాలు కాపాడాలంటూ టిడిపి సభ్యులు నాలుగు రోజులుగా పార్లమెంటు ఉభయ సభల్లో నిరసన తెలియజేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ రాజ్యసభలో సొమ్మసిల్లి పడిపోయారు. ఆంధ్ర ప్రదేశ్‌ను కాపాడాలని, తమ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని సిఎం రమేష్, సుజనా చౌదరిలు రాజ్యసభలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టి వెల్‌లోకి చొచ్చుకుపోయారు.నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సమయంలో సిఎం రమేష్ సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో డిప్యూటీ చైర్మన్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.

09/08/2013

స్పష్టత తర్వాతే విభజన..!

రాష్ట్ర విభజనపై ఎట్టకేలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. విభజన జరగకుండా ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించి.. అధిష్టానం నిర్ణయంతో అలకబూనిన సీఎం ఇవాళ సచివాలయంలో మనసు విప్పి సుధీర్గ్ఘంగా మాట్లాడారు. విభజన అంశంపై స్పందించడానికి ముఖ్యమంత్రికి 9 రోజులు పట్టిందంటే.. ఆయన ఏ రేంజ్ లో హర్టయ్యారో అర్థమవుతుంది. ఇటు అధిష్టాన నిర్ణయాన్ని గౌరవిస్తున్నా అని చెబుతూనే.. అధినేత్రికి పలు ప్రశ్నలు స్పందించారు. అయితే, రాష్ట్ర విజనకు భీజం వేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డే అని స్పష్టం చేయడం విశేషం.

రాష్ట్రాన్ని విభజిస్తే సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతాయని, ఇప్పుడా సమస్యలపైనే తాము దృష్టి సారిస్తామని సీఎం చెప్పారు. కోట్లాది రైతుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీటి పంపకాల అంశమే ఇప్పుడు అందరి మధ్య ఉన్న ప్రధాన సమస్య ఆయన పేర్కొన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఆంధ్ర ప్రాంతంలో 35 లక్షల ఎకరాలు సాగుబడిలో ఉన్నాయని, విభజన అనంతరం వాటికి నీరు అందించే విషయమై స్పష్టత రావాల్సి ఉందని అన్నారు. ఇరుప్రాంతాల మధ్య నీటి పంపిణీల్లో విభేదాలు వచ్చే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

అంతకుముందు, సీమాంధ్రలో ఉద్యమం గురించి మాట్లాడుతూ.. రాష్ట్రం ఎంతో ఎత్తుకెదగాలని ఆశించిన రాజీవ్ గాంధీ, తెలుగుజాతి ఒక్కటిగా ఉండాలని ఎలుగెత్తిన ఇందిరమ్మ, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు కొమ్ముకాసిన నెహ్రూల విగ్రహాలను కూల్చడం దురదృష్ట కరం అని సీఎం అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర ఉద్యమకారులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని, మొదట్లోనే వారికి స్పష్టమైన ఆదేశాలిచ్చామని సీఎం స్పష్టం చేశారు. విభజనపై తలెత్తే ఆందోళనపై అధిష్టానం ఆంటోనీ నేతృత్వంలో కమిటీనీ ఏర్పాటు చేశామని, విద్యార్ధి సంఘాలు, ఉద్యోగ సంఘాలు.. ఇలా ఎవరైనా తమకున్న సమస్యలు సందేహాలను ఈ కమిటీకి నివేదించుకోవచ్చని సూచించారు.

రాష్ట్రంలో చాలాకాలం తర్వాత సంవృద్ధి వర్షాలు కురిశాయని, వ్యవసాయానికి అనువైన పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఈ దశలో ఉద్యోగులు సమ్మెలు చేసేందుకు సిద్ధపడటం, రైతుల సన్నద్ధతను దెబ్బతీస్తుందని కిరణ్ వివరించారు. అంతేకాకుండా.. సోమశిల, కండలేరు మినహా అన్ని ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయని, 145 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నామని.. ఇలాంటి దశలో ఉద్యోగులు ప్రభుత్వంతో సహకరించాలని కోరారు.

రాష్ట్ర విజనకు భీజం వేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డేనని.. 2002లో ఆయన ఎమ్మెల్యేలతో తెలంగాణ ఫోరం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇక టీడీపీ కూడా 2008లో తెలంగాణకు మద్దతిస్తున్నట్టు తెలిపిందని వెల్లడించారు. ఎంఐఎం, సీపీఎం పార్టీలు తప్ప మిగతా పార్టీలన్నీ విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని… తీరా ప్రకటన చేసిన తర్వాత దొంగనాటకాలకు తెరదీస్తున్నాయని సీఎం మండిపడ్డారు.

విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. తాను విభజనకు వ్యతిరేకమూ కాదు, అనుకూలమూ కాదు అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు విభజనకు నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలున్న లేఖపై తానూ సంతకం చేశానంటూ చెబుతూనే.. అది పార్టీ వ్యవహారమని సర్ది చెప్పుకొన్నారు.

మొత్తంగా ముఖ్యమంత్రి విభజనపై అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై ఆచితూచి స్పందించారు. సీమాంధ్ర ఉద్యమాన్ని సమర్థిస్తూనే.. హద్దులు దాటితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించే ప్రయత్నం చేశారు. చాలాకాలం తర్వాత సీఎం ప్రజల ముందుకు రావడంతో.. రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగిన సమైక్యవాదుల స్టార్ బ్యాట్స్ మెన్ గా మళ్లీ బ్యాటింగ్ కు దిగే అవకాశాలున్నాయి సీమాంధ్ర నేతలు తెగ సంబరపోతున్నారని సమాచారం.

09/08/2013

CM Kiran Views On CWC Decision And AP Agitations

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Mana Vote posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share