SatyaTelangana

SatyaTelangana సత్య తెలంగాణ దినపత్రిక… ప్రజాస్వామ్య మనుగడ కోసం...

రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు  తీసుకువెళ్లాలి- గుజ్జ సత్యంhttps://satyatelangana.com/all-party/        ...
24/10/2025

రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకువెళ్లాలి- గుజ్జ సత్యం

https://satyatelangana.com/all-party/

తెలంగాణలో బీసీలు దశాబ్దాలుగా సామాజిక, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయి. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయడం ...

కావేరీ బస్సు దగ్ధం ఘటనపై కేసు నమోదురమేష్ అనే ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదుతో.. 125 C/A, 106 C/1 సెక్షన్ల కింద ఉళ్లిందకొండ ...
24/10/2025

కావేరీ బస్సు దగ్ధం ఘటనపై కేసు నమోదు

రమేష్ అనే ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదుతో.. 125 C/A, 106 C/1 సెక్షన్ల కింద ఉళ్లిందకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్

ఈ ప్రమాదంలో 19 మంది బస్సులోనే చిక్కుకొని సజీవదహనం.. మిగిలిన వారికి గాయాలు అవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స

ఒక బైక్ ఢీకొన్న అనంతరం 300 మీటర్లు లాక్కెళ్లిన బస్సు.. ఆ రాపిడికి నిప్పురవ్వలు డీజెల్ ట్యాంక్‌కి తాకడంతో ప్రమాదం

ఇప్పటికే ఒక డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో డ్రైవర్ పరారీలో ఉండటంతో, అతని కోసం గాలింపు చర్యలు షురూ


జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితా ప్రకటించిన జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొ...
24/10/2025

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితా ప్రకటించిన జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 4,01,365

2,08,561 మంది పురుష.. 1,92,779 మంది మహిళా ఓటర్లు

ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2,383 మంది ఓటర్లు పెరిగారని ఆర్.వి. కర్ణన్ వెల్లడి

నేటితో ముగియనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ ఉపసంహరణ గడువుప్రధాన పార్టీలతో సహా 81 మంది నామినేషన్అందులో ఎంత మంది నా...
24/10/2025

నేటితో ముగియనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ ఉపసంహరణ గడువు

ప్రధాన పార్టీలతో సహా 81 మంది నామినేషన్

అందులో ఎంత మంది నామినేషన్ ఉపసంహరణ చేసుకుంటారనే విషయమై అధికారుల్లో ఉత్కంఠ

ఒక్కో ఈవీఎం యూనిట్‌లో 16 మందికే అవకాశం

నేడు ఫిరాయింపు ఎమ్మెల్యేలను అసెంబ్లీలో మరోసారి విచారించనున్న స్పీకర్ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్...
24/10/2025

నేడు ఫిరాయింపు ఎమ్మెల్యేలను అసెంబ్లీలో మరోసారి విచారించనున్న స్పీకర్

ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి

ఉదయం 11 గంటలకు కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ టీ ప్రకాష్ గౌడ్ కేసు విచారణ

మధ్యాహ్నం 12 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ కాలే యాదయ్య కేసు విచారణ

మధ్యాహ్నం 2 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ గూడెం మహిపాల్ రెడ్డి కేసు విచారణ

మధ్యాహ్నం 3 గంటలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేసు విచారణ

ప్రతి కేసులో స్పీకర్ ముందు మౌఖిక వాదనలు వినిపించనున్న ఇరు వర్గాలు

https://youtu.be/vYKtWbqRis4?si=v4YOc-Be6X1C7ISk
24/10/2025

https://youtu.be/vYKtWbqRis4?si=v4YOc-Be6X1C7ISk

18న బంద్ ను విజయవంతం చేయాలి - జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అక్టోబర్ 14: స్థానిక సంస్థ ల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల....

కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వస్తకొండూర్ గ్రామానికి చెందిన మహేశ్వరం అనూ...
24/10/2025

కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వస్తకొండూర్ గ్రామానికి చెందిన మహేశ్వరం అనూష రెడ్డి మృతి

బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న అనూష

దీపావళి పండుగకి ఊరికి వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో రాత్రి ఖైరతాబాద్ లో కావేరి ట్రావెల్స్ కి చెందిన బస్సు ఎక్కింది

కర్నూలు బస్సు ప్రమాదంపై స్పందించిన ప్రధాని మోదీమృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ క్షతగాత్రులు త్వరగా కోలుక...
24/10/2025

కర్నూలు బస్సు ప్రమాదంపై స్పందించిన ప్రధాని మోదీ

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మోదీ

మృతులకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా.. క్షతగాత్రులకు రూ.50 వేలు ఇవ్వనున్నట్లు తెలిపిన ప్రధాని

24/10/2025

కర్నూల్ బస్సు ప్రమాదంలో 19 మృతదేహాల గుర్తింపు

కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో దగ్ధమైన బస్సులో 19 మృతదేహాలను గుర్తించి.. వాటిని వెలికితీసిన ఫోరెన్సిక్ బృందాలు

సౌదీ అరేబియా కీలక నిర్ణయం కఫాలా వ్యవస్థను రద్దు చేసిన సౌదీ అరేబియాసౌదీ నిర్ణయంలో వలస కార్మికులకు భారీ ఊరటవలస కార్మికులపై...
23/10/2025

సౌదీ అరేబియా కీలక నిర్ణయం

కఫాలా వ్యవస్థను రద్దు చేసిన సౌదీ అరేబియా

సౌదీ నిర్ణయంలో వలస కార్మికులకు భారీ ఊరట

వలస కార్మికులపై యజమానికి హక్కులు కల్పించేదే కఫాలా

కఫాలాను అడ్డుపెట్టుకుని పని కోసం వచ్చినవారిని చిత్రహింసలు పెడుతూ వచ్చిన యజమానులు

కఫాలాపై కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు

కఫాలాను రద్దు చేయాలని సౌదీపై ఒత్తిడి తెచ్చిన భారత్

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆరోగ్య పరిస్థితి విషమం అంటూ వస్తున్న వార్తలను ఖండించిన ఆయన కుటుంబ సభ్యులు ఆయన క్షే...
23/10/2025

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆరోగ్య పరిస్థితి విషమం అంటూ వస్తున్న వార్తలను ఖండించిన ఆయన కుటుంబ సభ్యులు

ఆయన క్షేమంగానే ఉన్నారని, డాక్టర్ల సూచన మేరకు రెస్ట్ తీసుకుంటున్నారని స్పష్టం

నిన్న రాత్రి కూడా కార్యకర్తలతో మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు వెల్లడి

ప్రస్తుతం AIGలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

23/10/2025

ఇందిరమ్మ ఇండ్లకు మంజూరు చేసిన స్థలాల విషయంలో గందరగోళం

ఇందిరమ్మ ఇండ్లకు అటవీశాఖ భూమిని కేటాయించిన ప్రభుత్వం..నిర్మాణాన్ని అడ్డుకున్న అటవీశాఖ అధికారులు

లబ్ధిదారులకు అటవీ శాఖ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం మేడిపల్లి గ్రామంలో పైలెట్ ప్రాజెక్టు కింద 150 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన అధికారులు

ఇండ్ల నిర్మాణం జరిగే సమయంలో, కేటాయించిన భూములు అటవీశాఖ ఆధీనంలో ఉన్నాయంటూ నిర్మాణాన్ని అడ్డుకున్న అటవీ శాఖ అధికారులు

దీంతో లబ్ధిదారులకు అధికారులకు మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

Address

Gunfoundry
Hyderabad
500001

Alerts

Be the first to know and let us send you an email when SatyaTelangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share