08/08/2026
రూ.4 కోట్ల మోసం కేసు.. కొండపల్లి గణేష్ పై లుక్‌అవుట్ నోటీసు?
గచ్చిబౌలి మైహోమ్ భూజాలో వరుసగా రెండుసార్లు గణేష్ లడ్డూను దక్కించుకున్న కొండపల్లి గణేష్ పై లుక్‌అవుట్ నోటీసు జారీ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం..
రియల్ ఎస్టేట్, మద్యం వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయని నమ్మించి బాధితుల నుంచి రూ.4 కోట్లు వసూలు చేసి మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి..
ముందస్తు బెయిల్ నిరాకరణతో ఏప్రిల్‌లో గణేష్ పరారైనట్లు పోలీసులు తెలిపారు. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ కేసులోనూ ఆయన కోసం గాలింపు కొనసాగుతోంది..
దేశం విడిచి పారిపోకుండా లుక్‌అవుట్ నోటీసు జారీ చేసే దిశగా పోలీసులు చర్యలు చేపట్టినట్లు సమాచారం.