18/10/2025
ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ రికార్డుల్లో 'ఇతరులు' పేరుతో ఉన్న భూములకు మ్యుటేషన్లు నిలిపివేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్య చేపట్టారు. దీనివల్ల నిజమైన హక్కుదారులు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. వెబ్‌ల్యాండ్‌లో తప్పుడు నమోదులు, నిర్లక్ష్యం కారణంగా ఇలా జరిగిందనే విమర్శలు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం ఈ సమస్యలపై ఫోకస్ పెట్టి పరిష్కరించే పనిలో ఉంది.