VSB TV

VSB TV We started this page in September 2018. All the updates related to education, entertainment , social
(1)

శ్రావణ మాసంలో ఐశ్వర్యం మరియు లక్ష్మీ కటాక్షం కోసం చేసే పనులు హిందూ సంప్రదాయంలో ఆధ్యాత్మిక శ్రేయస్సును, సంపదను తెచ్చిపెడత...
25/07/2025

శ్రావణ మాసంలో ఐశ్వర్యం మరియు లక్ష్మీ కటాక్షం కోసం చేసే పనులు హిందూ సంప్రదాయంలో ఆధ్యాత్మిక శ్రేయస్సును, సంపదను తెచ్చిపెడతాయని నమ్ముతారు. ఈ మాసంలో లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా సంపద, సౌభాగ్యం లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రింది పనులు శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం కోసం చేయవచ్చు:

వరలక్ష్మీ వ్రతం:
శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం లేదా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు.
లక్ష్మీదేవిని పూజించి, వ్రత కథ వినడం లేదా చదవడం ద్వారా సంపద, సౌఖ్యం లభిస్తాయని నమ్ముతారు.
ఈ రోజున లక్ష్మీదేవి చెంబు (కలశం)ను అలంకరించి, పసుపు, కుంకుమ, పూలు, ఆభరణాలతో పూజ చేస్తారు.

మంగళగౌరీ వ్రతం:
శ్రావణ మాసంలో మంగళవారాలలో మంగళగౌరీ వ్రతం ఆచరిస్తారు.
ఈ వ్రతం లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కుటుంబ సౌఖ్యం, సంతాన ప్రాప్తి కోసం చేస్తారు.
పసుపు గౌరమ్మను తయారు చేసి, గౌరీదేవిని పూజించడం ఈ వ్రతంలో భాగం.

లక్ష్మీ పూజ:
శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడం శుభప్రదం.
లక్ష్మీ అష్టకం, శ్రీ సూక్తం, కనకధారా స్తోత్రం లక్ష్మీ సహస్ర నామాలు, లక్ష్మీ అష్టోత్తర శతనమాలు, శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతి నామాలు చేస్తూ బిల్వ పత్రాలు అర్చన చేస్తే చాలా మంచిది.
పైన పేర్కొన్న స్తోత్రాలను పఠించడం ద్వారా ఐశ్వర్యం కలుగుతుంది.
పూజలో పసుపు, కుంకుమ, తామరపుష్పాలు, బిల్వ పత్రాలు, పాలు, తేనె సమర్పించడం మంచిది.

తులసి పూజ:
శ్రావణ మాసంలో తులసి మొక్కను పూజించడం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తెస్తుంది.
ప్రతిరోజూ తులసి మొక్కకు నీరు పోసి, దీపం వెలిగించి, లక్ష్మీ స్తోత్రాలు చదవడం శుభం.

దాన ధర్మాలు:
శ్రావణ మాసంలో అన్నదానం, వస్త్రదానం, ఆహార దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
శుక్రవారాల్లో పేదలకు బియ్యం, పప్పు, నీరు లేదా స్వీట్లు దానం చేయడం మంచిది.

శుక్రవార ఉపవాసం:
శుక్రవారాలలో ఉపవాసం చేసి, లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా సంపద, శాంతి లభిస్తాయి.
ఉపవాసం సమయంలో ఫలహారం (పండ్లు, పాలు) తీసుకోవచ్చు.

పవిత్ర స్నానం:
శ్రావణ మాసంలో ఉదయం పవిత్ర స్నానం చేసి, లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించడం లేదా ఇంటిలో పూజ చేయడం శుభప్రదం.
స్నానం సమయంలో "ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః" అనే మంత్రాన్ని జపించవచ్చు.

పుష్పాలతో అలంకరణ:
లక్ష్మీదేవికి తామర పుష్పాలు, గులాబీలు, మల్లెలు సమర్పించడం ఆమెకు ప్రీతికరం.

ఇంటిని శుభ్రంగా ఉంచి, పూలతో అలంకరించడం ఐశ్వర్యాన్ని తెస్తుంది.
ఈ పనులను శ్రద్ధగా, భక్తితో ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం, సంపద, సౌభాగ్యం లభిస్తాయి.

💐🌼సర్వేజన సుఖినోభవంతు 🌼💐
💐హరే రామ హరే కృష్ణ 💐
💐ఓం నమః శివాయ్య💐
💐🌼జై గురుదత్త శ్రీ గురుదత్త🌼💐

నగరపాలక సంస్థ :: రాజమహేంద్రవరంది.24.07.2025*వీధులలో ఆవులు, గేదెలు సంచరించకుండా నియంత్రణ చర్యలు* *ప్రజారోగ్యం, రోడ్డు ప్ర...
25/07/2025

నగరపాలక సంస్థ :: రాజమహేంద్రవరం
ది.24.07.2025

*వీధులలో ఆవులు, గేదెలు సంచరించకుండా నియంత్రణ చర్యలు*

*ప్రజారోగ్యం, రోడ్డు ప్రమాదాల దృష్ట్యా నిర్ణయం: ఎంహెచ్ఓ వినూత్న*

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధి వీధులలో సంచరించు ఆవులు, గేదెలు, దూడలు, ఎద్దుల నియంత్రణ కొరకు ప్రజారోగ్య విభాగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పశువులను యజమానులు చుట్టుప్రక్కల నివాసితులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఆరోగ్య శాఖాధికారి వినూత్న ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. విచ్చలవిడిగా రోడ్ల మీదకు ఆవులు, ఇతర పశువులను వదలడం వల్ల వాహనాల రాకపోకలకు ఆటంకంగా, ప్రమాదాలకు కారణం అవుతున్నాయన్నారు. డివైడర్ల వద్ద గ్రీనరీ కూడా దెబ్బతింటోందని చెప్పుకొచ్చారు. పైగా నివాస గృహాల మధ్య గేదెలు/ఆవులను కట్టి ఉంచడం వల్ల పేడ, మూత్రం అక్కడే నిల్వ ఉంటూ దుర్గంధం వ్యాపిస్తోందని ఆరోగ్య శాఖాధికారి చెప్పారు. తద్వారా నగరంలో పారిశుద్ధ్యం కుంటుపడటంతో పాటు.. చుట్టుప్రక్కల వారికి అసౌకర్యంగా, అనారోగ్యంగా మారుతుందన్నారు. కావున పశు యజమానులు ఆవులు/ గేదెలను రోడ్లపైకి రాకుండా చూడాలని.. నిబంధనలు అతిక్రమించిన యజమానులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. అలాగే వార్డు సచివాలయాల శానిటేషన్ సెక్రటరీలు తమ తమ సచివాలయాల పరిధిలో రోడ్లపైకి ఆవులు/ గేదెలు తిరగకుండా కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సూచించారు.

*జారీ చేసిన వారు: పీఆర్ఓ, రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్*

నగరపాలక సంస్థ :: రాజమహేంద్రవరంది.24.07.2025*అన్నా క్యాంటీన్ ను తనిఖీ చేసిన అడిషినల్ కమిషనర్*నగరంలోని అన్నా క్యాంటీన్ల‌లో...
25/07/2025

నగరపాలక సంస్థ :: రాజమహేంద్రవరం
ది.24.07.2025

*అన్నా క్యాంటీన్ ను తనిఖీ చేసిన అడిషినల్ కమిషనర్*

నగరంలోని అన్నా క్యాంటీన్ల‌లో నిర్వ‌హ‌ణ ప‌రంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు అడిషినల్ కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్ తెలిపారు. గురువారం శేషయ్య మెట్ట అన్నా క్యాంటీన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజన పదార్థాలు రుచిగా ఉంటున్నాయా లేదా.? అక్కడికి వచ్చిన వారిని ఆరా తీశారు. పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం 5 రూపాయలకే అల్పాహారం, భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. అనంతరం సాంబార్‌, ఉప్మా, ఇడ్లీ నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారమే భోజన పదార్థాలు ఉండేలా చూడాలని.. సమయపాలన తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి సూచించారు. క్యాంటీన్ పరిసరాలలో స్వచ్ఛత, వడ్డించే ప్రాంతం, చేతులు కడుగు ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్వో వాటర్ ఫిల్టర్ ను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలని.. వేడి నీళ్లలోనే పాత్రలు, ప్లేట్లు కడగాలన్నారు. అలాగే ప్రతిరోజూ అన్న క్యాంటీన్లను పరిశీలించి, ఏ మరమ్మతులు ఉన్నా వెంటనే చేయించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా భోజన అనంతరం వ్యర్థాలను బిన్ లలో వేయవలసిందిగా సూచించారు.

*జారీ చేసిన వారు: పీఆర్ఓ, రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్*

సహజంగా…మనం పట్టించుకోవాల్సిన…           సోషల్ రూల్స్..!            ➖➖➖✍️ *1.* ఏవరికైన  రెండు సార్లకు మించి అదేపనిగా కాల్...
25/07/2025

సహజంగా…మనం పట్టించుకోవాల్సిన…
సోషల్ రూల్స్..!
➖➖➖✍️

*1.* ఏవరికైన రెండు సార్లకు మించి అదేపనిగా కాల్ చేయవద్దు.
వారు సమాధానం ఇవ్వకపోతే, వారికి వేరే చాలా ముఖ్యమైన పని ఉందని అర్థం.
(కొంతమంది ఫోను ఎత్తేవరకూ మళ్ళీమళ్ళీ, మళ్ళీమళ్ళీ ఫోన్ చేస్తూనే ఉంటారు)

*2.* అవతలి వ్యక్తి అడగక ముందే మీరు అరువు తీసుకున్న డబ్బును వారికి తిరిగి ఇవ్వండి.
అది ఎంతచిన్న మొత్తమైనాసరే!
అది మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది!

*3.* ఎవరైనా మీకోసం పార్టీ ఇస్తున్నప్పుడు మెనూ లో ఖరీదైన వంటలను ఎప్పుడూ మీరు ఆర్డర్ చేయవద్దు.
వీలైతే మీ కోసం వారినే ఆహారాన్ని ఎంపిక చేయమని వారిని అడగండి.

*4.* "మీకు ఇంకా వివాహం కాలేదా?
మీకు పిల్లలు లేరా? ఎందుకు మీరు ఇల్లు కొనలేదు?"
వంటి ఇబ్బందికరమైన ప్రశ్నలను ఎదుటివారిని అడగవద్దు.
అవి వారి సమస్యలు!
మీవి కావు!!

*5.* మీ వెనుక ఉన్న వ్యక్తికి ఎల్లప్పుడూ మీరే తలుపు తెరిచి లోపలికి ఆహ్వానించండి.
అమ్మాయి, అబ్బాయి, చిన్నా, పెద్దా, ఎవరైనా సరే, ఒకరిపట్ల మంచిగా ప్రవర్తించడం ద్వారా మీరు చిన్నగా మారరు.

*6.* మీరు ఎవరితోనైనా వేళాకోళంగా సరదాగా మాట్లాడుతున్నప్పుడు, దాన్ని వారు సరదాగా తీసుకోపోతే వెంటనే దాన్ని ఆపివేయండి!
మరలా చేయవద్దు.

*7.* బహిరంగంగా ప్రశంసించండి,
ప్రైవేటుగా విమర్శించండి.

*8.* ఒకరి బరువు గురించి మీరు ఎప్పుడూ వ్యాఖ్యానించవద్దు.
“మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు”
అని చెప్పండి.
అప్పుడు బరువు తగ్గడం గురించి మాట్లాడాలనుకుంటే, వారే మాట్లాడుతారు.

*9.* ఎవరైనా వారి ఫోన్‌లో మీకు ఫోటో చూపించినప్పుడు, అదొక్కటే చూడండి.
ఎడమ లేదా కుడి వైపుకు స్వైప్ చేయవద్దు.
తర్వాత ఏముంటాయో మీకు తెలియదు కదా!

*10.* మీరు ఒక సీ.ఈ.ఓ. తో ఎట్లా వ్యవహరిస్తారో అదే గౌరవంతో క్లీనర్‌తో కూడా వ్యవహరించండి.
మీ క్రింది వారిని గౌరవంగా చూస్తే ప్రజలు ఖచ్చితంగా దాన్ని గమనిస్తారు.

*11.* మిమ్మల్ని అడిగే వరకు ఎప్పుడూ సలహా ఇవ్వకండి.

*12.* సంబంధంలేని వారికి మీ ప్రణాళికల గురించి చెప్పవద్దు.

*13.* ఒక స్నేహితుడు/సహోద్యోగి మీకు ఆహారాన్ని ఆఫర్ చేసినప్పుడు మర్యాదగా 'నో ’ చెప్పండి. కానీ, రుచి లేదా వాసన చూసిన తర్వాత 'నో ' చెప్పవద్దు.
అట్లా చేస్తే మీరు వారిని అవమానించినట్లే!

*14.* మరో ముఖ్య విషయం!
ఇతరుల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోకుండా, మీ పనేదో మీరు చూసుకోండి!!

చివరిది , అతి ముఖ్యమైనది :

*15.* ఇలా ఎవరైనా సలహాలు ఇస్తుంటే, వీడేంటి ఉచిత సలహాలు ఇస్తున్నాడు వీడికి పనిపాటా లేదా అనుకోవడం కాకుండా, వారికి కాస్త సమయం కేటాయించి వారు చెప్పేది విని , నచ్చితే పాటించడం, నచ్చకపోతే వదిలెయ్యడం చేయండి.
అంతేకానీ వారిని తక్కువగా చూడకూడదు!
వారు ఎవరైనా సరే..
పెద్దవారైన, చిన్నవారైన....సర్వం శ్రీకృష్ణార్పణమస్తు...లోకా సమస్తా సుఖినోభవన్తు...!

సేకరణ పోస్ట్

శ్రావ‌ణ మాస ప్రాముఖ్య‌త‌..చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో చైత్రం లగాయత్తు చూస్తే, శ్రావణమాసం ఐదవ మాసం. పూర్ణిమనాదడు చం...
25/07/2025

శ్రావ‌ణ మాస ప్రాముఖ్య‌త‌..
చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో చైత్రం లగాయత్తు చూస్తే, శ్రావణమాసం ఐదవ మాసం. పూర్ణిమనాదడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక దీనికి శ్రావణ మాసం అని పేరు. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణమాసంలో శ్రీమహావిష్ణువుకు చేసే పూజలు అనంత పుణ్యములను ఇస్తాయి. లక్ష్మీ దేవికి ఇష్టమైన ఈ నెలలో రోజూ ఉదయం, సాయంత్రం మహిళలు దీపారాధన చేస్తే దీర్ఘసుమంగళీయోగం, అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు. తిథులతో సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పండుగలు, పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మాసం ఇదే. శ్రావణ మాసం అంటే శుభమాసం. దీనిని నభో మాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్ధం.
అత్యంత పవిత్రంగా భావించే శ్రావణమాసంలో ఇల్లు, ఆలయాలు భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. వివాహాలు, నోములు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలతో సందడిగా ఉంటుంది. ఈ మాసంలోని ప్రతి శుక్రవారం మహిళలు మహాలక్ష్మిలా అలంకరించుకుని తమకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని సముద్ర తనయకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
పురాణాల ప్రకారం పాలసముద్ర మథనంలో ఉద్భవించిన హలాహలాన్ని పరమ శివుడు శ్రావణమాసంలోనే సేవించి నీలకంఠుడిగా లోకాన్ని ఉద్ధరించాడు. ఈ మాసంలో ఒక్కోరోజు ఒక్కో దేవతను పూజిస్తారు. సోమవారాల్లో శివుడికి అభిషేకాలు, మంగళవారం గౌరీ వ్రతం, బుధవారం విఠలుడికి పూజలు, గురువారం గురుదేవుని ఆరాధన, శుక్రవారం లక్ష్మీ, తులసి పూజలు, శనివారం హనుమంతుడు, వేంకటేశ్వరుడు, శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. వీటితోపాటు గరుడ పంచమి, పుత్రదైకాదశి, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, రుషి పంచమి, గోవత్సబహుళ, సీతల సప్తమి, శ్రీకృష్ణాష్టమి, పోలాల అమావాస్య లాంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి.
నిత్యం ఆధ్యాత్మిక ధార్మిక పరిమళాలతో భక్తకోటి పునీతమయ్యే పరమ పవిత్ర మాసం శ్రావణమాసం ఎన్నో విశిష్టతల సమాహారం. సౌభాగ్యం, సౌశీల్యం, కుటుంబ శ్రేయస్సు, సుఖసంతోషాల కోసం వ్రతాలు ఆచరించే మాసం. “శ్రావణమాసంలో చేసే పూజాది సత్కర్మలు అనంతమైన ఫలితాన్నిస్తాయి” అని సాక్షాత్తూ ఈశ్వరునిచే శ్రావణమాస మహిమ కీర్తించబడింది. స్త్రీలకు అత్యంత పవిత్రమైనదీ మాసం. ఆధ్యాత్మికంగాను, సామాజికంగాను ప్రత్యేకతను సంతరించు కున్న మాసం శ్రావణమాసం. పేరులోని శృతికి ఇంపైన ఈ మాసంలో మానవులు తరించడానికి కావలసిన పర్వాలన్నీ నిండి ఉన్నాయి.
స్థితికారకుడైన శ్రీమహావిష్ణువు దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు అనేక పర్యాయాలు అవతరించాడు. ఒక్కొక్క మారు ఒక్కొక్క రూపం. చేయవలసిన కార్యాన్నిబట్టి, ఆయా కాలాలకు తగిన ధర్మాన్నిబట్టి స్వామి వివిధ రూపాల్లో అవతరిస్తుంటాడు. నిరాకార, నిర్గుణ పరబ్రహ్మ ఒక రూపాన్ని అవతరించడమే అవతారం. ఈ అవతారాలలో కొన్ని లీలావతారాలు, కొన్ని అంశావతారాలు, మరికొన్ని పూర్ణావతారాలు.
ఈ అవతారాలలో తెలిసి నవి, తెలియనివి మరెన్నో ఉన్నాయి. ఎక్కువ మందికి తెలియని అవతారాలలో ఒకటి హయగ్రీవ అవతారం. విష్ణుమూర్తి హయ గ్రీవునిగా అవతరించిన ఈ రోజున ఆయనను ఆరాధించినట్టయితే విద్యాభివృద్ధి కలుగుతుంది. ఎందువలననగా విద్యను ప్రసాదించే గురువుగా హయగ్రీవుని ఆరాధిస్తూ ఉంటారు. ఈ స్వామిని శివపరంగా కొలిచిన 'దక్షిణామూర్తి' అని, దేవీపరంగా ఉపాసిస్తే 'శారదామూర్తి' అని చెబుతూ ఉంటారని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. అని అభిఏ విద్యకైనా ఫలం జ్ఞానం ఆనందం. ఈ రెండింటి కలయికే హయగ్రీవమూర్తి.
శూన్యమాస మైన తర్వాత వచ్చే శ్రావణమాసం కోసం పెళ్లీడు పిల్లలు ,పెళ్ళైన కొత్త దంపతులు ఆత్రంగా ఎదురు చూస్తుంటారు .శ్రవణా నక్షత్రం పౌర్ణమి నాడు వచ్చేదికనుక శ్రావణం . మండే ఎండాకాలమైన గ్రీష్మ ఋతువు ,వెళ్లి చల్లబరచే వర్ష ఋతువు ప్రవేశించి ఉపశమనం కలిగిస్తుంది .పంటలు వేసేకాలం .భూమి ఆకుపచ్చ చీర కట్టుకొని ముచ్చటగా దర్శనమిచ్చి మనశ్శాంతి కల్గిస్తుంది .వర్షాలు విపరీతంగా కురిసి నదులన్నీ నిండు గర్భిణీ స్త్రీలు లాగా నిండుగా ప్రవహిస్తాయి . శ్రావణ మంగళవారాలలో స్త్రీలు మంగళ గౌరీ నోము నోస్తారు . .ప్రతి శుక్రవారం పవిత్రమైందే .రెండవ శుక్రవారం అంటే పౌర్ణమి ము౦దు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం .ముత్తైదువలు అత్యంత భక్తీ శ్రద్ధలతో దీర్ఘ సౌమాంగల్యం కోసం అమ్మవారిని పూజిస్తారు ..కొబ్బరి కాయకు పసుపు కు౦కుమపెట్టి కలశంపై ఉంచి పైన రవికముక్కను అందంగా అలంకరించి అమ్మవారికి కళ్ళూ ముక్కు చెవులు నోరు ఏర్పరచి ,ఆభరణాలు తొడిగి ,పుష్పహారాలతో శోభిల్లజేసి తమ ఇంట లక్ష్మీదేవి వెలసినట్లు పరవశిస్తారు .అమ్మవారిని ఈ రకంగా చూసి మురిసిపోయి ధన్యులవుతారు .
ఈ మాసంలో రవి సంచరించే నక్షత్రాల ప్రభావం చంద్రుని మూలంగా మన మీద ప్రభావం చూపుతాయి. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించి, మంచి కలిగించడానికి, ధర్మాచరణాలను పండుగగా ఆచరించడం నియమం. మనస్సు మీద మంచి ప్రభావం ప్రసరించి పరమార్ధం వైపు మళ్లించి మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వల్ల కలిగే అస్తవ్యస్త అనారోగ్యాల నుంచి తప్పించుకోవడానికి, మంచి ఆరోగ్యాన్ని పొందడమే శ్రావణ మాసంలో వచ్చే పండుగలలోని ఆచారాల ముఖ్యోద్దేశం.

*🙏కనకధారా స్తోత్రం 🙏*వివరణ:1. జగద్గురువులైన శ్రీ ఆది శంకరుల అవతారంలో ప్రప్రథమంగా సన్యాసాశ్రమం తీసుకోకముందే బ్రహ్మచారిగా ...
25/07/2025

*🙏కనకధారా స్తోత్రం 🙏*
వివరణ:

1. జగద్గురువులైన శ్రీ ఆది శంకరుల అవతారంలో ప్రప్రథమంగా సన్యాసాశ్రమం తీసుకోకముందే బ్రహ్మచారిగా ఉన్నప్పడే లోకోద్ధరణకై చేసిన గొప్ప స్తోత్రమిది. ఈ స్తోత్రం అతి సులభంగా అందరూ పఠించే విధంగా తేలికైన శ్లోకాలతో ఈ స్తోత్రాన్ని ఇచ్చారు. ఈ స్తోత్రాన్ని లోకానికిచ్చేనాటికి వారు అతి చిన్నవారు కానీ అప్పటికే వారు సకల శాస్త్రాలనూ అవగతం చేసుకున్నారు... అలా అనడంకన్నా వారికి జన్మతః వచ్చినవి కాదు కాదు జన్మతః ఉన్నవే అంటే సరిగా కుదురుతుందేమో.

ఈ స్తోత్రం శ్రీ శంకరులు సన్యాసం తీసుకున్నాక ఇవ్వకూడదు కాబట్టి దానికి పూర్వమే ఇచ్చారు. ఎందుకంటే ఒకసారి సన్యాసం తీసుకున్నాక ఇక ఎవరూ సన్యాసిని లౌకిక కోరికలు కోరకూడదు కోరినా ఆ కోరికలని ఆ సన్యాసి భగవత్పరం చేయాలి ప్రయత్నపూర్వకంగా కోరికలు తీర్చే స్తోత్రాదులు వగైరాలు ఇవ్వడం అంత కుదరని పని. కాబట్టే సన్యాసాశ్రమానికి ముందే ఇచ్చారు. మరి బ్రహ్మచారిగదా బ్రహ్మచారికి ఇటువంటి స్తోత్రాలతో పని ఏముంది అని సందేహం రావచ్చు. బ్రహ్మచారి దానమిచ్చిన వారిని ఆశీర్వదించవచ్చు. బీద బ్రాహ్మణి వద్ద భిక్ష తీసుకున్న తరవాత, లక్ష్మీదేవిని ముగురమ్మల మూలపుటమ్మ గా స్తోత్రం చేసి తన ఆశీర్వాదంగా లక్ష్మీ అనుగ్రహం కలిగేటట్టు దీవించారు. ఈ స్తోత్రం ద్వారా మనకు శ్రేయోభివృద్ధి కలగడానికున్న అడ్డంకులని తొలగతోసుకుని సంసారాన్ని నడపడానికి, దాటడానికి కావలసినవి సమకూర్చుకోడానికి మన జాతికి వారు పెట్టిన భిక్ష ఈ స్తోత్రం.

ఈ శ్లోకాలు అప్పడెప్పుడో రెండు వేల ఏళ్ళకి పూర్వం జరిగిన కనకధార మనకెలా పనికొస్తుంది అంటే, అప్పుడు వారు చేసిన స్తోత్రంలో బ్రాహ్మణి పేరుకాని ఆయన పేరు కాని పెట్టకుండా ఎవరు చదివినా వారే స్తోత్రం చేసినట్టు అన్వయమయ్యేలా స్తోత్రం చేయడం శంకరుల ప్రఙ్ఞ, కాదు వారి ప్రజ్ఞకి తాఖీదులివ్వడానికి మనమెంత. అది వారి అపార కరుణతో కూడిన పరమాన్నపు బిక్ష.

ఇది కేవలం ధనాపేక్షకొరకు మాత్రమే చేయవలసిన స్తోత్రమా? ఇతరులు మోక్షాపేక్ష కలిగినవారు చేయనవసరంలేదా? ముమ్మాటికీ కాదు! కేవలం ధనాపేక్ష కలిగినవారికే ఈ స్తోత్రం శంకరులు ఇస్తే వారు జగద్గురువుగా ఎలా నిలబడతారు. ఈ స్తోత్రంలో వారు పరబ్రహ్మ తత్త్వాన్ని కీర్తించారు. పరబ్రహ్మము యొక్క కారుణ్యాన్ని కీర్తించారు. ప్రారబ్ధాన్ని ఎవరూ దాటలేక దాని వల్ల కలిగిన ఆటంకంతో పుణ్యకార్యాలు చేయలేకపోతున్న వారి ప్రారబ్దాన్ని పారదోయగల స్తోత్రమిది.

అర్థకామముల నుంచి మోక్ష సామ్రాజ్యము వరకూ ఇవ్వగల స్తోత్రం కనకధార.
దురదృష్ట వంతుడిని ఉద్దరించడం కనక ధార
దురితాలని తొలగతోయడం కనకధార
ఐశ్వర్యాన్ని అనుభవైకవేద్యం చేయడం కనకధార
అమ్మ కారుణ్యానికి దగ్గర చేయడం కనకధార
పాపరాశిని ధ్వంసం చేసి మోక్షానికర్హత చేకూర్చడం కనకధార
సకల విద్యలనూ కురిపించగల మేఘం కనక ధార

*కనకధార-కామకోటి🙏

గణేశ స్తుతి / హయగ్రీవ స్తుతి :

శ్లో!! వందే వందారు మందార మిందిరానంద కందళమ్ ! అమందానంద సందోహ బంధురం సింధురాననమ్ !!

వందనము! గజముఖము తన ముఖముగా కలిగినటువంటి, నమస్కరించువారి లేదా శరణుజొచ్చు వారి పాలిట కల్ప వృక్షము వంటి వాడు, తల్లి పార్వతీదేవి ఆనందమునకు మొలక వంటి వాడు, అమితాశ్చర్యమగు మహానందమును కోరు జ్ఞానులనుద్దరించువాడు (ఇక్కడ వినాయకుని పరబ్రహ్మ తత్త్వాన్ని వర్ణించారు) ఐన ఆ విఘ్న వినాయకునికి నమస్కారము.🙏

ఇక జగద్గురువులుగా వెళ్ళవలసిన బాల శంకరులు మొట్ట మొదట ఉపదేశంగా పలికిన స్తోత్రాన్ని "వందే" అంటూ మొదలెట్టారు. నమస్కారంతో మొదలు. అంటే జగద్గురువుగా నిలబడబోయే బాల శంకరులు లోకానికి చెప్పిన మొదటి బోధ నమస్కారం చెయ్యమని చెప్పడం.

ఆ నమస్కారాన్ని శాస్త్ర విహితంగా మొదలు వినాయకునికి నమస్సుతో మొదలు చేసిన శంకరులంతవారే వినాయకునికి మొదట చేయవలసిన నమస్కారం, పూజ గురించిన విషయాన్ని సనాతన ధర్మానికి వ్యతిరిక్త కాలంలో ధృవ పరిచారు. అందరూ వినాయకునికి మొదట నమస్కారం చేయవలసినదే.

నమస్కారం అంటేఐదు పంచేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు బుద్ధిని నమస్కారం

ఎవరికి చేస్తున్నామో వారి పరం చేయడం.

నమస్కారం చేయడం అంటే వినయాన్ని ఆవిష్కరించడం.

నమస్కారం చేయడం అంటే భక్తిని ఆవిష్కరించడం

నమస్కారం చేయడం అంటే ఎదుటివారి గొప్పతనాన్ని తనలోని తక్కువతనాన్ని గుర్తించడం.
నమస్కారం చేయడం అంటే ఉద్దరించమని అర్ధించడం.. నమస్కారం చేయడం అంటే అనుగ్రహాన్ని వర్షింపచేసి ఆటంకాలని తొలగ తోయమని అడగడమే.. ఇలా చెప్తూ పోతే నమస్కారం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. (అసలు సుందరకాండలోని గమ్మత్తంతా నమస్కార ప్రభావమే. సుందరకాండలోని మలుపులన్నీ నమస్కారము, స్తుతులు చుట్టూనే తిరుగుతుంటాయి. అందుకే కాబోలు సుందరకాండ ఉపాసన చేసినవారు అంత వినయంగానూ ఉంటారు)

దీనినే ఈ క్రింది విధముగా కూడా అన్వ్యయం చేస్తారు..

తా నమస్కరించువారి కోరికలు తీర్పు (మందారమను) దేవతావృక్షము వంటివాఁడును, తన పత్నియైన శ్రీ మహాలశ్రీ దేవి యొక్క ఆనందమునకు మొలక వంటివాఁడును. పండితులు (జ్ఞానులు) అనుభవించు బ్రహ్మానందమునకు కిరీటము వంటివాఁడును అగు హయగ్రీవునికి నమస్కారము చేయుచున్నాను.

*లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ !దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ !శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ ...
25/07/2025

*లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ !
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ !
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరమ్ !
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ .
🌿🙏🌹🙏🌼🙏🌷🙏🌼🙏🌿

అరుణాచల👏*అరుణాచలం.....*గిరులపై ఆలయాలు ఉంటాయి.. కానీ ఆ పర్వతమే ఓ మహాలయం... అదే పరమ పావనం, దివ్యశోభితమైన అరుణగిరి. భక్తులు...
25/07/2025

అరుణాచల👏
*అరుణాచలం.....*

గిరులపై ఆలయాలు ఉంటాయి.. కానీ ఆ పర్వతమే ఓ మహాలయం... అదే పరమ పావనం, దివ్యశోభితమైన అరుణగిరి. భక్తులు మహాదేవుడిగా భావించినా, రమణులు ఆత్మ స్వరూపంగా దర్శించినా ఈ గిరి ఔన్నత్యం అనంతం. సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపంగా భావించి ఈ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేసేవారి సంఖ్య అసంఖ్యాకం. అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన మహా క్షేత్రం కార్తిక పౌర్ణమినాడు దేదీప్యమానంగా వెలుగుతుంది.

*ఏమిటీ అరుణాచలం...*

తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. అగ్ని లింగేశ్వరుడుగా ఆదిదేవుడు ఇక్కడ పూజలందుకుంటున్నాడు. ‘స్మరణాత్‌ అరుణాచలే’ అంటారు. అరుణాచలం అనే పేరే ఒక మహామంత్రంగా భావిస్తారు. వైష్ణవులు పరమపావనమైన ఈ కొండను సుదర్శనగిరిగా వ్యవహరిస్తారు. విష్ణువు హస్తభూషణమైన చక్రాయుధం గిరి రూపంగా భువిపై సాకారమైందని విష్ణు భక్తుల నమ్మకం. తిరువణ్ణామలై అంటే శ్రీకరమైన మహాగిరి అని అర్థం. అరుణగిరి రుణానుబంధాల్ని హరించివేస్తుందని అరుణాచల మహాత్మ్యం పేర్కొంది. స్కాంద పురాణంలోని అరుణాచల మహత్యం ఈ క్షేత్ర ప్రశస్తిని, గిరి వైభవాన్ని విశేషంగా వర్ణించింది. మహేశ్వరపురాణంలో వేద వ్యాసుడు అరుణాచల వైశిష్ట్యాన్ని విశదీకరించారు. ముక్తిగిరి, శివగిరి, ఆనందాచలం, అగ్నిగిరి, ఓంకారాచలం ఇలా ఎన్నో పేర్లు అరుణగిరికి ఉన్నాయి. ‘సూర్యుడి నుంచి కాంతిని స్వీకరించే చంద్రుడిలా ఇతర క్షేత్రాలు ఆలంబనగా చేసుకుని ఈ గిరి నుంచి పవిత్రతను అందుకుంటాయని అంటారు. అరుణాచలాన్ని దర్శిస్తే రుణాలు తీరతాయని నానుడి. ఇక్కడ రుణాలు తీరడమంటే బంధనాల నుంచి విడివడి ముక్తిమార్గం వైపు పయనించడం. కైలాసంలో ఉన్న శివమహాదేవుడు నిరంతరం తపోదీక్షలో కొనసాగుతుంటాడు. ఆయన ధ్యానానంతరం కళ్లు తెరవగానే శివుని చూపులు అరుణగిరిపై ప్రసరిస్తాయంటారు. సదాశివుని శుభమంగళ వీక్షణాలతో అరుణాచలం సదా పులకితయామినిగా పరిమళిస్తుంది. అగ్ని లింగమై పరంజ్యోతి స్వరూపుడిగా దర్శనమిచ్చే శివుడు ఈ గిరి రూపంలో విరాట్‌ రూపాన్ని సంతరించుకున్నాడు. ‘ఎవరెన్ని మార్గాల్లో సంచరించినా చివరికి అందరి గమ్యం అరుణాచలమే’ అనేది తమిళనాట జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న సందేశం.

*అప్పుడు... ఇప్పుడు... ఎప్పుడూ...*

అరుణాచలానికి యుగయుగాల ప్రశస్తి ఉంది. కృత యుగంలో దీన్ని అగ్ని పర్వతమని, త్రేతాయుగంలో స్వర్ణగిరి అని, ద్వాపరంలో తామ్ర శైలమని వ్యవహరించారు. కలియుగాన శిలాశోభితమైన గిరి ఎన్నో రహస్యాల్ని తనలో నిక్షిప్తం చేసుకుంది. అరుణాచలం 260 కోట్ల సంవత్సరాలనాటిదని ప్రఖ్యాత పురాతత్త్వ శాస్త్రవేత్త బీర్బల్‌్ సహాని నిర్థరించారు. ఈ గిరిపై ఉన్న శిలలు ఎంతో ప్రత్యేకమైనవని, ఈ కొండపై ఉన్న మట్టిలో అనేక ఔషధీగుణాలున్నాయని శాస్త్రీయంగా నిర్థరించారు. గౌతముడు, అగస్త్య మహర్షి ఈ గిరిని శోణాచలమన్నారు. 43 కోణాల్లో శ్రీచక్రాకారంలో ఉండే ఈ పర్వతం శ్రీచక్రత్తాళ్వార్‌కు స్థాణువు రూపంగా వైష్ణవాగమాలు ప్రకటించాయి. జగద్గురువు ఆది శంకరాచార్యులు ఈ కొండను మేరువు గిరి అన్నారు. భగవద్రామానుజులు అరుణాచలాన్ని మహా సాలగ్రామంగా దర్శించారు.

*|| ఓం నమః శివాయ ||*

ధనదా రతిప్రియా దేవి ఓం హూం హ్రీం హ్రీం హ్రీం ధనదా రతిప్రియా యక్షిణి ఇహగచ్ఛా మమ దారిద్ర్య నాశయ నాశయ సకల ఐశ్వర్య్ దేహి దేహ...
25/07/2025

ధనదా రతిప్రియా దేవి
ఓం హూం హ్రీం హ్రీం హ్రీం ధనదా రతిప్రియా యక్షిణి ఇహగచ్ఛా మమ దారిద్ర్య నాశయ నాశయ సకల ఐశ్వర్య్ దేహి దేహి హూం ఫట్ స్వాహా
ఈ సాధన ఖర్చు లేకుండా చేసుకునేది
వివాహం కాని యువతులు యువకులకు వెంటనే మంచి భర్త భార్య లభిస్తుంది.
ఈ అమ్మవారిని మన్మధుని భార్య రతీదేవి అంటారు
ఈ అమ్మవారిని కూడా యక్షిణి దేవత అంటారు ధనదా రతిప్రియా దేవి ఎవరైనా ఇంట్లో చేయవచ్చు ఇందులో ఎటువంటి అనుమానం అక్కరలేదు
ఏదైనా ఒక శుక్రవారం రాత్రి పూట పదిగంటలకు మొదలు పెట్టండి
పసుపు పచ్చని బట్టలు ధరించండి ఆసనం మీద కూడా పసుపు రంగు వస్త్రాన్ని పరిచి దానిమీద ధర్భాసనం పరిచి కూర్చుని ఉత్తర దిశలో శుభ్రమైన ప్రదేశములో పసుపు వస్త్రాలు పరిచి దానిమీద తామరాకు పెట్టండి తామరాకు మీద (హూం) అని కుంకుమ తో రాయండి స్వచ్చమైన నూవుల నూనె మాత్రమే వాడాలి నూవుల పప్పు నూనే కిలో నాలుగు లేదా అయిదు వందలు రూపాయలు ఉంటుంది దిక్కుమాలిన నూనె వాడితే మంచి ఫలితం లేకపొగా దుష్ఫలితాలు వస్తాయి

ఆ తర్వాత మీరు ఇంట్లో శివలింగం ఉంటే దాన్ని పూజ చేయాలి లేదా మహదేవుని ఫోటో అయిన పెట్టండి
ముందుగా గురుపూజ చేయండి
వాగర్దావివసంప్రృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతఃపితరో వందే పార్వతీ పరమేశ్వరో
నమః శివాయ
ఓం గురుః బ్రహ్మ గురుర్ విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
ఓం హ్రీం సిద్దగురో ప్రసీద హ్రీం ఓం
ఓం అపవితః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్ భ్యాం అంతరః శ్శుచిః
అని పూజా ద్రవ్యాలు మీద మీ ఇల్లు మొత్తం నీటిని చల్లండి
రామ్ చిట్టి
ఓం ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసాం కురు ఘంటా నాదం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్
అని గంటను వాయించండి
రామ్ చిట్టి
ఆ తర్వాత గణపతి పూజ
ఓం గణాణాంత్వా గణపతింగ్ హవామహే కవిమ్ కవీనా ముపమశ్రవస్తవమ్ జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనః శ్రణ్వణ్ణూతి భిస్సీద సాధనం మహా గణాధిపతయే నమః
ఓం గం గం గణపతయే నమః
వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమ ప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా
శక్తి ఉన్న వాళ్ళు ప్రతిరోజూ మిఠాయి లేదా పొంగలి నైవేద్యంగా పెట్టాలి లేని వారు కుదరని వారు కనీసం బెల్లం మరమరాలు వేయించిన శనగపప్పు నైవేద్యంగా పెట్టాలి

ఈ అమ్మవారిని పూజ చేయడం వల్ల మీరు ఆర్ధికంగా అభివృద్ధి చెందుతుంది కనుక
ధనదా రతిప్రియా యక్షిణి దేవి నాకు ప్రసన్నం అయి నాకు ఆర్ధికంగా అభివృద్ధి చెందేలా ఆశీర్దించు అని మీ అభీష్టం సంకల్ప రూపంలో చెప్పుకోవాలి
ఏదైనా స్పటిక మాల లేదా రుద్రాక్ష మాల తో జపం చేయాలి
ఓం శివాయ నమః అని ఒక జప మాల చేయండి
దాని తర్వాత అమ్మవారి మంత్రం 11 జప మాలలు చేయాలి
మళ్లీ ఓం శివాయ నమః అని ఒక జప మాల చేయండి
నలబై ఎనిమిది రోజులు దీక్ష గా చేయండి ప్రతి ఎనిమిది రోజులు కి మీకు అనుభవాలు అనుభూతులు కలుగుతాయి మీకు సమాజంలో గౌరవం లభించింది రావాల్సిన ధనం వస్తోంది అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి
సాధన చేసే వారు పదకుండు కంటే ఎక్కువ గా రోజూ రెండు వేల మూడు వేల అయిదు వేలు జపం చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువగా ఫలితాలు ఉంటాయి
మీరు పెట్టిన నైవేద్యం ప్రసాదం మీరే మొత్తం తినాలి మీ ఇంట్లో వారికి పెట్టవచ్చు కానీ బైట ఎవరికి పెట్టవద్దు
ఓం హూం హ్రీం హ్రీం హ్రీం ధనదా రతిప్రియా యక్షిణి ఇహగచ్ఛా మమ దారిద్ర్య నాశయ నాశయ సకల ఐశ్వర్య దేహి దేహి హూం ఫట్ స్వాహా...

25/07/2025
POLICE PRO, EAST GODAVARI DISTRICT. తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పి.ఎస్., గార...
24/07/2025

POLICE PRO, EAST GODAVARI DISTRICT.

తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పి.ఎస్., గారి ఆదేశాల ప్రకారము తాళ్లపూడి లోని ZP హై స్కూల్ మరియు వేగేశ్వరపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సైబర్ నేరాలు గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన తాల్లపూడి సబ్-ఇన్స్పెక్టర్ గారు మరియు జిల్లా సైబర్ ల్యాబ్ పోలీసులు.

ఈ అవగాహన సదస్సు నందు సబ్-ఇన్స్పెక్టర్ గారు శ్రీ రామ కృష్ణ గారు మరియు సైబర్ ల్యాబ్ పోలీసులు మాట్లాడుతూ...... సోషల్ మీడియా వాడడంలో జాగ్రతలు తీసుకోవాలని వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్స్టాగ్రామ్,టెలిగ్రామ్, స్నాప్చాట్, స్కైప్ లో అపరిచుతులతో చాటింగ్ చేయవద్దని, అనవసర లింక్‌లను, అప్లికేషను లను క్లిక్‌ చేయడంతో కలిగే అనర్థాలు మరియు వివిధ రకాలైన సైబర్ మోసాలు అనగా టాస్క్ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, OTP ఫ్రాడ్, JOB ఫ్రాడ్, QR CODE ఫ్రాడ్ గురించి వివరించారు.

సైబర్‌ నేరాలకు గురైనప్పుడు వెంటనే 1930 ట్రోల్‌ఫ్రీ నంబర్‌కు డయల్‌ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్ సైట్లో నమోదు చేసుకోవాలన్నారు.

ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా సైబర్ ల్యాబ్ సిబ్బంది అయిన వై వి సురేష్ గారు, శ్రీ డి. మహేష్ గారు మరియు సుమారు 400 మంది విద్యార్ధిని విద్యార్ధులు అధ్యాపకులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ప్రొబేషనరీ ఎస్సైలతో జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పి.ఎస్., గారి ఆదేశాల మేరకు  అడిషనల్ ఎస్పీలు శ్రీ ఎన్. బి.ఎం ము...
24/07/2025

ప్రొబేషనరీ ఎస్సైలతో జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పి.ఎస్., గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీలు శ్రీ ఎన్. బి.ఎం మురళీకృష్ణ ( అడ్మిన్) గారు, శ్రీ ఏ.వీ సుబ్బరాజు ( లా అండ్ ఆర్డర్) గారు, శ్రీ ఎల్. అర్జున్ (క్రైమ్స్) గారు, శ్రీ ఎల్. చెంచి రెడ్డి (AR) గారి సమావేశం... విధుల్లో ఎలా ఉండాలో దిశానిర్ధేశం చేసారు.

📌 జిల్లాకు కొత్తగా 15 మంది ప్రొబేషనరీ సబ్-ఇన్‌స్పెక్టర్లు కేటాయింపు... వీరిలో అయిదుగురు మహిళలు కాగా మిగితా వారు పురుషులు

📌 జిల్లాలో ఐదు నెలలు పాటు వివిధ విభాగాలలో శిక్షణ తీసుకోనున్న ప్రొబేషనరీ సబ్-ఇన్‌స్పెక్టర్లు

📌 పోలీసుశాఖ ప్రతిష్ట పెంచేలా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచనలు

📌 జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు గురువారం నూతన ఎస్సైలతో సమావేశం నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. క్షేత్ర స్తాయిలో ప్రజలతో ఎలా మెలగాలో మరియు పోలీసు స్టేషన్ కు వచ్చినటు వంటి భాదితుల సమస్యల పరిష్కారంలో శాస్త్ర, సాంకేతిక పద్దతులను ఉపయోగించాలని, ప్రజలలో పోలీసు శాఖపై నమ్మకాన్ని పెంపొందించే విదంగా భాధ్యతలు నిర్వర్తించమని కోరారు.

📌 మారుతున్న కాలమాన పరిస్థితులకనుగుణంగా నేర నియంత్రణ మరియు పరిశోదన ఉండాలని, ఛార్జ్ షీట్లో సాంకేతికమైన ఆధారాలను జోడించి ఎక్కువ శాతం శిక్షలు పడేలా కృషి చేయాలనీ కోరారు.

📌 క్రింది స్తాయి సిబ్బంది (PC TO SHO) యొక్క విధులను శిక్షణలో భాగంగా కొన్ని రోజుల పాటు ఉత్సాహవంతంగా పని చేసి క్షేత్ర స్థాయిలో వారు ఎదుర్కుంటున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చెయ్యాలి.

📌 విధి నిర్వహణలో వృతితో పాటు శారీరక సామర్ధ్యం మరియు కుటుంబం పై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. క్రమశిక్షణ, సమయపాలన, సేవా తత్పరత, ఉన్నతాదికారుల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటూ పోలీసు స్టేషన్ కు వచ్చే మహిళా భాదితుల పట్ల గౌరవంతో మెలగాలని మహిళలు మరియు చిన్నారులకు చెందినా కేసుల విషయంలో ఎటువంటి అలసత్వం చూపించవద్దని సూచించారు.

ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి లు శ్రీ బి. రామ కృష్ణ గారు (SB), శ్రీ T.V.R.K కుమార్ (AR) గారు, A సూపరింటెండెంట్ కృష్ణం రాజు గారు, DCRB ఇన్స్పెక్టర్ శ్రీ P.E. పవన్ కుమార్ రెడ్డి గారు, RI శ్రీ ప్. సంజీవ్ కుమార్ గారు, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ అలీ ఖాన్ గారు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when VSB TV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to VSB TV:

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share