Jeevana Surabhi

Jeevana Surabhi Jeevana Surabhi is a Complete spiritual Telugu magazine .. plz read and spread all over.. thanks

కన్నడ నేల నుంచి తెలుగు నేలపైకి గజ్జెల రవళితో కదలి వచ్చిన మంజీర నది కన్నడ సంస్కృతీ సౌరభాన్ని కూడా మోసుకొస్తుంది. 'మంజీర ప...
07/03/2016

కన్నడ నేల నుంచి తెలుగు నేలపైకి గజ్జెల రవళితో కదలి వచ్చిన మంజీర నది కన్నడ సంస్కృతీ సౌరభాన్ని కూడా మోసుకొస్తుంది. 'మంజీర పొరలినదారిలో ఇక్షుదండాలు, పారిన దారిలో అమృతభాండాలు' అని సినారె వర్ణించారు.
మెదక్‌ సమీపాన సప్తఋషుల కేశపాయలుగా చీలిన మంజీర నది వనదుర్గను ప్రదక్షిణం చేసి మరలా ఒక్కటిగా మారుతుంది. కాకతీయ సామ్రాజ్యపు సరిహద్దు దేవతగా పూజలందుకున్న వనదుర్గ భవానీ దర్శనం అనిర్వచనీయ ఆనుభూతిని కలిగిస్తుంది.

మెదక్‌ పట్టణానికి 18 కి.మీ.ల దూరంలో నాగసాని పల్లెలో ఉందీ 'ఏడుపాయల తీర్థం'. నాగసాని పల్లె దగ్గర పెద్దగుట్ట సొరంగం ఉంది. అక్కడ మంజీర నదిని గరుడ గంగ అంటారు. మంజీర ఈ ప్రదేశంలోనే ఏడు పాయలుగా చీలి ప్రవహిస్తుంది.
ముందుగా రెండు పాయలవుతుంది. ఒకదానిని వశిష్ట పాయగా, రెండోదానిని జమదగ్ని పాయగా పిలుస్తారు.
వశిష్ట నుంచి విశామిత్ర పాయ ఏర్పడుతుంది.
జమదగ్ని పాయనుంచి గౌతమ, భరద్వాజ, ఆత్రేయ, కాశ్యప అనే మరో నాలుగు పాయలు ఏర్పడతాయి.
సప్త ఋషుల పేర్లే సప్తపాయలకు ఏర్పడినాయి.
ఈ ఏడు పాయల మధ్యే పెద్ద గుట్టను ఆనుకుని వనదుర్గాదేవి అమ్మవారు వెలసింది.
వశిష్ట, విశ్వామిత్ర, గౌతమ, భరద్వాజ, పాయలు వనదుర్గ వెనకనుంచి, ఆత్రేయ, కాశ్యప, జమదగ్ని పాయలు ముందు నుంచి ప్రవహించి, కొద్ది దూరానికే మళ్లీ కలిసిపోతాయి.

కొన్ని యుగాల వెనక పరీక్షిత్తు మహారాజును తక్షకుడు కాటేయడంతో ఆగ్రహించిన జనమేజయుడు ఈ మంజీర తీరంలోనే సర్పయాగం జరిపాడు.. యాగానికి విఘ్నం కల్పించేందుకు సర్పజాతి మంజీర జలాలతో యాగస్థలాన్ని ముంచెత్తేస్తుంది. ఇప్పటికీ భూగర్భ శాస్త్రవేత్తలు పరిశోధించగా మంజీరనది అట్టడుగున బూడిద పెద్ద పరిమాణంలో దొరికిందట! 'నాగసాని పల్లె' అనే పేరుకూడా సర్పయాగంవల్లే వచ్చిందని ప్రతీతి.

సామ్రాజ్య విస్తరణలో భాగంగా కాకతీయ రాజులు వనదుర్గ అమ్మవారిని తమ సామ్రాజ్యపు సరిహద్దు దేవతగా కొలిచారు.
ఇటు దేవగిరి యాదవరాజ్యం, అటు తుగ్లక్‌ సైన్యం నుంచి కాపాడుకునేందుకు మెదక్‌లో పసుపువాగుకు సమీపంలో ఎత్తయిన కొండమీద కోటను నిర్మించారు.
12వ శతాబ్దంలో మెదక్‌ పట్టణాన్ని 'సిద్ధాపూర్‌' అనేవారు. ఈ కోటనుంచి 19 కి.మీ.దూరంలోని అడవిలో వనదుర్గ మందిరం నిర్మించారు.
12వ శతాబ్దం నుంచే శివరాత్రికి, మాఘ అమావాస్యకు, విజయదశమికి జాతరలు, ఉత్సవాలు జరపడం ఆరంభమైంది. మహాశివరాత్రి తర్వాత \బండి ఉత్సవం' నిర్వహించడం ఆనవాయితీగా మారింది.

సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత ఇంత భారీ సంఖ్యలో జనం వచ్చే జాతర అంటే ఏడుపాయల జాతరే. ఏటా దాదాపు 30 లక్షల మంది వస్తారని అంచనా.

-సూర్యపుత్ర

శివ పార్వతులిరువురికీ సమాన స్థాయి కల్పించిన దివ్యధామం. పరమేశ్వరుడు కుక్కుట రూపంలో, ఆది పరాశక్తి పీఠాధి దేవతాగా వెలసిన పు...
05/03/2016

శివ పార్వతులిరువురికీ సమాన స్థాయి కల్పించిన దివ్యధామం.
పరమేశ్వరుడు కుక్కుట రూపంలో, ఆది పరాశక్తి పీఠాధి దేవతాగా వెలసిన పుణ్యక్షేత్రం పీఠికాపురి.

తూర్పు గోదావరి జిల్లాలోని ఈ పవిత్ర స్థలం శివ పార్వతులిరువురికీ సమాన స్థాయి కల్పించిన దివ్యధామం.

సతీదేవి శరీర భాగాలలోని పీఠ భాగం ఇక్కడ పడినందున ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి.
గయాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి త్రిమూర్తులు పన్నాగం పన్నుతారు. వారి కోరికపై యాగ భూమిగా తన శరీరాన్నే ఇస్తాడు గయుడు. శిరోభాగం గయ(బీహార్)లో ఉండగా, నాభి భాగం జాజిపూర్(ఒడిషా)లో, పాద భాగం పీఠికాపురం(ఏపి) వరకు విస్తరించాయి. యాగం పరిసమాప్తమయ్యేవరకు కదలరాదని, కోడి కూతతో మేల్కొలుపుతామని త్రిమూర్తులు షరతు విధిస్తారు. సరేనంటాడు గయాసురుడు. అచంచలంగా యాగ వేదికగా మారిపోతాడు. ఏడు రోజులు నిర్విఘ్నంగా యాగం సాగిన మీదట శివుడు కుక్కుట రూపం దాల్చి కొక్కొరొకో అని కూత కూస్తాడు. దాంతో యాగం ముగిసిందన్న భావనతో గయుడు లేస్తాడు. యాగం విఘ్నమవుతుంది. విష్ణుమూర్తి కోపంతో గయాసురుడి శరీరాన్ని మూడు ముక్కలు చేస్తాడు. పాదాలున్న ప్రాంతంగా పిఠాపురం ప్రసిద్ధికెక్కింది. అందుకే దీనిని పాద గయ క్షేత్రంగా భక్తులు పూజలు చేస్తారు.

ఇక్కడి విశాలమైన కోనేరులో నీరు ఎల్లవేళలా స్వచ్ఛంగా ఉంటుంది. భక్తులు కుక్కుటేశ్వర స్వామిని, రాజరాజేశ్వరీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు.
---
పాదగయ పుష్కరిణిలో మహా శివరాత్రి పర్వదిన సందర్భంగా రమారమి ఆరు లక్షలమంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా.

ఏడవ తేదీన లింగోద్భవ కాలాభిషేకం, 8వ తేదీన రథోత్సవం, 10వ తేదీన పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు.

03/03/2016
అశ్వయుజ బహళ తదియ (nov 1) "అట్ల తద్ది"ఇది పరమేశ్వరుని భర్తగా పొదడానికి పార్వతీదేవి చేసిన వ్రతంగా పేర్కొంటారు. బహుళ విదియన...
30/10/2012

అశ్వయుజ బహళ తదియ (nov 1) "అట్ల తద్ది"

ఇది పరమేశ్వరుని భర్తగా పొదడానికి పార్వతీదేవి చేసిన వ్రతంగా పేర్కొంటారు. బహుళ విదియనాడే యువతుల చేతులు గోరింటాకుతో ఎర్రబడతాయి.

పైడితల్లి సిరిమానోత్సవంఏటా దసరా వెళ్ళిన తొలి మంగళవారం విజయనగరంలో పైడితల్లి అమ్మవారికి భారీ ఉత్సవం నిర్వహిస్తారు. ఉత్తరాం...
29/10/2012

పైడితల్లి సిరిమానోత్సవం

ఏటా దసరా వెళ్ళిన తొలి మంగళవారం విజయనగరంలో పైడితల్లి అమ్మవారికి భారీ ఉత్సవం నిర్వహిస్తారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలవారు ఈ ఉత్సవానికి విధిగా హాజరు కావాలని కోరుకుంటారు. రైతులు తమ విత్తనాలతో జరిపే పూజను "తొలేళ్ళ ఉత్సవం" అంటారు. సిరిమానొత్సవం అనంతరం అమ్మవారికి విజయనగరం పెద్ద కోనేరులో ఘనంగా తెప్పోత్సవం జరుపుతారు.

సిరిమాను ఎక్కడనుంచి తేవాలనేది అమ్మవారే సూచిస్తారని ప్రతీతి. ఏ జాతి చెట్టు అనేది సరిగ్గా తెలియదుగానీ, సాధారణంగా దేవదార్ వృక్షాన్నే ఎంచుకుంటారనుకుంటా. దాదాపు 60 అడుగుల ఎత్తు ఉండాలి. ప్రధాన పూజారి పూజల అనంతరం దానిని చెక్కాక, 50 అడుగుల వరకూ ఉంటుంది. దానిపైనే పైడితల్లి ఆవహించిన వ్యక్తి కూర్చుని ఉరేగుతాడు. గుడి నుంచి కోట వరకు మూడుసార్లు తిప్పుతారు.

ఈసారి వి.న.జిల్లా డెంకాడ మండలంలోని చిన తాడివాడ గ్రామంలో దాసరి సూరప్పడు అనే ఆసామి తోటలోని చెట్టును గుర్తించారు.

పైడితల్లి సిరిమానోత్సవం

భగవద్గీత ఆన్నది రాజకీయ బోధ కాదు. ఆది ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని బోధించేది. ఆది రాజకీయమే అయితే కృష్ణుడు అందరికీ చెప్పేవాడు క...
27/10/2012

భగవద్గీత ఆన్నది రాజకీయ బోధ కాదు. ఆది ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని బోధించేది. ఆది రాజకీయమే అయితే కృష్ణుడు అందరికీ చెప్పేవాడు కదా. తన ఆత్యంత అంతరంగికుడైన అర్జునుడికి ఒక్కడికే ఎందుకు చెప్పాల్సి వచ్చింది? భగవద్గీత హిందువులకుమాత్రమే అనుకోవటం పోరబాటు. ఆది అందరిదీ. కృష్ణుడు గుర్తు చేసింది ”స్వధర్మం ”నే . స్వధర్మం అంటే హిందూ ధర్మం అని కాదు. స్వీయమైన, వైయక్తికమైన ధర్మం అని అర్ధం ..గీత ఒక చక్కని డిబేట్. సందేహాలకు సమాధానాలు.

-జాజి శర్మ, హైదరాబాద్.

more details @ www.jeevanasurabhi.com

24/10/2012
పశుపక్ష్యాదులను దైవ స్వరూపాలుగా భావించి పూజించడం భారతీయ సంప్రదాయం. పాలపిట్ట దేవీ స్వరూపమని ప్రజల నమ్మకం. అందువల్లే దసరా ...
24/10/2012

పశుపక్ష్యాదులను దైవ స్వరూపాలుగా భావించి పూజించడం భారతీయ సంప్రదాయం. పాలపిట్ట దేవీ స్వరూపమని ప్రజల నమ్మకం. అందువల్లే దసరా రోజున తెలుగువారంతా పాలపిట్టను దర్శించుకోవాలని తహతహలాడతారు. పాలపిట్ట ఉత్తర దిక్కునుంచి వస్తే శుభం కలుగుతుందని, దక్షిణ దిశగా వస్తే అశుభ సంకేతమనికూడా భావిస్తారు. 'పాల పిట్ట' మన రాష్ట్ర పక్షి. వివిధ రంగులతో ఆకర్షణీయంగా ఉండే ఈ పక్షి చాలా అరుదుగా కనిపిస్తుంది.

శ్రీ రాజరాజేశ్వరి దేవి - పిఠాపురం  అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం పిఠాపురంలో ఉంది. ఇది కుక్కుటేశ్వరుడి...
20/10/2012

శ్రీ రాజరాజేశ్వరి దేవి - పిఠాపురం
అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం పిఠాపురంలో ఉంది. ఇది కుక్కుటేశ్వరుడి దేవాలయంలో భాగంగా ఉంది. ఇక్కడి అమ్మవారి పేరు పురుహూతికా దేవి. అయితే శ్రీ రాజరాజేశ్వరిగా ప్రసిద్ధి. గుడికి ఎదురుగా ఉన్న కోనేరును "పాదగయ" అంటారు. పాదగయలో స్నానం చేస్తే గంగలో చేసినంత ఫలితం అని ఒక నమ్మకం ఉంది.

శ్రీ రాజరాజేశ్వరి దేవి నవరాత్రి అలంకారాలు

19/10/2012
17/10/2012

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Jeevana Surabhi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jeevana Surabhi:

Share