09/10/2025
*_బీసీ రిజర్వేషన్ లపై ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలతోనే హైకోర్ట్ స్టే విధించింది : బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు...._*
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో జీ.వో.నెం.9 ను శాస్త్రీయ పద్ధతిలో కాకుండా తమకు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడం వల్లే హైకోర్టు స్టే ఇవ్వాల్సి వచ్చిందని బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
🔥 బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో ప్రభుత్వ విధానం శాస్త్రీయంగా, సరిగ్గా లేదని బిఆర్ఎస్ పార్టీ తరపున అసెంబ్లీ వేదికగా మా నాయకులు, మేము ఎన్నోసార్లు ప్రభుత్వానికి హితవు పలికామని, రేవంత్ సర్కార్ మాత్రం మా సలహాలను, సూచనలను పెడచెవిన పెట్టడం వల్లే నేడు హైకోర్టులో స్టే విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
🔥 ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుతో పాటు అనేక హామీలను కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సాక్షిగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు కావస్తున్న బీసీ రిజర్వేషన్ల అమలు, వారికి ఇచ్చిన హామీల అమలులో తూతూ మంత్రంగా వ్యవహరిస్తూ చేతులు దులుపుకుంటున్నారే తప్పా హామీల అమలులో ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి కనిపించడం లేదు.
🔥 బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని చెప్పిన రేవంత్ సర్కార్ మాటతప్పి ఢిల్లీకి పోయి ధర్నాల పేరుతో నాటకాలు ఆడారు.
🔥 రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా చేయాల్సిన పోరాటాలను గల్లీలో చేస్తూ బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
🔥 ఇప్పటికైనా ప్రభుత్వం కామారెడ్డి వేదికగా బిసి డిక్లరేషన్ అమలు విషయంలో అఖిలపక్షం సభ్యుల సూచనలను, సలహాలను పెడచెవిన పెట్టకుండా శాస్త్రీయబద్ధంగా రూపొందించాలి. లేకపోతే వెనుకబడిన వర్గాల తరఫున పోరాడేందుకు బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అన్నారు.