12/06/2025
ఇందులో మీ పోయిన బండి ఏమైనా ఉందా చూసుకోండి..
పత్రిక ప్రకటన :-
తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్ జిల్లాల మోటార్ సైకల్ దొంగ అరెస్టు జిల్లా ఎస్పీ శ్రీ కె.నారాయణ రెడ్డి,IPS.
తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో15 మోటార్ సైకిల్ లను దొంగతనం చేసిన అంతర్ జిల్లా మోటార్ సైకల్ దొంగనుఈ రోజు తాండూర్ పోలీస్ అధికారులు అరెస్టు చేయడం జరిగింది. అని జిల్లా ఎస్పీ శ్రీ కె.నారాయణ రెడ్డి,IPS గారు తెలియజేయడం జరిగింది. ఇట్టి కేసుకు సంబందించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
నేరం సంఖ్యా 131/2025 , U/s 303(2) of BNS తాండూర్ టౌన్ పోలిసే స్టేషన్
నేరస్తుని వివరాలు :-
బోయిని శ్రీకాంత్ తండ్రి మురళి, వయస్సు : 24 సం’’, కులం : ముదిరాజ్, వృత్తి : ఆటొ డ్రైవరు, నివాసం : కమల్ పూర్ గ్రామము , యాలాల్ మండలం , వికారాబాద్ జిల్లా
నేరం వివరాలు:-
జిల్లా ఎస్పీ శ్రీ కె.నారాయణ రెడ్డి, IPS గారి ఆదేశాల మేరకు ఈ రోజు తేదీ :12.06.2025 నాడు అందజ సమయం ఉదయం 0900 గంటలకు తాండూర్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆదేశాల మేరకు ఎండి. సాజీద్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు మరియు క్రైమ్ సిబ్బంది (Amjad HC 3067, Shiva Kumar HC 3623, Sayappa PC 632, Shabeel Ahmed PC 5616 ) నమ్మదగిన సమాచారం మేరకు విలియం మూన్ చౌరస్టా వద్ద వెహికిల్ చెకింగ్ చేస్తుండగా హైదరాబాద్ రోడ్ నుండి వస్తున్న ఒక వ్యక్తి బైక్ ని ఆపి , తన బైక్ యొక్క డాక్యుమెంట్స్ మరియు అతని వివరములు అడిగే క్రమంలో అతను అట్టి బైక్ ని వదిలి పారిపోతుండగా అతనిని పట్టుకొని తాండూర్ పోలీసు స్టేషన్ కి తీసుకొని వచ్చి విచారించగా, అతని పేరు బోయిని శ్రీకాంత్ తండ్రి మురళి , వయస్సు : 24 సం’’, కులం : ముదిరాజ్ , వృత్తి : ఆటొ డ్రైవరు , నివాసం : కమల్ పూర్ గ్రామము , యాలాల్ మండలం , వికారాబాద్ జిల్లా , అతను హైదరాబాద్ నగరం లోని వివిద ప్రాంతాలలో మొత్తం 15- మోటార్ సైకిల్ లని దొంగతనం చేసి,10-మోటార్ సైకల్ లని తాండూర్ మండలం లోని బిజ్వార్ గ్రామస్తులకు అమ్మినాడు, 4-మోటార్ సైకల్ లని తర్వాత అమ్ముకోవడానికి తన ఇంటివద్ద దాచి వుంచాడు మిగిలిన 1-మోటార్ సైకల్ తాను నడుపుతూ పట్టు పడటం జరిగింది. దొంగిలించిన మోటార్ సైకిల్ లలో 5 మోటార్ సైకిల్ సంబందించి తాండూర్ పోలీస్ స్టేషన్ నందు ఒక కేసు, సైబరాబాద్ పోలీసు కమిషనరేటు పరిదిలోని అల్లాపుర్, చందానగర్ పోలీసు స్టేషన్ లనందు 4 కేసులు నమోదు అయ్యాయి. గతంలో కూడా ఇట్టి నేరస్తుడు యాలాల, కూకట్పల్లి , మియాపూర్, సనత్ నగర్, బంజారాహిల్ల్స్, బాచుపల్లి, చందానగర్ మరియు మాదాపూర్
పోలిసే స్టేషన్ లలో నమోదు అయిన సుమారు 20 కేసులలో జైలుకు వెళ్ళిరావడం జరిగింది. ఇట్టి నేరస్తుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది.
VEHICLE DETAILS
SL No Vehicle No Vehicle type
1. TS05EL3688 CB SHINE (BLACK)
2. KA32ET4351 CB125 SHINE SP
3. AP02BT5302 SPLENDOR+
4. AP09CH8861 SPLENDOR+
5. AP13AF3937 SPLENDOR+
6. KA32HF4767 SPLENDOR+
7. TS07JZ5197 SPLENDOR+
8. TS07GT1376 SPLENDOR+
9. TN05BA6019 SPLENDOR PRO
10. HA11EYMMG79656, MBLHAW12XMHG91518 SPLENDOR+
11. AP11AN2449 PULSAR 150
12. AP28DS8106 HONDA ACTIVA
13. TS34A8799 HF DELUXE
14. AP29BH8277 CB UNICORN
15. UP24AL7293 SPLENDOR+ (Grey Black)
చాక చక్యంగా వ్యవహరించి నేరస్థున్ని పట్టుకొని అతని వద్ద నుండి 15- మోటార్ సైకళ్లను స్వాదీనం చేసుకొన్న( విలువ అందజ రూ . 7,50,000/-) దొంగతనం కేసులని ఛేదించిన పట్టణ ఇన్స్పెక్టర్ జి . సంతోష్ కుమార్ గారు , సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ అబ్దుల్ సజీద్ గారు మరియు క్రైమ్ సిబ్బంది అయిన హెడ్ కానిస్టేబుళ్లు అంజాద్ ,శివకుమార్ మరియు కానిస్టేబుళ్లు సాయప్ప , షబీల్ అహ్మెద్ లను గౌరవ జిల్లా ఎస్‌పి శ్రీ నారాయణ రెడ్డి, IPS గారు అభినందించారు.