Andhra Vibes

Andhra Vibes Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Andhra Vibes, Media/News Company, Road No. 1, Banjara Hills, India, Telangana, Hyderabad.

పాస్ పోర్ట్ ఫీజులు భారీగా పెంపువిదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. జూలై 1, 20...
25/06/2026

పాస్ పోర్ట్ ఫీజులు భారీగా పెంపు

విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. జూలై 1, 2026 నుంచి పాస్‌పోర్టు ఫీజుల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది.

పాస్‌పోర్ట్ నిబంధనల్ని సవరించి, కొత్త ఫీజుల్ని కేంద్రం అమలులోకి తీసుకురానుంది. దీంతో సాధారణ, తత్కాల్ పాస్‌పోర్టులతో పాటు ఇతర సేవల రుసుములు కూడా పెరుగనున్నాయి. పాస్‌పోర్ట్ ఫీజులను చివరిసారిగా 2012లో పెంచారు. 14 సంవత్సరాల తర్వాత ఈ మార్పు వచ్చింది.

ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, కొత్తగా లేదా పునఃజారీ చేయబడిన 36 పేజీల పాస్‌పోర్ట్ కోసం సాధారణ రుసుమును రూ. 1,500 నుండి రూ. 2,500కు పెంచారు. అంటే, దరఖాస్తుదారులు ఇప్పుడు అదనంగా రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ఒక వ్యక్తి తత్కాల్ సేవ కింద పాస్‌పోర్ట్ పొందాలనుకుంటే, వారు ఇప్పుడు రూ.3,500కు బదులుగా రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ కేటగిరీకి రుసుమును రూ.1,500 పెంచారు. తరచుగా ప్రయాణించేవారు ఉపయోగించే 60 పేజీల పాస్‌పోర్ట్‌ల ఫీజులు కూడా పెరిగాయి. సాధారణ దరఖాస్తు ఫీజు రూ.2,000 నుండి రూ. 3,500కు, అత్యవసర దరఖాస్తు ఫీజు రూ. 4,000 నుండి రూ. 6,000కు పెరిగింది.

పాస్‌పోర్ట్ పోయినా లేదా దెబ్బతిన్నా కొత్తది పొందేందుకు కూడా అధిక ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. 36 పేజీల రీప్లేస్‌మెంట్ పాస్‌పోర్ట్‌కు సాధారణ కేటగిరీలో రూ.5,000, తత్కాల్‌లో రూ.7,500 నిర్ణయించారు. 60 పేజీల రీప్లేస్‌మెంట్ పాస్‌పోర్ట్‌కు వరుసగా రూ.6,000, రూ.8,500 వసూలు చేయనున్నారు. అయితే 8 సంవత్సరాల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం ప్రస్తుతం అమలులో ఉన్న 10 శాతం ఫీజు రాయితీని కొనసాగించనుంది. పాత రేట్లకే పాస్‌పోర్టు పొందాలనుకునే వారు జూన్ 30, 2026లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 1 నుంచి కొత్త ఫీజులు అమలులోకి వస్తాయి.

#కువైట్

సీసీటీవీలకన్నా డేంజర్ మీ ఇంట్లోని వైఫై రౌటర్‌.. 24 గంటలు మీపై నిఘా.?ఇంటర్నెట్ కోసం మనం వాడే వైఫై రౌటర్ ఇప్పుడు మన పాలిట ...
27/05/2026

సీసీటీవీలకన్నా డేంజర్ మీ ఇంట్లోని వైఫై రౌటర్‌.. 24 గంటలు మీపై నిఘా.?

ఇంటర్నెట్ కోసం మనం వాడే వైఫై రౌటర్ ఇప్పుడు మన పాలిట శత్రువుగా మారుతోందా?

అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. జేబులో స్మార్ట్‌ఫోన్ లేకపోయినా, ఎలాంటి డివైజ్ చేతిలో లేకపోయినా కేవలం మీ శరీర కదలికల ఆధారంగా వైఫై రౌటర్ మిమ్మల్ని గుర్తుపట్టేస్తుందని, మీ ప్రతి కదలికను కనిపెడుతుందని జర్మనీ పరిశోధకులు బాంబు లాంటి నిజం పేల్చారు.

కొత్త ముప్పు 'బీఎఫ్ఐడీ' (BFId): వైఫై తరంగాలతో నిఘా నీడ..

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇళ్లలోనే కాదు.. ఆఫీసులు, హోటళ్లు, కేఫ్‌లు, విమానాశ్రయాల్లో వైఫై రౌటర్లు సర్వసాధారణం అయిపోయాయి. అయితే, జర్మనీకి చెందిన 'కార్ల్స్‌రూహే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ' (KIT) పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో ఒక నకిలీ వైఫై దాడి వెలుగుచూసింది. దీనికి వారు 'BFId' అని పేరు పెట్టారు. ఈ సరికొత్త నిఘా సాంకేతికత ద్వారా మన చుట్టూ ఉండే సాధారణ వైఫై రౌటర్లను అత్యంత ప్రమాదకరమైన నిఘా చేసే వస్తువులుగా మార్చవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినా సరే.. 99.5% ఖచ్చితత్వంతో గుర్తింపు..!

సాధారణంగా సీసీటీవీ కెమెరాలు ఉంటేనే మనపై నిఘా ఉందని భయపడతాం. కానీ ఈ సరికొత్త టెక్నాలజీ ప్రకారం, మీరు వైఫై నెట్‌వర్క్ పరిధిలోకి రాగానే మీ శరీరం ద్వారా వెలువడే రేడియో తరంగాల్లో వచ్చే మార్పులను రౌటర్ రికార్డ్ చేస్తుంది. ప్రతి మనిషి శరీరాకృతి, వారు నడిచే విధానం వేర్వేరుగా ఉంటాయి. ఈ ప్రత్యేక శారీరక కదలికల ఆధారంగా, మెషిన్ లెర్నింగ్ మోడల్స్ సహాయంతో వైఫై రౌటర్లు ఏకంగా 99.5 శాతం ఖచ్చితత్వంతో మిమ్మల్ని గుర్తించగలవు. దీనికోసం మీ చేతిలో ఫోన్ ఉండాల్సిన అవసరం లేదు, ఒకవేళ మీ మొబైల్ ఫోన్ పూర్తిగా స్విచ్ఛాఫ్ చేసి ఉన్నా సరే ఈ నిఘా నుంచి తప్పించుకోలేరు.

మీకు తెలియకుండానే రహస్య కనెక్షన్..!

పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త జూలియన్ టోడ్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే ప్రపంచంలోని ప్రతి రౌటర్ ఒక నిఘా కెమెరాలాగే మారిపోతుంది. ఉదాహరణకు, మీరు ప్రతిరోజూ ఉచిత వైఫై ఉండే ఏదైనా కాఫీ షాప్ లేదా దుకాణం మీదుగా నడుచుకుంటూ వెళ్తుంటే, మీ అనుమతి లేకుండానే మీ ఫోన్ ఆ వైఫై నెట్‌వర్క్‌తో ఒక రహస్య కనెక్షన్ ఏర్పరుచుకుంటుంది. దీనివల్ల మీరు ఆ దారిలో వెళ్లిన ప్రతిసారీ సదరు దుకాణదారుడికి లేదా హ్యాకర్లకు మీ ఉనికి తెలిసిపోతుంది. తదుపరిసారి మీరు అక్కడికి రాగానే ఆ వ్యవస్థ మిమ్మల్ని వెంటనే గుర్తుపట్టేస్తుంది.

ఈ సాంకేతికత ఎలా పనిచేస్తుంది?

ఈ 'BFId' దాడి వైఫై 5 (WiFi 5) వెర్షన్ నుంచి అందుబాటులోకి వచ్చిన 'బీమ్‌ఫార్మింగ్ ఫీడ్‌బ్యాక్ సమాచారం' (BFI) ఆధారంగా పనిచేస్తుంది. రౌటర్లు తమతో అనుసంధానమైన డివైజ్‌ల నుంచి సిగ్నల్స్ అందుకోవడానికి ఈ ఫీచర్‌ను వాడుతుంటాయి. అయితే, గాలిలో ప్రసారమయ్యే ఈ సిగ్నల్స్‌కు ఎలాంటి భద్రత లేదా లాక్ (ఎన్‌క్రిప్షన్) ఉండదు. దీనిని ఆసరాగా చేసుకుని హ్యాకర్లు సులువుగా డేటాను రికార్డ్ చేస్తారు. మెషిన్ లెర్నింగ్ ద్వారా ఈ సిగ్నల్స్‌ను విశ్లేషించి, నెట్‌వర్క్ పరిధిలో తిరుగుతున్న వ్యక్తుల రేడియో చిత్రాలను (రేడియో ఇమేజ్) సృష్టిస్తారు.

197 మందిపై ప్రయోగం: ప్రభుత్వాలు తప్పుడు దారి పట్టే ప్రమాదం!

ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు 197 మందిపై ప్రయోగాలు చేసి, ఈ సాంకేతికత ఎంత ఖచ్చితంగా పనిచేస్తుందో నిరూపించారు. అయితే, డివైజ్ ద్వారా సేకరించిన డేటాను, సదరు వ్యక్తి అసలు పేరుతో ముడిపెట్టడానికి హ్యాకర్లకు మరికొంత అదనపు సమాచారం అవసరమవుతుంది. ఇందుకోసం వారు గతంలో సేకరించిన స్మార్ట్‌ఫోన్ డేటాను వాడుకునే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ సాంకేతికతను ప్రభుత్వాలు లేదా కొన్ని శక్తులు ప్రజలపై నిఘా పెట్టడానికి, వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడానికి ఉపయోగించే ప్రమాదం ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే వైఫై ప్రమాణాలలో (IEEE 802.11bf) తక్షణమే కొత్త భద్రతా నిబంధనలు చేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇంటర్నెట్ సౌకర్యం కోసం మనం తెచ్చుకున్న వైఫై రౌటరే మన అంతరంగిక జీవితంలోకి ఇలా దొంగచాటుగా తొంగిచూడటం నిజంగా ఆందోళనకరమైన విషయమే. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ భద్రతా లోపాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో టెక్నాలజీ సంస్థలు వైఫై నెట్‌వర్క్‌ల భద్రతపై కఠినమైన చర్యలు తీసుకోకపోతే, సామాన్యుడి గోప్యత కేవలం ఒక కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.

ప్రపంచానికి ఒక శుభవార్త అందవచ్చు : అమెరికా విదేశాంగ మంత్రిఇరాన్‌తో శాంతి చర్చల గురించి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్క...
24/05/2026

ప్రపంచానికి ఒక శుభవార్త అందవచ్చు : అమెరికా విదేశాంగ మంత్రి

ఇరాన్‌తో శాంతి చర్చల గురించి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

మరికొన్ని గంటల్లో ప్రపంచానికి ఒక శుభవార్త అందే అవకాశం ఉంది' అని తెలిపారు. దీంతో అమెరికా-ఇరాన్ చర్చలు కీలక దశకు చేరుకున్నాయనే సంకేతాలు వెలువడ్డాయి (Iran peace talks).

రుబియో వ్యాఖ్యల నేపథ్యంలో అంతర్జాతీయ దృష్టి మొత్తం అమెరికా-ఇరాన్ చర్చలపై పడింది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్‌తో శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని పేర్కొన్నారు. అధికారిక ప్రకటనకు ముందు ఒప్పందం తుది వివరాలపై చర్చిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. కాగా, హోర్ముజ్ జలసంధిపై ఎవరి నియంత్రణా లేకుండా స్వేచ్ఛా రవాణాకు అవకాశం ఉండాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి (US Iran deal).

కాగా, ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికా కలిసి పని చేస్తాయని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో రుబియో పేర్కొన్నారు (Iran negotiations). భారత్, అమెరికా రెండూ ఉగ్రవాద బాధిత దేశాలేనని, ఉగ్రవాదంపై పోరులో భారత్‌తో కలిసి నడుస్తామని పేర్కొన్నారు. ఇక, అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలో ఆ దేశ బృందం భారత్‌కు రాబోతోందని జైశంకర్ పేర్కొన్నారు.

ఇండియాలో డయాబెటిస్ సూపర్ డ్రగ్ 'ఒజెంపిక్' లాంచ్.. ధర, ఎలా వాడాలంటే.డెన్మార్క్‌లోని గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నోవో న...
12/12/2025

ఇండియాలో డయాబెటిస్ సూపర్ డ్రగ్ 'ఒజెంపిక్' లాంచ్.. ధర, ఎలా వాడాలంటే.

డెన్మార్క్‌లోని గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నోవో నార్డిస్క్ ఇవాళ ఒజెంపిక్ అనే డయాబెటిస్‌, వెయిట్ లాస్ డ్రగ్‌ను భారత్‌లో విడుదల చేసింది.

డయాబెటిస్, హార్మోన్ థెరపీ, ఒబేసిటీ వంటి దీర్ఘకాలిక సమస్యల చికిత్సల కోసం ఔషధాలు తయారు చేసే అంతర్జాతీయ కంపెనే నోవో నార్డిస్క్.

వారానికి ఒక్కసారి ఇంజెక్ట్ చేసే సెమాగ్లూటైడ్ ఫార్ములేషనే ఈ “ఒజెంపిక్”. సెమాగ్లూటైడ్ అంటే రక్తంలో చక్కెర తగ్గించే హార్మోన్ ప్రభావాన్ని అనుకరించే ఔషధం. భారత్‌లో టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలో లేని పెద్దలు ఆహారం, వ్యాయామం చేస్తూనే ఈ ఔషధాన్ని వాడేందుకు ఇప్పటికే ఆమోదముద్ర పడింది.

ఈ డ్రగ్ 0.25 ఎంజీ, 0.5 ఎంజీ, 1 ఎంజీ అనే మూడు డోసేజ్‌లలో లభ్యం కానుంది. ఒక్కసారి వాడి పారేసే ప్రీ ఫిల్డ్ పెన్‌లో వస్తుంది. నోవోఫైన్ నీడిల్స్ అనే పెన్ పైనా ఉంటుంది. ఇది సబ్‌క్యూటేనియస్ ఇంజెక్షన్. అంటే చర్మపు కింద ఇంజెక్ట్ చేసే విధానంలో దీన్ని తీసుకుంటారు.

ప్రారంభ డోసు 0.25 ఎంజీ ధర రూ.8,800. అలాగే, 0.5 ఎంజీ ధర రూ.10,170, 1 ఎంజీ ధర రూ.11,175. ప్రతి పెన్‌లో నాలుగు వారాలకు సరిపడే డోసులు ఉంటాయి.

"ఒజెంపిక్‌ను ఇండియాకు తీసుకురావడం ఓ పెద్ద మైల్‌స్టోన్‌గా భావిస్తున్నాం. అంతర్జాతీయంగా ఉన్న నమ్మకం, క్లినికల్ ప్రూఫ్, వరల్డ్ క్లాస్ క్వాలిటీ, బలమైన సరఫరా వ్యవస్థ ఆధారంగా ఒజెంపిక్ ఇండియన్ డాక్టర్లకు మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది" అని నోవో నార్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియా చెప్పారు.

గుండె, కిడ్నీలకు దీర్ఘకాల రక్షణ
"మా లక్ష్యం పేషెంట్లకు ఇన్నోవేటివ్, సులభంగా అందే థెరపీని అందించడం. ఇది రక్తంలో గ్లైసెమిక్ కంట్రోల్ మెరుగుపరుస్తుంది. వెయిట్ మేనేజ్‌మెంట్‌కు ఉపయోగపడుతుంది, హృదయం, కిడ్నీలకు దీర్ఘకాల రక్షణ ఇస్తుంది" అని శ్రోత్రియా తెలిపారు.

ఒజెంపిక్ 2017లో యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ద్వారా టైప్ 2 డయాబెటిస్ కంట్రోల్‌ విషయంలో ఆమోదం పొందింది. ఆకలిని తగ్గించే ప్రభావం కూడా ఇందులో ఉండడం వల్ల వెయిట్ లాస్ కోసం కూడా దీన్ని విస్తృతంగా వాడుతున్నారు. హృదయ సంబంధ , కిడ్నీ సమస్యల నుంచి రక్షణ కూడా ఇస్తుందని నోవో తెలిపింది.

ఈ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఒజెంపిక్ ఒక జీఎల్‌పీ-1 రిసెప్టర్ అగోనిస్ట్. అంటే శరీరంలో సహజంగా ఉండే జీఎల్‌పీ-1 హార్మోన్‌లా పనిచేసే ఔషధం. ఇది గ్లైసెమిక్ కంట్రోల్‌ను మెరుగుపరచడంలో, హెచ్‌బీఏ1సీని తగ్గించడంలో సహాయపడుతుంది. హెచ్‌బీఏ1సీ అంటే మనిషి శరీరంలో 3 నెలల బ్లడ్‌ షుగర్‌ సగటును చూపించే ప్రమాణం.

ఆకలి నియంత్రణ కోసం.. మెదడులో ఆకలిని నియంత్రించే ప్రాంతాలపై ఈ ఔషధం పనిచేస్తుంది. దీంతో టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో వెయిట్ లాస్‌కు కూడా ఉపయోగపడుతుంది.

కేంద్ర కేబినెట్ భేటీ.. సంచలన నిర్ణయాలివే.ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సంచలన న...
12/12/2025

కేంద్ర కేబినెట్ భేటీ.. సంచలన నిర్ణయాలివే.

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. 2027 జనగణన, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు వంటి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.

ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రివర్గంలో తీసుకున్న అంశాలను వివరించారు.

కీలక నిర్ణయాలు ఇవే..

1. 2027లో రెండు విడతల్లో జరగనున్న జనగణన కోసం రూ.11,718 కోట్ల బడ్జెట్‌ను కేబినెట్ ఆమోదించింది.ఈ జనగణనను డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి నిర్వహించనున్నారు.

2. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు 'పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన' (Pujya Bapu Grameen Rozgar Yojana) గా మారుస్తూ నిర్ణయం

3. ఈ పథకం కింద ఒక కుటుంబానికి ఏడాదికి ఉన్న గరిష్ఠ పని దినాలను 100 నుంచి 120 రోజులకు పెంచింది. రోజు కూలీని రూ.240గా నిర్ణయించింది. రూ.1.51 లక్షల కోట్లు కేటాయింపు.

4. బొగ్గు గనుల్లో పలు సంస్కరణలు తీసుకురావడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

5. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన.. ఈ పథకం కింద అందించే మొత్తాన్ని రూ.6,000 నుంచి రూ.10,000 వరకు పెంచాలని నిర్ణయం తీసుకుంది.

6. దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాల(Kendriya Vidyalayas) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో తెలంగాణకు 4, ఆంధ్రప్రదేశ్ కి 4 మంజూరు చేసింది.

7. నాలుగు కీలకమైన రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం

8. సహకార రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి NCDC కింద రూ.2,000 కోట్ల ఆర్థిక సహాయం

9. పీఎం కిసాన్ సంపద యోజన.. ఈ పథకానికి రూ.6,520 కోట్లు కేటాయింపు.

10. క్వాంటం టెక్నాలజీ పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించడానికి అదనంగా రూ.4,000 కోట్ల నిధులు కేటాయింపు

11. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSME)లకు బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు లభించేందుకు వీలుగా రూ.15,000 కోట్లతో కొత్త క్రెడిట్ గ్యారెంటీ పథకానికి గ్రీన్ సిగ్నల్

12. దేశంలోని డిజిటల్ మౌలిక సదుపాయాలను రక్షించడనాకి సైబర్ దాడులను నిరోధించడానికి సైబర్ సెక్యూరిటీ పాలసీకి ఆమోదం.

13. సెమీకండక్టర్ తయారీని ప్రోత్సహించేందుకు రూ.12,000 కోట్లు కేటాయింపు. కొత్త సెమీకండక్టర్ తయారీ కర్మాగారాలను నెలకొల్పే సంస్థలకు ఆర్థిక సహాయం పెంపు.

14. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అదనంగా 1.5 కోట్ల గృహాలను నిర్మించడానికి ఆమోదం

15. చిన్న ఉపగ్రహాలను ప్రయోగించడానికి వీలుగా తమిళనాడులోని కులశేఖరపట్నం వద్ద కొత్త ప్రయోగ వేదిక (Launch Pad) నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

16. 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమాన్ని రక్షణ రంగంలో బలోపేతం చేయడానికి, రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(FDI) పరిమితి పెంపు

17. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం వైద్య సేవలను అందించడానికి నేషనల్ టెలి-మెడిసిన్ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు ఆమోదం

18. నీటిపారుదల పథకాలకు జాతీయ మిషన్ ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50 ప్రధాన, మధ్యస్థ నీటిపారుదల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి రూ.35,000 కోట్లతో ఒక కొత్త జాతీయ మిషన్‌ను ప్రారంభించేందుకు కేబినెట్ లైన్ క్లియర్ చేసింది.

19. భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద ఇంటర్నెట్ సేవలు. ఇందుకోసం అదనంగా రూ.8,000 కోట్ల నిధులు కేటాయింపు

20. రాష్ట్రాల ఆర్థిక బలోపేతం కోసం ప్రత్యేక ప్యాకేజీ. ఇందులో భాగంగా రాష్ట్రాలు తమ మూలధన పెంచుకోవడానికి.. వడ్డీ లేని రుణాల రూపంలో రూ.1.3లక్షల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి గ్రీన్ సిగ్నల్

బస్సు ప్రమాదంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి.. సహాయ చర్యలకు ఆదేశంపుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తున్న ప్రైవేటు బస్సు అల్లూర...
12/12/2025

బస్సు ప్రమాదంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి.. సహాయ చర్యలకు ఆదేశం

పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తున్న ప్రైవేటు బస్సు అల్లూరి సీతారామారాజు జిల్లాలో ఘోర ప్రమాదానికి గురవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

మృతుల సంఖ్య భారీగా ఉండడంతో తీవ్ర ఆవేదన చెందారు. మృతుల కుటుంబానికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వెంటనే ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఆరా తీశారు. అనంతరం అల్లూరి జిల్లా అధికార యంత్రాంగంతో మాట్లాడి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భద్రాచలం నుంచి అన్నవరం వెళుతున్న యాత్రికుల ప్రైవేటు బస్సు లోయలో పడిన ఘటనలో పలువురు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదం, క్షతగాత్రులకు అందతున్న సహాయంపై సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ సహాయ చర్యలు ముమ్మరంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారని, పలువురు మృతి చెందగా. గాయపడిన వారిని చింతూరు ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదించారు. గాయపడిన వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు తరలించాలని సీఎం ఆదేశించారు.

ఉన్నతాధికారులు తక్షణం ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. అన్ని శాఖలు సమన్వయంతో బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని చెప్పారు. మృతుల సంఖ్య పెరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం ప్రమాదానికి గల కారణాలు కూడా ఆరా తీశారు. ఘాట్‌ రోడ్డులో ఎలా జరిగింది? డ్రైవర్‌ నిద్రమత్తులో ఉన్నాడా? వంటివి అధికారులు తెలుసుకునే పనిలో ఉన్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై నారా లోకేశ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో పలువురు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడడంతో దుర్మరణం పాలవడం బాధాకరమని తెలిపారు. గాయపడిన వారికి అవసరమైన వైద్యాన్ని అందించాలని అధికారులను ఆదేశించినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కర్నూలు నుంచి వైజాగ్‌కు ప్రత్యేక బస్సులుఏపీఎస్‌ ఆర్టీసీ కర్నూలు నుంచి వైజాగ్‌కు మూడు ఏసీ బస్సులను ఏర్పాటు చేయగా శనివారం ...
09/11/2025

కర్నూలు నుంచి వైజాగ్‌కు ప్రత్యేక బస్సులు

ఏపీఎస్‌ ఆర్టీసీ కర్నూలు నుంచి వైజాగ్‌కు మూడు ఏసీ బస్సులను ఏర్పాటు చేయగా శనివారం నగరంలోని ఆర్టీసీ కొత్తబస్టాండ్‌లో పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌ ప్రారంభించారు.

ఆయన మాట్లాడుతూ జిల్లా నుంచి వైజాగ్‌కు వెళ్లే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఏసీ సర్వీసులు అందుబాటులోకి తీసుకవచ్చామని వివరించారు. దీనివల్ల రెండు ప్రాంతాలకు అనుసంధానం పెరుగడమే కాకుండా టూరిజం పరంగా మరింత అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. వైజాగ్‌కు బస్సు సర్వీసు కావాలని తెలిసిన వెంటనే ప్రతిపాదనలు పంపాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చి ప్రయాణికుల కోరిక మేరకు మూడు నూతన బస్సులను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తనకు ఎంతో బాధ కలిగించిందని అన్నారు.

ప్రమాదాలు జరిగిన సమయంలో ఆటోమేటిక్‌ స్ర్పింక్లర్‌ సిస్టమ్‌ బస్సులో ఉంటే ప్రాణపాయం జరగకుండా ఉంటుందన్నారు. ఈవిషయంపై ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు చెప్పారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి ఆటోమెటిక్‌ స్ర్పింక్లర్‌ సిస్టమ్‌పై చర్చిస్తామని మంత్రి చెప్పారు. కర్నూలు జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసులు, డిపో మేనేజర్లు సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.

సుప్రీంకోర్టు బిగ్ షాక్.. అద్దె ఇంట్లో 12 ఏళ్లు ఉన్నా యాజమాన్యం రాదు.. టెనంట్ల ఆశలు అంతం!'ది లిమిటేషన్ యాక్ట్-1963'లోని ...
09/11/2025

సుప్రీంకోర్టు బిగ్ షాక్.. అద్దె ఇంట్లో 12 ఏళ్లు ఉన్నా యాజమాన్యం రాదు.. టెనంట్ల ఆశలు అంతం!

'ది లిమిటేషన్ యాక్ట్-1963'లోని ఆర్టికల్ 65 ప్రకారం, ఎవరైనా ఒక ఆస్తిని 12 సంవత్సరాలు నిరంతరం స్వాధీనం చేసుకుని ఉంటే దానిపై హక్కు పొందవచ్చనే నిబంధన గురించి చాలా మందికి తప్పుడు అవగాహన ఉంది.

ఈ చట్టం అడ్వర్స్ పాజిషన్ (ప్రతికూల స్వాధీనం) కేసులకు వర్తిస్తుంది కానీ, అద్దెదారులకు కాదు. అందుకే ఇంటి యజమానులు తమ టెనంట్లను ఎక్కువ కాలం ఉంచడానికి జంకుతారు - 12 ఏళ్లు దాటితే ఆస్తి తమ చేజిక్కుల్లోంచి పోతుందనే భయం వారిని వెంటాడుతుంది.
ఇటీవల ఢిల్లీలోని ఓ కోర్టు ఈ తప్పుడు అవగాహనను బలపరుస్తూ టెనంట్ పక్షాన తీర్పు ఇచ్చింది. దీంతో యజమానుల హక్కులు గందరగోళంలో పడ్డాయి. అద్దెకు ఉన్న ఇంట్లో ఎన్ని దశాబ్దాలు నివసించినా, ఆ ఆస్తిపై యాజమాన్య హక్కు రాదనే స్పష్టమైన నియమాన్ని ఈ తీర్పు పూర్తిగా వక్రీకరించింది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఇంటి యజమానుల్లో ఆందోళన వ్యక్తమైంది.
ఈ గందరగోళానికి సుప్రీంకోర్టు దిగివచ్చి కీలక తీర్పు ఇచ్చింది. అద్దె ఒప్పందం ఆధారంగా నివసిస్తున్న టెనంట్‌కు ఎప్పటికీ ఆస్తి యాజమాన్య హక్కు రాదని, లిమిటేషన్ యాక్ట్ అడ్వర్స్ పాజిషన్‌కు మాత్రమే వర్తిస్తుందని స్పష్టంగా వెల్లడించింది. ఢిల్లీ కోర్టు తీర్పును రద్దు చేస్తూ, యజమానుల హక్కులను బలోపేతం చేసింది.
ఈ తీర్పుతో ఇకపై ఇంటి యజమానులు నిర్భయంగా టెనంట్లను ఉంచవచ్చు - 12 ఏళ్ల భయం తొలగిపోయింది. టెనంట్లు మాత్రం తమ హక్కులను అద్దె ఒప్పందంలోనే పరిమితం చేసుకోవాల్సి వస్తుంది. సుప్రీంకోర్టు నిర్ణయం ఆస్తి చట్టాల్లో కొత్త స్పష్టత తెచ్చింది!

రోజూ 2 వెల్లుల్లి రెబ్బలు తింటే పుష్కలమైన ఆరోగ్యం..! ఎప్పుడు, ఎలా తినాలో తప్పక తెలుసుకోవాలి.వెల్లుల్లి ప్రతి భారతీయ వంటగ...
09/11/2025

రోజూ 2 వెల్లుల్లి రెబ్బలు తింటే పుష్కలమైన ఆరోగ్యం..! ఎప్పుడు, ఎలా తినాలో తప్పక తెలుసుకోవాలి.

వెల్లుల్లి ప్రతి భారతీయ వంటగదిలో కనిపించే ఒక సాధారణ కూరగాయ. వంటకాల రుచిని పెంచడానికి దీనిని వంటకాల్లో వాడుతుంటారు. దీనిని గ్రేవీలలో కూడా ఉపయోగిస్తారు.

కానీ, వెల్లుల్లిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయని మీకు తెలుసా? ఇందులో విటమిన్ బి6, విటమిన్ సి, మాంగనీస్, సెలీనియం, ఫైబర్ ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే, ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. దీని గురించి మరింత తెలుసుకుందాం.

ప్రతిరోజూ వెల్లుల్లి ఎందుకు తినాలి?:

వెల్లుల్లి ఒక దివ్యౌషధం. మీరు దానిని ప్రతిరోజూ తినాలి. ఇది రుచికరమైనది, ఔషధం రెండూ విధాలుగా పనిచేస్తుంది. వెల్లుల్లి తినటం వల్ల మీరు ఎప్పుడూ అనారోగ్యానికి గురికాకుండా ఉంటారు. వెల్లుల్లికి మందులు లేకుండానే రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే శక్తి ఉంది. వెల్లుల్లి గుండె జబ్బులను నివారించగల చెడు కొలెస్ట్రాల్‌ను కూడా బయటకు పంపడంలో సహాయపడుతుంది.

వెల్లుల్లి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

మీ రోగనిరోధక శక్తిని పెంచుకోండి – ప్రతిరోజూ 2 నుండి 3 వెల్లుల్లి రెబ్బలు పచ్చిగా తినడం వల్ల మీ శరీరం రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది – వెల్లుల్లిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గడం – వెల్లుల్లిలో కొవ్వును కాల్చడానికి సహాయపడే అనేక సమ్మేళనాలు ఉన్నాయి. ఇది మన జీవక్రియను కూడా పెంచుతుంది. కాబట్టి, వెల్లుల్లిని తీసుకోవాలి.

జీర్ణక్రియను మెరుగుపరచండి- ఎవరికైనా మలబద్ధకం, అజీర్ణం లేదా గ్యాస్ సమస్య ఉంటే వారు రోజూ వెల్లుల్లి తినాలి.

వెల్లుల్లిని ఎప్పుడు, ఎలా తినాలి?

ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినాలి. తొక్క తీసి 2 నుండి 3 పచ్చి వెల్లుల్లి రెబ్బలు నమిలి తినేయాలి. ఆ తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగొచ్చు. కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకునే వారు వెల్లుల్లిని తేనెలో ముంచి తినాలి.

రోజ్ వాటర్‌తో మచ్చలేని చర్మం.. ఇలా వాడితే చాలు మెరిసే అందం మీ సొంతం..!గులాబీలను ఎల్లప్పుడూ ప్రేమ, ఆనందం, అందానికి చిహ్నం...
09/11/2025

రోజ్ వాటర్‌తో మచ్చలేని చర్మం.. ఇలా వాడితే చాలు మెరిసే అందం మీ సొంతం..!

గులాబీలను ఎల్లప్పుడూ ప్రేమ, ఆనందం, అందానికి చిహ్నంగా భావిస్తారు. వివిధ రకాల గులాబీలు వేర్వేరు భావోద్వేగాలను వ్యక్తపరుస్తాయి. ప్రేమకు చిహ్నంగా ఉండే గులాబీలు మీ ముఖానికి గులాబీ రంగును ఇవ్వడానికి కూడా సహాయపడతాయి.

అవును, ఇది వింతగా అనిపించవచ్చు. కానీ, మీరు గులాబీలను ఉపయోగించడం ద్వారా మెరిసే చర్మాన్ని పొందవచ్చు. రోజ్ వాటర్ లో కాటన్ బాల్ ముంచి మీ ముఖానికి అప్లై చేయండి. ఇది మీ చర్మాన్ని శుభ్రపరచడానికి, మురికి, ఆయిల్‌ని తొలగించడానికి సహాయపడుతుంది. మీరు దీన్ని రోజుకు రెండుసార్లు ఉపయోగించవచ్చు.

ముఖాన్ని వాష్ చేసిన తర్వాత రోజ్ వాటర్‌ని కాటన్ ప్యాడ్‌తో రాసుకుంటే చర్మం తాజాగా మారుతుంది. ఇది నేచురల్ టోనర్ లాగా పనిచేసి గ్లో పెంచుతుంది. రోజ్ వాటర్‌తో ముఖంపై ఉన్న మేకప్‌ కూడా తొలగించొచ్చు. రోజ్ వాటర్‌లో కొంచెం కొబ్బరి నూనె కలిపితే మేకప్ ఈజీగా పోతుంది. చర్మం కూడా మృదువుగా ఉంటుంది.
రోజ్ వాటర్‌ని స్ప్రే బాటిల్‌లో వేసి ముఖంపై స్ప్రే చేస్తే చర్మం తేమ కలిగి ఉంటుంది. ఎల్లపుడూ అందంగా, తాజాగా కనబడతారు.

రోజ్ వాటర్‌లో గ్లిజరిన్ వేసి రాత్రి నిద్రపోయే ముందు ముఖానికి, చర్మానికి రాసుకోవాలి. ఇలా చేస్తే చర్మం తేమ కలిగి ఉంటుంది. చర్మం పొడిగా మారకుండా చూసుకోవచ్చు. రోజ్ వాటర్‌లో నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోండి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే బ్యాక్టీరియా తగ్గుతుంది, పింపుల్స్ కూడా తొలగిపోతాయి.
రోజ్ వాటర్‌లో కాటన్ ప్యాడ్స్ నానబెట్టి కళ్ల కింద పెట్టుకోవాలి. దీంతో డార్క్ సర్కిల్స్ తొలిగిపోతాయి. కళ్లు అందంగా కనిపిస్తాయి.

రోజ్ వాటర్‌లో శనగపిండి, నిమ్మరసం వేసి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి రాసుకోండి. 20 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకుంటే ట్యాన్ తొలగిపోతుంది.​ రోజ్ వాటర్‌లో కలబంద గుజ్జు కలిపి ఆయిల్ స్కిన్ ఉన్న వారు ముఖానికి రాసుకోవచ్చు. తద్వారా చర్మం తాజాగా ఉంటుంది. రోజ్ వాటర్‌ని ఎలాంటి ఫేస్ ప్యాక్‌లో అయినా వేసి ముఖానికి రాసుకుంటే సహజ కాంతి వస్తుంది. మృదుత్వం కూడా ఉంటుంది.

Address

Road No. 1, Banjara Hills, India, Telangana
Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Andhra Vibes posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share