Dasubhash*tam

Dasubhash*tam Listen to the best in Telugu Music, Literature, and Arts. http://dasubhash*tam.page.link/U6ZU
dasubhash*tam.page.link/U6ZU

Top-rated Telugu Audiobooks App for personal, professional, and spiritual development through literature.

లవర్స్ ఆల్ అన్ ట్రూ [VISLESHANA - FREE] డ్రాఫర్ తన పెద్ద కూతురు మరియన్ ను మానసికంగా ఇబ్బందిపడే వాళ్ళు ఉండే శరణాలయంలో ఎంద...
21/09/2026

లవర్స్ ఆల్ అన్ ట్రూ
[VISLESHANA - FREE] డ్రాఫర్ తన పెద్ద కూతురు మరియన్ ను మానసికంగా ఇబ్బందిపడే వాళ్ళు ఉండే శరణాలయంలో ఎందుకు చేర్పించాడో వినండి.
https://buff.ly/xH0orh8

ప్రేమిస్తే ఏమవుతుంది [NAVALA] తనకు ఆశ్రయం కల్పించిన శరణ్యకు చెప్పకుండా సుశీల ఇంట్లోంచి గాయత్రి ఎందుకు పారిపోయిందో వినండి...
10/09/2026

ప్రేమిస్తే ఏమవుతుంది
[NAVALA] తనకు ఆశ్రయం కల్పించిన శరణ్యకు చెప్పకుండా సుశీల ఇంట్లోంచి గాయత్రి ఎందుకు పారిపోయిందో వినండి.
https://buff.ly/Et0Ttke

ది పిక్చర్ ఆఫ్ డొరియన్ గ్రే [VISLESHANA - FREE] ఒక వింత కోరిక నిజం అవడం వలన డోరియన్ గ్రే ఎన్ని కష్టాలు పడ్డాడో వినండి. h...
03/09/2026

ది పిక్చర్ ఆఫ్ డొరియన్ గ్రే
[VISLESHANA - FREE] ఒక వింత కోరిక నిజం అవడం వలన డోరియన్ గ్రే ఎన్ని కష్టాలు పడ్డాడో వినండి.
https://buff.ly/wWZ0sre

మనసు కబుర్లు [VISLESHANA - FREE] మనం చెప్పుకోలేని ఎన్నో వైద్య, ఉద్యోగ, మానసిక సమస్యలకి, దొరకని ఎన్నో ప్రశ్నలకి శ్రీకాంత్...
27/08/2026

మనసు కబుర్లు
[VISLESHANA - FREE] మనం చెప్పుకోలేని ఎన్నో వైద్య, ఉద్యోగ, మానసిక సమస్యలకి, దొరకని ఎన్నో ప్రశ్నలకి శ్రీకాంత్ మిరియాలగారు ఇచ్చిన సమాధానాలు వినండి.
https://buff.ly/Ul9EzIX

మానసిక ఆరోగ్యం గురించి తెలుసుకోండి.మిరియాల శ్రీకాంత్ గారి మనసు కబుర్లు విడుదల సందర్భంగా.10వ తరగతిలో మా సోషల్ టీచర్ క్లాస...
23/08/2026

మానసిక ఆరోగ్యం గురించి తెలుసుకోండి.

మిరియాల శ్రీకాంత్ గారి మనసు కబుర్లు విడుదల సందర్భంగా.

10వ తరగతిలో మా సోషల్ టీచర్ క్లాసులోకి రాగానే ఒక ప్రశ్న వేశారు. "ఈ ప్రపంచంలో అన్నిటికంటే వేగమైనది ఏంటి?" అని. ఒక్కొక్కరినీ లేచి సమాధానం చెప్పమని అడిగారు. మొదట అమ్మాయిల వరస. ఒక అమ్మాయి "విమానం" అంది. ఇంకో అమ్మాయి "చిరుతపులి" అంది. ఇంకో అమ్మాయి "జపాన్‌లో బుల్లెట్ ట్రైన్" అంది. ఇలా అమ్మాయిలు వరసగా చెప్పడం, సోషల్ టీచర్ వాళ్ళని కూర్చోబెట్టడం జరిగింది. తర్వాత అబ్బాయిల వరస. ఒకడు "బుల్లెట్టు బండి" అన్నాడు, ఇంకొకడు "సూపర్ మ్యాన్" అన్నాడు, ఇంకొకడు "స్విఫ్ట్ బర్డ్" అన్నాడు, ఇంకొకడు "బుగాటి కారు" అన్నాడు. ఇక నేను, నా పక్కన నా స్నేహితుడు కుమార్ ఉన్నాం. నేను లేచి "కాంతి వేగం" గురించి చెప్పాను. నా స్నేహితుడు లేచి "అన్నిటికంటే వేగమైనది మనసు" అన్నాడు.

అందరూ వస్తువుల గురించి, జంతువుల గురించి చెబుతూ ఉంటే కంటికి కనబడని వేగమైన వాటి గురించి నేను, నా స్నేహితుడు చెప్పిన సమాధానాలకి మమ్మల్నిద్దరినీ నిలబెట్టి చప్పట్లు కొట్టించారు మా టీచర్. తర్వాత నన్ను కూర్చోబెట్టి మా కుమార్‌కి చప్పట్లు కొట్టించారు. "శభాష్ రా కుమార్! అన్నిటికంటే మనసే వేగమైనది అన్న నిర్ణయానికి నువ్వు ఎలా వచ్చావు?" అని అడిగితే, వాళ్ళ అమ్మ అతనికి హనుమంతుడి కథ చెబుతూ ఆయన మనోవేగంతో ఎక్కడికైనా వెళ్తాడు అని చెప్పిందని, అంటే మనసు ఎంత వేగంగా ఒక ప్రదేశం, విషయం గురించి ఆలోచిస్తుందో అంతే వేగంతో హనుమంతుడు అక్కడ ఉండగలడు అని చెప్పింది అని చెప్పాడు. ఆ తర్వాత మా పాఠం మొదలయింది.

ఇప్పుడు ప్రస్తుతం విషయానికి వస్తే... నిజమే, మనసు చాలా వేగమైనది. అంతే కాదు కొంచెం రోగమైనది. వేగమైనా, భోగమైనా, యోగమైనా, రోగమైనా అన్నీ దానికే పడుతున్నాయి కదా. పట్టుకుని ఆపుదాం అంటే అసలు దాని పగ్గాలు దొరకవాయే! అసలు పగ్గాలు ఉన్నాయని తెలుసుకోవడం కూడా కష్టమాయే.

సరే, యోగం ఎలా వస్తుందో తెలీదు, వ్యావహారిక జీవితంలో అది అంతగా ముఖ్యం కాదు. భోగం అంటామా... దానికోసం ఎలానూ మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాము. వేగం అంటామా... ఇప్పుడు పదో క్లాసులో లెక్కల పరీక్షలో వచ్చిన ప్రశ్నలా దాన్ని కొలిచి ఏం సాధించాలి?

మరి ఏం చేద్దాం? రోగం గురించి మాట్లాడుకుందాం. దీన్ని నేరుగా రోగం అనడం కూడా తప్పే. మనం నేరుగా ఆ నిర్ణయానికి వచ్చేయకూడదు. ఇది ఒక మానసిక స్థితి. ఆ స్థితులు ఏంటో తెలుసుకుందాం.

ఇప్పుడు ఈ మనసు వచ్చేసి "బద్ధకం" అంటుంది, "ఏ పని చేయడానికి మోటివేషన్ లేదు" అంటుంది, "ఎవరితోనూ మాట్లాడలేను, నేను introvert ని" అంటుంది, "అన్నీ అతిగా మాట్లాడేస్తాను, ADHD" అంటుంది. ఏదైనా పని చేద్దాం అంటే ప్రొక్రాస్టినేషన్ అని చెప్పి, రేపు డెడ్‌లైన్ అయితే ఇంకో గంట ఉందనగా పని మొదలుపెడుతుంది.

ఎదుగుతున్నప్పుడు ఒక మానసిక సమస్య, జీవితంలో ఒక మానసిక సమస్య, సరే, ఇవన్నీ దాటేశాం, ఉద్యోగంలో పడ్డాం అంటే అక్కడో "స్ట్రెస్" అంటూ మానసిక సమస్య. "పెళ్లి చేస్తే సెట్ అవుతారు" అంటూ ఇంట్లోవాళ్ళు పెళ్లి చేస్తారు. అక్కడో మానసిక సమస్య. సరే, అది అయిపోయింది, పిల్లలు పుట్టారు. వారికి ఎదుగుతున్నప్పుడు ADHD, Autism సమస్యలు. సరే, వాటిని పరిష్కరిద్దాం అని అనుకుంటే పిల్లల పెంపకం స్కిల్స్ లేవు, నేర్పేవాళ్ళు దగ్గర ఉండరు కాబట్టి అది ఒక సమస్య.

ఇప్పుడు నేను పైన చెప్పిన సమస్యలన్నీ కలిసి అందరికీ వస్తాయని, ఉంటాయని అనడం లేదు కానీ, ప్రపంచంలో ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. సరే, ఈ సమస్యలన్నీ ఒక ఎత్తు అయితే అసలు వీటిని గుర్తించకపోవడం మరో సమస్య. వీటి గురించి తెలుసుకోలేకపోవడం, అర్థం చేసుకోలేకపోవడం, అర్థమైతే వివరంగా మాట్లాడలేకపోవడం, సహాయం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోలేకపోవడం మరిన్ని సమస్యలు.

ఇలాంటి ఎన్నో మానసిక విషయాలపై, భావోద్వేగ విషయాలపై, వ్యక్తిత్వ శైలిపై, మనసు గురించి దాని స్వభావం గురించి అచ్చ తెలుగులో అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు ఎంతో లోతైన మనసు విషయాలను చక్కగా వివరించారు డాక్టర్ శ్రీకాంత్ మిరియాల గారు. సాధారణంగా ఇటువంటి మానసిక ఆరోగ్యంపై అవగాహన కలిగించే ప్రోగ్రామ్‌లు, పాడ్‌కాస్ట్‌లు విదేశాలలో లేదా భారతదేశంలోని ఇతర భాషల్లోనే ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. అయితే అదృష్టవశాత్తూ, తెలుగువారి కోసం కూడా ఇటువంటి అంశాలపై అవగాహన పెంచేందుకు డాక్టర్ శ్రీకాంత్ మిరియాల గారు 'X' (ట్విట్టర్) వేదికగా వివిధ మానసిక అంశాలపై ఆడియో స్పేసెస్ నిర్వహించారు.

డాక్టర్ శ్రీకాంత్ మిరియాల గారు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి, బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (NIMHANS) నుంచి సైకియాట్రీలో ఎండీ పట్టా పొందారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో మానసిక వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఆయన ఒక మంచి కథకుడు కూడా, వారి వైద్య అనుభవాల ఆధారంగా 'KGH కథలు' అనే పుస్తకాన్ని రాశారు. ఈ మధ్యనే తెలుగులో వారి కొత్త నవల 'జూనియర్ డాక్టర్' కూడా విడుదల అయింది.

సామాజిక మాధ్యమాలలో ఆయన చాలా చురుకుగా ఉంటూ మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆయన ట్విట్టర్ (X) లో నిర్వహించిన 30 కి పైగా ఆడియో స్పేసులను 'దాసుభాషితంలో' శ్రవణ పుస్తకంగా ప్రచురించడానికి అనుమతి కోరగా ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు. దాదాపు 30 కి పైగా ఉన్న ఈ ఆడియోలలో మానసిక ఆరోగ్యం, పిల్లల పెంపకం, Autism & ADHD, emotional awareness, వ్యక్తిత్వ లోపాలు, sexual health, సినిమాల్లో సృజన, మానసిక ఒత్తిడి... ఇలా ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఎంతో వివరణాత్మకంగా చర్చించారు.

ఇప్పుడు ఈ ఆడియోలను వారానికి కొన్ని అధ్యాయాల చొప్పున 'దాసుభాషితం'లో విడుదల చేస్తున్నాము. ఈ వారం విడుదల అవుతున్న అధ్యాయాలు, అందులో మీకు అందే సమాచారం:

1. పిల్లల పెంపకం: ఒకప్పుడు, అంటే ఒక 20, 30 ఏళ్ళు వెనక్కి వెళితే ప్రసవాలు పుట్టినింట్లోనో, మెట్టినింట్లోనో జరిగేవి. మన చుట్టూ బంధు బలగాలు, మిత్ర బలాలు ఉండేవి. పిల్లల పెంపకం ఏమీ అంత అలసటగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు? సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, ఎవరికి వారే ఉండేట్లుగా దూరంగా ఉండే జీవనాలుగా మారిపోయి పిల్లల పెంపకం అలసటగా మారింది. అలా మారడం వలన పిల్లల పెంపకంలో ఎదురైన, ఎదురవుతున్న సమస్యలేంటి అన్న విషయాలు, కొన్ని పరిష్కారాలు మీరు వింటారు. కొందరు అడిగిన ప్రశ్నోత్తరాలు, సమాధానాలు కూడా వింటారు.

2. పిల్లల ఆహారం: పిల్లలు తినడం లేదు అనేది తల్లిదండ్రులకి పెద్ద సమస్య. సరిగా తినడం లేదని చిన్నప్పటి నుంచి చంకన వేసుకుని కొందరు బలవంతంగా తిండి పెడతారు, అదో సమస్య. "పోషకాలు తిను బాబూ" అంటే పిల్లాడు బర్గర్ లాంటిదేదో తింటాను అని మారం చేయడం ఇంకో సమస్య. ఈ విషయంపై చర్చ ఈ అధ్యాయంలో ఉంటుంది.

3. భావోద్వేగ పరిచయం (Emotional Awareness): ఈ మానసిక అవగాహన లేక ఎంతమంది ఏ విధంగా సఫర్ అవుతున్నారో వివరిస్తూ మొదలవుతుంది ఈ చాప్టర్. ఉదాహరణకి, ఉన్న ఊళ్ళోనే ఉండి, ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా అక్కడే ఏదో చదివేసి, బీటెక్ చేసేసి, పెద్దగా నెట్‌వర్క్ పెంచుకోకుండా, తానేం అనుకుంటున్నాడో ఇతరులతో చెప్పలేక, చెప్పకుండా ఉండిపోతూ జీవితంలో భావ వ్యక్తీకరణ చేయలేక కష్టాలు పడుతూ ఉండటం వలన ఎదుర్కొనే వారి సమస్యలు, పరిష్కారాలపై మొదలవుతుంది ఈ చాప్టర్.

4. ఆటిజం: ఆటిజం అంటే ఏంటి? ఎంతమందిలో ఉంటుంది? దానిని ఎలా గుర్తించాలి? అన్న విషయంపై చర్చ.

5. ADHD: అంటే ఏంటి? అది ఏ వయసువారిలో ఉంటుంది? ఎంత కామన్ గా ఉంటుంది? విషయంపై చర్చ ఈ అధ్యాయంలో ఉంటుంది.

ఈ వారం ఇవి వినండి మరి. మానసిక ఆరోగ్యంపై మరిన్ని మనసు కబుర్లు విడుదల చేస్తున్నప్పుడు మరో న్యూస్‌లెటర్లో కలుద్దాం.

link = https://bit.ly/4zzQngv

అభినందనలతో,
Rãm Kottapalli.

గుడ్ ఎర్త్ [VISLESHANA - FREE] వాంగ్ లాంగ్ ధనవంతుడు అవకముందు ఎంతటి దయనీయ స్థితి ను అనుభవించాడో వినండి.https://buff.ly/4w...
20/08/2026

గుడ్ ఎర్త్
[VISLESHANA - FREE] వాంగ్ లాంగ్ ధనవంతుడు అవకముందు ఎంతటి దయనీయ స్థితి ను అనుభవించాడో వినండి.
https://buff.ly/4wKsTmn

మనిషి బతకడానికి కూడు, గూడు, బట్ట అవసరం అని అంటారు పెద్దలు. కానీ ఇందులో ఏవైనా అవసరానికి మించి ఉంటే వాటి మీద నిర్లక....

స్మృతిచిహ్నం [NAVALA] జ్ఞాన తండ్రి విగ్రహాన్ని చేయనన్న ప్రత్యగాత్మ ఎవరి ప్రోత్సాహంతో ఆయన స్మృతిచిహ్నాన్ని తయారు చేశాడో వ...
13/08/2026

స్మృతిచిహ్నం
[NAVALA] జ్ఞాన తండ్రి విగ్రహాన్ని చేయనన్న ప్రత్యగాత్మ ఎవరి ప్రోత్సాహంతో ఆయన స్మృతిచిహ్నాన్ని తయారు చేశాడో వినండి.
https://buff.ly/9ryQiDf

చిన్ననాటి ముచ్చట్లు [VISLESHANA - FREE] జడలో పెట్టుకునే నాగరం విరిగిపోతే దాన్ని అతకపెట్టడానికి కేసరి భార్య చేసిన అమాయకపు...
30/07/2026

చిన్ననాటి ముచ్చట్లు
[VISLESHANA - FREE] జడలో పెట్టుకునే నాగరం విరిగిపోతే దాన్ని అతకపెట్టడానికి కేసరి భార్య చేసిన అమాయకపు పని వినండి.
https://buff.ly/72bFqhj

నుడి - నానుడి  [VYASAM] మనం రోజువారీ వాడే పదాల పుట్టుపూర్వోత్తరాలు వినండి. https://buff.ly/PsCCnvK
23/07/2026

నుడి - నానుడి
[VYASAM] మనం రోజువారీ వాడే పదాల పుట్టుపూర్వోత్తరాలు వినండి.
https://buff.ly/PsCCnvK

రెబకా [VISLESHANA - FREE] తన భర్తే తనను చంపే విధంగా తన నడతను మార్చుకున్న రెబకా దాచిన నిజం ఏమిటో వినండి. https://buff.ly/...
16/07/2026

రెబకా
[VISLESHANA - FREE] తన భర్తే తనను చంపే విధంగా తన నడతను మార్చుకున్న రెబకా దాచిన నిజం ఏమిటో వినండి.
https://buff.ly/hrkLbap

Address

Hyderabad
500070

Alerts

Be the first to know and let us send you an email when Dasubhash*tam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dasubhash*tam:

Shortcuts

Share