HI TV Digital Media

HI TV Digital Media we bring you Latest News, Politics, Current Affairs, Cricket,Sports, Business & cinema news.

Tirupati Airport will be named as“Sree Venkateswara International Airport”Om Namo Venkatesaya!
20/06/2025

Tirupati Airport will be named as

“Sree Venkateswara International Airport”

Om Namo Venkatesaya!

కొత్త కాపురాన్ని చూడటానికి వచ్చిన తండ్రిని Beach కి తీసుకెళ్లాడు కొడుకు. అతడి భార్య కూడా వారితో వచ్చింది. ముగ్గురూ ఇసుకల...
05/05/2025

కొత్త కాపురాన్ని చూడటానికి వచ్చిన తండ్రిని Beach కి తీసుకెళ్లాడు కొడుకు. అతడి భార్య కూడా వారితో వచ్చింది. ముగ్గురూ ఇసుకలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు.

దూరంగా పిల్లలు తడి ఇసుకతో ఇళ్లు కట్టుకుంటున్నారు. Beach అంతా Rush గా ఉంది.

"ఎలా ఉంది కొత్త సంసారం" అని అడిగాడు తండ్రి.

కొడుకు మాట్లాడలేదు. కోడలు మొహమాటంగా నవ్వింది.

ఇంతలో దూరంగా పిల్లల మధ్య గొడవ మొదలయింది. అందులో ఒక కుర్రవాడు పక్కవాడి గూటి మీద కాలు వేయటంతో ఆ ఇసుక ఇల్లు నేలమట్టం అయింది. అందరూ కలిసి వాన్ని కొట్టబోయారు. పెద్దలు వచ్చి వాళ్లను విడిపించి సర్ది చెప్పారు.

“నిన్న రాత్రి చాలాసేపు మీరు ఏదో విషయంలో గొడవ పడుతున్నారు. అర్ధరాత్రి వరకూ మీ మాటలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి” అని తండ్రి అన్నాడు.

“అబ్బే అదేం లేదు మామయ్య గారు” అంది కోడలు.

ఆయన నవ్వాడు “మీకన్నా పాతికేళ్లు పెద్దవాన్ని నా దగ్గర దాచవద్దు. ఏ విషయంలో జరిగింది గొడవ”

“నా Computer ముట్టుకోవద్దని చెబుతూనే ఉంటాను. తనకి Laptop ఉంది కదా. అనవసరంగా నా దాన్ని కెలుకుతూ ఉంటుంది. ఎంతో కష్టపడి తయారు చేసుకున్న File మొన్న Delete అయిపోయింది” నిష్ఠూరంగా అన్నాడు కొడుకు.

కోడలు వెంటనే ”ఎంతో Neatness గా సర్దుకున్న నా Shelf లో బట్టలన్నీ మొన్న మీరు చిందర వందర చేయలేదా? అయినా మీ Watch నా పట్టుచీరల మధ్యన ఎందుకుంటుంది?” అంది కోపంగా.

“పట్టుచీరలు చిందరవందర చేయటం, Computer లో File Delete చేయటం ఒకటేనా?” అన్నాడు మరింత కోపంగా కొడుకు.

ముసలాయన నవ్వాడు “నిన్న కూడా మీరు మొదట్లో చిన్న స్వరంతోనే మాట్లాడుకొని, ఆవేశం పెరిగాక పక్క గదిలో నేనున్నానని కూడా మర్చిపోయి నాకు వినిపించేంత గట్టిగా మాట్లాడుకున్నారు”

ఇద్దరూ సిగ్గుతో తలవంచుకున్నారు. ఈలోపు అప్పటి వరకూ ఆడుకుంటూన్న పిల్లలు అక్కడ నుండి వెళ్లిపోయారు. పెద్దాయన అటే చూస్తూ “ఆ పిల్లలు కొట్టుకోవడం చూసారు కదా. మీకేమైనా అర్థం అయిందా?” అని అడిగాడు. అర్థం కానట్టు చూసారు ఇద్దరూ.

“ఎలాగూ కూలిపోయే ఇసుక గూళ్ల కోసం పిల్లలందరూ కొట్టుకున్నారు. చీకటి పడేసరికి ఆ గూళ్లని అలాగే వదిలేసి వెళ్లిపోయారు. మన జీవితాలు కూడా అంతే. కొంతకాలం బ్రతుకుతాం ఆపై అన్నీ వదిలేసి వెళ్లిపోతాం. ఈ కొద్దికాలం ఎంత సంతోషంగా ఉండాలి? ఎలా సంతోషంగా ఉండాలి? అని ఆలోచించాలి తప్ప Delete అయిపోయిన File కోసం, నలిగిపోయిన పట్టు చీరల కోసం కొట్టుకుని మనసులూ, జీవితాలూ పాడుచేసుకోకూడదు.”

“వివాహం అంటేనే ఒకే వ్యక్తితో చాలాసార్లు ప్రేమలో పడటం”

నిజమే కదా మీ అభిప్రాయం కామెంట్ రాయండి

04/05/2025
సెక్స్ చాలా మధురమైనది అయ్యి ఉంటుంది కానీ జాగ్రత్త కాళ్ళ మధ్యలో విషం కూడా దాగి ఉంటుందేమో.....!!!!!!శృంగార కోరికలు నియత్రణ...
20/04/2025

సెక్స్ చాలా మధురమైనది అయ్యి ఉంటుంది కానీ జాగ్రత్త కాళ్ళ మధ్యలో విషం కూడా దాగి ఉంటుందేమో.....!!!!!!

శృంగార కోరికలు నియత్రణలో ఉంచుకున్న వాళ్ళే ఈ భూమి మీద సుఖ శాంతులతో చాలా రోజులు బ్రతికగలరు...

మనుషులకి (ఆడ) (మగ) లు ఇది అర్ధం చేసుకోవాలి వాళ్ళ కష్టాలకి,పతనానికి ఒక్కోసారి వాళ్ళ కామం తో కూడుకున్న అక్రమ సంబంధాలు కాగలవు...

ప్రతి ఒక్క ఆడ,మగ వాళ్ళ ఆత్మలు మంచిగా ఉండవు,కొందరు రాక్షస స్వభావం కలిగి ఉంటారు,మరి కొందరులో విషం దాచుకుని ఉంటారు
మరికొందరి తల రాత ఇంకొక్కరి జీవితాన్ని నాశనం చేసేలా ఉంటుంది..కాబట్టి జాగ్రత్త గా ఉండండి...!!!!

ప్రతిసారీ మీలో కలిగే కోరికల మాటలు వినకండి ఆది మిమ్మలి తప్పుడు దిశలో తీసుకెళ్ళే అవకాశం ఉంది..
దానితో మీరు అన్ని విధాల నష్టపోతారు....

ప్రతి ఒక్కరిలో అందం,ఫిగర్ చూసి రిలేషన్ కోసం పాకులాడకండి ఇది అంత మోసం,ముఖ్యం గా ఈ సోషల్ మీడియా లో కూడా,నిజమయిన సౌందర్యం నిజమయిన ప్రేమ,రిలేషన్ వాల్యూ దీనికంటే చాలా ఎక్కువ...

చూసిన ప్రతిఒక్కరితో రిలేషన్ కోసం ఎదురు చూడకండి(sex)...
ప్రతిఒక్కరు కావాలి అంటే అందరి శరీరాలు ఒకటే అనుకుని మోసపోకు కొంతమంది పాములు అయ్యి ఉంటారు, మిమ్మల్ని కాటు వేసి మీ జీవితం నాశనం చేసేస్తారూ,మీ సుఖ శాంతులు దూరం చేసేస్తారు...!!
అందుకే కామం తో పాకులాడే వాళ్ళ కంటే నిగ్రహంగా ఉండే వాళ్ళ జీవితాలు ఎంతో గొప్ప గా ఉంటాయి,ఉత్తమఫలితాలు ఇస్తాయి...

ఒక్కరికంటే ఎక్కువ రిలేషన్s కలిగి ఉండటం పురుషత్వం కాదు...
లోకం మిమ్మల్ని,స్త్రీవాది,మోసగాడు పిల్లలు నీ కానీ పడేసే మెషిన్ అనుకుంటారు అంతే చీప్ గా అయ్యే వాడు నిజమయిన మగాడు కాదు....
కేవలం పడక సుఖం కోరుకోవటం నిజమయిన మనసులు కాదు వాళ్ళ వాళ్ళ బాధ్యతలు నుండి దేనికోసమో పారిపోకుండా అన్ని నెరవేర్చుకున్న వాళ్ళే నిజమయిన మనుషులు...

ఒక్కరు ఉంటారు మిమ్మల్ని నిజం గా ప్రేమించే
వాళ్ళు వాళ్ళతో జీవితం పంచుకుంటే చాలు..

ఈ మధ్య ఎక్కడ చూసినా ప్రపంచం మీద ఇంకేమి లేదు ఓన్లీ అక్రమ సంబంధాలు ఉన్నాయి 5min సుఖం కోసం పిల్లలు నీ చంపేస్తున్నారు, మొగుడిని చంపేస్తున్నారు,పెళ్లాలని చంపేస్తున్నారు....దేవుడు ప్రతి మనిషిని ఒకేలా సృష్టించాడు ప్రతిఒక్కరి తో 5min సుఖం ఒకేలా ఉంటుంది కదా???మరి ఎందుకు ఒక్కరి కోసం ఇంకొక్కరిని చంపుకుంటున్నారు....
కొత్త కొత్త వాళ్ళని కోరుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచన చెయ్యండి......
ప్రాణం చాలా విలువైనది..ఒక్కరిని చంపేస్తే వాళ్ళు ఎలాగో చచ్చిపోతారు కానీ నువ్వు కూడా ఏం సుఖంగా ఉంటావు????నీ బ్రతుకు కూడా నాశనమే కదా???....!!!!!

☝️☝️☝️☝️☝️ఏమయినా తప్పు రాసి ఉంటే క్షమించండి 🙏🙏🙏....!!!!

పిన్నీసు కథ... ప్రతిభ కనపర్చిన ఆటగాడి మెడలో వేలాడే మెడల్స్ ఎంత పవర్ ఫుల్లో...ముప్పైఏళ్ళ క్రితం మొలతాడుకూ, స్త్రీల పసుపుత...
19/04/2025

పిన్నీసు కథ...

ప్రతిభ కనపర్చిన ఆటగాడి మెడలో వేలాడే మెడల్స్ ఎంత పవర్ ఫుల్లో...
ముప్పైఏళ్ళ క్రితం
మొలతాడుకూ,
స్త్రీల పసుపుతాడుకూ
వేలాడే సూదిపిన్నీసులు అంతే...!!!

ఆ రోజుల్లో హవాయి చెప్పు తెగిపోతే కాపాడేది పిన్నీసే

మూడు నాలుగు సంవత్సరాలకోసారి కుట్టించే నిక్కరు ఎనకాల కుట్లూడిపోతే కాపాడింది ఆ పిన్నీసే.

ఆ రోజుల్లో ఎప్పుడుపడితే అప్పుడు బట్టలు కొనేవారు కాదు... సంవత్సరానికోసారి, అదైనా పండక్కే.

కాల్లో ముల్లుగుచ్చుకుంటే పిన్నీసుతోనే ఆపరేషన్.

చెవిలో గులిమి (గుబిలి) తీసుకోవాలంటే పిన్నీసే...

ఏదైనా పీచున్న కూర తిన్నరోజున, ఇంకేదైనా నారవంటిది పంట్లో ఇరుక్కున్నా పిన్నీసే దిక్కూ...

చిన్నప్పుడు పెన్ను పత్తి సరిగ్గా రాయకపోతే పాళీని తీసేసి, దానికున్న గాడిలోంచి గడ్డకట్టిన ఇంకును పిన్నీసుతోటే శుభ్రం చేసేవాళ్ళం .

బాల్ పెన్నులో వుండే బాల్ సరిగ్గా తిరగకపోయినా ఆ పిన్నీసుతోటే రిపేరు .

జెండా వందనం రోజున పిల్లలజేబులకి జెండా బొమ్మని పిన్నీసుతోనే పెట్టుకున్న గుర్తు.

అటువంటి పిన్నీసుకు కాలం చెల్లింది అనుకునే టైంలో....

ఇవాళ ఒకబ్బాయి
"అంకుల్,
పిన్నీసుంటే ఓసారివ్వరా?
సెల్లో సిమ్ము తీసుకోవాలి" అన్నప్పుడు నాకు చాలా గర్వంగా అనిపించింది.
మన చిన్నప్పటి పిన్నీసుకు
మళ్ళీ మంచిరోజులు
వచ్చాయా అని?
తప్పకుండా వచ్చినయ్...!

పిన్నీసమ్మ తల్లీ నీక్కూడా ఓరోజుందని తెలిసింది...

సేకరణ పోస్ట్

ఇకనైనా ట్రోల్స్ చేయడం ఆపేయండి ప్లీజ్..
08/04/2025

ఇకనైనా ట్రోల్స్ చేయడం ఆపేయండి ప్లీజ్..

No చెప్పటం నేర్చుకోవాలి..! లేదంటే ఇలాంటి పరిస్థితే వస్తుంది.. మనోడు షాప్ ఓపెన్ చేశాక, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని అందరికీ అప్...
17/03/2025

No చెప్పటం నేర్చుకోవాలి..! లేదంటే ఇలాంటి పరిస్థితే వస్తుంది..

మనోడు షాప్ ఓపెన్ చేశాక, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని అందరికీ అప్పు ఇచ్చాడు కొన్ని సంవత్సరాల తరువాత తనకు మిగిలింది ఇది..!

మన జీవితాన్ని నాశనం చేసేదే మన మొహమాటమే.. ఏమైనా అనుకుంటారు అని అప్పులు ఇవ్వటం ఆహ్ తరువాత అప్పులపాలు అవ్వటం..!

ఆ స్టార్ హీరో పక్కలోకి రమ్మన్నారు, దర్శకుడు కూడా ..-నిఖిల్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అనసూయ సోర్స్ -తెలుగు వన...
06/02/2025

ఆ స్టార్ హీరో పక్కలోకి రమ్మన్నారు, దర్శకుడు కూడా ..
-నిఖిల్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అనసూయ

సోర్స్ -తెలుగు వన్ Feb 3 2025

ఓ స్టార్ హీరో ,ఓ స్టార్ దర్శకుడు సైతం కమిట్మెంట్‌ ఇస్తే
అవకాశం ఇస్తానని చెప్పడంతో రిజెక్ట్ చేశా
దీంతో నాకు సినిమా అవకాశాలు తగ్గాయి

ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి

అయితే
అ హీరో, డైరెక్టర్ ఎవరనేది మాత్రం
అనసూయ బయటపెట్టలేదు.

(హవ్వ ..
కళామతల్లి ముద్దు బిడ్డలు ఇలా కమిట్మెంట్‌ అడుగుతారా ? )

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when HI TV Digital Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share