Idi Ra Matter

Idi Ra Matter మీకు అత్యంత నమ్మకమైన, తాజా వార్తలు అందించే డిజిటల్ చానెల్.

19/04/2026

ఎవరు మమ్మా నేను ముమ్మ నా

19/04/2026

మంచిర్యాల జిల్లాలో అమానుష ఘటన

మందమర్రిలో 6 సంవత్సరాల కూతురు తన మాట వినడం లేదని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి చితకబాదిన తండ్రి సతీష్

చిన్నారి కేకలు విని వీడియో తీసిన పశువుల కాపరి

పశువుల కాపరిని చూసి చిన్నారిని తీసుకొని బైక్ పై పరారైన తండ్రి సతీష్

చిన్నారిని విచక్షణ రహితంగా కొట్టిన సతీష్ పై పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్

19/04/2026

రీల్స్ మోజులో పడి ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలో పల్సర్ బైకుపై అతివేగంతో వెళ్తూ, నాటు తుపాకీ ప్రదర్శిస్తూ వీడియో తీస్తుండగా ఈప్రమాదం జరిగింది.

అదుపు తప్పిన బైకు ఆగి ఉన్న ట్రక్కును బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వీడియో తీస్తున్న మరో బైకు కూడా ట్రక్కును ఢీకొనడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.

19/04/2026

కొందరు నాయకులు నన్ను యాంటీ హిందూలా చూపించాలని కుట్రలు చేస్తున్నారు

తనపై వచ్చిన విమర్శల మీద స్పందించిన నటుడు ప్రకాశ్ రాజ్

ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డు పెట్టుకుని అసహ్యమైన రాజకీయాలు చేసే కొందరు కావాలనే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు

అన్ని ధర్మాలను సమానంగా ప్రేమించే నాకు అవతార పురుషుడు రాముడు గురించి తక్కువగా మాట్లాడే అవసరం లేదు

– ప్రకాష్ రాజ్

17/04/2026

మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు.

ఈ సందర్భంగా తనకు, ప్రధాని మోదీకి భార్య సమస్య లేదంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

‘‘నేను 20 ఏళ్లలో చేయలేని పనిని మా సోదరి 5 నిమిషాల్లో చేసి చూపించింది.

ఆమె ప్రసంగం చూసి చాలా గర్వపడ్డాను. ఆమె హోంమంత్రి అమిత్ షాను నవ్వించారు’’ అని అన్నారు.

17/04/2026

ఈ బిల్లు దేశ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేక బిల్లు: రాహుల్ గాంధీ

దీని ద్వారా దక్షిణాది, ఈశాన్య, చిన్న రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారు

ఓబీసీలు, దళితులు హిందువులే అంటున్నారు.. కానీ, వారిని అధికారంలోకి రానివ్వడం లేదు

- రాహుల్ గాంధీ

11/04/2026

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఏఎస్ఐ రమేష్ నిర్వాకం

ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటల వీడియోలు తీసి బెదిరించి డబ్బులు వసూలు

ఆ వీడియోలు చూపించి కోరిక తీర్చాలంటూ యువతులు, మహిళలను వేధిస్తున్న ఏఎస్ఐ రమేష్

జమ్మలమడకకు చెందిన ఆటో డ్రైవర్ సహాయంతో వీడియోలు తీయిస్తున్న ఏఎస్ఐ

స్థానిక ఎస్ఐ, కానిస్టేబుల్ సైతం ఇదే తరహాలో మహిళలలో వేధిస్తున్నారని ఆరోపణలు

09/04/2026

నా భార్య తన ప్రియుడితో కలిసి నన్ను చంపాలని చూసింది

సూసైడ్ అటెంప్ట్ చేసి.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన వ్యక్తి

రెండు నెలలుగా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసిన భర్త

హైదరాబాద్ – చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటూ గత ఏడాది ఆగస్టు నెలలో మ్యాట్రిమోనీ ద్వారా సమత అనే మహిళను పెళ్లి చేసుకున్న మహేష్ అనే వ్యక్తి

అయితే సమత తన ప్రియుడు ఉపేందర్ గౌడ్ అనే వ్యక్తిని పంపి తనను హత్య చేయించాలని చూసిందని, చైతన్యపురి పోలీస్ స్టేషన్లో రెండు నెలల క్రితం ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని సెల్ఫీ వీడియో విడుదల చేసిన మహేష్

07/04/2026

17 ఏళ్ల మైనర్ బాలికపై ఓ పూజారి అత్యాచారం

ఉత్తరప్రదేశ్‌లోని మధురలో వెలుగు చూసిన దారుణ ఘటన

17 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డ ఓ పూజారి

తనకు జరిగిన ఈ అఘాయిత్యంపై రోడ్డుపైకి వచ్చి.. బాధితురాలు ఆక్రందన

ఈ పూజారి నన్ను రేప్ చేశాడు.. అతడిపై చర్యలు తీసుకోండంటూ తీవ్ర ఆగ్రహం

కళ్ల ముందే బాధితురాలు ఇంతలా రోదిస్తున్నా.. చోద్యం చూస్తున్న పోలీసులు **e

06/04/2026

హిమాచల్ ప్రదేశ్‌లోని ఊనా జిల్లాలో జామకాయలు దొంగలించి తిన్నదని చిన్నారి అని కూడా చూడకుండా కొట్టి, చిన్నారి ఏడుస్తున్నా ప‌ట్టించుకోకుండా కట్టేసిన మాజీ జవాన్

05/04/2026

మాదాపూర్ లో స్కూటీని ఢీకొట్టి 5 కిలోమీటర్లు లాక్కెళ్లిన డీసీఎం

స్కూటీపై వెళ్తున్న అయేషా(22), అబ్దుల్ బాసిత్ అనే దంపతులను ఢీకొట్టి దాదాపు 5 కిలోమీటర్లు లాక్కెళ్లిన డీసీఎం

జూబ్లీహిల్స్ వద్ద డీసీఎంను అడ్డుకుని, క్లీనర్‌ను పోలీసులకు అప్పగించిన యువకులు

డ్రైవర్ పారిపోగా, గాయపడిన దంపతులను ఆసుపత్రిలో చేర్చిన స్థానికులు

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అయేషా మృతి

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

03/04/2026

వీణ హర్ష పై దాడి చేసిన తాతం శెట్టి నాగేంద్ర

Address

Hyderabad
500 ###, 501 ###, 502 ###.

Website

Alerts

Be the first to know and let us send you an email when Idi Ra Matter posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share