
21/06/2025
కొందరు ఎడారి లో పుట్టి
ఎడారి లో పెరిగి
ఎడారి లో ఆనందం గా బతుకుతుంటారు
కొందరు
ఎడారి లో
పుట్టకున్నా
ఎడారి లో పెరగకున్నా
బతుకే ఎడారి అయిపోతుంది
జీవితం కొందరికి
జీవిత కాల దుఃఖాన్ని
కొందరికి
జీవిత కాల సుఖా న్ని
పంచుతుంది
జీవితం చేతి లో బంధీ అయ్యే వారు కొందరు
జీవితాన్ని తమ చేతుల్లోనే ఉంచుకునే వారు చాలా తక్కువ మంది
కష్టాలను కౌగిలించుకొని
కన్నీళ్లను ప్రేమించడం
ఒక కళ
పూల దారి లో
ఎవ్వడైనా నడవగలడు
డబ్బుంటే ఎవ్వడైనా
కొండ మీది కోతి ని కొనగలరు
గుండెల్లో ధైర్యం తప్పా
జేబులో ఏమీ లేనప్పుడు
నీ ఆస్తి నీవే
నీ పాస్తి
నువ్వు ఇష్టపడే పస్తులే
ఒంటి మీద
దుస్తులు
కాళ్ళ కు చెప్పు లు సరిగ్గా
లేనప్పుడు
నిజమైన నిన్ను ఇష్టపడే వాళ్లు
ఎవ్వరూ ఉండరు
ఒక్క రోడ్డు,ఫుట్ పాత్ తప్పా
ఐనా
ఈ ప్రపంచం ముందు
ఏ ఒక్కడి ముందు మోకరిల్లవు చూడూ
అదీ నువ్వు