15/10/2025
పాడుబడిన బోరుబావి.... పైకి వస్తున్న పాతాళ గంగమ్మ...
వరంగల్ జిల్లా:
వర్ధన్నపేట మండలం కట్ర్యాలలో వింత ఘటన.. 15 ఏళ్ల క్రితం వేసిన బోరులోనుంచినీరు పైకి ఊబికి వచ్చింది. పాడు బడిన బోరులోంచి నీరు రావడానికి చూసి స్థానిక రైతులు ఆశ్చర్యం గురి అయ్యారు ఈ వింత ఘటన చూసి రైతు కిరణ్ నిర్గాంత పోయాడు. తనకున్న ఎకరం పొలం కోసం 15 ఏళ్ల క్రితం 200 ఫీట్లు బోరువేయగ నీటి చుక్క కూడా రాకపోవడంతో వదిలేసామన్నారు....
ఇన్ని సంవత్సరాల పాటు పాడుబడిన బోరు నుంచి నీరు దారాళంగా ఊబికి రావడం గంగమ్మ చలవే అంటూ రైతు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
విద్యుత్ ప్రమేయం లేకుండానే పాడుబడిన బోరు నుంచి నిర్విరామంగా వస్తున్న నీటిని తన పంట సాగుకు వినియోగిస్తున్నట్లు రైతు కిరణ్ తెలపగా,,,,,
ఇదొక వింత ఘటనగా చెప్పుకొచ్చారు...