03/11/2024
ఋషికొండ పై ప్రజా కోర్టులో చర్చ జరగాలి
👉 ప్రజాస్వామ్య వాదులంతా ముక్త కంఠంతో ఖండించాలి
👉 ఋషికొండ పై భవనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి
👉 ఋషికొండ పై మీడియా తో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
విశాఖపట్నం, నవంబర్ 02:: ఋషికొండ పై ప్రజా ధనం తో తన స్వార్ధం కోసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించిన విలాసవంతమైన భవనాలపై ప్రజా కోర్టులో చర్చ జరగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం ముఖ్యమంత్రి ఋషికొండ ప్యాలస్ లో బ్లాక్ ల వారిగా తిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం
మీడియా తో మాట్లాడుతూ
ప్రజాస్వామ్యoలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయా అని ఆశ్చర్యం కలుగుతుందని,
ఇలాంటివి సాధ్యమా అనిపించిందని పేర్కొన్నారు.
ఒక వ్యక్తి తన విలాసవంతమైన జీవితం కోసం తన స్వార్ధం కోసం ఇలాంటి కట్టడాలు చేస్తారాయని,
గుండె చేదిరిపోయే నిజాలు ఇక్కడ కనిపించాయని అన్నారు.
ఇలాంటి నేరాలు చెయ్యడానికి చాలా గుండె ధైర్యం కావాలని,
ఈ ప్యాలస్ చూడడానికి నేను నా మిత్రుడు పవన్ కళ్యాణ్ బిజెపి నాయకులు ప్రయత్నం చేసామని వెళ్లలేకపోయామని తెలిపారు. చాలా దేశాలు తిరిగాను కానీ పర్యావరణాన్ని విధ్వంసం చేసి ఒక ముఖ్యమంత్రి ఇలాంటి ప్యాలస్ కట్టడం ఎక్కడా చూడలేదని అన్నారు.నిజాం ప్యాలెస్ పలక్నుమా ప్యాలెస్ చూసా
ఈ ప్యాలస్ చూస్తే ఆశ్చర్యం ఉద్వేగం కలిగిందన్నారు.
Take a look at this OnePlus Buds 3 TWS, in Ear Earbuds with Sliding Volume Control and 49dB ANC Bluetooth Gaming on Flipkart
https://dl.flipkart.com/s/MtFGSLNNNN
ఉత్తరాంధ్ర ఇరిగేషన్ కోసం 400 కోట్లు ఖర్చు పెట్టలేదు కానీ 430 కోట్ల తో ఈ ప్యాలెస్ కట్టాడని, ఒక రాజులా, చక్రవర్తిలా భవించాడని అన్నారు. 7 బ్లాక్ లలో 13,548 చ.మీటర్లలో కట్టడమే కాకుండా చుట్టూ ఉన్న 18 ఎకరాలను జపాన్ టెక్నాలజీ తో కొండ చుట్టూ ప్రొటెక్షన్ కట్టించారని అన్నారు. పి.ఎం, ప్రెసిడెంట్ ల విడిది కోసం కడుతున్నామని అన్నారు..వారు నావెల్ గెస్ట్ హౌస్ లొనే ఉన్నారు, వారు ఇలాంటి పాలస్ ను కట్టమని అడగలేదు గదా అని అన్నారు.
టబ్ కి 36 లక్షలు,
కమోడ్ కు 12 లక్షలు ఖర్చు చేశాడని, 9.88 ఎకరాల్లో 7 బ్లాక్ లతో విలాసవంతమైన ప్యాలస్ ను పర్యావరణానికి విధ్వంసం చేసి నిర్మించడాన్ని ఏ ఒక్కరూ హర్షించరని తెలిపారు. పాలస్ సమూహం దేనికి ఉపయోగ పడుతుందో తెలియడం లేదన్నారు. దేశం లో అత్యంత అరుదైన ప్రదేశం..దేనికీ పనికి రాకుండా భవంతులు కట్టేశారు, ఈ ప్రాంత సరిహద్దుల్లో కి ఎవరిని రాకుండా కట్టడి చేసి, ఎన్జీటి, హైకోర్టు, కేంద్ర ప్రభుత్వాలను మభ్య పెట్టి, అధికారులను భయ పెట్టి , ప్రజల్ని మోసం చేసారని పేర్కొన్నారు. కళింగ బ్లాక్ లో 300 మందికి కాన్ఫిరెన్స్ హాల్ ను నిర్మించారని, అప్పట్లో ఉన్న రాజులకు కూడా ఇలాంటి ఆలోచనలు లేవని,
వేంగి బ్లాక్ ఈ పేరేంటో అర్ధం కాలేదని అన్నారు.
100kv సబ్ స్టేషన్ ,
200 టన్నుల సెంట్రల్ Ac, ఎటు చూసినా సముద్రం కనపడేలా వ్యూ తో నిర్మించారని, ఇలాంటి వ్యక్తులు రాజకీయాలలో ఉండడం భావ్యమా అనే అంశం పై చర్చ జరగాలని అన్నారు.
కాపిటల్ నిర్మిస్తామని ప్రజల్ని మభ్య పెట్టి ప్రజా ధనాన్ని మంచినీళ్లు లా ఖర్చు చేసారని అన్నారు.
ఆంధ్ర ఎస్కోబా...జగన్ అని, ప్రజల పై గౌరవం ఉంటే వీటన్నిటికీ సమాధానం చెప్పాలని అన్నారు. ఇంతవరకు
నేను సిద్ధాంతపరమైన , రాజకీయపరమైన, పోరాటాలు చేసానే కానీ దొంగలతో పోరాటం చేయవలసి వస్తోందని అన్నారు. ఇలాంటి బరితెగింపు ఏ ముఖ్యమంత్రి చేయలేదని, ఈ ఆరాచకాలన్నింటిని ప్రజల ముందు పెడతామని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి బాల వీరంజనేయ స్వామి, పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్, మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ, ఎం.పి లు భరత్, కలిశెట్టి అప్పల నాయుడు, శాసన సభ్యులు వంశీ కృష్ణ యాదవ్, గంట శ్రీనివాస రావు, కోండ్రు మురళి, పళ్ళ శ్రీనివాస్, రామకృష్ణ బాబు, పర్యాటక శాఖ సెక్రటరీ వినయ్ చంద్ , జిల్లా కలెక్టర్ హరేంధీర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు .
Buy OnePlus Buds 3 TWS, in Ear Earbuds with Sliding Volume Control and 49dB ANC Bluetooth Gaming for Rs.6499 Online, Also get OnePlus Buds 3 TWS, in Ear Earbuds with Sliding Volume Control and 49dB ANC Bluetooth Gaming Specs & Features. Only Genuine Products. 30 Day Replacement Guarantee. Free Shipp...