06/10/2024
*నవంబర్ నెలలో గుంటూరులో చర్చా గోష్ఠి ఉంటుంది.ఈ పుస్తకం చదివి పాల్గొనాలి.*
*భారతీయ నాస్తికవాదం*
*INDIAN ATHEISM*
*ఆంగ్లమూలం దేవీప్రసాద్ చటోపాధ్యాయ*
*తెలుగు అనువాదం డా॥ రెంటాల శ్రీవెంకటేశ్వరరావు*
*ధర_₹300 కాపీ_కోసం 9490098654*
*తెలుగులో తత్వశాస్త్రంమీద వచ్చిన రచనలు చాలా తక్కువ.మతశాస్త్రం (థియోలజీ) మీద కూడా రాలేదు.మతం పేరుతో వచ్చాయి.ఇతిహాసాలమీదా పురాణాలమీదా అసంఖ్యాకంగా వస్తూనే ఉన్నాయి. కానీ శాస్త్రీయమైన రచనలు అనదగ్గవి బహు తక్కువ. అందుచేత, 'భారతీయ నాస్తికవాదం' చదవాల్సిన రచన.*
*నాస్తికత ధోరణుల్ని వివరించడమే కాక,ఇన్ని నాస్తిక శాఖలూ, ఇందరు పండితులూ ఉండి కూడా ఎందుకు సమాజం ఇప్పటికీ మతం పట్టులో ఉండిపోయింది అన్న ప్రశ్నకి ఆలోచనా పూర్వకమైన సమాధానాన్ని కూడా ఇచ్చింది ఈ రచన.*
*నిజానికి ఇది చదవాల్సిన పుస్తకం కాదు. అధ్యయనం చెయ్యాల్సిన పుస్తకం. మెదడుకు శాస్త్రీయమైన ఆలోచనా విధానాన్ని మప్పడంకోసం అయినా అధ్యయనం చెయ్యాల్సిన పుస్తకం, భగవంతుడు న్నాడని ఆస్తికులు.లేదని నాస్తికులు చెప్పిన రుజువుల్ని,వాదనల్ని, ఖండన భండనల్ని చదవడం బుద్ధికి శిక్షణ.*
*దేవీప్రసాద్ చటోపాధ్యాయ (1918-93) పేరెన్నిక గన్న మార్క్సిస్టు తత్వవేత్త,ప్రాచీన భారతదేశంలో విజ్ఞానశాస్త్రం గురించి, తత్వశాస్త్రం గురించి, అరుదైన పరిశోధనలు జరిపిన మేధావి. పద్మభూషణ్ పురస్కార గ్రహీత.*
*డా॥ రెంటాల శ్రీవెంకటేశ్వరరావు కవిగా, విమర్శకుడిగా, వక్తగా,అనువాదకుడిగా తెలుగు పాఠకులకు సుపరిచితులు. విశేషించి గజల్ రచయితగా ప్రసిద్ధులు. ఇప్పటి వరకూ సుమారు 4000 పుటల అనువాద రచనలు ఇచ్చిన కలం వారిది.*