AIR Kadapa

AIR Kadapa Tune AIR - Kadapa at 900kHz in MW Radio Transister. Listeners around kadapa town can tune in their Mobile FMs at 103.6 Mhz

Radio of Rayalaseema, more than 50 years of broadcasting wonderful programs, old Songs & Voices for Rayalaseema Listeners and also in parts of AP, Telangana, Karnataka, Tamil Nadu.

❤️శ్రోతల కోరిక మేరకు_ "పంచతంత్ర కథలు"_పునః ప్రసారం చేస్తుంది మీ ఆకాశవాణి కడప కేంద్రం❤️ ఒక మంచి పుస్తకం  జీవితానికి ప్రేర...
29/02/2024

❤️శ్రోతల కోరిక మేరకు_ "పంచతంత్ర కథలు"_పునః ప్రసారం చేస్తుంది మీ ఆకాశవాణి కడప కేంద్రం❤️

ఒక మంచి పుస్తకం జీవితానికి ప్రేరణగా నిలుస్తుంది. వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుతుంది. మనలో మనం మంచి,చెడులను గురించి తర్కించుకునెలా చేస్తుంది. అందుకే మనిషి జీవితంలో సాహిత్యానికి ఎప్పుడూ గొప్ప స్థానం ఉంటుంది. లోకంలో మన చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల అవగాహన పొందాలన్నా.. లౌక్యాన్ని పెంచుకోవాలన్నా.. వికాసాన్ని పెంపొందించు కోవాలన్నా ..నీతి గ్రంథాల పఠనం అత్యంత ఆవశ్యకం. అందుకే చిన్నప్పుడు మన స్కూళ్లలో *Moral Science* పేరుతో నీతి శాస్త్ర అధ్యయనాన్ని తప్పనిసరి చేశారు.

తెలియని విషయాన్ని పెద్దలకు శాస్త్రంగా బోధించవచ్చు. కానీ పిల్లలకు అలా కాదు. వారికి ఏ విషయమూ అంత వేగంగా అర్థం అయ్యే అవకాశం లేదు. అందుకే మన పూర్వకాలంలో గురువులు అందుకు ఏకైక మార్గంగా "కథలు చెప్పడాన్ని" ఎంచుకున్నారు.ఇటీవల పిల్లలు పెద్దలు తేడా లేకుండా అన్ని వయసుల వారు ఆసక్తి కనబరచేవి ఈ పంచతంత్ర కథలు .....

❤️మీకు నచ్చిన... మీరు మెచ్చిన కథలు... మళ్ళీ మీ ముందు తెస్తుంది మీ ఆకాశవాణి కడప కేంద్రం❤️

నీరు తక్కువగా తాగేవారి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రాళ్లు రకరకాల పరిమాణంలో ఉంటాయి. లవణాలు, ఖనిజాలు, కాల...
27/02/2024

నీరు తక్కువగా తాగేవారి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రాళ్లు రకరకాల పరిమాణంలో ఉంటాయి. లవణాలు, ఖనిజాలు, కాల్షియం, యూరిక్ ఆమ్లాలు మూత్రపిండాల్లో చేరి కఠినమైన రాళ్లుగా రూపాంతరం చెందుతాయి.అప్పుడు కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి.
మూత్రపిండాలకు సహజంగా వచ్చే సమస్యలేంటి? కిడ్నీకి ఏ సమస్యలు వస్తాయి?
మూత్రనాళంలో వచ్చే ఇబ్బందులేంటి?
బ్లాడర్ ఎలా దెబ్బతింటుంది?
ప్రోస్టేట్ సమస్యలేంటి?
కిడ్నీలో రాళ్లు ఉంటే ఎక్కడ నొప్పి వస్తుంది? యూరిన్ మిగిలిపోతోందా?
యూరిన్‌కి వెళ్తే మంటగా ఉంటోందా?
ఇలాంటి సందేహాలకు సమాధానాలను❤️ డాక్టర్ గారి సలహాల ❤️_ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో తెలుసుకోండి.....మీ ఆకాశవాణి కడప కేంద్రం నుండి 👉👂📻🎶🎵

మన భావాలను వ్యక్తపరిచేందుకు తెలుగులో అయితేనే బాగా చెప్పగలం. మాతృభాషతోనే మనిషి జీవితం మెుదలవుతుంది. అమ్మ నేర్పించే మాతృభా...
20/02/2024

మన భావాలను వ్యక్తపరిచేందుకు తెలుగులో అయితేనే బాగా చెప్పగలం. మాతృభాషతోనే మనిషి జీవితం మెుదలవుతుంది. అమ్మ నేర్పించే మాతృభాష అమృతం లాగా ఉంటుంది.
తెలుగు భాష ను రక్షించుకోవడానికి 1999లో 30వ యునెస్కో మహాసభ.. ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రకటించింది. ఆత్మగౌరవాన్ని ప్రసాదించే...,
అమ్మ భాషను గౌరవించడం ప్రతీ ఒక్కరి బాధ్యత.
ఏ జాతి అయితే మాతృభాషను కీర్తిస్తుందో ఆ జాతి మరింత అభివృద్ధి చెందుతుంది. ఇక తెలుగు భాష విషయానికి వస్తే.. వేల ఏళ్ల నుంచి మనుగడలో ఉంది..కాలం మారుతుంది. భాషలో కాస్త మార్పులు రావొచ్చు. అయితే అందులోని మాధుర్యం మాత్రం అలానే ఉంది. అది తెలుగు భాష గొప్పదనం.
అటువంటి తెలుగు భాష ఔనత్యాన్ని గురించి,పరిరక్షణకు జరుగుతున్న కృషి గురించి పరిచయాన్ని వినండి.... 👉👂📻🎶🎵
❤️మీ ఆకాశవాణి కడప కేంద్రం నుండి ❤️

ఆరోగ్య సమస్యలు అందరికీ ఉంటున్నాయి కానీ చిన్న వయస్సులోనే తట్టుకోలేనంత  ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి ,వీటికి కారణం ఏమాత్...
20/02/2024

ఆరోగ్య సమస్యలు అందరికీ ఉంటున్నాయి కానీ చిన్న వయస్సులోనే తట్టుకోలేనంత ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి ,వీటికి కారణం ఏమాత్రం తీరిక దొరకని ఉరుకులు పరుగుల జీవితం ఒకవైపు, మరోవైపు మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడం.లైఫ్‌లో సెటిల్ అవ్వాలన్న ఆలోచనలు, ప్రతికూల ఆర్థిక పరిస్థితులు, వృత్తిపరమైన ఒత్తిళ్లు,ఇతర ఇతర కారణాలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి....
ఫలితంగా బిపి, షుగర్, థైరాయిడ్ లాంటి సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి...

మీ సమస్యలు సందేహాలకు నేరుగా సమాధానాలు తెలుసుకోండి " డాక్టర్ గారి సలహాలు "- ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో.....
❤️మీ ఆకాశవాణి కడప కేంద్రం నుండి ❤️👉👂📻🎶🎵

రోడ్డు భద్రత మన అందరి బాధ్యత.దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలతో రోజుకు 1.50 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని, 6 లక్షల మంది...
09/02/2024

రోడ్డు భద్రత మన అందరి బాధ్యత.దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలతో రోజుకు 1.50 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని, 6 లక్షల మంది క్షతగాత్రులవుతున్నారని,నిమిషానికి ఒక యాక్సిడెంట్‌లో ఒక్కరు మృత్యువాత పడుతున్నారని , డ్రైవర్ల నిర్లక్ష్యంతోనే సుమారు 90 శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి..
రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే మీతో పాటు మరొకరి ప్రాణాన్ని కూడా కాపాడినవారవుతారు.

రహదారి భద్రత గురించి పరిచయం వినండి ....❤️మీ ఆకాశవాణి కడప కేంద్రం నుండి❤️👉👂📻🎵🎶

కుటుంబంలో అందరి ఆరోగ్యాన్ని  మహిళలు జాగ్రత్తగా చూసుకుంటారు కానీ వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోరు.కానీ అన్ని దశలలో మహిళలు ఎ...
05/02/2024

కుటుంబంలో అందరి ఆరోగ్యాన్ని మహిళలు జాగ్రత్తగా చూసుకుంటారు కానీ వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోరు.కానీ అన్ని దశలలో మహిళలు ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. హార్మోన్ల మార్పులు, రక్తహీనత పీరియడ్స్, ప్రెగ్నెన్సీ కారణంగా వారు ప్రతిరోజూ ఏదో ఒక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది..
స్త్రీలకు సంబంధిన అన్ని రకాల సమస్యలు - సందేహాలకు సమాధానాలు తెలుసుకోండి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో....
👉👂📻🎵🎶
❤️మీ ఆకాశవాణి కడప కేంద్రం నుండి ❤️

ఈ ప్రపంచంలో తండ్రి, తల్లి, కుమారులు, అన్నదమ్ములు భార్య, సేవకుడు, ఆదర్శవంతంగా ఎలా ఉండాలో సవివరంగా తెలిపిన మహా కావ్యము రామ...
02/02/2024

ఈ ప్రపంచంలో తండ్రి, తల్లి, కుమారులు, అన్నదమ్ములు భార్య, సేవకుడు, ఆదర్శవంతంగా ఎలా ఉండాలో సవివరంగా తెలిపిన మహా కావ్యము రామాయణము. రామాయణములోని పాత్రలే మనకు ఆదర్శములు అనడంలో అతిశయోక్తి లేదు.
రామాయణంలో వ్యక్తిత్వ వికాసం గురించి ధారావాహిక ప్రసారం అవుతుంది ...
వినండి.......👉👂📻🎵🎶..... ❤️మీ ఆకాశవాణి కడప కేంద్రం నుండి ❤️

తల్లి తండ్రులు పిల్లల చదువు విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. స్కూల్ కి పంపిస్తున్నాము  అక్కడ ఉపాధ్యాయులే చదివిస్తారులే ...
01/02/2024

తల్లి తండ్రులు పిల్లల చదువు విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. స్కూల్ కి పంపిస్తున్నాము అక్కడ ఉపాధ్యాయులే చదివిస్తారులే అన్న ధోరణిలో తల్లితండ్రులు ఉండకూడదు. పిల్లల చదువు విషయంలో తల్లితండ్రులు కూడా బాధ్యత వహించాలి. ముందుగా పిల్లలను బాగా చదివించాలంటే.. ముందు వారికి చదువు పట్ల ఉన్న భయం అనేది పోగొట్టాలి.చదువు పట్ల ఇష్టాన్ని పెంచాలి.చదువుకుంటే సమాజంలో వచ్చే పేరు, ప్రతిష్టల గూర్చి పిల్లలకు వివరంగా చెప్పాలి...

మరి మహిళా శ్రోతలు మీ అమూల్యమైన అభిప్రాయాలను ఈరోజు మహిళా భారతి కార్యక్రమం లో మాతో పంచుకోండి.... 👉👂📻🎵🎶
❤️ మీ ఆకాశవాణి కడప కేంద్రం నుండి ❤️

దంత క్షయం అనేది మీ నోటిలోని సూక్ష్మక్రిములు లేదా బ్యాక్టీరియా మీ దంతాలను తినే యాసిడ్‌లను తయారు చేసినప్పుడు సంభవించే నష్ట...
30/01/2024

దంత క్షయం అనేది మీ నోటిలోని సూక్ష్మక్రిములు లేదా బ్యాక్టీరియా మీ దంతాలను తినే యాసిడ్‌లను తయారు చేసినప్పుడు సంభవించే నష్టం, ఇది కుహరం అని పిలువబడే రంధ్రానికి దారి తీస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే, ఈ పరిస్థితి ఇన్ఫెక్షన్, తీవ్రమైన నొప్పి లేదా దంతాల నష్టం కూడా కలిగిస్తుంది.
దంత సమస్యలపై మీ ప్రశ్నలు సమాధానాల కోసం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం లో పాల్గొనండి...
❤️ఆకాశవాణి కడప కేంద్రం... ❤️👂👉📻🎵🎶

కృత్రిమ మేధ మానవ మేధస్సుకు మించినది, మన సామర్థ్యాలను అధిగమిస్తుంది మరియు ఏ పనిలోనైనా మనల్ని మించిపోతుంది. అయితే, ఇది ప్ర...
28/01/2024

కృత్రిమ మేధ మానవ మేధస్సుకు మించినది, మన సామర్థ్యాలను అధిగమిస్తుంది మరియు ఏ పనిలోనైనా మనల్ని మించిపోతుంది. అయితే, ఇది ప్రస్తుతానికి సైద్ధాంతికంగానే ఉంది. కృత్రిమ మేధస్సును బాగా అర్థం చేసుకోవడానికి మరియు దాని ప్రయోజనాలు తెలుసుకోవడానికి కృత్రిమ మేథో విప్లవం ధారావాహిక వినండి .... 👉👂🎶🎵📻 ❤️మీ ఆకాశవాణి కడప కేంద్రం నుండి ❤️

27/01/2024

Address

Kadapa

Alerts

Be the first to know and let us send you an email when AIR Kadapa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category