06/08/2025
గెలుపే లక్ష్యంగా ప్రచారం.
పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నిక ల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
ఈరోజు పులివెందుల లోని నల్లపురెడ్డి పల్లె గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎన్.డి విజయ జ్యోతి మరియు రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి, పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జ్ ధ్రువ కుమార్ రెడ్డి లు పర్యటించి అక్కడి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నుండి పొందిన ఫలాలు వివరించి జెడ్పిటిసి ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న శివ కళ్యాణ్ రెడ్డికి ఓటు వేసి వేయించి గెలిపించాలని పులివెందులలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నది ఇప్పుడు మళ్లీ పులివెందుల జడ్పిటిసి గెలిచి మళ్లీ పాత రోజులు రావాలని అలాగే పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి కోరిక కూడా అందువల్ల మళ్లీ ఒకసారి కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ సయ్యద్ గౌస్ పీర్, కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సిరాజుద్దీన్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్, మైనార్టీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ మైనుద్దీన్, డివిజన్ ఇన్చార్జులు హరి ప్రసాద్, కరీం, ముబారక్ భాష, కమల్ భాష, సిద్ధిక్, షామీర్ హుస్సేన్ , జాహోర్ , కాంగ్రెస్ పార్టీ రైతు జిల్లా అధ్యక్షుడు చిన్న రామిరెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ జిల్లా అధ్యక్షురాలు సంజయ్ కాంత ,బద్వేల్ పట్టణ అధ్యక్షుడు పగడాల నరసింహ, బద్వేల్ మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గంగయ్య, పెండ్లిమర్రి మండల పార్టీ అధ్యక్షుడు మహబూబ్ భాషా, వేముల మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రఫీ , భాష, నాయబ్ రసూల్ , కార్య కర్తలు తది తరులు పాలుగొన్నారు