Kadapa Times

Kadapa Times Kadapa Times Provides News and more Activities across the YSR Kdapa District, Do follow our Page for more updates
(226)

మాది రాయలసీమ,...
రాగిసంగటి మాది.. రాళ్ల సేద్యం మాది..
సజ్జ.. జొన్న.. కొర్ర.... ఏదైన సంగటని..
ఎరిగినోడికే తెలుసు.. యెర్రోడికేం తెలుసు..
తాత తండ్రుల నుంచి తరతరాల నుంచి..
సీమకే ఎరుక మరి.. సిటీయోడికి ఏమెరుక..
ఆవు.. గేదెలేవైన మనుషులే మా ఇంట..
వేరులేదు మూగజీవాలకూ మాకు..
పశుభాషతో మేమూ పలకరించుతాము..
పాడియావునైన.. సేద్యపు ఎద్దునైనా..
మీసాలు మెలిదిప్పె రోషమే ఆభరణం..
పసిడి ఉంగరపేలైన... పేడనెత్తుట మా నైజం..

రాయలేలాడో లేదో ఎరుక లేదు కాని..
రాజసం మా నడక.. రామచంద్రుడి లెక్క..
కాపోడు కాడెత్తు.. కూలోడు పనిబట్టు..
కలిసి తినడం తప్ప... కులము పట్టింపులేదు..
వావి వరసల మసులు ధనికుడైన పేద దళితుడైనా..
అయ్య.. మామ.. అనుచు.. అత్త.. పెద్దమ్మనుచూ..
నోరార పిలుచుకొనే పల్లె గడపలు మావి..
అన్నమని అడిగితే లేదనదు మా గడప..
గొడ్డు కారమైన ముద్దపైనేసి...
కడుపు నింపుట తెలుసు కల్మషము లేకుండ.
ఇది మా రాయలసీమ... రతనాల కరువుసీమ.

24/12/2025

To the esteemed Management of Kadapa,

We commend your exceptional work in installing fencing on the bridges across the Buggavanka River. We kindly request that you also assess the condition of the roads atop these bridges, which currently feature potholes and manholes. We urge you to address these issues promptly to ensure the safe and smooth passage of vehicles. The current road conditions are causing damage to vehicles, including tires, and we request your immediate attention to this matter. Thank you.

Kadapa Municipal Corporation Srinivasa Reddy Reddeppagari YS Avinash Reddy District Collector, YSR Kadapa District Kadapa District

11/12/2025

కడప నగర నూతన మేయర్ గా పాక సురేష్..కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా ఆమోదించిన వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు...
10/12/2025

కడప నగర నూతన మేయర్ గా పాక సురేష్..
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా ఆమోదించిన వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు..
రేపు ఉదయం 11 గంటలకు నగరపాలక సంస్థ కార్యాలయంలో నూతన మేయర్ గా పాక సురేష్ ఎన్నిక, ప్రమాణ స్వీకారం...

24/11/2025

కడప నగరంలో గంజాయి, నిషేధిత మత్తు పదార్థాలు సేవించే వారిపై, అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా...**✅ జిల్లా పోలీ...
15/11/2025

కడప నగరంలో గంజాయి, నిషేధిత మత్తు పదార్థాలు సేవించే వారిపై, అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా...*

*✅ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జల్లెడ పడుతున్న పోలీసులు*

*✅ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక*

కడప నవంబర్ 15: గంజాయి, అసాంఘిక కార్యకలాపాల, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవించే వారిపై కఠిన చర్యలకు పోలీస్ అధికారులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు కడప నగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవనం, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది అత్యాధునిక డ్రోన్ కెమెరాల సాయంతో నిఘా ఉంచేలా చర్యలు చేపట్టారు. కడప వన్ టౌన్ సి.ఐ చిన్న పెద్దయ్య ఆధ్వర్యంలో ఎస్.ఐ అమర్ నాథ్ రెడ్డి స్పెషల్ పార్టీ సిబ్బంది తో కలిసి ఆయా ప్రాంతాలను జల్లెడ పట్టారు. అనుమానస్పదంగా సంచరించే వారిపై నిఘా ఉంచడం తో పాటు గంజాయి ని సేవించే వారిని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిని గుర్తించేందుకు విస్తృత చర్యలు చేపట్టారు. శనివారం నగరంలోని బుగ్గవంక పరివాహక ప్రాంతం, గుర్రాల గడ్డ, పాత బస్సు స్టాండ్ వెనక ప్రాంతం, పరిసరాలలో డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచడం ద్వారా అనుమానాస్పదంగా సంచరించే వారిని గుర్తించే చర్యలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా విచారిస్తున్నారు. స్పెషల్ పార్టీ సిబ్బంది, డ్రోన్ ఆపరేటర్ పాల్గొన్నారు.

జిల్లా పోలీస్ కార్యాలయం, కడప.

కడప జిల్లా మైదుకూరు మండలం తువ్వపల్లి సమీపంలో మైదుకూరు బద్వేల్ రహదారి పై రోడ్డు ప్రమాదం..!!కడపకు చెందిన ఇద్దరు యువకులు దు...
10/11/2025

కడప జిల్లా మైదుకూరు మండలం తువ్వపల్లి సమీపంలో మైదుకూరు బద్వేల్ రహదారి పై రోడ్డు ప్రమాదం..!!

కడపకు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం...

సంఘటన స్థలానికి చేరుకున్న మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు...

బద్వేల్ లో ఘనంగా జరుగుతున్న కార్తీకమాసం మూడోవ సోమవారం వేడుకలు.... బద్వేల్ పట్టణంలోని శ్రీ మల్లేశ్వర స్వామి వారికి జీడిపప...
10/11/2025

బద్వేల్ లో ఘనంగా జరుగుతున్న
కార్తీకమాసం మూడోవ సోమవారం వేడుకలు....

బద్వేల్ పట్టణంలోని శ్రీ మల్లేశ్వర స్వామి వారికి జీడిపప్పులతో ప్రత్యేక అలంకరణ..

ఓం నమః శివాయ అంటూ మరుమోగుతున్న ఆలయం....

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిని
దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు.....

లక్కిరెడ్డిపల్లె విద్యార్థి అభినయ్‌కు బంగారు పతకం..లక్కిరెడ్డిపల్లె మండలానికి చెందిన సి. అభినయ్, కడపలోని నాగార్జున మోడల్...
10/11/2025

లక్కిరెడ్డిపల్లె విద్యార్థి అభినయ్‌కు బంగారు పతకం..

లక్కిరెడ్డిపల్లె మండలానికి చెందిన సి. అభినయ్, కడపలోని నాగార్జున మోడల్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు లో నవంబర్‌ 7 నుండి 9 వరకు జరిగిన 69వ ఎస్‌జీఎఫ్‌ఐ అంతర్‌ జిల్లాల ఆర్చరీ పోటీల్లో, అభినయ్‌ తన ప్రతిభను చాటాడు...

కాంపౌండ్ బౌ అండర్‌–14 కేటగిరీ టీమ్‌ విభాగంలో బంగారు పతకం సాధించి కడప జిల్లాకు గర్వకారణంగా నిలిచాడు.
ఉపాధ్యాయులు, కోచ్‌లు, తల్లిదండ్రులు అభినయ్‌ను అభినందిస్తూ, భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

కడప పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన సినీ కమెడియన్ అలీ...
09/11/2025

కడప పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన సినీ కమెడియన్ అలీ...

కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న సినీ నటుడు సుమన్.
09/11/2025

కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న సినీ నటుడు సుమన్.

కడప జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా సయ్యద్ అబ్దుల్ రౌఫ్ నియామకం..
08/11/2025

కడప జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా సయ్యద్ అబ్దుల్ రౌఫ్ నియామకం..

కడప అమీన్ పీర్ దర్గాను నేడు ఫేమస్ డ్రమ్స్ శివమణి గారు మరియు పుష్ప సినీ నటుడు జగదీష్ దర్గాని దర్శించుకునేందుకు రాత్రి 9 గ...
08/11/2025

కడప అమీన్ పీర్ దర్గాను నేడు ఫేమస్ డ్రమ్స్ శివమణి గారు మరియు పుష్ప సినీ నటుడు జగదీష్ దర్గాని దర్శించుకునేందుకు రాత్రి 9 గంటలకు దర్గాకు వస్తున్నారు.....

Address

Kadapa
516001,002,003,004

Website

Alerts

Be the first to know and let us send you an email when Kadapa Times posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share