NR న్యూస్

NR న్యూస్ సమాచారం

*సాయినాథ‌పురంలోని అయిదురోడ్ల కూడ‌లిలో వేమ‌న్న ఇలా..*  సాయినాధపురంలో ఐదు రోడ్ల కూడలి వద్ద మొండి భైరవుడిలా తల లేని యోగి వే...
28/01/2025

*సాయినాథ‌పురంలోని అయిదురోడ్ల కూడ‌లిలో వేమ‌న్న ఇలా..*
సాయినాధపురంలో ఐదు రోడ్ల కూడలి వద్ద మొండి భైరవుడిలా తల లేని యోగి వేమన గురించి 2023 ఏప్రిల్ లో నేను ఒక కథనం రాశా..
. ఆ కథనం నేపథ్యం ను ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లి సరికొత్త యోగి వేమన ను పున: ప్రతిష్టింప చేసింది.. ఈ కథనం ఎమ్మెల్యేను బాగా స్పందింపజేసింది..

మైదుకూరులోని అత్య‌ధిక రోడ్ల కూడ‌లి కల్గిన ప్రాంతం సాయినాథ‌పుర‌మే అని చెప్ప‌వ‌చ్చు.. మైదుకూరుకు ప్ర‌ధాన కూడలి నాలుగు రోడ్లు అయితే.. ఇక్క‌డ అయిదు రోడ్లు కూడ‌లి స‌ముదాయం ఉంది.. అయిదురోడ్ల కూడ‌లిగా రూపుదిద్దుకున్న ఈ ప్రాంతంలో యోగివేమ‌న విగ్ర‌హం ఇలా దిక్కుమొక్కులేకుండా ప‌డివున్నాడు.. నాలుగు రోడ్ల కూడ‌లిలో శ్రీకృష్ణ‌దేవ‌రాయులు విగ్ర‌హం, బ‌ద్వేల్ రోడ్డులో మార్కెట్‌కూడ‌లిలో పొట్టి శ్రీరాములు విగ్ర‌హం ఏర్పాటుచేసిన నేప‌థ్యంలో సాయినాథ‌పురం అయిదురోడ్ల కూడ‌లిలో రైతు ఉద్య‌మ‌కారుడు కీ.శే ఎంజే సుబ్బ‌రామిరెడ్డి, బీజేపీనాయ‌కులు రాజ‌మోహ‌న్‌రెడ్డి, అచ‌ల‌మ‌తం ప్ర‌తినిధులు క‌ల‌సి ప‌దేళ్ల‌కింద‌ట రాత్రిరాత్రికి యోగి వేమారెడ్డి విగ్ర‌హంను నెల‌కొల్పారు.. ఈ సెంట‌ర్‌కు యోగివేమ‌న సెంట‌ర్ గా పేరు నామ‌క‌రణం చేయాల‌న్న‌ది వారి ప్ర‌ధాన డిమాండ్‌.. ప‌దేళ్లు గ‌డిచిపోయింది.. ఇప్పుడు యోగి వేమ‌న ఇలా దిక్కు మొక్కు లేకుండా మొండి భైర‌వుడి త‌ర‌హాలో ఉండిపోయాడు...వేమారెడ్డి కులానికి చెందిన నేత‌లే ఈ పదేళ్ల కాలం అధికారంలో ఉంటుండి కూడా.. వేమ‌న వైపు క‌న్నెత్తి చూడ‌లేదు.. అస‌లు అక్క‌డ వేమ‌న విగ్ర‌హం ఉంద‌న్న సంగ‌తి కూడా ఆ నేత‌ల‌కు తెల‌య‌ని దుస్థితి.. ఏమి చేద్దాం మ‌రి..
ఆ కథనం లింక్..https://journalistnandireddy.in/arthasatabdhaṁ-caritra-kalgina-sayinadhapuraṁ-maidukuru-purapalika-rajakiyanlo/

మైదుకూరులో మన ‘జాతీయ’ నేతలకు ఘనమైన ‘‘నివాళి’’..👉విగ్రహాలను పునః ప్ర‌తిష్టించిన ఎమ్మెల్యే ‘‘పుట్టాసుధాక‌ర్ యాద‌వ్‌’’-నంది...
27/01/2025

మైదుకూరులో మన ‘జాతీయ’ నేతలకు ఘనమైన ‘‘నివాళి’’..

👉విగ్రహాలను పునః ప్ర‌తిష్టించిన ఎమ్మెల్యే ‘‘పుట్టాసుధాక‌ర్ యాద‌వ్‌’’

-నందిరెడ్డి నాగ‌శివారెడ్డి, జ‌ర్న‌లిస్టు

https://journalistnandireddy.in/a-grand-tribute-to-our-national-leaders-in-mydukur/

మైదుకూరులో భార‌త రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్క‌ర్‌, ఆంధ్రా జాతిపిత అమరజీవి పొట్టి శ్రీరాములు, విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణ‌దేవ‌రాయులు ప్రజాకవి, సంఘసంస్కర్త వేమన విగ్రహాలను పునః ప్ర‌తిష్ట చేసిన ఘ‌న‌త ఎమ్మెల్యే పుట్టాసుధాక‌ర్ యాద‌వ్‌కు ద‌క్కింది.. 16 ఏళ్ల కింద‌ట వారి వారి అభిమానుల చేత‌ప్ర‌తిష్టించ‌బ‌డిన ఈ జాతీయ‌నేత‌ల విగ్ర‌హాల‌ను పునః ప్ర‌తిష్టించి ఆ నేత‌ల ప‌ట్ల త‌న‌కున్న‌భ‌క్తి భావంతో పాటు, అభిమానంను పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ చాటుకున్నారు.. నాలుగు రోడ్ల సెంట‌ర్ లో శ్రీకృష్ణ‌దేవ‌రాయలు, బ‌ద్వేల్ రోడ్డులోని మార్కెట్ కూడిలో పొట్టిశ్రీరాములు, ఆర్టీసీబ‌స్తాండ్ ఎదురుగా మండ‌ల కాంప్లెక్ ముందు వైపున బీఆర్ అంబేద్క‌ర్‌, సాయినాథపురం కూడలో యోగి వేమ‌న ద‌శాబ్ధమున్న‌ర కాలంగా దిక్కుముక్కు లేని దీన‌స్థితిలో ఉండిపోయారు. వీరి ఆల‌నా పాల‌నా ఏ పాల‌కుడు ప‌ట్టించుకున్న‌దాఖ‌లాలు లేవు.. చివ‌ర‌కు ఆ జాతీయ నేత‌ల విగ్ర‌హాలు నెల‌కొల్పుకున్న ఆయా సామాజిక వ‌ర్గాల నేత‌లు, వ్య‌క్తులు, సంఘాలు జ‌యంతి, వ‌ర్ధంతి రోజు పూల దండ వేసి కొద్దో గొప్పో నివాళిలు అర్పించే సంస్కృతి ఉండిపోయింది.. పాల‌క‌వ‌ర్గాల‌నేత‌ల మాత్రం ప‌ర్లాంగు లో దూరంలో ఉండిపోతూ వ‌చ్చారు.. ఫ‌లితంగా ఈ ద‌శాబ్ధ‌న్న‌ర కాలంలో జాతీయ‌నేత‌లు మ‌స‌క ప‌ట్టి ఎందుకు మాకు గ‌తి అనేట్లు నిర్జీవంగా ఉండిపోయారు.. త‌మ‌కు అన్యాయం జ‌రిగిన‌ప్పుడు మాత్రం అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు రాజ్యాంగక‌ర్త బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హం గుర్తు వ‌చ్చేది.. మిగ‌తా కాలంలో మైదుకూరులో బీఆర్ అంబేద్క‌ర్ అనే విగ్ర‌హం ఒక్క‌టుంది అనే ఆలోచ‌న కూడా పాల‌కుల‌కు వ‌చ్చేది కాదు..

ఆరునెలల కిందటే ఎమ్మెల్యేగా ఎన్నికై అధికారం అందిపుచ్చుకున్న పుట్టా సుధాకర్ యాదవ్ దృష్టి మైదుకూరులో దిక్కుమొక్కు లేకుండా నీర్జీవంగా ఉన్న భార‌త రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్క‌ర్‌, ఆంధ్రా జాతిపిత అమరజీవి పొట్టి శ్రీరాములు, విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణ‌దేవ‌రాయులు ప్రజాకవి, సంఘసంస్కర్త వేమన విగ్రహాలను పునః ప్ర‌తిష్టించాల‌నే ఆలోచ‌న త‌ట్టింది.. ఆలోచ‌న త‌ట్టగానే అంద‌ర‌కీ ఆద‌ర్శంగా జాతీయ నేత‌ల విగ్ర‌హాల‌ను తిరిగి ప్ర‌తిష్టించి అంద‌ర‌కీ ఆద‌ర్శంగా ఉండేలా ఒక ప్ర‌ణాళిక సిద్దం చేశారు.. రెండు నెల‌ల కింద‌టి నుండి జాతీయ నేత‌ల‌విగ్ర‌హాల‌ను మార్చేదిశ‌గా పావులు క‌దిపారు. గ‌త జిల్లా క‌లెక్ట‌ర్ లోతేటి శివ‌శంక‌ర్ ని అక్టోబ‌ర్ నెల‌లో క‌ల‌సి విగ్ర‌హాల ఏర్పాటు, ప్లాట్ ఫాం, నాలుగు రోడ్ల కూడ‌లి సుంద‌రీ క‌ర‌ణ‌, ప్రొద్దుటూరు_ బ‌ద్వేల్ రోడ్డు విద్యుద్దీక‌ర‌ణ ప‌నులు కొర‌కు డీఎంఎఫ్ నిధులు మంజూరు చేయాల‌ని ఎమ్మెల్యే పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ కోర‌డం.. అందుకు క‌లెక్ట‌ర్ శివ‌శంక‌ర్ అంగీక‌రించ‌డం జ‌రిగిపోయాయి. సంక్రాంతి ప‌ర్వ‌దిన‌మ‌న శ్రీకృష్ణ‌దేవ‌రాయులు విగ్ర‌హాన్ని, రిప్ల‌బిక్ డే రోజుకు బీఆర్ అంబేద్క‌ర్‌, పొట్టిశ్రీరాములు, యోగి వేమ‌న విగ్ర‌హాలు ప్ర‌తిష్టించాల‌నే ఒక ల‌క్ష్యం మేర‌కు ఆఘ‌మేఘాల మీద త‌మ అనుచ‌రుల‌ను భాగ‌స్వామం చేసి ఎమ్మెల్యే ఎట్ట‌కేల‌కు పునఃప్ర‌తిష్టింప‌చేశారు.. చ‌రిత్రిలో మ‌రిచిపోలేని విధంగా జాతీయ నేత‌ల‌కు ఘ‌న‌మైన నివాళులు అర్పించి త‌న మార్కు పాల‌న రుచిచూపించారు..

ఎన్టీఆర్ జ‌యంతి రోజుకు విగ్ర‌హ‌ప్ర‌తిష్ట‌కు ప్ర‌ణాళిక‌లో ‘‘పుట్టా’’...

తెలుగుదేశం వ్య‌వ‌స్ధాపకుడు ‘‘నంద‌మూరి ఎన్టీరామారావు’’ త‌న రాజ‌కీయ జీవితంలో మైదుకూరులో చోటు లేద‌నే చెప్పాలి.. 1983లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెప్పించి అధికార‌ఫ‌లాలు అందించిన ఎన్టీఆర్ విగ్ర‌హంను మైదుకూరులో నెల‌కొల్పే విష‌యంలో తెలుగుదేశం పార్టీ క్యాడ‌ర్ నిర్ల‌క్షంగా వ్య‌వ‌హ‌రించింద‌నే చెప్పొచ్చు.. 1983,85,1994,99, 2014 అధికారంలో తెలుగుదేశంపార్టీ ఉన్న‌ప్ప‌టికీ ఆ పార్టీకి ప్రాతినిధ్యం వ‌హించిన నేత‌ల్లో ఎన్టీఆర్ విగ్ర‌హం ఏర్పాటు చేయాల‌న్న సామాజిక స్పృహ లోపించ‌ద‌నే చెప్పొచ్చు.. ఎమ్మెల్యేగా మొద‌టి విజ‌యం సాధించిన పుట్టాసుధాక‌ర్ యాద‌వ్ కు ఎన్టీఆర్ బాగా స్మ‌ర‌ణ‌కు వ‌చ్చిన‌ట్లు ఉంది.. జాతీయ నేత‌ల విగ్ర‌హాల‌ను పునః ప్ర‌తిష్ట నేప‌థ్యంలో ఇందిరాగాంధీ, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి విగ్ర‌హాల‌కు దీటుగా ఎన్టీఆర్ క్యాంస విగ్ర‌హంను ఏర్పాటు చేయాల‌ని ఒక దృఢ‌నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఉంది.. ఆర్టీసీ బ‌స్టాండు ఎదురుగా మండ‌ల కాంప్లెక్ ఆవ‌ర‌ణంలో భారీ స్ధాయిలో ఎన్టీఆర్ విగ్ర‌హం ఏర్పాటు చేసేందుకు ప్ర‌ణాళిక పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా మేనెల‌లో విగ్ర‌హ ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మం ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని ఎమ్మెల్యే పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ భావించ‌డ‌మే కాకుండా.. ఎన్టీఆర్ మ‌న‌మ‌డు నారాలోకేష్ చేతుల మీదుగా ఆవిష్క‌ర‌ణ చేయించాల‌ని ఒక నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.. ఎన్టీఆర్ కాంస్య విగ్ర‌హం ప్ర‌తిష్ట తెలుగు త‌మ్ముళ్ల‌లో ఒక జోష్ ను నింపుతుంద‌ని.. మైదుకూరులో ఎన్టీఆర్ ను ప్ర‌తి నిత్యంచూసే సువ‌ర్ణావ‌కాశం ల‌భిస్తుంద‌నే ఆశా భావం వ్య‌క‌మ‌వుతోంది...

జాతీయ నేత‌ల విగ్ర‌హాల ఏర్పాటు వెనుక ‘‘ కథ ’’..

అది 2008 సంవ‌త్స‌రం చివ‌రి నెల‌లు.. ఆ స‌మ‌యంలో ఉద్య‌మాల కూడలిగా పేరున్న మైదుకూరు నాలుగు రోడ్ల సెంట‌ర్ లో శ్రీకృష్ణ‌దేవ‌రాయులు విగ్రహం ఆఘ‌మేఘాల మీద ఆళ్ల‌గ‌డ్డ నుండి తెప్పించి ( కృష్ణ‌దేవ‌రాయులు సామాజిక వ‌ర్గంగా చెప్పుకునే యువ‌కులు కొందరు) అంద‌రూ అద‌మ‌రిచి నిద్రిస్తున్న వేళ ప్ర‌తిష్టించారు.. నాలుగు రోడ్ల కూడలిని శ్రీకృష్ణ‌దేవ‌రాయులు సెంట‌ర్ గా పేరు మార్చుకున్నారు.. అదే సమయంలో దళిత సంఘాలు తమ నాయకుడు బిఆర్ అంబేద్కర్ విగ్రహంను మండల కార్యాలయ కాంప్లెక్ ఆవరణంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసి.. బీఆర్ అంబేద్కర్ సాక్షిగా ఆందోళనలు, నిరసనలు చేస్తూ వస్తున్నారు.. అదే తరుణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహంను బద్వేల్ రోడ్డు నందు గల మార్కెట్ కూడలిలో శ్రీరాములు సామాజిక వర్గంకు చెందిన స్ధానికులు కొందరి సహకారంలో అర్థరాత్రి బొమ్మను పెట్టేశారు.. ఇక వేమారెడ్డి సామాజిక వర్గంకు చెందిన నాయకులు, మేధావులు కడపరోడ్డు లోని సాయినాథపురం సెంటర్ ఎంపిక చేసుకుని యోగి వేమన విగ్రహంను రాత్రి రాత్రికి ఏర్పాటు చేసేశారు.. చివరకు జాతీయనాయకులకు కులంరంగు పూచిసెంటర్లను ఎవ్వరికీ వారు ఏర్పాటు చేసుకున్నారు.. తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న జాతీయ నేతల విగ్రహాలకు 16 ఏళ్లు కాలం గడిచింది. జాతీయ నెతల్లో పొట్టిశ్రీరాములు, వేమన విగ్రహాల పూర్తి అనాధరణకు గురయ్యారు... ఎట్టకేలకు ఎమ్మెల్యే గా ఎన్నికై అధికారం చేజిక్కించుకున్న ఎమ్మెల్యే పుట్టాసుధాకర్ యాదవ్ జాతీయ నేతలను గుర్తించారు.. ప్రభుత్వ నిధులతో భావితరాలు మరిచిపోని విధంగా నేతల విగ్రహాలను పునః ప్ర‌తిష్టించి ప్రాణం పోశార‌ని చెప్ప‌డం అతియోశ‌క్తి కాద‌ని నాభావ‌న‌.. మైదుకూరులో జాతీయ‌నేత‌ల‌కు మ‌రింత గుర్తింపు తీసుకువ‌చ్చి.. అధికార హోదా క‌ల్పించ‌డ‌మే కాకుండా .. ప్ర‌భుత్వ విధానంలో భాగ‌స్వాముల‌ను చేయ‌డం లో ప్ర‌ముఖ పాత్ర పోషించిన ఎమ్మెల్యే పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ ప‌నితీరును అంద‌రం మెచ్చుకోవాల్సిందే... మెచ్చుకొని తీరాల్సిందే...

*మైదుకూరు నింగిలో రెపరెపలాడుతున్న‘‘జాతీయపతాకం* ’’👉 *ఆవిష్కరించబడిన ‘‘మధుర ఘట్టం’’..* 👉‘‘అట్టహాసం’’గా జాతీయ పతాక ఆవిష్కరణ...
26/01/2025

*మైదుకూరు నింగిలో రెపరెపలాడుతున్న‘‘జాతీయపతాకం* ’’
👉 *ఆవిష్కరించబడిన ‘‘మధుర ఘట్టం’’..*

👉‘‘అట్టహాసం’’గా జాతీయ పతాక ఆవిష్కరణ...

,👉 *పరవశించిన ‘‘పుట్టా సుధాకర్ యాదవ్’’*

- *నందిరెడ్డి నాగశివారెడ్డి, జర్నలిస్టు* ..✍️

https://journalistnandireddy.in/national-flag-fluttering-in-mydukur-ningi/
మన ఆత్మగౌరవానికి ప్రతీక మన జాతీయ పతాకం... ‘‘జెండా వూంఛా రహే హమారా’’ అనే నినాదంతో మైదుకూరు నింగిలోకి ఎక్కి కూర్చుంది ‘‘జాతీయ పతాకం’’ .. నింగిలో ఎత్తుగా ఎగిరి రెపరెపలాడుతున్న ఈ పతాకమే మైదుకూరు ప్రజల స్వాభిమానానికి సంకేతంగా నిలుస్తోంది.. ఎవరెస్టు ఎక్కినా.. చంద్ర మండలంపై అడుగు పెట్టినా.. అంతర్జాతీయ స్థాయిలో ఆటల్లో రాణించినా.. ఇలా అత్యంత విజయం సాధించిన ప్రతి సందర్భంలో కళ్ల ముందు కనిపించేది ‘‘జాతీయ జెండాయే’’.. మన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే జాతీయ పతాకం మైదుకూరు నింగిలో (101 అడుగుల ఎత్తులో ) రెపరెపలాడుతుంటే ఇక్కడి ప్రతి పౌరుడు స్వాభిమానానికి సంకేతంగా భావిస్తున్నాడు.. పైన రెప‌రెప‌లాడుతున్న ప‌తాకాన్ని మెడ‌లు వంచి పై పైకి చూస్తూ మురిసిపోయోంత మ‌ధుర ఘ‌ట్టం మైదుకూరులో కూడ‌లిలో ఆవిష్క‌రించ‌బ‌డింది..
76వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం.. ఈ దినోత్సం పుర‌స్క‌రించుకుని నియోజ‌క‌వ‌ర్గ‌కేంద్ర‌మైన మైదుకూరు కూడలిలో ‘‘101’’ అడుగుల ఎత్తులో రెండు టన్నుల బరువైన ఇనుప పోల్ పై 20 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో జాతీయ ప‌తాకంను ర‌మార‌మి 16 ల‌క్ష‌లు నిధులు వెచ్చించి నిర్మించిన జాతీయ ప‌తాక ఆవిష్క‌రణ కార్య‌క్ర‌మం అట్ట‌హాసంగా జ‌రిగింది.. వంద అడుగుల జాతీయ చేత బ‌ట్టి.. వాయిధ్యాల న‌డుమ ప‌తాకాన్ని ఆవిష్క‌రించేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ విద్యార్ధులు, పుర ప్ర‌ముఖులు, ప్ర‌భుత్వ అధికారులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు.. ఈ సంద‌ర్భం ఒక వేడుక‌గా మారింది.. ప‌తాక ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం పండుగ‌ను మ‌రిపించింది.. వేలాదిగా త‌రిలి వ‌చ్చిన జ‌న‌స‌మూహం స‌మ‌క్షంలో ఆదివారం ఉద‌యం 9.15 గంట‌ల‌కు జాతీయ‌ప‌తాకాన్ని ఎమ్మెల్యే పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ ఆవిష్క‌రించారు..మొట్ట మొద‌ట మైదుకూరులో జ‌రుగుతున్న ఈ జాతీయ‌ప‌తాక ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని తిల‌కించేందుకు పెద్ద సంఖ్య‌లో మ‌హిళ‌లు, ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చి వీక్షించారు.. ఆ మ‌ధుర క్ష‌ణాల‌ను వీక్షించి ప‌ర‌వ‌శించి పులకించారు.. జాతీయ ప‌తాకం నింగిలోకి దూసుకువెళ్తుంటే ఆనంద‌డోలిక‌ల‌తో మునిగిపోయి.. చ‌ప్ప‌ట్లతో ప్రతిధ్వనించారు.. ప‌తాకం నింగిలోకి వెళ్లి రెప‌రెప‌లాడ‌గానే జాతీయ గీతం ఆల‌పించి జాతీయ‌త ప‌ట్ల త‌మ భ‌క్తి భావంను ప్ర‌ద‌ర్శించారు.. ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంకు విచ్చేసిన ప్ర‌తి విద్యార్ధినీ, విద్యార్ధి జాతీయ ప‌తాకం చేత బ‌ట్టి నింగికేగిసిన ప‌తాకంకు వంద‌నంచేశారు. జాతీయ నాయకుల వేషధారణతో చిన్నారులు ఆవిష్కరణ కార్యక్రమంకు విచ్చేశారు.. చిన్నారుల వేషధారణ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ను ఆకట్టుకుంది.. చిన్నారులను ఎమ్మెల్యే ప్రశంసించారు.. ప‌తాక ఆవిష్క‌ర‌ణ‌కు ఎమ్మెల్యే పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ తో పాటు, జ‌న‌సేన పార్టీనియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జ్ పండిట్ మ‌ల్హోత్ర‌, బిజేపీ ఇన్‌ఛార్జ్ మాచ‌నూరు సుబ్బ‌రాయుడుతోపాటు, పుర‌పాలిక అధికారులు, పోలీసు అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ ప‌తాక ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంకు త‌ర‌లివ‌చ్చారు.. జాతీయ ప‌తాక ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం మైదుకూరుచ‌రిత్ర‌లో ఒక అరుదైన ఘ‌ట‌న‌గా అభివ‌ర్ణించ‌వ‌చ్చు..

ప‌తాక ఆవిష్క‌ర‌ణ‌లో ఆనందంతో పుల‌కించిన ‘‘ఎమ్మెల్యే పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌’’...

త‌న‌కు అధికారం క‌ట్ట‌బెట్టిన మైదుకూరుప్ర‌జ‌ల హృద‌యాల‌ను ఆక‌ట్టుకునే దిశ‌గా అడుగులు వేసే క్ర‌మంలో భాగంగా మైదుకూరు న‌డి బొడ్డున జాతీయ జెండా రూప‌క‌ల్ప‌న‌లో ప్ర‌ధాన భూమిక ఎమ్మెల్యే పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ పోషించిన విష‌యం విదిత‌మే.. ప్ర‌జ‌లంద‌రిలో ఆత్మాభిమానం పెంపొందించే ప్ర‌క్రియ చేప‌ట్టాను అనే భావ‌న క‌ల్గి ఉన్నందువ‌ల్ల‌నేమో.. ఎప్పుడు నిరాడంబరంగా కనపడే ఎమ్మెల్యే పుట్టా సుదాకర్ యాదవ్ ముఖం జాతీయ పతాక ఆవిష్కరణ వేడుకలో ముఖం ఆనందంతో నిండిపోయింది.. చిరునవ్వు వెల్లివిరిసింది.. జాతీయ జెండా నింగిలోకి వెళ్లి రెపరెపలాడటం చూసి కొద్ది సేపు ఆనందంతో మురిసిపోయారు.. పుెలకించిన మనసుతో నిండు కుండలా కార్యక్రమంలో కనపడ్డారు..

ఎమ్మెల్యే ఆనందం ఏ పాటిదో వారి మాటల్లో .
‘‘ పురపాలిక లోె నిధులులేవు.. ఏదో సాధించాలనే తపన.. నన్ను ఎమ్మెల్యేను చేసి ఆరు నెలలు దాటింది.. మైదుకూరు ప్రజల హృద‌యాల్లోసుస్ధిరంగా నిలిచిపోవాలంటే ప‌ట్ట‌ణం అభివృద్ధి సాధించాలి.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు మైదుకూరుకు వ‌స్తేవారితో కారులో ఉన్న‌ప్పుడు చెవిలో జోరీగా లాగా వివిధ అభివృద్ధి ప‌నుల‌కు నిధులు ఇవ్వండి గ‌ట్టిగా అడిగా... ఇక్క‌డ చేప‌ట్ట‌వ‌లసిన అభివృద్ధి ప‌నులకు నాలుగు లెట‌ర్లుత‌యారు చేసి అందులో వివ‌రించి అందించా.. ఎట్ట‌కేల‌కు శాశ్విత ప‌నుల‌కు సంబంధించి నిధులు మ‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ద్వారా మంజూరు చేయించుకున్నాను.. మైదుకూరు ప‌ట్ట‌ణంలో ప్ర‌జ‌ల అభిమానం చూర‌గొనే శాశ్విత‌ప‌నులు చేప‌ట్టాలన త‌ప‌న ఉంది.. అయితే పుర‌పాలిక‌లో నిధులు లేవు.. ఏమైనా స‌రే ప‌నులు ముందు చేయించాలి అని గ‌ట్టిగా అనుకున్నా.. నాలుగు రోడ్ల సెంట‌ర్‌లో శ్రీ కృష్ణ‌దేవ‌రాయులు విగ్ర‌హంతో పాటు, భార‌త రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్క‌ర్‌, ఆంధ్రా జాతిపిత అమరజీవి పొట్టి శ్రీరాములు, ప్రజాకవి, సంఘసంస్కర్త వేమన విగ్రహాలను పునః ప్ర‌తిష్ట చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నాను.. నాలుగు రోడ్ల కూడ‌లిలో పెద్ద జాతీయ‌ప‌తాకంను నిల‌బెట్టి, ప్రొద్దుటూరు, బ‌ద్వేల్ రో్డ్డులో ప్ర‌జ‌ల‌కు సౌకర్యంగా ఉండేందుకు విద్యుద్దీక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టాల‌నే భావ‌న‌తో నిధులు లేకున్నా ముంద‌స్తు ప్ర‌ణాళిక చేప‌ట్టాను.. నిధులు విష‌యం ప‌క్క‌న బెట్టి అభివృద్ధి ముఖ్యం అనే భావ‌న‌తో రెండు కోట్లతో ఈ ప‌నులు చేప‌ట్టేందుకు ముందుకు రావాలిన మాపార్టీకి చెందిన కొంద‌రిని కోరాను.. నిధులు ముఖ్యం కాదు.. మీ అభివృద్ధి ఆకాంక్ష‌కు మేము తోడుంటాము అనే చిత్త‌శుద్దితో కొంద‌రు ముందుకు వ‌చ్చారు.. అందులో ముఖ్యంగా ఏపీ ర‌వీంద్ర‌, దాస‌రి బాబు, వేప‌రాల చిన్న‌, కోన సుబ్బారావు.. వీరి ద్వారా డ‌బ్బులు పెట్టించి ముందుగా ఈప‌నులు చేప‌ట్టా.. ఒక ప్ర‌ణాళిక మేర‌కు రిప‌బ్లిక్ రోజు కు పూర్తి చేయాల‌న్న‌ది నా దృఢ సంక‌ల్పం.. ఆ సంకల్పం మేర‌కు ఈ న‌లుగ‌రు ప‌ట్టుద‌లతో ప‌నిచేశారు..అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించిన త‌రుణంలో శ్రీకృష్ణ దేవ‌రాయులు విగ్ర‌హ ప్ర‌తిష్ట‌రోజు, విద్యుద్దీక‌ర‌ణ ప‌నులు ప్రారంభించిన‌రోజు.. జాతీయ‌ప‌తాకం మైదుకూరు నింగిలో రెప‌రెప‌లాడిన ఈ రోజు నాకు పెద్ద ఆనందం వ‌చ్చింది.. ఈప‌నులు చూసి మురిసిపోయా.. నాలో నేను న‌వ్వుకున్న‌.. ఒక విధంగా అనుకున్న ల‌క్ష్యమేర‌కు జాతీయ నాయ‌కులు విగ్ర‌హాలు, జాతీయ ప‌తాకం, విద్యుద్దీక‌ర‌ణ ప‌నులు పూర్తి చేయ‌డంను చూసి గ‌ర్వంగా ఉంది.. అలాగే, మైదుకూరు పురపాలిక సరిహద్దు స్వాగత బోర్డులను కూడా ఏర్పాటు చేయబోతున్నాను.. ఒక్కొక్కటిగా అభివృద్ధి చేస్తూ మీ రుణం తీర్చుకుంటున్నాను అనే తృప్తి నాకు పెద్ద ఆనందంను క‌ల్గిస్తోంది... ఈ ఆనందం స్ధిరంగా ఉండే విధంగా నా ప్ర‌ణాళిక ఉంటుంది’’..

*మైదుకూరులో ఆవిష్కరింపబడుతున్న ‘‘ జాతీయ పతాకం’’* * *రిపబ్లిక్ డే సందర్భంగా ఓ మధుర  ఘట్టం..* **ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ య...
25/01/2025

*మైదుకూరులో ఆవిష్కరింపబడుతున్న ‘‘ జాతీయ పతాకం’’*
* *రిపబ్లిక్ డే సందర్భంగా ఓ మధుర ఘట్టం..*
**ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ చేతుల మీదుగా..*
**బీ ఆర్ అంబేద్కర్, పొట్టి శ్రీరాములు, యోగి వేమన విగ్రహాలు పునః ప్రతిష్ట* ..
..✍️ నంది రెడ్డి నాగశివారెడ్డి
జర్నలిస్ట్

https://journalistnandireddy.in/national-flag-being-unveiled-at-mydukur/

మైదుకూరులో ఓ ప్రధాన ఘట్టం ఆవిష్కరించబడుతోంది.. జనవరి 26న రిపబ్లిక్ దినోత్సవం పురస్కరించుకుని ఈ ఘట్టం ఎమ్మెల్యే పుట్టాసుధాకర్ యాదవ్ చేతుల మీదుగా జరగబోతోంది.. జాతీయ పతాకం చూస్తే చాలు ప్రతి భారతీయ పౌరుడి హృదయం స్పందిస్తుంది.. శరీరం పులకిస్తుంది.. మనసు ప‌ర‌వ‌శిస్తుంది.. ‘‘ దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేసేందుకు ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు జరిగాయి.. మువ్వెన్నెల జెండా ఒక్కతాటిపైకి తెచ్చింది. అలాంటి జెండా ఆవిష్కరణ వెనక ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. మూడు రంగుల ఏర్పాటు నుంచి మధ్యలో అశోకుడి చక్రం ముద్రణ వరకు ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి. దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని ప్రతిబింబింపజేసే ఈపతాకానికి ప్రాణం పోసింది మన తెలుగువాడే. ఆయనే కృష్ణా జిల్లాకు చెందినపింగళి వెంకయ్య’’ ఎంతో ప్రాధాన్యత కల్గిన జాతీయ పతాకాన్ని 101 అడుగు ఎత్తులో జాతీయ పతాకం మనగడ్డపై.. మన మైదుకూరు నడిబొడ్డున రెపరెపలాడటానికి ప్రధానసూత్రదారి ఎమ్మెల్యే పుట్టాసుధాకర్ యాదవ్ అనడంలో సందేహం అవసరం లేదు..

పురపాలిక సంఘం సహకారంతో, సూర్యలైన్స్ హైదరాబాద్ వారి సాంకేతిక సహకారంతో మైదుకూరు నడిబోడ్డున రాయల్ కూడలిలో రూ16లక్షల వ్యయంతో ఈ భారీ జెండాను తీర్చిదిద్దారు.. రెండు టన్నుల బరువైన జెండా పోల్ పై 20 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో రూపుదిద్దుకుంది.. సుమారు 3 నుంచి 5 కిలోమీటర్ల దూరం నుంచి జాతీయ పతాకం రెపరెపలాడుతూ కనిపిస్తూ దేశ ఔన్నత్యం, మైదుకూరు ఘనకీర్తిని చాటనుంది. 76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జనవరి 26న (రేపు) ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ జాతీయ పతాకం ఆవిష్కరించనున్నారు.
శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ చాలా విషయాల్లో తమ మైదుకూరును అద్వితీయంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు.. ఆ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని మైదుకూరుకు రప్పించి ఇక్క‌డ అభివృద్ధిలో భాగ‌స్వామ్యుల‌ను చేశారు.. మైదుకూరు గురించి అంద‌రూ మాట్లాడుకునే అంశాలు ఉండాలని, జిల్లాతో పాటు రాష్ట్రం కూడా మైదుకూరు వైపు చూడాలని శాస‌న‌స‌భ్యులుగా పుట్టా కలగనడంలో తప్పేమీలేదు. అందుకు ఆచరణలో ఆయన రకరకాల పద్ధతులను ఎంచుకుంటున్నారు. తాజాగా మైదుకూరులో అత్యంత ఎత్తయిన, అతి పెద్ద జాతీయ పతాకాన్ని మైదుకూరులో ఏర్పాటు చేయడానికి పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ నిర్ణయించడం ఇలాంటి నిర్ణయాల కోవలోకే వస్తుంది.
అతిపెద్ద జాతీయపతాకం ను మైదుకూరు కూడ‌లిలో శ్రీ కృష్ణ‌దేవ‌రాయులు స్థూపం వ‌ద్ద‌నే ఏర్పాటుచేయబోతున్నారు. తన మైదుకూరు రాష్ట్రంలోనే ‘నెంబర్‌వన్‌’గా ఉండాలనుకునే పుట్టా త‌ప‌న‌కు ఇది నిదర్శనం కావొచ్చు. ఇప్పటికే మైదుకూరులో శ్రీ కృష్ణ‌దేవ‌రాయుల‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయించి త‌న చేతుల మీదుగానే ప్రారంభించి.. మైదుకూరు పుర ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు.. గ‌ణ‌తంత్ర దినోత్స‌వ సంద‌ర్భంగా మైదుకూరులో భార‌త రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్క‌ర్‌, ఆంధ్రా జాతిపిత అమరజీవి పొట్టి శ్రీరాములు, ప్రజాకవి, సంఘసంస్కర్త వేమన విగ్రహాలను పునః ప్ర‌తిష్ట చేస్తున్నారు.. ప్ర‌గ‌తి దిశ‌గా మైదుకూరును సృష్టించడంలో తనదైన ముద్ర కోసం పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ తహతహ లాడుతున్నార‌న‌డానికి జాతీయ‌నాయ‌కుల విగ్ర‌హాల పునః ప్ర‌తిష్ట ఇందుకు చ‌క్క‌టి తార్కాణం.. అతిపెద్ద పతాకాన్ని మైదుకూరులో ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల మ‌న ప్రాంత ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందింపజేయడానికి దోహ‌ద‌ప‌డుతుంద‌నే భావ‌న‌తో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేస్తున్న‌ట్లు ఎమ్మెల్యే పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ గారు అనడం విశేషం. ఈభారీ పతాకాన్ని రిప‌బ్లిక్ దినోత్ప‌వం సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 26 (ఆదివారం ) శాస‌న‌స‌భ్యులు పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ ఆవిష్క‌రించ‌బోతుండ‌టం ఓ మ‌ధుర ఘ‌ట్టంగా భావించ‌వ‌చ్చు..

*మిస్ట‌రీ.. దారుణ హ‌త్య మిస్ట‌రీ...!* ➡️మైదుకూరు పుర‌పాలిక ప‌రిధిలోని శెట్టివారిప‌ల్లెలో..➡️ *మాన‌వీయ‌కోణంలో స్పందించిన ...
02/01/2025

*మిస్ట‌రీ.. దారుణ హ‌త్య మిస్ట‌రీ...!*
➡️మైదుకూరు పుర‌పాలిక ప‌రిధిలోని శెట్టివారిప‌ల్లెలో..
➡️ *మాన‌వీయ‌కోణంలో స్పందించిన ఎమ్మెల్యే పుట్టా సుధాక‌ర్ యాద‌వ్*
➡️హ‌త్య ఉదంతంపై పోలీసు ఉన్న‌తాధికారికి ఫిర్యాదు..
➡️పోలీసు శాఖాధికారుల్లో అనూహ్య స్పంద‌న‌

నందిరెడ్డి నాగ‌శివారెడ్డి, జ‌ర్న‌లిస్టు...✍️

https://journalistnandireddy.in/mystery-brutal-murder-mystery/

*2024 డిశంబ‌ర్ 6.. స‌మ‌యం అర్ధ‌రాత్రి ఒంటిగంట‌.. నిర్మాణంలో ఉన్న భ‌వనం.. ఆ భ‌వ‌నంలో ఖాళీగా ఉండే మంచంపై నిద్రిస్తున్న 75ఏళ్ల వృద్ధుడుపై ఇద్ద‌రు యువ‌కులు దాడి..* వృద్ధుడి త‌ల‌పై దిండు మోపి ఊపిరి ఆడ‌కుండా బ‌లంగా నొక్కేస్తున్నారు.. కొద్ది సేప‌టికి ఆవృద్ధుడు ఊపిరాడ‌కా కాళ్లు గిల‌గిల కొట్టుకుంటూ ప్రాణాలు వ‌దిలారు.. వృద్ధుడి ప్రాణాలు పోయాయ‌ని నిర్ధారించుకున్న ఆ ఇద్ద‌రు యువ‌కులు అక్క‌డ నుండి చ‌డీచ‌ప్ప‌డు కాకుండా జారుకున్నారు.. పడుకున్న మంచంమీద‌నే శ‌వ‌మై ఉండిపోయాడు ఆవృద్ధుడు.. తెల్లారింది.. కొత్త‌గా క‌డుతున్న ఇంటికి నీరు ప‌ట్టేందుకు ఓ వ్య‌క్తి వ‌చ్చాడు.. ఇక్క‌డేంటి ఖాళీగా ఉన్న మంచంలో ఎవ‌రో పడుకుని ఉన్నారు అనుకుంటూ అక్క‌డి వ‌చ్చి ప‌రిక్షించి చూశాడు.. ప్రాణాలు లేని వృద్ధ శ‌వం.. వృద్ధుడు క‌దా మామూలు చావు చచ్చాడేమో అనుకుని బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చి అంగ‌న్ వాడీ కేంద్రం వ‌ద్ద ఉంచాడు.. ఆ వృద్ధుడి బంధువులు అంత్య‌క్రియ‌లు త‌తంగం పూర్తిచేశారు.. 75 ఏళ్లు క‌దా ఏదైనా అనారోగ్యం వ‌ల్ల చ‌చ్చిపోయాడేమో అని ఆ ప‌ల్లె వాసులు అనుకున్నారు.. ఇదంతా మైదుకూరు పుర‌పాలిక ప‌రిధిలోని శెట్టివారిప‌ల్లె గ్రామంలో చోటుచేసుకుంది..

*వృద్ధుడి మ‌ర‌ణం బ‌ట్ట‌బ‌య‌లు చేసిన సీసీ కెమెరా..*

కొత్త ఇల్లులు నిర్మించుకునే క్ర‌మంలో ఆ ఇండ్ల య‌జ‌మానులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలో అల్లాడుప‌ల్లె వీరారెడ్డి(75) చావుకు సంబంధించి మిస్ట‌రీ రికార్డైంది.. ఆ రికార్డు లో వృద్దుడి హ‌త్య దృశ్యాలు ఆప‌ల్లె వాసుల‌ను హ‌డ‌లెత్తించాయి.. న‌డి ఊరిలో.. ఇలా హ‌త్య‌కు పాల్పడ‌టంపై భ‌యాందోళ‌న చెందారు.. కానీ, ఎవ్వ‌రికీ వారు మిన్న‌కుండిపోయారు.. వృద్దుడి అంత్య‌క్రియ‌లు త‌ర్వాత ఆప‌ల్లెకు పోలీసులు వ‌చ్చారు.. విచార‌ణ జ‌రిపారు.. ఎవ్వ‌రీ నుండి పిర్యాదు లేని కార‌ణ‌మో? హ‌త్య‌కు సంబంధించిన ఆధారం లేని కార‌ణ‌మో? వీరారెడ్డి హ‌త్య మిస్ట‌రీ అలా ఉండిపోయింది.. వీరారెడ్డిని చంపారు.. ఇలాప‌ల్లెలో.. న‌డి ఊరిలో హ‌త్య జ‌ర‌గ‌డం ను అంద‌రూ తీవ్రంగా భావించారే కానీ, హ‌త్య మిస్ట‌రీ విష‌యం గుస‌గుస‌గా ఉండిపోయింది.. వీరారెడ్డి మామూలు చావుగానే మిగిలిపోయింది.. ఆ ప‌ల్లె జ‌నం సైతం ఆ వృద్ధుడి హ‌త్య ఉదంతం గురించి మ‌రిచిపోయారు..

*మాన‌వీయ కోణంలో స్పందించిన ఎమ్మెల్యే పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌..*

25 రోజులు త‌ర్వాత శెట్టివారిప‌ల్లెలో వృద్ధుడు వీరారెడ్డి హ‌త్య ఉదంతం ఎమ్మెల్యే పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ చెవికి చేరింది.. వృద్దుడి ప్రాణాలు పోవ‌డం వెనుక మిస్ట‌రీ ఏమిటీ?? ఒక వ్య‌క్తి హ‌త్య‌కు గురైతే ఇలా వ‌దిలేయ‌డం ఏంట‌నే అనే కోణంలో తీవ్రంగా చలించాడు.. మాన‌వ‌త్వం మంట‌గ‌లిచి పోవ‌డం ప‌ట్ల ఒకింత ఆవేద‌న‌కు గుర‌య్యారు.. జ‌న‌వ‌రి ఒక‌టిన త‌న‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలియ‌జేసేందుకు విచ్చేసిన పోలీసు ఉన్న‌తాధికారుల‌తో శెట్టివారిప‌ల్లెలో జ‌రిగిన వృద్దుడి హ‌త్య విష‌యంపై సీరియ‌స్ అయ్యారు.. మ‌నం ఎక్క‌డున్నాము? ఏమి జ‌రుగుతోంది? అస‌లు మాన‌వీయ‌త ఉండాల్సిన బాధ్య‌త ముఖ్యంగా మీలో ఉండాలి కదా అంటూ పోలీసు అధికారుల‌ను సూటిగా ప్ర‌శ్నించారు.. ఏదిఏమైనా వీరారెడ్డి వృద్దుడు హ‌త్య మిస్ట‌రీ చేధించి తీరాల్పిందే..ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎక్క‌డ జ‌ర‌కూద‌డు అంటూ పోలీసుఅధికారుల‌కు ఎమ్మెల్యే పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ ఒక విధంగా ఆదేశాలు జారిచేసిన‌ట్లు ఉంది.. 24గంట‌ల్లో వృద్దుడి హ‌త్య మిస్ట‌రీ తేల్చండి అంటూ మాన‌వీయ కోణంలో ఎమ్మెల్యే స్పందించారు.. వృద్ధుడి హ‌త్య ఉదంత వివ‌రాలు డీఐజీకి ఎమ్మెల్యే తెలియ‌జేశారు.. హ‌త్యn మిస్ట‌రీని తేల్చండి.. నిజాలు బ‌హిర్గ‌త‌ప‌ర్చండి అంటూ పోలీసు ఉన్న‌తాధికారిని కోరారు..

*24 గంట‌లోపే క‌దిలిన పోలీసు అధికారులు..*

శెట్టివారిప‌ల్లెలో వీరారెడ్డి అనే వృద్దుడు హ‌త్య ఉదంత‌పై ఎమ్మెల్యే సూచ‌న మేర‌కు మైదుకూరు పోలీసు అధికారుల్లో క‌ద‌లిక ఆరంభ‌మైంది.. 24గంట‌లు కాక ముందే వృద్ధుడి హ‌త్య మిస్ట‌రీ వ్య‌వ‌హారం పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా ఇద్ద‌రినీ అదుపులోకి తీసుకున్నారు.. విచార‌ణ వేగ‌వంతం చేశారు.. వృద్దుడు హ‌త్య నేప‌థ్యంను వ‌డ‌పోత‌ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. వృద్ధుడు వీరారెడ్డి హ‌త్య మిస్ట‌రీలో వారి కుటుంబ స‌భ్యుడే ప్రధాన రోల్ గా పోలీసులు భావించిన‌ట్లు తెలుస్తోంది.. ప‌ల్లెలో న‌డి బొడ్డున ఈ హ‌త్య‌కు పాల్ప‌డ‌టంను ఆప‌ల్లె వాసులు క‌ల‌త చెందుతున్న‌ప్ప‌టికీ.. ఇలాంటి ఘ‌ట‌న మ‌రోక‌టి జ‌రిగితే ఏలా అనే భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నా.. మ‌న‌కెందుకు వ‌చ్చిన స‌మ‌స్య‌లే అనే భావ‌న‌తో నోరు క‌ట్టేసుకునిఉన్న ఈ త‌రుణంలో నియోజ‌క‌వ‌ర్గ బాధ్యుడుగా ఎమ్మెల్యే పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ స్పందించ‌డం ప‌ట్ల హ‌త్య మిస్ట‌రీ ఉదంత నేప‌థ్యం తెలిసిన ప్ర‌తి ఒక్క‌రు అభినందిస్తున్నారు.. వృద్దుడి హ‌త్య వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు చేయ‌డ‌మే కాకుండా.. అందుకు కార‌కులైన వారిపై చ‌ర్య‌లు తీసుకున్న నేప‌థ్యంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎక్క‌డా జ‌ర‌గ‌వు.. హ‌త్య‌లు సంస్కృతికి అడ్డుక‌ట్ట వేసిన‌ట్లు అవుతుంద‌ని అత్య‌ధికులు భావిస్తున్నారు... హ‌త్య విచార‌ణ పూర్తి కాగానే వృద్దుడి హ‌త్య మిస్ట‌రీ ని చేధించ‌నున్నారు..

ఈ కథ‌నంకు స్పంద‌న‌...గాంధీ పుట్టిన దేశ‌మేనా?? మ‌రి ఇలాంటి దేశంలో ఈ దుస్థితికి కార‌కులెవ్వ‌రూ?పాల‌కులా? అధికారులా?ప్ర‌శ్న...
03/10/2023

ఈ కథ‌నంకు స్పంద‌న‌...

గాంధీ పుట్టిన దేశ‌మేనా?? మ‌రి ఇలాంటి దేశంలో ఈ దుస్థితికి కార‌కులెవ్వ‌రూ?
పాల‌కులా? అధికారులా?
ప్ర‌శ్నించ‌లేని జ‌నాల‌దా? ఎవ్వ‌రిదీ త‌ప్పిదం?
ఏళ్ల‌త‌ర‌బ‌డి మ‌హిళ‌లు, యువ‌తుల‌కు మాన ప్రాణాలకు రక్ష‌ణ కొర‌బ‌డిన‌ట్లేనా?

-నందిరెడ్డి నాగ‌శివారెడ్డి, జ‌ర్న‌లిస్టు

మ‌హిళ‌ల మాన ప్రాణాల‌కు సంబంధించిన ఈ క‌థ‌నం స్పంద‌న‌కు దారి తీసింది.. నేష‌న‌ల్ ఉన్న‌తాధికారులను సైతం క‌ద‌లిక తీసుకువ‌చ్చింది.. జాతీయ ర‌హ‌దారిలో స‌ర్వాయ‌పల్లె రోడ్డు వ‌ద్ద‌నిర్మించిన అండ‌ర్ బ్రిడ్జీ వల్ల మ‌హిళ‌లు, యువ‌తుల త‌న మాన ప్రాణాల‌కు గుర‌వుతున్న క‌థ‌నం నేను ఎలా క‌సితీరా రాయ‌గ‌లిగానో.. అదే త‌ర‌హాలో నేష‌న‌ల్ హైవే అధికారులు అదే దిశ‌గా స్పందించారు.. క‌థ‌నం క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు రాశావు అంటూ అధికారులు కితాబు ఇచ్చారు.. పుర‌పాలిక అధికారి రంగ‌స్వామి సైతం క‌థ‌నం చ‌దివి త‌న‌దైన శైలిలో స్పందించి.. మ‌హిళ‌ల మాన ప్రాణాలు కాపాడ‌టంలో ఏ మాత్రం వెనుక‌డుగు వేసేది ఉండదంటూ భ‌రోసా ఇచ్చారు.. బిజేపీ నాయ‌కులు బిపీ ప్ర‌తాప్ రెడ్డి అదే ఒర‌వ‌డి కొన‌సాగించారు.. నేను రాసిన క‌థ‌నం త‌ను షేర్ చేయ‌డ‌మే కాకుండా నేష‌న‌ల్ హైవే ప్రాజెక్టు డైరెక్ట‌ర్ కైలాస్ కు గాంధీ పుట్టిన దేశ‌మేనా?? మ‌రి ఇలాంటి దేశంలో ఈ దుస్థితికి కార‌కులెవ్వ‌రూ? అంటూ నేను రాసిన క‌థ‌నంను పంపించారు.. ఈ క‌థ‌నం చ‌దివిన వెంట‌నే పీడీ కైలాస్ మ‌హిళ‌ల‌కు సంబంధించి స‌మ‌స్య‌ను స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రిస్తాను.. ఆ స‌మ‌స్య‌కు శాశ్విత ప‌రిష్కారం చూపేవిధంగా త‌న కింద
స్ధాయి అధికారుల‌కు ఆదేశాలు జారీ చేస్తాను అంటూ మెసేజ్ చేశారు.. అదే వేగంగా మంగ‌ళ‌వారం నేష‌న‌ల్ హైవే ప‌ర్య‌వేక్ష‌ణ బృందం బ్రిడ్జీ కింద మురికి కుంట‌ను తొల‌గించి మ‌హిళ‌ల‌, యువ‌తుల మాన ప్రాణాల‌కు ఏమాత్రం భంగం వాటిల్ల‌కుండా ప‌నులు చేప‌డుతున్నారు...

గాంధీ పుట్టిన దేశ‌మేనా?? మ‌రి ఇలాంటి దేశంలో ఈ దుస్థితికి కార‌కులెవ్వ‌రూ?,👉పాల‌కులా? అధికారులా?👉ప్ర‌శ్నించ‌లేని జ‌నాల‌దా?...
02/10/2023

గాంధీ పుట్టిన దేశ‌మేనా?? మ‌రి ఇలాంటి దేశంలో ఈ దుస్థితికి కార‌కులెవ్వ‌రూ?
,👉పాల‌కులా? అధికారులా?
👉ప్ర‌శ్నించ‌లేని జ‌నాల‌దా? ఎవ్వ‌రిదీ త‌ప్పిదం?
👉ఏళ్ల‌త‌ర‌బ‌డి మ‌హిళ‌లు, యువ‌తుల‌కు మాన ప్రాణాలకు రక్ష‌ణ కొర‌బ‌డిన‌ట్లేనా?
- *నందిరెడ్డి నాగ‌శివారెడ్డి, జ‌ర్న‌లిస్టు*
‘‘ ఇక్కడ ప్రయాణమంటే మహిళ ల హాడలేనా’’ అంటూ ఈ ప్రాంత మహిళలతోపాటు.. ఈ దారిని ప్రయాణించే మహిళల, యువతుల కన్నీటి కథల గురించి మనకు స్వాంతంత్ర ఫలాలు అందాయంటూ ఘనంగా నిర్వహించుకునే రిపబ్లిక్ దినోత్సవ పురస్కరించుకుని ఓ కథనం రాసింటి.. మళ్లీ స్వాతంత్ర దినోత్సవం వచ్చింది.. ఘనంగా వేడుక కూడా పూర్తిచేసుకున్నారు.. కానీ ఈ ప్రాంత మహిళల మాన ప్రాణాలను పరిర‌క్షించే విష‌యంలో ఏపాటి చిత్త‌శుద్ధి అటు పాల‌కుల్లో కానీ, ఇటు అధికారుల్లో మ‌చ్చుకైన క‌న‌ప‌డ‌లేద‌న్న‌ది అంద‌రం అంగీక‌రించి తీరాల్సిందే..
మైదుకూరు ప‌ట్ట‌ణంకు అరమైలు దూరం లో క‌డ‌ప‌-క‌ర్నూలు జాతీయ ర‌హ‌దారి భైపాస్ వ‌ద్ద స‌ర్వాయ‌ప‌ల్లె రోడ్డు అండ‌ర్ రోడ్డు నిర్మాణం జ‌రిగిపోయింది.. ప‌ల్లె జ‌నం ప‌ట్ట‌ణంకు రాక‌పోక‌లు సాగించేందుకు ఈ అండ‌ర్ రోడ్డు నిర్మాణం చేప‌ట్ట‌డం మంచిదే.. నిర్మాణ విష‌యంలో లోప‌బూయిష్ట విధానాల కార‌ణంగా వ‌ర్షం వ‌చ్చిందంటే అండ‌ర్ రోడ్డు పెద్ద‌మురికి గుంతే.. అందులోని నీరు బ‌య‌ట‌కు వెళ్లేందుకు వీలుగా నిర్మాణం చేప‌ట్ట‌ని ఫ‌లితంగా చిన్న‌పాటి వ‌ర్షం వ‌చ్చినా నీరంతా అక్క‌డ నిలిచిపోతుంది.. ఆ నీరు ఇంకి పోయేంత వ‌ర‌కు అటు ప‌ట్ట‌ణం నుండి ప‌ల్లెల‌కు.. ఇటు ప‌ల్లెల నుండి ప‌ట్ట‌ణంకు విచ్చేసే మ‌హిళ‌ల‌తోపాటు, యువ‌తులకు న‌ర‌క‌యాత‌నే.. వ‌ర్షం నీరు అధికంగా నిలిచిపోవ‌డంతో అటువైపు వెళ్లాలన్న‌..ఇటు వైపు రావాలి అన్న ఆ నీటిలో మ‌హిళ‌లు న‌డిచి తీరాల్సిందే.. మోకాలి లోతు వ‌ర‌కు నీరు ఉండిపోవ‌డంతో చీరెల‌ను పైకి ఎత్తుకొని దాటుకోవ‌ల్సి వ‌స్తోంది.. ఆస‌మ‌యంలో మైదుకూరు వైపు నుండి కానీ, మైదుకూరు వైపు కు వెళ్లే మ‌గవాళ్లు వ‌స్తున్నారేమో చూసుకోవాలి.. ఎందుకంటే ఆడ‌వాళ్లు చీరెలు.. యువ‌తులు లంగాల‌ను మోకాలి వ‌ర‌కు పైకి ఎత్తుకుని అందులో నుండి న‌డ‌వాలి అంటే మాన‌ప్రాణాల‌కు సంబంధించిన వ్య‌వహారం కాబ‌ట్టి... ఏడాదికి ఆరు నెల‌లుపాటు ఇదే దుస్థితి మ‌హిళ‌లు, యువ‌తులు ఎదుర్కొవ‌ల్సి వ‌స్తోంది.. మ‌గాళ్లేవ్వ‌రూ, యువ‌కులు ఎవ్వ‌రూ రాలేదులే అని కొక‌లు పైకి ప‌ట్టుకుని గుంత‌లో దిగాక‌.. అటు వైపు నుండి కానీ, ఇటువైపు నుండి కానీ మ‌గ‌వాళ్లు వ‌చ్చారంటే పాపం ఆడ‌వాళ్లు త‌ల‌దించుకుని దాటుకునే దౌర్భాగ్య‌దుస్థితి ఇక్క‌డ ఉండిపోయింది.. ఇక్క‌డ రాక‌పోక‌లు సాగించే ఆడ‌వాళ్ల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది.. కానీ మ‌న అధికారులు కానీ, పాల‌కులు గానీ ఆడ‌వాళ్ల‌, యువ‌తుల మాన‌ప్రాణాలు కాపాడే విష‌యంలో ఏ పాటి శ్ర‌ద్ధ చూప‌డం లేదు..

నవ్విపోదురుగాక‌.. నాకేంటి సిగ్గు..
అండ‌ర్ బ్రిడ్డీ నిర్మాణంలోని లోపాల‌ను స‌రిచేసి ఆడ‌వాళ్లు మాన‌ప్రాణాల‌ను ప‌రిర‌క్షించాల్సిన ఎమ్మెల్యే శెట్టిప‌ల్లెర‌ఘురామిరెడ్డి ఆదిశ‌గా చూడ‌లేదు.. బైపాస్ రోడ్డు మీద‌కు వెళ్లేందుకు రోడ్డును ఎంపీ అవినాష్‌రెడ్డి కోటా కింద రూ.5ల‌క్ష‌లు నిధులు వెచ్చించి మ‌ర‌మ్మ‌త్తులు చేయించి మ‌హిళ‌ల‌ను అలా గాలికివ‌దిలేసిన‌ట్లైంది. బైపాస్ రోడ్డు కు ఇరువైపుల రోడ్డుకు మర‌మ్మ‌త్తులు చేయించ‌డం మంచిదే అనిచెప్పుకున్న‌ప్ప‌టికీ మ‌హిళ‌ల మాన ప్రాణాల‌ను కాపాడేవిష‌యంలో ముందు చూపు ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డితోపాటు, పుర‌పాలిక అధికారికి ఎందుకు కొర‌వ‌డింద‌నే విమర్శ‌లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి..

ఇదే గుంత‌లోనే ఎమ్మెల్యే ప్ర‌యాణం..?
జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష కార్య‌క్ర‌మంలో భాగంగా ఖాజీపేట మండ‌లం బి.కొత్త‌ప‌ల్లె గ్రామానికి ( మా ప‌ల్లె)కు ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి ఇదే అండ‌ర్ బ్రిడ్డీ కింద రాక‌పోక సాగించారు.. ఆ స‌మ‌యంలో బ్రిడ్డీకింద మోకాలిలోతు నీరు ఉంది.. మ‌రి అందులో నుండి ప్రయాణించిన ఎమ్మెల్యే ఈ మురికి గుంట దుస్థితిని చూడ‌లేక‌పోయారేమో?. ఎందుకంటే ఎమ్మెల్యే వెంట ముందు.. వెనుక వాహ‌నాలకు కొద‌వ ఉండ‌దు క‌దా.. ఈక్ర‌మంలో ఆ మురికి గుంట విష‌యం.. మ‌హిళ‌ల అవ‌స్ధ‌లు కంట‌క‌న‌ప‌డుకుండా పోయింటాయి.. ఒక వేళ చూసినా ఆదిశ‌గా ఆలోచ‌న చేసి ఉండ‌క‌పోవ‌చ్చు నేమో అనే సందేహాలు కూడా ఈ ప్రాంత వాసుల్లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి.. కొత్త‌ప‌ల్లెకు ఎమ్మెల్యే ఈ గుంత‌లో నుండి ప్రయాణించి ఉంటారు కాబ‌ట్టి.. మ‌న క‌ష్టాల‌ను గుర్తెరిగే వారంతే మ‌న మాన ప్రాణాలు కాపాడే విష‌యంలో చొర‌వ చూపుతారనే ఆశ కూడా బాధిత మ‌హిళ ల్లో ఉండిపోయింది.. ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి ఇటుగా వ‌చ్చి మూడు రోజుల‌వుతున్నా ఈ స‌మ‌స్య‌కు స‌త్వ‌ర ప‌రిష్కారం దొర‌క్క‌పోవ‌డం వ‌ల్ల ఈ ప్రాంత‌ మ‌హిళ‌ల‌కు తీవ్ర‌నిరాశకు లోన‌వుతున్నారు..
పుర‌పాలిక అధికారి రంగ‌స్వామి ది అదే తంతేనా..?
పుర‌పాలిక అధికారిగా వ‌చ్చిన రంగ‌స్వామికి మైదుకూరుప్రాంతంలో బాగా ప‌రిచ‌యం ఉంది..గ‌తంలో మండ‌ల గ్రామ కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసిన అనుభ‌వం ఉంది.. పైగా ఈ ప్రాంత వ్యక్తుల‌తో స‌న్నిహితం ఉంది.. చుట్టుప‌రిస‌రాల‌పై అవ‌గాహన ఉంది.. మ‌రి బైపాస్ అండ‌ర్ బ్రిడ్డీ నందు వారాలు,నెల‌లు త‌ర‌బ‌డి నీరు నిలిచి అటు ఇటు రాక‌పోక‌లు సాగిస్తున్న ప్ర‌జ‌ల‌తోపాటు, ముఖ్యంగా మ‌హిళ‌లు ప‌డే ఇబ్బందులు. వారి మాన ప్రాణాల స‌మ‌స్య గురించి ఎందుకు గుర్తించ‌లేపోయార‌న్న‌ది ఓ పెద్ద సందేహం.. త‌న ముందు ప‌నిచేసిన పుర‌పాలిక అధికారుల త‌ర‌హాలోనే ప‌నిచేస్తూ వారి సంస్కృతినే అల‌వ‌ర్చుకున్నారా అనే విమ‌ర్శ‌లు కూడా విన‌వ‌స్తున్నాయి..
ఈ స‌మ‌స్య‌కు ల‌క్ష‌లు, కోట్లు అవ‌స‌రం లేదు.!
అండ‌ర్ బ్రిడ్డీ కింద మైదుకూరు నుండి వ‌చ్చే మురికి నీరుచేర‌కుండా.. వర్ష‌పు నీరు అక్క‌డ నిలబ‌డ‌కుండా చేసేందుకు కొద్దిపాటి బుర్ర ఉప‌యోగిస్తే స‌రిపోతుంది.. ఆ బుర్ర ఉప‌యోగించ‌ని ఫ‌లితంగా ఏళ్ల‌త‌ర‌బ‌డి మహిళ‌లు మాన ప్రాణాల‌ను ప‌ణ్ణంగా పెట్టాల్సిన దుస్తితి ఉండిపోయింది.. ఈ ప్రాంత మహిళ‌ల‌కు స్వాతంత్ర ఫలాలు అందించి..వారి మాన ప్రాణాలు కాపాడగ‌లిగిన‌ప్పుడే మ‌హాత్మ గాంధీ ఆత్మ శాంతిస్తుంది త‌ప్ప‌.. జ‌యంతి,వ‌ర్ధంతి వేడుకులు ఘ‌నంగా జ‌రుపుకుంటే శాంతించ‌ద‌న్న‌ది మ‌న పాల‌కులు, అధికారులు గుర్తెర‌గాల్సి ఉంటుంది..

29/06/2023
వైఎస్ జ‌గ‌న్ కోసం.. ప్రాణాలోడ్డి ‘‘ఒక్కడి’’గా  నిల‌బ‌డ్డా.! పార్ట్ -2 ( జ‌ర్న‌లిస్టు డైరీ)కడప పార్లమెంట్ ఉప ఎన్నికల నామి...
27/06/2023

వైఎస్ జ‌గ‌న్ కోసం.. ప్రాణాలోడ్డి ‘‘ఒక్కడి’’గా నిల‌బ‌డ్డా.! పార్ట్ -2 ( జ‌ర్న‌లిస్టు డైరీ)

కడప పార్లమెంట్ ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియప్రారంభం నుండి మంత్రి హోదాలో డీఎల్ కాంగ్రెస్ పార్టీ తరుపునపోటీ చేస్తుండటంతో వైసీపీ పార్టీ అధినాయకత్వం మైదుకూరు నియోజకవర్గం మీదనే ఫోకస్ పెట్టింది.. ఎంతగా అంటే డీఎల్ కదలికలపై పూర్తి స్ధాయి నిఘా పెట్టింది.. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మిగతా నియోజకవర్గాలు ఒక ఎత్తు.. మైదుకూరు నియోజకవర్గం ఒక ఎత్తు అనేలా.. అటు పార్టీ పరంగానే కాకుండా సాక్షి య‌జ‌మాన్యం ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. డీఎల్ పై వ్య‌తిరేక క‌థ‌నాలు అందించే విష‌యంలో ప్ర‌త్యేక డెస్క్ ఏర్పాటు చేసింది.. ఈడెస్క్ కు వార్తా క‌థ‌నాలు అందించే బాధ్య‌త నాపై పెట్టింది.. ఢిల్లీ కి క‌డ‌ప‌కు పోటీ అనే నినాదంతో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోటీ చేస్తున్న నేప‌థ్యంలో నేను కూడా నావంతుగా మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో స‌హ‌కారం అందించాను. నా ప్రాణాన్ని ప‌ణ్ణంగా పెట్టి వార్త‌ల‌తోపాటు.. డీఎల్ కు షాడో గా వ్య‌వ‌హ‌రిస్తూ అటు పార్టీ.. ఇటు సాక్షి య‌జ‌మాన్యం నాకు అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌ను నెర‌వేర్చా..

- నందిరెడ్డి నాగ‌శివారెడ్డి, జ‌ర్న‌లిస్టు

ఎన్నిక‌ల‌కు సాక్షి ప్ర‌త్యేక టీం..
మైదుకూరు నియోజక‌వ‌ర్గం పై సాక్షి యాజమాన్యం దృష్టి పెట్టిన నేప‌థ్యంలో డీఎల్ పై ఎప్ప‌టిక‌ప్పుడు డేగ కన్నుతో వార్త‌లు అందించే క్ర‌మంలో ప్ర‌త్యేక టీం ఏర్పాటుచేసింది.. టీం మైదుకూరులో ఉండే విధంగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో స‌న్నిహితంగా సంగ‌న కిషోర్ రెడ్డి స‌ర్వాయ‌ప‌ల్లె రోడ్డులో త‌న ఇంటిని ఇచ్చేశారు.. ఇక‌ప‌ర్నీచ‌ర్ ను మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్ చార్జ్ గా ఉన్న శెట్టిప‌ల్లెర‌ఘురామిరెడ్డిని అడ‌గ‌మ‌ని న‌న్ను ఆదేశించారు.. అదే మాట ర‌ఘురామిరెడ్డి వ‌ర్గీయుల‌కు చేర‌వేచా.. సంగ‌న కిషోర్ రెడ్డి ఇచ్చిన రూమ్ లో ప‌ర్నిచ‌ర్ ఏర్పాటు చేయించారు. ఒంగోలు జిల్లా రిపోర్ట‌ర్ శ్రీనివాసులుతోపాటు, విజ‌య‌వాడ‌, గుంత‌క‌ల్‌, క‌ర్నూలు, నంద్యాల తదిత‌ర సెంట‌ర్ల నుండి ప‌ది మంది వ‌ర‌కు సాక్షి రిపోర్ట‌ర్ల‌ను మైదుకూరుకు పంపించారు..అంద‌రూ నియోజ‌క‌వ‌ర్గంకు కొత్త‌వారే..నేనే అంద‌రికీ సుప‌రిచితుడ‌ను.. వీరి నిర్వ‌హాణ బాధ్య‌త‌ను నాకు అప్ప‌గిస్తూ ఖ‌ర్చుల కింద 10వేలు ఇచ్చి నాతో సంత‌కం తీసుకున్నారు క‌డ‌ప సాక్షి రిపోర్ట‌ర్‌. ఎన్నిక‌ల స‌మాచారం అందుకునే క్ర‌మంలో మండ‌లానికి ఇద్ద‌రిని నియ‌మించుకున్నాము.. ఆ ప‌ది రోజులు మా తిండి ఖ‌ర్చులు పాతిక వేలు దాటింది.. ప‌దివేలు య‌జ‌మాన్యం ఇస్తే ఇక 15వేలు నేనుపెట్టుకున్నా.. ఎన్నిక‌లు అయిపోగానే ఆ ఖ‌ర్చుల‌కింద న‌న్ను ప‌ర్నీచ‌ర్ తీసుకోమ‌ని జిల్లా రిపోర్ట‌ర్లు చెప్పారు కానీ.. ఎక్క‌డ మేము తీసుకెళ్తామేమో అని ఇక్క‌డ పార్టీ పెద్ద‌లు ఆదేశం మేర‌కు ఒక్క మాట కూడా చెప్ప‌కుండా రాత్రికి రాత్రే తీసుకెళ్లారు.. మా టీం ఖ‌ర్చు కింద‌నే 15వేల వ‌ర‌కు నేను పెట్టుకోవ‌ల్సి వ‌చ్చింది..

ప్రాణాల‌కు తెగించి.. దాడుల‌కు బెద‌ర‌కుండా పోలింగ్ రోజు నా విధులు..
‘‘పొద్దునే డీఎల్ ఇంటి వ‌ద్ద‌కు వెళ్లు.. మీతో ఒంగోలు శ్రీను, ఓబీ వ్యాన్ , కెమ‌రా మెన్ వ‌స్తారు తీసుకెళ్లు అంటూ ’’ సాక్షి య‌జ‌మాన్యం నుండి ఆదేశాలు.. ‘‘డీఎల్ ఎక్క‌డికి వెళ్లితే అక్క‌డు మీరు వెళ్లాలి.. రిగ్గింగు పాల్ప‌డితే క‌వ‌రేజ్ చేయండి ’’ అంటూమ‌రో సందేశం.. ఇంకేముంది య‌జ‌మాన్యం, జిల్లా రిపోర్ట‌ర్ల ఆదేశం మేర‌కు ఆరోజు నాలుగు గంట‌ల‌కే డీఎల్ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాము.. నేను ఓబిలో వ్యాన్ లో ఉంటూనే డీఎల్ కు షాడోగా ఉండిపోయాయి... ఈ ఎన్నిక‌ల‌కు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జ్ గా భూమా నాగిరెడ్డి,శోభ‌నాగిరెడ్డి వ్య‌వ‌హ‌రించేవారు. డీఎల్ క‌దలిక‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు నాతో శోభ‌క్క తెలుసుకునేది. గుత్తికొట్టాల‌కు డీఎల్ వెళ్లారు.. పోలింగ్ కేంద్రంలో దుగ్గిరెడ్డి గంగాధ‌ర్ రెడ్డి బిడ్డ ఏజెంట్ గా ఉండ‌టంతో డీఎల్ అరిచి బ‌య‌ట‌కుపంపించారు.. అక్క‌డే ఉన్న మాకు గంగాధ‌ర్ రెడ్డి ఫోన్ ఛేశారు.. మా బిడ్డ‌ను డీఎల్ బ‌య‌ట‌కు పంపించారు.. నీవు అక్క‌డే ఉన్నావు క‌దా కూర్చోబెట్ట‌మ‌ని చెప్పారు.. డీఎల్ వెళ్లాక మేము గంగాధ‌ర్ బిడ్డ‌ను ఏజెంట్ కూర్చోబెట్ట‌గ‌లిగాం.. ఆత‌ర్వాత డీఎల్ నందిపాడు వెళ్లారు.. అక్క‌డ గంగాధ‌ర్‌రెడ్డి భార్య‌, వాసు భార్య ఏజెంట్ గా కూర్చోని ఉండ‌టం వాళ్ల‌తో పెద్ద డిస్క‌స్ జ‌రిగింది.. అక్క‌డే ఉన్న మ‌మ్మ‌ల్ని చూసి ఫ్యాంట్ జిప్పు మీద చేయి పెట్టి ఇది కూడా తీసుకోండంటూ డీఎల్ ఆగ్ర‌హించారు.. త‌ర్వాత ఖాజీపేట మీదుగా క‌మ‌లాపురం డీఎల్ వెళ్లారు.. డీఎల్ క‌మలాపురం వెళ్లే స‌మ‌యంలో డెస్క్‌కు స‌మాచారం అందించా.. ‘‘మీరు వెన‌క్కి వ‌చ్చి మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గం చూసుకోండి.. డీఎల్ రాగానే వారికి షాడోగా ఉండండి’’ అని చెప్పారు.. మేము ఖాజీపేట‌కు తిరిగి వ‌చ్చాము..

ఖాజీపేట కేసీ బంగ్లా పోలింగ్ కేంద్రంలో డీఎల్ అల్లుడు కిర‌ణ్‌తో వాగ్వివాదం..

ఖాజీపేట కేసీ బంగ్లా పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జ‌రుగుతుంద‌నే స‌మాచారం మేర‌కు నేను, శ్రీను వ‌చ్చాము.. పోలింగ్ కేంద్రంలోకి వెళ్తుండ‌గా డీఎల్ అల్లుడు కిర‌ణ్ కుమార్ రెడ్డి ఎదురుగా వ‌స్తుంటే.. తెలిసిన వ్య‌క్తిక‌దా ఎందుకు ఎదురు ప‌డ‌టం అనే భావ‌న‌తోముఖంతిప్పుకున్నా.. గ‌మ‌నించిన కిర‌ణ్ పోలింగ్ కు నాకు ఎన్నిక‌ల క‌మీష‌న్ పాస్ ఇచ్చిన విష‌యం తెలియ‌క అది గ‌మ‌నించిన కిర‌ణ్ న‌న్ను పోలీసుల‌కు ప‌ట్టించే నిమిత్తం డీఎస్పీ అధికారిని తీసుకువ‌చ్చారు.. నేను ఇక ఎదురు తిర‌గాల్సి వ‌చ్చింది.. ఎన్నిక‌ల క‌మీష‌న్ ఇచ్చిన పోలింగ్ పాస్ ను చూపించా..అప్పుడు కిర‌ణ్ తో నాకు గొడ‌వ‌తో కూడిన వాగ్వివాదం జ‌రిగింది.. ఇది సాక్షిటీవీలో లైవ్ కూడా వ‌చ్చింది.. చివ‌ర‌కు అదే డీఎస్పీ తో కిర‌ణ్ ను పోలింగ్ కేంద్రం నుండి నేనే బ‌య‌ట‌కు పంపించా.. అది ఆ పోలింగ్ కేంద్రంలో జ‌రిగింది..

ఖాజీపేట హైస్కూల్ పోలింగ్ కేంద్రంకు వైఎస్ జ‌గ‌న్..

పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో పోలింగ్ స‌రళి ప‌రిశీలించే క్ర‌మంలో సాయంత్రం 3.30 గంట‌ల స‌మ‌యంలో ఖాజీపేట హైస్కూల్ పోలింగ్ కేంద్రం వ‌ద్ద‌కు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి వ‌చ్చారు.. ఆ స‌మ‌యంలో డీఎల్ పెద్ద కుమార్తె నిర్మ‌ల‌తో ‘‘ ఏమ్మా నిర్మలమ్మ దౌర్జన్యం చేస్తున్నారు ’’ అంటూ వైఎస్ జగన్అనే క్రమంలో.. ‘‘మీరు రౌడి, దౌర్జన్యం చేసేది మీరు.. మీగురించి మాకు తెలియదా’’ అని నిర్మలమ్మ అనేశారు. జగన్ ఖాజీపేటకు విచ్చేసిన సమాచారం నిర్మలమ్మ తన తండ్రి డీఎల్ కు అందించారు.. నేను వస్తున్నా అని డీఎల్ కు చెప్పిన సమాచారం అక్కడ అప్పటికే తెలిసిపోయింది..

కేసీ కెనాల్ బంగ్లా పోలింగ్ కేంద్రంలో జగన్..

ఖాజీపేట జడ్పీహైస్కూల్ తర్వాత కేసీ కెనాల్ బంగ్లా పోలింగ్ కేంద్రంకు జగన్ విచ్చేశారు.. అప్పటికీ డీఎల్ ఖాజీపేటకు వస్తున్న సమాచారం వైసీపీ లీడర్లకు తెలిసిపోయింది.. డీఎల్ వస్తున్నారు.. ఈ చివరి గంట రిగ్గింగ్ కుపాల్పడతారు మీరు ఇక్కడే ఉండండి అంటూ ఖాజీపేట మండల వైసీపీ నాయకులు, శెట్టిపల్లెరఘురామిరెడ్డి రెండవ కుమారుడు బాబ్జీ లు జగన్ ను కోరారు.. నేను కడప వెళ్లాలి అంటూ జగన్ వెళ్లిపోయారు. జగన్ వెళ్లే క్రమంలో ఐన్యూస్ రిపోర్టర్లు ఎన్నికల తీరు గురించి అడిగారు .. డీఎల్ ఖాజీపేటకు వస్తున్నారు.. రిగ్గింగ్ కుపాల్పడబోతారు.. చూడండి అంటూ పోలింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయారు..

డీఎల్ ఖాజీపేటకు రాకతో ఉడాయించిన వైసీపీ లీడర్లు..

ఖాజీపేటకు డీఎల్ వచ్చిరాకమునుపే అప్పటి వరకు ఖాజీపేట మండల పోలింగ్ ఇన్చార్జులగా వ్యవహరించిన నాయకులంతా సెల్ ఫోెన్లు ఆప్ చేసి కనపడకుండా పోయారు.. ఖాజీపేట లోని పోలింగ్ కేంద్రంలో ఏజెంట్ గా ఉన్న గంగాధర్ రెడ్డి మాత్రమే మాకు అందుబాటులో ఉంటూ సమాచారం అందిస్తూ వచ్చారు.. ‘‘ డీఎల్ వచ్చాడు.. మీ సాక్షి వాళ్లే చూసుకోండి’’ అంటూ ఇన్‌చార్జ్ లు ఫోన్లును స్విచ్చాఫ్ చేసుకున్నారు.. ఇక‌మిగిలింది నేను, సాక్షి టీవీ శ్రీను. ‘‘ నాగశివా నీవు జాగ్రత్త’’ అక్కడ గలాటాలు మొదలయ్యాయి అంటూ భూమా శోభక్కనాకు ఫోన్ చేసి జాగ్రత్త చెప్పింది. అప్పటికే సాక్షి య‌జ‌మాన్యం డీఎల్ రిగ్గింగ్ ను అరిక‌ట్టే క్ర‌మంలో ఓబీవ్యాన్లును పంపించేప‌ని చేపట్టింది.. ప్రొద్దుటూరు నుండి వ‌స్తున్న ఓబీ వ్యాన్ పై అప్ప‌టికే ఖాజీపేట స‌మీపంలో దాడి జ‌రిగింది.. ఇక్క‌డ ఓబీ వ్యాన్ ను ధ్వంసం చేశారు.. ఇక మీరే చూసుకోండంటూ సాక్షి పెద్ద రిపోర్ట‌ర్ల నుండి మాకు సూచ‌న‌లు.. సుంకేసుల పోలింగ్ కేంద్రం వ‌ద్ద‌కు డీఎల్ వ‌స్తున్నారు.. రిగ్గింగ్ జ‌రుగుతుంద‌నే స‌మాచారంతో నేను, శ్రీను అక్క‌డి వెళ్లాము.. శీను సుంకేసుల పోలింగ్ కేంద్రం నుండి లైవ్ ఇస్తున్నారు.. నేను అక్క‌డే ఉన్నా.. సుంకేసుల వ‌స్తున్న డీఎల్ దుగ్గిరెడ్డి జ‌నార్థ‌న్ రెడ్డి ఇంటి మీద‌కు వెళ్తున్నారు అనే స‌మాచారం వ‌చ్చింది.. అప్పుడే నాకు క‌డ‌ప సాక్షి ఆఫీసు నుండి ఫోన్‌.. నీవు అక్క‌డి నుండి జ‌నార్ధ‌న్ ఇంటి మీద‌కు డీఎల్ వెళ్తున్నారంట మీరు వెంట‌నే వెళ్లండి అని.. నేను అక్క‌డ నుండి వెళ్లేందుకు వాహ‌నం కోసం ఎదురు చూస్తున్న‌క్ర‌మంలో పోలీసు జీపు,అందులో జ‌ర్న‌లిస్టు మిత్రులు కొంద‌రున్నారు.. నేను వారితోక‌ల‌సి వెళ్లి సాక్షి టీవీ చంద్రకు ఫోన్ చేసి వారి వాహ‌నంలో ఎక్కాను.. ఖాజీపేట నుండి కేసీ బంగ్లా వైపు డీఎల్ వెళ్తున్నారు.. మేము ఫాలో అయ్యాము.. మా వాహ‌నం ప‌సిగ‌ట్టిన డీఎల్ అనుచ‌రులు ఢీకొట్టారు.. ఈ కార్ల మ‌ధ్య మ‌నం చిక్కిపోతామ‌నే భావ‌న‌తో మేము డైరెక్టుగా దుంప‌ల‌గ‌ట్టు వైపు వెళ్లాము..

న‌న్ను హ‌త‌మార్చేందుకు వ‌చ్చి ఓబీ వ్యాన్ ధ్వంసం..

ఇక పోలింగ్ 20 నిమిషాల్లో ముగియ‌నున్న ఓబీవ్యాన్ పోలీంగ్ కేంద్రం వ‌ద్ద ఉంది.. నేను శ్రీనుతో మాట్లాడా.. శీను ఇక్క‌డ మా కారును ఢీ కొట్టే ప్ర‌య‌త్నంచేశారు.. త‌ప్పించుకున్నాం అని చెప్పా.. అన్న నీవు జాగ్ర‌త్త నీ కోసం డీఎల్ వ‌స్తున్నాడు అని ఫోన్ పెట్టి ఈ విష‌యం గురించి లైవ్ ఇస్తున్నా అని చెప్పారు.. శీను లైవ్ ఇస్తున్న క్ర‌మంలో డీఎల్ అక్క‌డికి రానే వ‌చ్చారు.. నేను ఓబీ వ్యాన్‌లో ఉన్నార‌నుకున్నారు.. డీఎల్ అనుచ‌రుల ఇచ్చిన‌స‌మాచారంతో డీఎల్ మేన‌ల్లుడు మ‌ధు, అల్లుడు కిర‌ణ్‌లు డ్రైవ‌ర్‌గా ఉన్న‌ముదిరెడ్డిప‌ల్లె శ్రీనుతో చెప్పి ఓబీ వ్యాన్ ను ఢీ కొట్టు అందులో నాగ‌శివా ఉన్నాడు అని చెప్పించి ఢీకొట్టించారు.. అందులో వెతికారు నేను లేను.. వ్యాన్‌ను ధ్వంసం చేయ‌డంతో పాటు సాక్షి శ్రీనుపై భయంక‌ర‌మైన దాడికి పాల్ప‌డ్డారు.. కానిస్టేబుల్ శివరామిరెడ్డి వాళ్ల శ్రీనునుకాపాడి మైదుకూరు పోలీసు స్టేష‌న్ కు తీసుకు వెళ్లారు..

‘‘నిన్ను చంపేందుకు వ‌చ్చారు.. పారిఫో’’ అంటూ ఈనాడు భాస్క‌ర్‌, జ్యోతి ప్ర‌సాద్ ఫోన్‌..

న‌న్ను హ‌త‌మార్చే క్ర‌మంలో ఓబీ వ్యాన్‌పై దాడి చేసిన త‌ర్వాత నేను లేక‌పోవ‌డంలో ఇక్క‌డే ఎక్క‌డో ఉంటాడు వాడిని ప‌ట్టుకోండి అంటూ సుంకేసుల‌తో డీఎల్ అనుచ‌రులు హాల్‌చ‌ల్ చేశారు.. డీఎల్ సుంకేసుల విచ్చేసిన నేప‌థ్యంలో మిత్రులు ఈనాడు భాస్క‌ర్ రెడ్డి, ఆంధ్ర‌జ్యోతి ప్ర‌సాద్ అక్క‌డికి వ‌చ్చారు.. ‘‘ నాగశివను ఇక్కడ ఉండకుండా వెళ్లిపోమని చెప్పండి.. వాడి కోసం కొందరు వెళ్లారు..దొరికితే చంపేస్తారు ..మీరు చెప్పండి అంటూ ’’ మధుచెప్పాడని నాకుఫోన్ చేసి భాస్కర్,ప్రసాద్ లు చెప్పారు.. అప్పటికే నేను చెన్నూరు చేరుకున్నాను.. సాక్షి విలేకరి బాలకొండయ్య ఇంట్లో ఉన్నానని చెప్పా.. అప్పుడు కూడా ఏ మాత్రం భయపడకుండా కడప సాక్షి ఆఫీసుకు వెళ్లి పోలింగ్ వార్తలు రాచి ఇచ్చా..రాత్రి పదకొండుకు ఇంటికి చేరుకున్నాను..

ఓబీ వ్యాన్ ధ్వంసం చేసినా డీఎల్ పై కేసు పెట్టలేదు..

సుంకేసుల పోలింగ్ కేంద్రం వద్ద ఓబీ వ్యాన్ ధ్వంసం చేయబడినా.. సాక్షి శీను మీద దాడి చేసినా కనీసం డీఎల్ పై పోలీాసులకు ఫిర్యాదు చేసే ప్రయత్నం సాక్షి యజమాన్యం చేయలేకపోయింది.. మాకేందుకు అన్నట్లు అందరూ మిన్నకుండిపోయారు.. శ్రీనుగాయపడి మైదుకూరుపోలీసు స్టేషన్ లో ఉన్నవిషయం సాక్క్షి యజమాన్యం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికిరావ‌డంతో ఫోన్ లో ప‌రామ‌ర్శించారు.. న‌న్ను ఓ చిన్న‌విలేక‌రినే క‌దా.. న‌న్ను వ‌దిలేశారు వైసీపీ నాయ‌కుల‌తోపాటు, సాక్షి య‌జ‌మాన్యం .. అందుకేనేమో నేను సాహ‌సం.. నేను ప‌డ్డ వేద‌న‌..ప్రాణాల‌కు తెగించి పోరాడిన విధానం జ‌గ‌న్ దృష్టికి వెళ్ల న‌ట్లు ఉందో..లేదో మ‌రి... బిడ్డ క‌న్నీటిని ఖాత‌రుచేయ‌కుండా అంత శ్ర‌మ ప‌డినా య‌జ‌మాన్యం నుండే కాదు.. వైసీపీ పెద్ద లీడ‌ర్ల నుండి ధ్యాంక్స్ చెప్పిన దాఖ‌లాలు లేవు.. ఇదేనేమో మ‌న ప్రాణాల‌కు లెక్క క‌ట్టే విలువ‌...గుర్తింపు..

ఇప్పుడు ఆ నేత‌లు తొడ‌లు చ‌రుస్తున్నారు..

జ‌గ‌న్ ఉప ఎన్నిక‌లు ఏంత‌కీల‌కం ఆ స‌మ‌యంలో ముఖంచాటేసిన‌.. ప‌లాయ‌నంచిత్త‌గించిన నేత‌లు ఇప్పుడు మాత్రం మాజ‌గ‌న్ స‌న్నిహితుడంటూ తొడ‌లు చ‌రుస్తున్నారు.. జ‌గ‌న్ కే వ్య‌తిరేకంగా ప‌నిచేసిన నాయ‌కులు ఇప్పుడు అధికారం మ‌త్తులో జోగుతున్నారు., మాదే రాజ్యం అంటూ ప‌ద‌వులు సొంతం చేసుకుంటున్నారు.. కొంద‌రైతే జ‌గ‌న్ అంటే నేను.. నేనంటే జ‌గ‌న్ అంటూ సూక్తిలు చెబుతున్నారు.. ఇదండి రాజ‌కీయ లోకం..

(ఉప ఎన్నికల్లో జగన్ కోసం ప్రాణాలొోడ్డి చేసినందుకు నాకు ఇక్కడి పెద్దలు ఇచ్చిన పెద్ద గిప్ట్ ఎంటొో జర్నలిస్టు డైరీ లో మీ ముందుకు త్వరలో...)

Address

102/2, B. KOTHAPALLI, KHAZIPET MANDAL
Kadapa
516172

Alerts

Be the first to know and let us send you an email when NR న్యూస్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to NR న్యూస్:

Share