04/09/2025
{Note: This video is summarised version of whole psalm 83 1-18 }వివిధ రకాల జనాలు, ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం లేనివారు కూడా ఒకే ఉద్దేశంతో ఏకమయ్యారు – వారంతా దేవునికి వ్యతిరేకులై వీలుంటే దేవుని ప్రజలను నాశనం చేయాలని ఇష్టపడతారు. శత్రువులైన హేరోదు, పిలాతు అంతే గదా. క్రీస్తును సిలువ వేసిన సందర్భంలో ఇద్దరూ స్నేహితులయ్యారు (లూకా 23:12; కీర్తన 2:2 చూడండి). ఈజిప్ట్‌లో ఫరో, కనాను చుట్టూ ఉన్న జాతులు, పర్షియాలో హేమాను అప్పటినుంచి జర్మనీకి పాలకుడైన హిట్లర్‌తో సహా ఎంతో మంది ఇస్రాయేల్‌వారిని చితక్కొట్టి వారి పేరే ఇక వినబడకుండా సమూలంగా తుడిచిపెట్టేద్దామని చూశారు. ఇలాంటి ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. ఇకనుంచీ విఫలం కాక మానవు. ఇస్రాయేల్ ప్రజల విషయంలో దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. వాటిని ఆయన తప్పక నెరవేర్చుకొంటాడు. అదే విధంగా ఆయా కాలాల్లో ఆయా వ్యక్తులూ జనాలూ క్రీస్తును అనుసరించేవారిని సమూల నాశనం చేసేందుకు చూశారు. అలా చెయ్యడం కేవలం అసాధ్యం (మత్తయి 16:18). నిజానికి అలాంటి ప్రయత్నాలు తరచుగా ఇంకా వారి సంఖ్య అధికం అయ్యేందుకే, వారి బలప్రభావాలూ పవిత్రత పెరిగేందుకే దోహదం చేశాయి. ❤️