All INDIA MEDIA Association

All INDIA MEDIA Association jan jan ki aawaz

13/07/2025
KB ASIFABAD! Kagaznagar :   తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక తెలంగాణ బోనాలు తెలంగాణ బోనాల జాతర మహంకాళి ఆలయం (పోచమ్మ ...
13/07/2025

KB ASIFABAD! Kagaznagar : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక తెలంగాణ బోనాలు
తెలంగాణ బోనాల జాతర మహంకాళి ఆలయం (పోచమ్మ గుడి )F. కాలనీ వార్డు నెం: 1,సిరిసిల్క్ దగ్గరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పారిశుధ్య పనులు చేపట్టాలని అలాగే వర్షం కారణంగా ఆలయం చుట్టూ నీళ్లు నిలిచి బురద ఉండడంతో వాటిని పూడ్చాలని మున్సిపల్ కమిషనర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి తమ సిబ్బందితో వచ్చి అక్కడి పనులు పర్యవేక్షించి సకాలంలో పూర్తి చేసినందుకు సహృదయస్థులు మున్సిపల్ కమిషనర్ ఎల్పుల రాజేందర్ గారికి మరియు మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదములు
ఎన్నో ఏండ్లుగా అంగరంగ వైభవంగా జరుపుకొనే బోనాల జాతరకు మొట్ట మొదటి సారి భక్తులకు ఇబ్బందులు కలుగకుండా కంకర చిప్స్ వేయించి భక్తుల కాలనీ వాసుల మనస్సు దోచుకున్న గౌరవ మున్సిపల్ కమిషనర్ ఎల్పుల రాజేందర్ గారిపై ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆశిస్తున్నాము
తెలంగాణ ఉద్యమకారులు
BRS నాయకులు
తాజ్ బాబా

22/06/2025

*_అర్హులకు ఇళ్లను కేటాయించాలి: BRS పార్టీ మున్సిపాలిటీ నాయకులు తాజ్ బాబా_*

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల లబీదారుల ఎంపికలో అవకతవకలు జరిగినాయి అని BRS పార్టీ పట్టణ నాయకులు తాజ్ బాబా గారు విమర్శించారు.

లబ్ధిదారుల ఎంపిక నిస్పాక్షపతంగా కాలేదని, మున్సిపాల్ కమిషనర్ అంజయ్య ఆధ్వర్యంలో జరిగిన ఎంపికలో అర్హులకు ఇళ్లను కేటాయించలేదని ఆరోపించారు.

ఈ విషయంలో అంజయ్య గారిని వివరణ కోరగా దురుసుగా ప్రవర్తించారని, అంజయ్య తీరు పై కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే గారికి ఫిర్యాదు చేశామని తెలిపారు.

మున్సిపాల్ కమిషనర్ అంజయ్య పై చర్యలు తీసుకోవడం పై హామీ ఇచ్చినట్లు తెలిపారు.
మంగళవారం 11 గంటల వరకు చర్యలు తీసుకొని యడల ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలు తో పాటు BRS పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, ముస్తాఫిజ్, మహమూద్, అబిబ్, ఇల్ముల్, సల్మాన్ నజీమ్,
మహిళా నాయకులు, కమల, వరలక్ష్మి, రమాదేవి గార్లు, మరియు నాయకులు పాల్గొన్నారు.

10/06/2025
14/04/2025

అయ్యా, దేవుడా ! అంబేద్కరా !


ఎలా రాసావయ్యా రాజ్యాంగాన్ని ?

ఈ రాజ్యాంగాన్ని లా లోని ఒక్కొక సెక్షన్స్ లోని ఒక్కొక పాయింట్ ని వెతకడానికే 30, 40 మంది న్యాయవాదులు మల్లగుల్లాలు పడుతున్నారే, ఒక్కొక సెక్షన్స్ ని చదివి అర్ధం చేసుకోవడానికి ఇప్పుడున్న న్యాయవాదులకు జీవితకాలం పట్టేట్లు ఉంది...

ఎంతగా చదివావో, ఎంతగా పరిశోధన చేసావో, ఎంత తపన పడ్డావో, ఎంతగా మదనపడ్డావో, ఎన్ని బాధలు పడ్డావో, ఎన్ని అవమానాలు భరించావో, దిగమింగావో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపావో, అసలు సమయానికి తిన్నవో లేదో, ఇంత గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించి, రచించావే, నిజంగా నువ్వు మనిషివి అయితే కాదు స్వామి, నువ్వు ఒక మహర్షివి, కారణజన్ముడివి, సమతామూర్తివి, నిజమైన దేశభక్తుడివి, నీ త్యాగ నిరతకి, నీ అపర మేధాశక్తికి, నీ పాదాలకి వేల కోట్ల నమస్కారాలు స్వామి 🙏🏻

09/03/2025

ఇది సిరిపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పరిస్థితి

Address

Kagaznagar

Telephone

+918522969426

Website

Alerts

Be the first to know and let us send you an email when All INDIA MEDIA Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to All INDIA MEDIA Association:

Share