22/01/2023
SCT పోలీస్ కానిస్టేబుల్ వ్రాత పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటులను పరిశీలించి, పోలీస్ అధికారులకు, బందోబస్తు సిబ్బందికి తగిన సూచనలు చేసి, ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రవీంద్రనాథ్ బాబు, ఐపీఎస్.
ఈరోజు అనగా 22-01-2023 తేదీన జరుగుచున్న ఎస్సీటీ పోలీస్ కానిస్టేబుల్ వ్రాత పరీక్ష కేంద్రం గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామంలోని ప్రగతి & ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ ల ప్రాంగణంలో ఉన్న పరీక్షలు నిర్వహించు చున్న బ్లాకులను పరిశీలించి, తగు సూచనలు, ఆదేశాలు జారీ చేసి, వ్రాత పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నందుకు సంతృప్తి వ్యక్తం చేశారు.
పరీక్షలకు హాజరైన అభ్యర్థులతో మాట్లాడి, వారికి సంబంధించిన అనుమానాలను నివృత్తి చేశారు. వారికి వేరే ఏదైనా సమస్య ఉత్పన్నమైతే, వెంటనే చట్ట పరిధిలో పరిష్కరించమని ఎగ్జామినేషన్స్ బందోబస్తులో ఉన్న పోలీస్ అధికారులకి, పరీక్షల నిర్వహణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అభ్యర్థులకు ఏ చిన్న సమస్య తలెత్తిన, వెంటనే పరీక్ష నిర్వాహకలకు, కన్వీనర్ ను సంప్రదించి, ఆ సమస్యకు పరిష్కారం కనుగొని, అభ్యర్థులకు సహకరించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు, సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలల అధికారులు, పరీక్ష నిర్వహణ అధికారులు బందోబస్త్ లో ఉన్న అదనపు ఎస్పీ (ఏఆర్) శ్రీ బి. సత్యనారాయణ, పెద్దాపురం ఇన్చార్జి డిఎస్పి శ్రీ ఎం. వెంకటేశ్వరరావు, జగ్గంపేట సి.ఐ, శ్రీ అప్పారావు, సామర్లకోట ఇన్స్పెక్టర్ శ్రీ కె. దుర్గా ప్రసాద్, గండేపల్లి ఎస్సై శ్రీ వై. గణేష్ కుమార్, సిబ్బంది హాజరుగా ఉన్నారు.
Follow :-