Dantuluri Kishore Varma

Dantuluri Kishore Varma Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dantuluri Kishore Varma, Digital creator, Kakinada.

అస్సీఘాట్ నుంచి ఆదికేశవా ఘాట్ వరకూ గంగానది ఒడ్డు నెలవంకలా ఒంపుతిరిగి ఉంటుంది. ఇది వారణాసికి గొప్ప అందాన్ని ఇస్తుంది. ఈ ఒ...
01/03/2026

అస్సీఘాట్ నుంచి ఆదికేశవా ఘాట్ వరకూ గంగానది ఒడ్డు నెలవంకలా ఒంపుతిరిగి ఉంటుంది. ఇది వారణాసికి గొప్ప అందాన్ని ఇస్తుంది. ఈ ఒంపులో చాలా ప్రత్యేకతలునున్న ఎన్నో ఘాట్లు ఉన్నాయి. నదిమీద బోట్‌లో ప్రయాణిస్తూ ఈ ఘాట్లను చూడడం ఒక గొప్ప అనుభూతి. లింక్ కామెంట్స్‌లో ఉంది చూసి ఆనందించండి.

ఫాల్గుణమాసం వచ్చేటప్పటికి చలి పూర్తిగా తగ్గి ఎండవేడి మొదలౌతుంది. అయినప్పటికీ ఉదయ సాయంత్రాలు చల్లగాలులు సేదతీరుస్తూ ఉంటాయ...
27/02/2026

ఫాల్గుణమాసం వచ్చేటప్పటికి చలి పూర్తిగా తగ్గి ఎండవేడి మొదలౌతుంది. అయినప్పటికీ ఉదయ సాయంత్రాలు చల్లగాలులు సేదతీరుస్తూ ఉంటాయి. తెలుగు నెలలని మరచిపోయాక, ఋతువుల్ని మరచిపోయాకా ప్రకృతిలో వచ్చే మార్పుల్ని గమనించగలిగే నేర్పు మనలో తగ్గిపోయింది. ఆ ఎరుకతో వచ్చే ఆనందం కూడా అవిరైపోయింది.

దేవాలయంలో మూడు ప్రదక్షిణలు చేయాలట. మొదటి ప్రదక్షిణతో రజోగుణాన్ని, రెండవదానితో తమోగుణాన్ని, మూడవదానితో సత్వగూణాన్ని విడిచ...
24/02/2026

దేవాలయంలో మూడు ప్రదక్షిణలు చేయాలట. మొదటి ప్రదక్షిణతో రజోగుణాన్ని, రెండవదానితో తమోగుణాన్ని, మూడవదానితో సత్వగూణాన్ని విడిచిపెట్టి నిర్మలమైన మనసుతో దైవదర్శనం చేసుకొంటే ఈ క్షణమే ముక్తిని ప్రసాదించే దేవుడు ఈక్షణముక్తేశ్వరస్వామి. ఈ గుడి ఎక్కడుందో... ఏమిటో!?

కొబ్బరి ఆకుల సవ్వడిఅలల గలగలలునీటి మీదనుంచి వచ్చే చల్లని గాలికనిపించే సుందర దృశ్యంకొంచెంసేపు మౌనంగ కూర్చుని ఆస్వాదిస్తేజీ...
23/02/2026

కొబ్బరి ఆకుల సవ్వడి
అలల గలగలలు
నీటి మీదనుంచి వచ్చే చల్లని గాలి
కనిపించే సుందర దృశ్యం
కొంచెంసేపు మౌనంగ కూర్చుని ఆస్వాదిస్తే
జీవితకాలపు జ్ఞాపకాల్లా మనసుపొరల్లో నిలిచిపోతాయి

జపాన్ జూలో పంచ్ అనే కోతి పిల్లని దాని తల్లి దగ్గరకు రానివ్వకపోవడంతో, జూ సిబ్బంది పంచ్‌కి ఇచ్చిన ఒక స్టఫ్డ్ టాయ్‌ని అది హ...
23/02/2026

జపాన్ జూలో పంచ్ అనే కోతి పిల్లని దాని తల్లి దగ్గరకు రానివ్వకపోవడంతో, జూ సిబ్బంది పంచ్‌కి ఇచ్చిన ఒక స్టఫ్డ్ టాయ్‌ని అది హత్తుకోవడం.. దానితో ఆడుకోవడం.. దాని కళ్ళల్లో దిగులు.. ప్రంపంచం చేత 'అయ్యో' అనిపించాయి. ఒంటరి పెంగ్విన్, నిరాధరించబడిన కోతి పిల్ల, అసహాయమైన వీధి కుక్క పిల్ల.. మనలో ఎంపతీని లాగి బయటకుతీస్తాయి.

కమ్మరి కొలిమికుమ్మరి చక్రంజాలరి పగ్గంసాలెల మగ్గంశరీర కష్టం స్పురింపజేసేగొడ్దలి రంపం కొడవలి నాగలి...ఇవన్నీ నా రాతకి, పాటక...
22/02/2026

కమ్మరి కొలిమి
కుమ్మరి చక్రం
జాలరి పగ్గం
సాలెల మగ్గం
శరీర కష్టం స్పురింపజేసే
గొడ్దలి రంపం కొడవలి నాగలి...
ఇవన్నీ నా రాతకి, పాటకి మూలాధారం
- శ్రీశ్రీ

అయిదునిమిషాలు వెయిట్‌చేసి ప్లేటులో వేయించుకొన్న రెండు పెసరట్లలో ఒక్కోదాన్నీ రెండంటే రెండే ముక్కలుగా తుంచుకొని, కరాచీనూక ...
22/02/2026

అయిదునిమిషాలు వెయిట్‌చేసి ప్లేటులో వేయించుకొన్న రెండు పెసరట్లలో ఒక్కోదాన్నీ రెండంటే రెండే ముక్కలుగా తుంచుకొని, కరాచీనూక ఉప్మా, కారంచట్నీల్లో లడాయించి ఊ...ఫ్ అని లోపలకి లాగేసుకొంటున్న పెద్దమనిషి; మళ్ళీ వెంటనే ప్లేటుని ముందుకు చూపిస్తున్నాడు - మరో రెండట్లకోసం. ఆయన వంతు ఎప్పుడవుతుందో, మన పేకెట్ చేతికి ఎప్పుడు వస్తుందో!

08/10/2025

Queen Bee

06/10/2025
Adi Yogi 🙏
02/10/2025

Adi Yogi 🙏

Address

Kakinada
533016

Website

Alerts

Be the first to know and let us send you an email when Dantuluri Kishore Varma posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share