25/09/2023
*బారాసా లో చేరిన యువకుల ఉజ్జ్వల భవిష్యత్ అంతా నేనే చేసుకుంటా*...
*యువతకు మంత్రి గంగుల అభయం*
*గులాబీ గూటికి కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు*.
బి ఆర్ ఎస్ పార్టీలో చేరిన యువత, భవిష్యత్తు, బాధ్యత తనదేనని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ వెల్లడించారు...
నేడు ఆదివారం నగరంలోని మధు గార్డెన్ లో కాంగ్రెస్, బీజేపీ కి చెందిన అభినవ్ పటేల్ బంధం రాహుల్, దాసరి సాయి చరణ్ తో పాటు 300 మంది యువత పెద్ద ఎత్తున టిఆర్ఎస్ యువత నియోజకవర్గం ఇంచార్జ్ నేతికుంట హరీష్ ఆధ్వర్యంలో మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో పార్టీలో చేరినారు.. పార్టీలో చేరిన యువతకు మంత్రి గంగుల కమ్మలాకర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
ఈ సందర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తన పై నమ్మకంతో పెద్ద ఎత్తున గులాబీ గూటికి చేరిన యువత భవిష్యత్తు తనదే అని వారికి అభయం ఇచ్చారు.. తెలంగాణ రాష్ట్రం రాకముందు కరీంనగర్ అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని అన్నారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ గారి సహకారంతో వందల కోట్ల నిధులు నగర అభివృద్ధికి తీసుకొని వచ్చినట్టు వెల్లడించారు.. నగరంలో ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని.. హైదరాబాద్ తర్వాత కరీంనగర్ను రెండో నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.. నగరం రాత్రిపూట జిగేల్ మంటుందని.. కరీంనగర్ ను పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని అన్నారు.. ఇప్పటికే కేబుల్ బ్రిడ్జ్ అందుబాటులోకి తెచ్చామని.. మానేర్ రివర్ ఫ్రంట్ పనులు 25 శాతం పూర్తి చేశామని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఢిల్లీ పార్టీలు అని బి ఆర్ ఎస్ ఒక్కటే మన ఇంటి పార్టీ అని గుర్తు చేసారు.. కెసిఆర్ ఆలోచన అంతా తెలంగాణ అభివృద్ధి అని.. దేశానికి అన్నం పెట్టె స్థాయిలో తెలంగాణ అభివృద్ధి చెందినదనిఅన్నారు...రానున్న ఎన్నికల్లో కెసిఆర్ చేతులు బలోపేతం చేయాలనీ యువత కు పిలుపునిచ్చారు..యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, మంత్రి కేటీర్ గారి సహకారం తో హైదరాబాద్ కు పెద్ద ఎత్తున విదేశీ కంపెనీ లు తరలి వస్తున్నాయని అన్నారు.. ఈ కార్యక్రమం లో నగర మేయర్ సునీల్ రావు, బారసా నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్ కొత్తపల్లి కరీంనగర్ రూరల్ మండలాధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, కార్పొరేటర్లు నేతి కుంట యాదయ్య ఐలేందర్ యాదవ్, బోనాల శ్రీకాంత్ పిట్టల శ్రీనివాస్ గందె మహేష్, మాజీ కార్పొరేటర్ తాటి ప్రభావతి, ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు నందేల్లి మహిపాల్ యువత అధ్యక్షులు కుల్దీప్ వర్మ, గడ్డం ప్రశాంత్ రెడ్డి, గంగాధర చందు, మొగిలోజు వెంకట్, పొన్నం రాజు జిపి స్వామి నవాజ్,, షేక్ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు