25/09/2023
మరో 6 రోజులే ఛాన్స్
ప్రజలు రూ. 2000 నోట్లు మార్చుకునేందుకు మరో ఆరు రోజులు గడువు మాత్రమే ఉంది. ఈనెల 30వ తేదీ ఆర్బిఐ డెడ్ లైన్ గా విధించింది. ఇంకా రూ. 2 వేల రూపాయల నోట్లు ఉంటే బ్యాంకులో డిపాజిట్ చేసుకొని మార్చుకోవచ్చు. కాగా ఈ ఏడాది మే 19న, రూ.2 వేల నోట్లను రద్దు చేస్తున్నట్లు ఆర్బిఐ ప్రకటించిన సంగతి విదితమే.