Chalanam

Chalanam Hi

25/10/2025

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

08/08/2025
ప్రాంతీయ యుద్ధానికి సిద్ధంకండి బీజింగ్/న్యూఢిల్లీ: చైనా సైన్యం ‘ప్రాంతీయ యుద్ధం’లో విజయం సాధించేందుకు యుద్ధసన్నద్ధంగా ఉం...
24/09/2014

ప్రాంతీయ యుద్ధానికి సిద్ధంకండి

బీజింగ్/న్యూఢిల్లీ: చైనా సైన్యం ‘ప్రాంతీయ యుద్ధం’లో విజయం సాధించేందుకు యుద్ధసన్నద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. ఈ విషయంలో కేంద్ర నాయకత్వం తీసుకునే అన్ని నిర్ణయాలను కచ్చితంగా పాటించాలని కూడా ఆయన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ)కి సూచించారు. చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్, చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన ఈ పిలుపునిచ్చారు. పీఎల్‌ఏ ప్రధాన కేంద్ర బలగాలకు చైనా కమ్యూనిస్ట్ పార్టీపై పూర్తిస్థాయి విశ్వాసం ఉండాలని, కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయాలూ అమలయ్యేలా చూడాలని జిన్‌పింగ్ అన్నారు. జిన్ పింగ్ భారత పర్యటనుంచి స్వదేశం తిరిగివచ్చిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేసినట్టు జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. ‘ప్రాంతీయ యుద్ధం’ కోసం చైనా బలగాలు యుద్ధసన్నద్ధంగా ఉండాలని, సమాచార పరిజ్ఞాన యుగంలో యుద్ధంలో గెలిచేలా తమ సామర్థ్యాలకు పదునుపెట్టాలని కూడా జిన్‌పింగ్ అన్నారు. ‘ప్రాంతీయ యుద్ధం’ జిన్‌పింగ్ ఇలా వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కానప్పటికీ, ఇటీవల చైనా సైన్యం పదేపదే చొరబాటుకు పాల్పడిందన్న వార్తల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

మరింత తగ్గిన పసిడి                                                                                                      ...
23/09/2014

మరింత తగ్గిన పసిడి పసిడి ధరలు మరింత తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ అంతకంతకు పడిపోవడంతో దేశ రాజధాని ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర మరో రూ.120 తగ్గి రూ.26,850కి చేరుకుంది. గడిచిన మూడు రోజుల్లో పసిడి ధర సుమారు రూ.400 మేర తగ్గింది. గ్లోబల్ మార్కెట్లకు తోడు దేశవ్యాప్తంగా అమ్మకాలు నీరసించడంతో అతి విలువైన లోహం ధర ఎనిమిది నెలల కనిష్ఠస్థాయికి జారుకుంది. పసిడికి తోడు వెండి ధరలు మరింత క్షీణించాయి. కిలో ధర రూ.375 మేర పడిపోయి రూ.39,250 వద్ద స్థిరపడింది.

gold పారిశ్రామిక రంగం నుంచి వెండికి డిమాండ్ తగ్గిపోవడంతో గడిచిన ఐదు రోజులుగా ధరలు తగ్గడానికి కారణమవుతున్నాయని బంగారం విక్రయదారు తెలిపారు. ప్రస్తుత సీజన్‌లో కొనుగోలు చేయడం అంత శుభకరం కాదని వినియోగదారులు భావించడంతో అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది. అమెరికా బులియన్ మార్కెట్లో ఔన్స్ పసిడి ధర 0.60 సెంట్లు తగ్గి 1,208.40 డాలర్ల వద్ద ముగిసింది. దీంతోపాటు వెండి కూడా 0.3 శాతం క్షీణించి 17.78 డాలర్లు పలికింది.

సింగరేణి కార్మికులకు సీఎం వరాలు                                                                                         ...
23/09/2014

సింగరేణి కార్మికులకు సీఎం వరాలు సింగరేణి కార్మికుల కుటుంబాల్లో దసరా, దీపావళి పండుగల కాంతులు ముందుగానే విరజిమ్మాయి. దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికుల జీవితాలను కూడా వెలిగించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వారిపై వరాల జల్లు కురిపించారు. సంస్థ లాభాల్లో 20శాతాన్ని కార్మికులకు చెల్లించాలని నిర్ణయించారు. కార్మికులకు బోనస్‌గా కోల్‌ఇండియా ద్వారా రూ.240కోట్ల ప్యాకేజీని అందిస్తామని ప్రకటించారు. దీంతో ప్రతి కార్మికుడికి సగటున రూ.40వేల చొప్పున లబ్ధ్దిచేకూరనున్నది.

SCCLసోమవారం సాయంత్రం కోల్‌బెల్ట్ ప్రజాప్రతినిధులతో సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో సీఎం ఈ నిర్ణయాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి దసరా పండుగ జరుపుకోబోతున్న ప్రస్తుత తరుణంలో ఎన్నడూ లేని విధంగా 20శాతం బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. కార్మికులు ఎప్పటి నుంచో కోరుతున్న డిపెండింగ్ ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీపావళి కానుకగా దాదాపు 3,100 మంది పెండింగ్ డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలని సింగరేణి యాజమాన్యాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ముఖ్యమంత్రితో సమావేశమైనవారిలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు, దివాకర్‌రావు, సోమారపు సత్యనారాయణ, చెన్నయ్య తదితరులున్నారు. సింగరేణి కార్మికులకు సంస్థ లాభాల్లో 20 శాతం వాటా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు బాల్క సుమన్ అన్నారు. గత ప్రభుత్వాలు కార్మికులను ఇబ్బందిపెడితే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ వరాల జల్లు కురిపించారని కొనియాడారు. సీఎంతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణి కార్మికుల డిపెండెంట్ ఉద్యోగాలతోపాటు డిస్మిస్డ్ కార్మికులకు కూడా ఉద్యోగాలు ఇచ్చేందుకు సీఎం అంగీకరించినట్లు చెప్పారు.

ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు మాట్లాడుతూ చీకట్లో పనిచేస్తూ దేశానికి వెలుగులందిస్తున్న సింగరేణి కార్మికుల జీవితాల్లో ముఖ్యమంత్రి వెలుగులు నింపారని ప్రశంసించారు. గత ప్రభుత్వాలు ఏటా లాభాల్లో ఒకశాతం మాత్రమే కార్మికులకు ఇచ్చేవారని, వీటికి భిన్నంగా ముఖ్యమంత్రి ఒకేసారి 20శాతం ప్రకటించి కార్మికులపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారని ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, సోమారపు సత్యనారాయణ, చెన్నయ్య తెలిపారు. దసరా పండుగను పురష్కరించుకుని సెప్టెంబర్ నెల జీతాలను ఈ నెల చివరిలోగా ఇప్పిస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. సీఎంకు సింగరేణి కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

సింగరేణి సీఎండీతో కోల్‌బెల్ట్ ఎంపీ, ఎమ్మెల్యేల భేటీ
సింగరేణి కార్మికులకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను సత్వరం పరిష్కరించాలని సింగరేణి మైనింగ్ ఏరియా ప్రజాప్రతినిధులు సింగరేణి సంస్థ సీఎండీ సుతీర్ధ భట్టాచార్యను కోరారు. ఎంపీ బాల్క సుమన్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు నల్లాల ఓదేలు, సోమారపు సత్యనారాయణ, దుర్గం చిన్నయ్య, ఎన్ దివాకర్‌రావు తదితరులు సోమవారం మధ్యాహ్నం భట్టాచార్యను కలిసి ఐదు అంశాలతో కూడిన వినపతిపత్రాన్ని అందజేశారు.

సింగరేణి సంస్థ 2013-14 సంవత్సరపు లాభాల్లో 25శాతం కార్మికులకు ఇవ్వాలని, డిపెండెంట్ కార్మికుల సమస్యను పరిష్కరించాలని, అనారోగ్యంతో విధులు నిర్వహించలేకపోతున్న ఉద్యోగుల దరఖాస్తుల పరిశీలనకు అప్పిలేట్ మెడిక్ బోర్డును ఏర్పాటుచేయాలని, డిస్మిస్డ్ ఉద్యోగులకు మానవతా దృక్పథంతో మరొక అవకాశం ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బాల్కా సుమన్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి సంస్థ వివక్షకు గురైందని, తెలంగాణ రాష్ట్రంలో సంస్థ భవిష్యత్తుకు, కార్మికుల సంక్షేమానికి కోల్‌బెల్ట్ ఏరియా ప్రజాప్రతినిధులుగా నిరంతరం కృషిచేస్తామన్నారు. ఎమ్మెల్యే నల్లాల ఓదేలు మాట్లాడుతూ ఏడేండ్లకుపైగా గనుల్లో పనిచేసి అనారోగ్యంతో చనిపోయిన కార్మికుల పిల్లలకు చివరి అవకాశం (వన్‌టైమ్ సెటిల్‌మెంట్) కల్పించేందుకు యాజమాన్యం సుముఖత వ్యక్తంచేసినట్లు చెప్పారు.

ఐరోపాపై ఐఎస్‌ఐఎస్ కన్ను                                                                                                 ...
23/09/2014

ఐరోపాపై ఐఎస్‌ఐఎస్ కన్ను
యూరోపియన్ యూనియన్‌కు చెందిన 28 దేశాల అధికారులు పనిచేసే యూరోపియన్ కమిషన్ భవనంపై ఇరాక్, సిరియాల్లో నరమేధం సృష్టిస్తున్న ఐఎస్‌ఐఎస్ కన్నుపడింది. ఈ భవనాన్ని పేల్చేసేందుకు మిలిటెంట్లు కుట్ర చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో బ్రసెల్స్, హేగ్‌లలో కొన్ని ఇండ్లపై రైడ్ చేసి, అనుమానితులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తున్నది.
సిరియా కుర్దిష్‌కు చేరువగా ఐఎస్‌ఐఎస్: సిరియాలో కుర్దిష్ ప్రాంతం స్వాధీనం చేసుకునే దిశగా ఐఎస్‌ఐఎస్ మిలిటెంట్లు కదులుతున్నారు. కుర్దిష్‌లోని అరబిక్, కొబానే పట్టణాలకు మిలిటెంట్ల కేవలం పదికిలోమీటర్ల దూరంలో ఉన్నారని సిరియా పౌరహక్కుల సంస్థ తెలిపింది.
ఇరాక్‌లో అమెరికా వ్యతిరేక ర్యాలీ: ఐఎస్‌ఐఎస్‌పై విమాన దాడులు నిర్వహిస్తున్న అమెరికాకు వ్యతిరేకంగా ఇరాక్‌లో ఉద్యమాలు ఉపందుకుంటున్నాయి. దేశరాజధాని బాగ్దాద్‌లో షియా మతగురువు మఖ్తాదా అల్ సదర్ నేతృత్వంలో శనివారం భారీర్యాలీ తీశారు.

టెస్ట్ పాసైన మంగళ్‌యాన్                                                                                                 ...
23/09/2014

టెస్ట్ పాసైన మంగళ్‌యాన్ అంతరిక్ష ప్రయోగాల్లో ఎదురులేకుండా దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో అపురూప విజయాన్ని అందుకుంది. అంగారకుడిపై పరిశోధనల కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మంగళ్‌యాన్ ప్రాజెక్టులో కీలక ఘట్టాన్ని పూర్తిచేసింది. తొలి ప్రయత్నంలోనే ఒక ఆర్బిటర్‌ను అంగారకుడి గురుత్వాకర్షణ ప్రభావప్రాంతంలోకి ప్రవేశపెట్టడమేకాకుండా మార్స్ ఆర్బిటర్ మిషన్‌లో (మామ్) దాదాపు పది నెలలుగా నిద్రావస్థలో ఉన్న లిక్విడ్ అపోజీ మోటార్ (లామ్) సోమవారం విజయవంతంగా మండించి ఆ ఘనత సాధించిన తొలి ఆసియాదేశంగా భారత్‌కు కీర్తినందించింది. మంగళ్‌యాన్ ప్రాజెక్టు మొత్తానికీ అత్యంత కీలకమైన అంగారక కక్ష్యలోకి మామ్‌ను ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని బుధవారం ఉదయం 7:30గంటలకు నిర్వహించనుంది. ఈ ప్రక్రియలో లామ్‌దే కీలకపాత్ర. ఈ ప్రయోగాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.

mangalబెంగళూరు, సెప్టెంబర్ 22: అంగారక గ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మంగళ్‌యాన్ ప్రాజెక్టులో మరో కీలక దశ విజయవంతమైంది. సోమవారం అంగారక గురుత్వాకర్షణ పరిధిలోకి ప్రవేశించిన మార్స్ ఆర్బిటర్ మిషన్‌లో (మామ్) పది నెలలుగా నిద్రావస్థలో ఉన్న లిక్విడ్ అపొజీ మోటార్‌ను (లామ్) ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా మండించారు. ఆర్బిటర్ ప్రయాణ మార్గాన్ని సవరించారు. మామ్ వేగాన్ని తగ్గించి, అంగారకుడి గురుత్వాకర్షణ నుంచి రక్షించేందుకు 440 న్యూటన్ సామర్థ్యమున్న ఈ లామ్‌ను ఉపయోగిస్తారు.

మంగళ్‌యాన్ ప్రాజెక్టు మొత్తంలో అంగారక గ్రహ కక్ష్యలోకి మామ్‌ను ప్రవేశపెట్టడమే అత్యంత కీలక దశ. ఈ ప్రక్రియను బుధవారం (24న) ఉదయం 7:30గంటలకు నిర్వహిస్తారు. అంగారకుడికి పెరియాప్సిస్ (అత్యంత సమీపం) 423 కిలోమీటర్లు, అపోయాప్సిస్ (సుదూరం) 80 వేల కిలోమీటర్ల మధ్యలోని కక్ష్యలోకి మామ్‌ను ప్రవేశపెడుతారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే ప్రపంచంలోనే ఒకే ప్రయత్నంలో మార్స్ ప్రయోగాన్ని విజయవంతం చేసిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది. ఒక ప్రయోగ వస్తువును మార్స్ గురుత్వ ప్రభావ ప్రాంతంలోకి పంపిన తొలి ఆసియాదేశంగా భారత్ ఇప్పటికే రికార్డు నెలకొల్పింది.

angarakuduలామ్ టెస్ట్‌ఫైర్ విజయవంతం కావటంపై ఇస్రో సంతోషం వ్యక్తం చేసింది. ప్రధాన లిక్విడ్ ఇంజిన్ టెస్ట్‌ఫైర్ విజయవంతమైంది. ముందుగా నిర్దేశించిన ప్రకారం మధ్యాహ్నం 2:30గంటలకు ఇంజిన్‌ను 4 సెకండ్లపాటు మండించాం. ఆర్బిటర్ దిశను సరిచేశాం. అంగారక కక్ష్యలోకి ప్రవేశించేందుకు మామ్ సిద్ధంగా ఉన్నది. అది అంగారకుడికి 5.4 లక్షల కిలోమీటర్ల పరిధిలో ఆవరించి ఉన్న గురుత్వాకర్షణ ప్రభావ ప్రాంతంలోకి సోమవారం ప్రవేశించింది అని ఇస్రో సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. సెకనుకు 22.1 కిలోమీటర్లున్న మామ్ వేగాన్ని అంగారక కక్ష్యలోకి ప్రవేశించే సమయంలో సెకనుకు 4.4 కిలోమీటర్లకు తగ్గిస్తారు.

ఇందుకోసం లామ్‌ను 24వ తేదీన 24 నిమిషాలపాటు మండిస్తారు. ఇందుకు సంబంధించిన కమాండ్స్‌ను మామ్‌లో ఇప్పటికే అప్‌లోడ్ చేసినట్లు ఇస్రో అధికారులు తెలిపారు. కక్ష్యలోకి చేరే సమయంలో ఒకవేళ లిక్విడ్ ఇంజిన్ మండకుంటే ప్రత్యామ్నాయంగా మామ్‌లో ఉంచిన ఎనిమిది పీడన యంత్రాలను మండించి ఆర్బిటర్‌ను కక్ష్యలోకి ప్రవేశపెడుతామని చెప్పారు. అయితే, ఈ విధానం ద్వారా ఆర్బిటర్‌ను కచ్చితమైన కక్ష్యలోకి ప్రవేశపెట్టడం సాధ్యం కాకపోవచ్చని, అందువల్ల నిర్దేశిత ప్రయోగాలకు వీలుండదని పేర్కొన్నారు. మార్స్‌పై ప్రయోగాలకు ప్రపంచవ్యాప్తంగా 51ప్రయోగాలు జరుగగా 21మాత్రమే విజయవంతమయ్యాయి.మామ్ ను మార్స్ కక్ష్యలోకి ప్రవేశపెట్టే కార్యక్రమానికి ప్రధాని హాజరవుతారని

రేపటి నుంచే బతుకమ్మ                                                                                                     ...
23/09/2014

రేపటి నుంచే బతుకమ్మ కొత్త రాష్ట్రంలో తొలి పండుగకు భారీ ఏర్పాట్లు
- జిల్లాకు రూ.10 లక్షలు విడుదల చేసిన ప్రభుత్వం
- యంత్రాంగాన్ని సన్నద్ధం చేసిన కలెక్టర్
- పంచాయతీ పరిధిలో సర్పంచ్‌లకు బాధ్యత
- మహిళా ఉద్యోగులకు మధ్యాహ్నం వరకే విధులు
హన్మకొండ అర్బన్ : ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన బతుకమ్మ వేడుకకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరుగుతున్న తొలి బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 10లక్షలు విడుదల చేసింది. బతుకమ్మ ఏర్పాట్లపై ఇటీవల కలెక్టర్ జి.కిషన్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్‌లు బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అందుకోసం పంచాయతీ నిధులు వాడుకునే వెసులుబాటు కల్పించారు. గ్రామాల్లో బతుకమ్మలు ఆడే ప్రదేశాల్లో చదును చేయించడం, లైట్ల ఏర్పాటు, రోడ్ల మరమ్మతు వంటి పనులు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

నగరంలో హంగామా...
గతంలో ప్రభుత్వం నిధులు ఇవ్వని రోజుల్లో.. వరంగల్ నగరంలో ఆ పనులు నగర పాలక సంస్థ చేసేది. ప్రస్తుతం రూ.10 లక్షల వరకు నిధులు వస్తుండడంతోగతంకన్నా మెరుగైన ఏర్పాట్లు చేసేందుకు చర్యలుతీసుకుంటున్నారు. ఉర్సుగుట్ట, ఓసిటీ, రంగశాయిపేట, పద్మాక్షిగుట్ట, దేశాయిపేట, సోమిడి, వడ్డేపల్లి చెరువు, బంధం చెరువు తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో విద్యుత్ దీపాల ఏర్పాటు, రోడ్ల మరమ్మతు, చెత్త తొలగించడం వంటి పనులు ఇప్పటికేప్రారంభించారు. ఉత్సవాల సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సాంసృ్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

గుండెపోటుతో బీజేడీ ఎంపీ మృతిఒడిశా  : ఒడిశాలోని కంధమల్‌ బీజేడీ ఎంపీ హేమేంద్ర చంద్రసింగ్‌ గత రాత్రి గుండెపోటుతో మృతి చెందా...
05/09/2014

గుండెపోటుతో బీజేడీ ఎంపీ మృతి
ఒడిశా : ఒడిశాలోని కంధమల్‌ బీజేడీ ఎంపీ హేమేంద్ర చంద్రసింగ్‌ గత రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. సెప్టెంబర్‌ 1న ఎంపీ చంద్రసింగ్‌ అనారోగ్యంతో కారణంగా భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. గత రాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఎంపీ హేమేంద్ర చంద్రసింగ్‌ మృతి పట్ల బీజేడీ నేతలు సంతాపం ప్రకటించారు.

05/09/2014

ఘనంగా గురుపూజోత్సవం...హాజరైన చంద్రబాబు
గుంటూరు, సెప్టెంబర్‌ 5 : జిల్లాలో గురుపూజోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంద్రప్రదేశ్‌లో తొలిసారిగా చిన్నారుల సమక్షంలో జరుగుతున్న గురుపూజోత్సవంలో ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రులు గంటా, రావెల కిషోర్‌బాబు, నరసరావుపేట ఎంపీ రాయపాటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 175 మంది ఉత్తమ ఉపాధ్యాయులు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.

సర్వేపల్లి ఏకసంతాగ్రహి : కేసీఆర్హైదరాబాద్: సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి చేసిన సేవలు వెలకట్టలేనివని తెలంగాణ ముఖ్యమంత్ర...
05/09/2014

సర్వేపల్లి ఏకసంతాగ్రహి : కేసీఆర్

హైదరాబాద్: సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి చేసిన సేవలు వెలకట్టలేనివని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అన్నారు. రవీంద్రభారతిలో జరిగిన టీచర్స్ డే వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ సర్వేపల్లి ఏకసంతాగ్రహి అన్నారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో ఉచిత నిర్బంధ విద్య అమలుచేస్తమని స్పష్టం చేశారు. పట్టుబడితే, జట్టుకడితే సాధించలేనిది లేదని తెలంగాణ సమాజం నిరూపించిందని అన్నారు. మన విద్యార్థులను ప్రపంచంలోనే గొప్ప విద్యార్థులుగా తీర్చిదిద్ది ప్రపంచానికవసరమయ్యే వజ్రాలను తయారుచేద్దామని పేర్కొన్నారు.

Address

Karimnagar
505001

Alerts

Be the first to know and let us send you an email when Chalanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share